Hin

7th october 2024 soul sustenance telugu

October 7, 2024

వైఫల్యాలను సులభంగా అంగీకరించడం

మనం ఎంత కష్టపడినా కొన్నిసార్లు విఫలమవుతాము అనేది జీవితంలో ముఖ్యమైన పాఠాలలో ఒకటి. మనం వైఫల్యాలు, లోపాలను మన ప్రయాణంలో భాగంగా పరిగణించి అంగీకరించాలి. మనలో చాలా మంది జీవితంలో వైఫల్యాలకు భయపడతాము . కానీ మనం విఫలమైనప్పుడు, అనుభవం మరియు నేర్చుకున్న ఆ పాఠం మనకు  బహుమతులు అనేది సత్యం. గొప్ప విజయ గాథలో కూడా చెప్పలేని అనేక వైఫల్యాలు, తప్పులు మరియు సవాళ్లు ఉంటాయి.

  1. వైఫల్యాలు లేదా తప్పులు జరిగినప్పుడు అపరాధభావాన్ని సృష్టించవద్దు. అపరాధ భావం నేను తగినంత మంచిగా లేను అనే భావనకు దారితీస్తుంది. వైఫల్యం కారణంగా మీరు తగినంత మంచిగా లేరని మీరు భావిస్తే, అది మీ ఆత్మగౌరవాన్ని తగ్గిస్తుంది.
  2. మీ ఆలోచనలు, భావాలకు బాధ్యత వహించడానికి ప్రతి ఉదయం ధ్యానం చేయండి. ఆత్మ గౌరవం మీరు సాధించేవాటిపై ఆధారపడి వుండదని మీరు అనుభవం చేసుకుంటారు. మీరు సదా శాంతి మరియు ఆనంద స్వరూపులే కానీ లక్ష్యాన్ని సాధించిన తర్వాత వాటిని అనుభవం చేసుకోవటం కాదు.
  3. అనుభవాన్ని, పాఠాలను తీసుకొని పొరపాటును మరోసారి చేయకూడదని మీకు మీరే వాగ్దానం చేసుకోండి. నిందించడం, ప్రశ్నించడం లేదా అపరాధభావంలోకి వెళ్లకుండా శక్తిని ఆదా చేసుకోండి. ఆ శక్తితో మిమ్మల్ని మీరు బలోపేతం చేసుకొని ముందుకు సాగడానికి ఉపయోగించుకోండి.
  4. పరిస్థితులు మరియు వ్యక్తులు మీ నియంత్రణలో లేరని అర్థం చేసుకోండి. మీరు వాటికి ఎలా స్పందిస్తారో అది మీ నియంత్రణలో ఉంటుంది.
  5. లక్ష్యాలను నిర్దేశించుకోండి, ప్లాన్ చేసుకోండి, అమలు పరిచి లక్ష్యాన్ని సాధించి విజయాన్ని ఆస్వాదించండి. కానీ ఒక పనిని లేదా దాని ఫలితాన్ని మీ శారీరక, భావోద్వేగ శ్రేయస్సు కంటే ముఖ్యమైనదిగా చేసుకోవద్దు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

8th july 2025 soul sustenance telugu

ప్రేమను ఆపేక్షలతో సమానం చేయకండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన స్వభావాలు, విలువలు, లక్ష్యాలకు అనుగుణంగానే ఇతరులు ప్రవర్తించాలని మనం సాధారణంగా కోరుకుంటాం. ఎవరైనా మన అంచనాలకు తగ్గట్లుగా ఉంటే, వారు

Read More »
7th july 2025 soul sustenance telugu

గతాన్ని వదిలేసేందుకు 7 పద్ధతులు (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సరిదిద్దుకోవటం – ఆత్మలో జ్ఞాపకాలు ఆత్మపై ముద్రలు వంటివి. కొన్ని ముద్రలు లోతైనవి, కొన్ని కాకపోవచ్చు. గత నెగిటివ్ అనుభవాలు ఆత్మపై

Read More »
6th july 2025 soul sustenance telugu

గతాన్ని వదిలేసేందుకు 7 పద్ధతులు (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు పాజిటివ్ సమాచారం మరియు ఆధ్యాత్మిక నషా – మనం ప్రతిరోజూ 10 నిమిషాల పాటు పాజిటివ్ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎంత ఎక్కువగా

Read More »