Hin

9th jan 2024 soul sustenance telugu

January 9, 2024

వస్తువులలో కాకుండా ఆలోచనలలో ఆనందాన్ని అనుభూతి చెందండి

మన సమాజం మనకు వస్తువులు కలిగి ఉండటం మనకు సంతోషాన్ని కలిగిస్తుందని, ఎన్ని వస్తువులు ఉంటే అంత సంతోషం ఉంటుందని నమ్మేలా చేసింది. మనం చూసిన అన్ని ఉత్పత్తులు మరియు సేవలు మనకు సంతోషాన్ని వాగ్దానం చేశాయి. సంతోషం కోసం – ఇళ్లు, వాహనాలు, గాడ్జెట్లు, ఖరీదైన గడియారాలు, బ్రాండెడ్ బట్టలు … అన్నీ కొనడం ప్రారంభించాము కానీ అవి సమాధానం కాదని గ్రహించాము. మనం వాటిని బాగున్నాయని భావించాము కానీ వాటికన్నా మెరుగైనవి వచ్చినప్పుడు, వాటిని స్వంతం  చేసుకోవాలనుకున్నాము. కాబట్టి మనం మళ్ళీ అసంతృప్తి చెందాము. నిజం ఏమిటంటే ఆనందం ఆలోచనల నుండి వస్తుంది, వస్తువుల నుండి కాదు.  ఫోన్ కొనేటప్పుడు మనం ఇలా అనుకుంటాము: వావ్! ఇప్పుడు నేను కోరుకునే ఫోన్‌ని కలిగి ఉన్నాను, ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఈ మంచి ఆలోచనలు ఆనందాన్ని ఇస్తాయి, ఫోన్ కాదు. ఒకరి ఆలోచనలు బాగుంటే తక్కువ ఫీచర్ లతో ఉన్న ఫోన్‌ని కలిగి ఉన్నా వారు సంతోషంగానే ఉంటారు. మార్కెట్‌లో సరికొత్త అత్యంత ఖరీదైన ఫోన్‌ని కలిగి ఉన్న ఎవరైనా అతని ఆలోచనలు ఒత్తిడి, దురాశ, అసూయ లేదా కోపంతో ఉంటే వారు దయనీయంగా ఉంటారు. సరైన ఆలోచనలను సృష్టించడం వల్ల సుఖమే అనుభూతి కలుగుతుంది. ప్రతి సందర్భంలోనూ మనం సరిగ్గా ఆలోచిస్తే ఆనందం అనేది స్థిరమైన అనుభూతి అవుతుంది.

మనకు కావలసినది ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉంటాము అనేది మన లోతైన విశ్వాసం. వస్తువులు భౌతికమైనవి మరియు భౌతిక సౌకర్యానికి ముఖ్యమైనవి. ఈ రోజు మానసికంగా సుఖంగా ఉండటానికి మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. మీరు ఉపయోగించే వస్తువులతో సంబంధం లేకుండా సంతోషంగా మిమ్మల్ని మీరు ఊహించుకోండి. మీ ఇల్లు, మీ వాహనం, మీ ఫోన్… మనం ప్రతీ రోజు ఉపయోగించే అన్నింటి జాబితా చాలా పెద్దది. ఈరోజు మీ మానసిక సుఖ సంతోషాలు భౌతిక సౌలభ్యం కోసం ఉపయోగించే వస్తువులపై ఆధారపడకుండా జాగ్రత్త వహించండి. మీరు వస్తువును ఉపయోగిస్తున్నప్పుడు స్థిరంగా మరియు ప్రశాంతంగా ఉండండి. మీరు వస్తువును నియంత్రిస్తున్నారని గుర్తుంచుకోండి; వస్తువు మీ మనస్సును నియంత్రించదు. రోజులో కొన్ని సార్లు క్షణం ఆగి, నా వద్ద ఉన్నవి ఉపయోగిస్తూ నేను సంతోషంగా ఉన్నాను అనే ధృవీకరణను రిపీట్ చేయండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

20th jan 2025 soul sustenance telugu

మీ సంకల్పశక్తి మీకు అతిపెద్ద బలం

మనం ఒక లక్ష్యాన్ని సాధించాలనుకున్నా, సరైన ఆహారానికి కట్టుబడి ఉండాలనుకున్నా, వ్యసనాన్ని వదులుకోవాలనుకున్నా లేదా ఆరోగ్యకరమైన అలవాటును కొనసాగించాలనుకున్నా, విజయం లేదా వైఫల్యాన్ని మన సంకల్ప శక్తికి ఆపాదించుకుంటాము. కొన్నిసార్లు మనం అత్యధిక సంకల్ప

Read More »
19th jan 2025 soul sustenance telugu

మిమ్మల్ని విమర్శించే వ్యక్తులపై దృష్టి పెట్టవద్దు

మనం లేదా మనం చేసే పనికి మనల్ని ఇష్టపడని వ్యక్తులు ఎల్లప్పుడూ ఉంటారు. వారి గురించి మనకు తెలిసినప్పటికీ, వారిపై దృష్టి పెట్టవలసిన అవసరం లేదు. మనకు మద్దతు ఇచ్చి, సానుకూల శక్తిని పంపే

Read More »
18th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 6)

బ్రహ్మా కుమారీలకు  కొత్తగా వచ్చినవారు అడిగే ఒక సాధారణ ప్రశ్న ఏమిటంటే, మనం కేవలం ధ్యానం మాత్రమే ఎందుకని నేర్చుకోలేము? ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వివరించే 7 రోజుల కోర్సు యొక్క వివిధ సెషన్లకు మనం

Read More »