Hin

24th April 2025 Soul Sustenance Telugu

April 24, 2025

వెళ్ళిపోయిన ప్రియమైన వ్యక్తికి శాంతిని, ప్రేమను ప్రసరింపజేయండి

మనలో ప్రతి ఒక్కరూ కూడా వేరు వేరు జన్మల ప్రయాణంలో ఉన్నారు, అలాగే మన చుట్టూ ఉన్న ఆత్మలు కూడా. బంధువు, స్నేహితుడు లేదా సహోద్యోగి వంటి ఏదైనా సంబంధంలో మనకు దగ్గరగా ఉన్న ఎవరైనా ఆత్మ వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు సాగినప్పుడు మనం మన భావోద్వేగాలకు బాధ్యత వహించి మరియు స్థిరంగా ఉండాలి. మరణం తప్పించుకోలేనిది అనే జ్ఞానం ఉన్నప్పటికీ, ప్రియమైన వ్యక్తి మరణాన్ని ఎదుర్కోవడం చాలా మందికి సవాలుగా మరియు కష్టమైన క్షణంగా మారుతుంది. మనల్ని విడిచిపెట్టిన ఆత్మ, శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా మన ప్రకంపనలను పొందుతూనే ఉంటుందని గుర్తుంచుకోవడం ముఖ్యం.

 

  1. ప్రియమైన వ్యక్తి మరణాన్ని ఎదుర్కొంటున్నప్పుడు, మనము భావోద్వేగపరంగా భారంగా మరియు విచారంగా ఉంటూ, బాధతో ఏడుస్తూ – మీరు లేకుండా నేను జీవించలేను… మీరు లేకుండా నేను సంతోషంగా ఉండలేను. దయచేసి తిరిగి రండి అని అంటూ ఉంటాము. ఆత్మ భౌతికంగా మన నుండి చాలా దూరం వెళ్లి, వేరే చోట జన్మించినప్పటికీ, మరొక ఆత్మ కోసం సృష్టించబడిన ప్రతి ఆలోచన మరియు దాని యొక్క శక్తి, ఆ ఆత్మకు చేరుకుంటుంది.
  2. ఆత్మలమైన మనం, జనన మరణాలు లేని శాశ్వతమైన ఆధ్యాత్మిక శక్తులం. మనం ఈ దేహం కాదు. మన దేహం ఒక శారీరక వస్త్రం వంటిది, ఇది జనన-మరణ ప్రక్రియలో లభిస్తుంది. ఇతర వ్యక్తులతో మన పాత్రలను పోషించడానికి మనం ఈ దేహాన్ని పొందుతాము. కాబట్టి, మరణం శరీరానికే, ఆత్మకు కాదు. ఆధ్యాత్మిక అవగాహన, అంతర్గత బలం మరియు నమ్మకంతో మనం దీనిని గుర్తుపెట్టుకొని అనుభూతి చేసుకోవాలి.
  3. ఇతరులు తమ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా, మీతో వారి శక్తి సంబంధం ఎప్పటిలాగే కొనసాగుతుంది. కాబట్టి, మీ ఆలోచనలు మరియు భావాలు ఆధ్యాత్మిక శక్తి యొక్క ప్రకంపనల వలె వారిని చేరుకుంటాయి, అందువల్ల వాటిని జాగ్రత్తగా చూసుకోండి. మీ సన్నిహితులను ప్రేమతో మరియు నిర్లిప్తతతో గుర్తుంచుకోండి, బాధ మరియు మోహముతో కాదు. లేకపోతే, వారు కొత్త శారీరక వస్త్రము ధరించిన చోట దుఃఖాన్ని అనుభవిస్తారు మరియు వారు తమ కొత్త కుటుంబ పరిసరాలలో సర్దుకోలేకపోతారు.
  4. మీ కోసం మరియు వారి కోసం ధ్యానం చేయండి. అది మీకు శాంతియుతంగా మరియు శక్తివంతంగా ఉండటానికి సాధికారత ఇస్తుంది, తద్వారా మీరు వారికి శాంతి మరియు ప్రేమను ప్రసరింపజేస్తారు. ఇది వారి భవిష్య ప్రయాణంలో వారికి ఒక ఆశీర్వాదం మరియు సాధికారత అవుతుంది. మీ స్థిరత్వం ఇతర కుటుంబ సభ్యులకు పరిస్థితిని ఎదుర్కోవటానికి మరియు దానిని సులభంగా అంగీకరించడానికి కూడా సహాయపడుతుంది.

రికార్డు

22nd May 2025 Soul Sustenance Telugu

భోజనం చేసే ముందు భగవంతునికి ఆహారాన్ని అర్పించడం వల్ల కలిగే 7 ప్రయోజనాలు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం అలవర్చుకోవల్సిన ఒక అందమైన అలవాటు, భగవంతుని ధ్యానంలో ప్రతి భోజనాన్ని వండడం. అలాగే, ఒక రోజులో

Read More »
21st May 2025 Soul Sustenance Telugu

మీ వాస్తవిక సత్య గుణానికి తిరిగి వెళ్లడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సత్యం మన వాస్తవిక గుణం, కానీ ఎప్పటికప్పుడు మన సౌలభ్యం కోసం లేదా స్వల్పకాలిక లాభాల కోసం అబద్ధాలు చెబుతాము. ఆసక్తికరమైన

Read More »
20th May 2025 Soul Sustenance Telugu

మీ పిల్లలతో తగినంత సమయం గడపకపోవడంపై అపరాధ భావాన్ని అధిగమించండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు వివిధ రకాల వ్యక్తిగత మరియు వృత్తిపరమైన నిబద్ధతలను గౌరవించేటప్పుడు, చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు తగినంత నాణ్యమైన సమయాన్ని ఇవ్వకపోవడం

Read More »