Hin

28th may 2024 soul sustenance telugu

May 28, 2024

విభేదాలు వచ్చినప్పుడు వ్యక్తుల నుండి తప్పుకోవద్దు

సంబంధాలు పెళుసుగా ఉండటానికి ఒక పెద్ద కారణం మన జాతలో ఉండాలనుకునే వ్యక్తుల గురించి మనం ఎక్కువగా ఎంపిక చేసుకోవడం. ఒకరి ప్రవర్తన అసౌకర్యంగా అనిపిస్తే, మనం వారికి సర్దుబాటు చేయడానికి లేదా సహాయం చేయడానికి బదులుగా తప్పుకుంటున్నాము. ఈ అలవాటు మన ప్రేమ, శ్రద్ధను మరియు పంచుకోవటాన్ని అడ్డుకుంటుంది. కొంత కాలం క్రితం, మనం ఉమ్మడి కుటుంబాల సంస్కృతిని కలిగి ఉన్నాము, మూడు నుండి నాలుగు తరాలకు చెందిన 20-25 మంది సభ్యులు ఒకే పైకప్పు క్రింద ఉంటూ కలిసి జీవించారు. మన స్వభావాలు, విలువలు మరియు అలవాట్లలో తేడాలు వచ్చినప్పుడు, మనం స్వీకరించాము. ఈ రోజు మనం చిన్న చిన్న తేడాల వల్ల ఇతరుల నుండి వైదొలగుతున్నాము.

  1. మిమ్మల్ని మీరు శక్తివంతం చేసుకోవడానికి, ఆత్మగౌరవాన్ని పెంచుకోవడానికి ప్రతిరోజూ మెడిటేషన్ చేసి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అధ్యయనం చేయండి. అలా చేయడం ద్వారా, ఇతరులను అంగీకరించడం మరియు విభిన్న వ్యక్తిత్వాలకు అనుగుణంగా మారడం సులభం అవుతుంది.
  2. ఒకరి ప్రవర్తన అసౌకర్యంగా ఉన్నప్పుడు, వారి స్వభావం మరియు చర్య వెనుక ఉన్న బాధను అర్థం చేసుకోండి. వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని బాధపెట్టాలని లేదా మార్చాలని చూడరు. వారు వారి అలవాట్లు, అవగాహనలు మరియు నమ్మకాలకు బాధితులు. అర్థం చేసుకోవటం అనేది సానుభూతి.
  3. మీరు బాధ పడినా, మీ మనసుకు సలహా ఇవ్వండి – అది వారి స్వభావం. నాకు సహజమైనది, ప్రస్తుతం వారికి కష్టంగా ఉంది. నేను గతాన్ని తొలగిస్తాను. నేను వారిని మరియు మా సంబంధాన్ని నయం చేస్తున్నాను. ఇది కరుణ.
  4. సానుభూతి మరియు కరుణతో, మీరు వారి కోసం స్వచ్ఛమైన ఆలోచనలను సృష్టిస్తారు. తప్పుకునేందుకు అవకాశం ఉండదు. మీరు అంగీకరించడానికి మరియు వారితో ఉండటానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

22nd june2024 soul sustenance telugu

మీ మనస్సు ఒక బిడ్డ వంటిది

మనస్సు మన బిడ్డలాంటిది. మనం మన బాధ్యతలను నిర్వర్తిస్తున్నప్పటికీ, మీలో ఉన్న ఈ బిడ్డ  శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలి. మనం దానిని ప్రేమించాలి, పాలన చేయాలి మరియు ఓదార్చాలి. మనుష్యులు తమ మనస్సుపై నియంత్రణ

Read More »
21st june2024 soul sustenance telugu

మనుష్యుల వైబ్రేషన్లను అనుభూతి చెందడం ప్రారంభించండి

మీరు ఎవరినైనా కలిసినప్పుడు, మీ దృష్టి ఎటు వెళుతుంది? ఒకటి: వారి రూపం మరియు వస్త్రాలు పై మీ దృష్టి వెళుతుంది. రెండు: వారి మాటలు మరియు చేతల పై దృష్టి వెళుతుంది. ఇపుడు

Read More »
20th june2024 soul sustenance telugu

పోటీ పడటం మానండి… ఈ క్షణాన్ని ఆస్వాదించండి (పార్ట్ 4)

మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు సమతుల్య మనస్సును ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. కోపం, ఆవేశం, అహం లేదా దురాశ మన ఆలోచనలలో అసమతుల్యతను సృష్టించవచ్చు. మనల్ని మనం మనలాగే అనుభవం చేసుకున్నప్పుడు మరియు

Read More »