Hin

4th june 2025 soul sustenance telugu

June 4, 2025

విజయం కోసం ఆత్మ శక్తిని మరియు పాత్ర శక్తిని సమతుల్యం చేయుట (పార్ట్ 2)

నిన్నటి సందేశాన్ని కొనసాగిద్దాము. ఆత్మ శక్తికి దోహదపడే వివిధ అంశాలు:

ఆంతరిక మౌనము మరియు ఏకాగ్రతా శక్తి – మౌనము ఒక శక్తి. మనసులో ఎంత తక్కువ ఆలోచనలు వస్తాయో అంత ఎక్కువ శాంతిగా, పాజిటివ్‌గా, ఏకాగ్రంగా ఆ వ్యక్తి ఉన్నాడు అని అర్థం. పాత్ర విజయానికి సూక్ష్మ స్థాయిలో మనసు మౌనం ఎక్కువ దోహదపడుతుంది. వివిధ పాత్రలను పోషించే సమయంలో నేను ఎదుర్కోవలసి వచ్చే ఆటంకాలు, నెగిటివ్ పరిస్థితులు నా మౌనాన్ని పరీక్షిస్తాయి. అటువంటి పరిస్థితులలో కూడా నన్ను నేను ప్రశాంతంగా పెట్టుకుని, ఎంతోకాలం నుండి ఆంతరిక శాంతి ద్వారా ఏర్పరచుకున్న మనసు మౌనం, సానుకూలత అన్నీ కలిసి నా భౌతిక పాత్రపై మరియు వివిధ పనులలో నేను సాధించే విజయంపై ప్రభావం చూపుతాయి.

ఆంతరిక మరియు బాహ్య నిశ్చింతత, సంతోషము మరియు సంతుష్టతల శక్తి –  సంతోషం కూడా ఒక శక్తే. ఆంతరిక సంతోషమే కాదు, ఇతరులను కలిసినప్పుడు నా కళ్ళతో, ముఖంతో, మాటలతో, చేతలతో పూర్తి తేలికదనాన్ని, ఉత్సాహాన్ని మొదలైనవాటిని అనుభూతి చేయించడం కూడా సంతోషమే. నాతో నేను మరియు ఇతరులతో నేను సంతుష్టంగా ఉన్నాను, ఇతరులు కూడా నాతో సంతుష్టంగా ఉన్నారు అన్న భరోసా నా పాత్రలో సానుకూల శక్తిని కలిగించి అనేక సానుకూల విధాలుగా సహాయపడుతుంది. పదే పదే అసంతృప్తికి, అసంతోషానికి లోనవుతుంటే, ఆ లోటు నా లోపల ఉండవచ్చు, నా సంబంధాలలో ఉండవచ్చు, ఈ ఖాళీతనము నా విజయంపై నెగిటివ్ ప్రభావం చూపుతుంది.

రేపటి సందేశంలో ఆత్మ శక్తిని దోహదపరిచే మరిన్ని అంశాలను చర్చించుకుందాము.

రికార్డు

16th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మెడిటేషన్ ని మీ ఔషధంగా చేసుకొని ఆ ఔషధాన్ని ప్రతి రోజు తీసుకోండి మెడిటేషన్ మన మనస్సును మరింత శక్తివంతంగా చేసి

Read More »
15th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు రోజంతా మీ ఆలోచనలను జాగ్రత్తగా పరిశీలించుకోండి   మన భావోద్వేగ ఆరోగ్యం అనేది ముఖ్యంగా మన ఆధ్యాత్మిక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది.

Read More »
14th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మానవాత్మలం అనగా మొదట ఆత్మలం, ఇది మన ఆధ్యాత్మిక గుర్తింపు. మనం మన భౌతిక శరీరం ద్వారా మన పాత్రను

Read More »