Hin

25th june2024 soul sustenance telugu

June 25, 2024

విజయం కోసం పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని తయారుచేసుకోవడం (పార్ట్ 1)

జీవితంలో వివిధ రకాల పరిస్థితులు ఎదురుకోవడం, వివిధ రకాల వ్యక్తులను కలవడం, మీకు ఎన్నో సవాళ్లను తీసుకొస్తుంది, మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది. అలాగే, మన వ్యక్తిత్వం  స్థాయిలో మన శక్తులు మరియు నైపుణ్యాలను పెంచుకోవాలి, తద్వారా మనల్ని మనం స్వీకరించుకోవచ్చు. మనలో లేని వివిధ రకాల కొత్త వ్యక్తిత్వ లక్షణాలను పెంపొందించడమే కాకుండా, మనలోని కొన్ని ప్రతికూల వ్యక్తిత్వ లక్షణాలపై కూడా పని చేసి వాటిని పూర్తిగా తొలగించాలి. ఈ ప్రతికూల అంశాలు మనల్ని ప్రతికూలంగా ప్రభావితం చేసి, మన సంబంధాలలో అస్థిరతను కలిగిస్తాయి. మనకు కొన్ని సమయాల్లో అవసరమయ్యే వివిధ  శక్తులు మరియు ధర్మాలు అనేవి మన ఆలోచనలు, మాటలు, చర్యలలో సరైన సమయంలో బయటపెట్టలేకపోతున్నాము అన్న విషయం మొదట గ్రహించాల్సిన అవసరం ఉంది. అప్పుడు ధ్యానం మరియు ఆధ్యాత్మిక జ్ఞాన సాధనాలు వంటి మనస్సు సాధికారత పద్ధతులను ఉపయోగించి, ఆ శక్తులు మరియు ధర్మాలను మన స్వభావంలో భాగం చేయవచ్చు.

 

ఏదైనా కఠిన పరిస్థితిలో కావలసిన మొట్టమొదటి శక్తి, పరిస్థితి యొక్క అవసరాలకు అనుగుణంగా మన ఆలోచనను సానుకూలంగా పరివర్తన చేసే లేదా మార్చగల శక్తి. అప్పుడు, సానుకూల ఆలోచనలు సృష్టించడం, పరిస్థితిని లేదా ప్రతికూల దృశ్యాన్ని నివారించడం మన మనస్సులో అధిగమించడం కష్టం అనిపిస్తుంది. ఇదే కర్మల్లో ఉన్న ఆధ్యాత్మిక శక్తి లేదా ఆచరణలోకి తీసుకురావడం. అలాగే, మన సంబంధాలు సానుకూలంగా లేని వ్యక్తులతో శాంతి మరియు సామరస్యాన్ని తీసుకురావడానికి శుభ భావనాల శక్తిని ఉపయోగించాలి. శుభ భావనలు కర్మలలో సద్గుణాలు తెచ్చి, మనల్ని ప్రేమగా మరియు వినయంగా చేస్తాయి. కాబట్టి, మనలో మనం ఎంత ఎక్కువ లక్షణాలు, శక్తులను నింపుకుంటామో, అంత సంపూర్ణంగా, ఆధ్యాత్మికంగా నైపుణ్యం కలిగి ఉంటాము అలాగే అంతే విజయవంతమవుతాము.

(సశేషం …)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

6th dec 2024 soul sustenance telugu

అందమైన, స్వేచ్ఛాయుతమైన ప్రపంచాన్ని సృష్టించుకుందాం

వివిధ దేశాల నుండి వచ్చిన, వివిధ భాషలు మాట్లాడే, వివిధ మతాలను అనుసరించే, జీవితంలోని వివిధ రంగాలలో వివిధ రకాల చర్యలను నిర్వహించే కోట్లమంది మానవులతో నిండిన ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. భగవంతుడు మన

Read More »
5th dec 2024 soul sustenance telugu

ప్రతి కర్మపై ధ్యాస పెట్టడం

మన ప్రతి ఆలోచన, మాట మరియు చర్య మనం ప్రపంచానికి పంపే శక్తి, ఇది మన కర్మ. పరిస్థితులు, వ్యక్తుల ప్రవర్తనలు అనేవి తిరిగి వచ్చే శక్తి, ఇది మన విధి. ప్రతి కర్మ

Read More »
4th dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 3)

స్టెప్ 3 – పరిష్కారానికి సానుకూల చర్యలు తీసుకోవడం – మూడవ దశ మరియు చాలా ముఖ్యమైనది పరిస్థితిని సరిచేయడానికి భౌతిక స్థాయిలో సానుకూలంగా ఏదైనా చేయడం. కొన్నిసార్లు, మనం సానుకూలంగా ఆలోచించి భగవంతుడిని

Read More »