Hin

11th-oct-2023-soul-sustenance-telugu

October 11, 2023

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 1)

మనమందరం మనకు మరియు ఇతరులకు సాధ్యమైనంత ఉత్తమమైన రీతిలో ప్రయోజనం చేకూర్చే పనులు చేసే ప్రత్యేకమైన వారము. ఉద్యోగంలో, మార్కెట్‌కు వెళ్లేటప్పుడు, చదువుతున్నప్పుడు, కుటుంబం మరియు స్నేహితులతో సంభాషించేటప్పుడు లేదా మన శరీరాన్ని చూసుకునేటప్పుడు, మనం ఎల్లప్పుడూ విజయం కోసం చూస్తుంటాము.  ఇది భౌతిక స్థాయిలో విజయం.  మనస్సు యొక్క స్థాయిలో కూడా విజయమే సంపూర్ణ విజయం. తరచుగా, చాలా మందికి సంతోషంగా, సంతృప్తిగా ఉండటమే సర్వస్వం. కొందరికి విద్య, వృత్తి మరియు సంపద యొక్క అపారమైన విజయమే చాలా గొప్ప విషయం. మరి కొందరికి ఇవన్నీ సంతోషంగా ఉంటూ చేయకపోతే ఇదేమీ కానట్లే. ఈ సందేశాన్ని చదివేటప్పుడు విజయం యొక్క 5 అందమైన అంశాలను అన్వేషిద్దాం:

  1. విజయం అంటే సంతృప్తి. మనం చాలా సార్లు ప్రపంచం నుండి గౌరవం కోసం చూస్తాము. కానీ, అలాగే మన మనస్సు యొక్క అంతర్గత ప్రపంచం నుండి శాంతి, ఆనందం మరియు శక్తి యొక్క అంతర్గత సంపదల సంతృప్తి కొరకు చూస్తున్నామా? కొన్నిసార్లు, మనం చాలా సాధిస్తాము, కానీ మనకు కావలసినంత సంతృప్తి ఉండదు. అలాగే, కెరీర్ లో అగ్రస్థానానికి చేరుకున్న వ్యక్తులను మీరు కలుస్తూ ఉండవచ్చు, వారు విజయాన్ని సాధించినప్పటికీ, వారు వ్యక్తులు ఇచ్చే బాహ్య గౌరవాన్ని పొందినప్పటికీ వారి హృదయపూర్వక ప్రేమ మరియు శుభాకాంక్షలు పొందలేక వారు తేలికగా మరియు రిలాక్స్ గా  ఉండలేరు. నిరాశకు గురై మరొక ఉద్యోగం కోసం వెతుకుతారు. కొందరు విజయాల గమ్యాన్ని చేరుకునే సమయంలో అనుభవించిన ఒత్తిడి యొక్క ప్రభావాల కారణంగా  శారీరకంగా అనారోగ్యానికి గురై అధిక రక్తపోటు లేదా మధుమేహం లేదా జీర్ణక్రియ సమస్యలతో బాధపడతారు.  కనుక అంతర్గత విజయం మరియు బాహ్య విజయం మధ్య సమతుల్యత, దీర్ఘకాలంలో మిమ్మల్ని సంతోషంగా, ఆరోగ్యంగా మరియు తేలికగా ఉంచుతుంది.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

20th march 2025 soul sustenance telugu

సంబంధాల్లో కలిగే బాధ నుండి విముక్తిని పొందడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ రంగాలలో వేర్వేరు సంబంధాలలోకి వచ్చినప్పుడు, కొన్నిసార్లు మన అంతర్గత ప్రపంచంలోకి మరొక ఆత్మను అనుమతించినప్పుడు, మనల్ని వారు అర్థం

Read More »
19th march 2025 soul sustenance telugu

జీవితంలోని వివిధ దృశ్యాలలో సాకులు చెప్పడం మానుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలా మంది మన విశ్వసనీయతను కాపాడుకోవడానికి, ఇతరులపై లేదా పరిస్థితులపై నిందలు వేయడానికి సాకులు చెబుతారు. కొన్నిసార్లు మనకు, మన

Read More »
18th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు అంతర్గత బలం యొక్క సానుకూల సంస్కారాలను సృష్టించడానికి, మనం ముందుగా పట్టుదల యొక్క మొదటి అడుగు వేయాలి. పట్టుదల అంటే నేను

Read More »