Hin

29th April 2025 Soul Sustenance Telugu

April 29, 2025

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 2)

  1. విజయం అంటే మన జీవతపు క్వాలిటి పెరగడం. మనం ఖరీదైన కారు,  ఖరీదైన బట్టలు కొనుగోలు చేసి  గర్వపడతాము. కొన్నిసార్లు ఈ అహం నెగెటివ్ రూపం దాల్చుతుంది. నేడు చాలా మంది వ్యక్తులు విజయం అంటే భౌతిక ఆస్తులు అని పెద్ద ఇళ్లు,  ఆభరణాలు ధరించడంతో విజయాన్ని పొందామని  భావిస్తున్నారు. కానీ మనం ఎటువైపు వెళ్తున్నామో ఎప్పుడైనా ఆలోచించుకున్నామా? ఇవన్నీ ప్రధానమైనవే కాని ఈ సుఖాలు మన జీవితాలను నిర్వచించకూడదు. మీరు ఇతరులు చూడాలని కొనే ఖరీదైన మొబైల్ ఫోన్ మీ విజయం కాదు. మీకు కావలసిన విధంగా మీ ఆఫీసు కలను నెరవేర్చుకోండి, కానీ దానిని సాధించిన తర్వాత, నాకు మరింత కావాలి అని అనకండి. సంతృప్తి లేని విజయం అసంపూర్ణమని గ్రహించండి ఎందుకంటే  కలను సాధించకముందు కూడా సంతృప్తిగా ఉండవచ్చు. ఈ కలల కోసం జీవితాంతం శ్రమించి వాటిని సాధించిన తర్వాత కూడా తృప్తి చెందకపోతే ఏం లాభం? కాబట్టి, ఆ కలను సాకారం చేసుకునే ప్రయాణంలో విజయాన్ని ఆనందించండి, మీరు కలిసే మంచి వ్యక్తులను, అందమైన వస్తువులను, జీవితంలోని విభిన్న దృశ్యాలను, ప్రకృతిని, భగవంతుని సహవాసాన్ని, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే మీ వ్యక్తిత్వాన్ని ఆనందించండి.  
  2. అందరితో చక్కని సంబంధాలు కలిగి ఉంటూ జీవించటమనేది విజయానికి చాలా ముఖ్యమైన భాగం. జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశాలలో సంబంధాలు ఒకటి. ఇది వ్యక్తులతో లేదా భగవంతునితో సంబంధం కావచ్చు. వాస్తవానికి, భగవంతునితో ఉన్న సంబంధం శాశ్వతమైనది మరియు అన్ని జన్మల సంబంధం.  వ్యక్తులతో సంబంధాలు ప్రతి జన్మకు మారుతూ ఉంటాయి. సంబంధాలు అపారమైన అర్థాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి, విజయం అంటే మీ జీవితాంతం అందరిని సంతోషపరుస్తూ, అందరి నుండి ఆనందాన్ని పొందుతూ జీవితాన్ని గడిపారని లోలోపల అనుభూతి చెందడం. అలాగే, విజయం అనేది మీ జీవితంలోని ప్రతి క్షణం భగవంతునికి అపారమైన ప్రాముఖ్యతను ఇవ్వడం, మీరు సాధించిన ప్రతిదానికీ వారికి ధన్యవాదాలు చెప్పడం.

(సశేషం…)

రికార్డు

22nd May 2025 Soul Sustenance Telugu

భోజనం చేసే ముందు భగవంతునికి ఆహారాన్ని అర్పించడం వల్ల కలిగే 7 ప్రయోజనాలు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం అలవర్చుకోవల్సిన ఒక అందమైన అలవాటు, భగవంతుని ధ్యానంలో ప్రతి భోజనాన్ని వండడం. అలాగే, ఒక రోజులో

Read More »
21st May 2025 Soul Sustenance Telugu

మీ వాస్తవిక సత్య గుణానికి తిరిగి వెళ్లడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సత్యం మన వాస్తవిక గుణం, కానీ ఎప్పటికప్పుడు మన సౌలభ్యం కోసం లేదా స్వల్పకాలిక లాభాల కోసం అబద్ధాలు చెబుతాము. ఆసక్తికరమైన

Read More »
20th May 2025 Soul Sustenance Telugu

మీ పిల్లలతో తగినంత సమయం గడపకపోవడంపై అపరాధ భావాన్ని అధిగమించండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు వివిధ రకాల వ్యక్తిగత మరియు వృత్తిపరమైన నిబద్ధతలను గౌరవించేటప్పుడు, చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు తగినంత నాణ్యమైన సమయాన్ని ఇవ్వకపోవడం

Read More »