Hin

12th-oct-2023-soul-sustenance-telugu

October 12, 2023

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 2)

  1. విజయం అంటే మన జీవతపు క్వాలిటి పెరగడం. మనం ఖరీదైన కారు, ఖరీదైన బట్టలు కొనుగోలు చేసి గర్వపడతాము. కొన్నిసార్లు ఈ అహం నెగెటివ్ రూపం దాల్చుతుంది. నేడు చాలా మంది వ్యక్తులు విజయం అంటే భౌతిక ఆస్తులు అని పెద్ద ఇళ్లు,  ఆభరణాలు ధరించడంతో విజయాన్ని పొందామని  భావిస్తున్నారు. కానీ మనం ఎటువైపు వెళ్తున్నామో ఎప్పుడైనా ఆలోచించుకున్నామా? ఇవన్నీ ప్రధానమైనవే కాని ఈ సుఖాలు మన జీవితాలను నిర్వచించకూడదు. మీరు ఇతరులు చూడాలని కొనే ఖరీదైన మొబైల్ ఫోన్ మీ విజయం కాదు. మీకు కావలసిన విధంగా మీ ఆఫీసు కలను నెరవేర్చుకోండి, కానీ దానిని సాధించిన తర్వాత, నాకు మరింత కావాలి అని అనకండి. సంతృప్తి లేని విజయం అసంపూర్ణమని గ్రహించండి ఎందుకంటే  కలను సాధించకముందు కూడా సంతృప్తిగా ఉండవచ్చు. ఈ కలల కోసం జీవితాంతం శ్రమించి వాటిని సాధించిన తర్వాత కూడా తృప్తి చెందకపోతే ఏం లాభం? కాబట్టి, ఆ కలను సాకారం చేసుకునే ప్రయాణంలో విజయాన్ని ఆనందించండి, మీరు కలిసే మంచి వ్యక్తులను, అందమైన వస్తువులను, జీవితంలోని విభిన్న దృశ్యాలను, ప్రకృతిని, భగవంతుని సహవాసాన్ని, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే మీ వ్యక్తిత్వాన్ని ఆనందించండి. 
  2. అందరితో చక్కని సంబంధాలు కలిగి ఉంటూ జీవించటమనేది విజయానికి చాలా ముఖ్యమైన భాగం. జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశాలలో సంబంధాలు ఒకటి. ఇది వ్యక్తులతో లేదా భగవంతునితో సంబంధం కావచ్చు. వాస్తవానికి, భగవంతునితో ఉన్న సంబంధం శాశ్వతమైనది మరియు అన్ని జన్మల సంబంధం. వ్యక్తులతో సంబంధాలు ప్రతి జన్మకు మారుతూ ఉంటాయి. సంబంధాలు అపారమైన అర్థాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి, విజయం అంటే మీ జీవితాంతం అందరిని సంతోషపరుస్తూ, అందరి నుండి ఆనందాన్ని పొందుతూ జీవితాన్ని గడిపారని లోలోపల అనుభూతి చెందడం. అలాగే, విజయం అనేది మీ జీవితంలోని ప్రతి క్షణం భగవంతునికి అపారమైన ప్రాముఖ్యతను ఇవ్వడం, మీరు సాధించిన ప్రతిదానికీ వారికి ధన్యవాదాలు చెప్పడం.

(రేపు కొనసాగుతుంది…) 

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

20th march 2025 soul sustenance telugu

సంబంధాల్లో కలిగే బాధ నుండి విముక్తిని పొందడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ రంగాలలో వేర్వేరు సంబంధాలలోకి వచ్చినప్పుడు, కొన్నిసార్లు మన అంతర్గత ప్రపంచంలోకి మరొక ఆత్మను అనుమతించినప్పుడు, మనల్ని వారు అర్థం

Read More »
19th march 2025 soul sustenance telugu

జీవితంలోని వివిధ దృశ్యాలలో సాకులు చెప్పడం మానుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలా మంది మన విశ్వసనీయతను కాపాడుకోవడానికి, ఇతరులపై లేదా పరిస్థితులపై నిందలు వేయడానికి సాకులు చెబుతారు. కొన్నిసార్లు మనకు, మన

Read More »
18th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు అంతర్గత బలం యొక్క సానుకూల సంస్కారాలను సృష్టించడానికి, మనం ముందుగా పట్టుదల యొక్క మొదటి అడుగు వేయాలి. పట్టుదల అంటే నేను

Read More »