Hin

30th April 2025 Soul Sustenance Telugu

April 30, 2025

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 3)

  1. జీవితంలోని వివిధ లక్ష్యాలను సాధించేటప్పుడు మనం ఎంత వినయంగా మరియు నిజాయితీగా ఉన్నాము అనేదే మన విజయం. నమ్రత అన్నింటికంటే గొప్ప గుణం. కోపం మరియు అహం వినయం యొక్క అతిపెద్ద శత్రువులు,  ఇతరులు మనల్ని చూసే విధానాన్ని, వారి హృదయాలలో మన గురించి భావనను పాడుచేస్తాయి. అహంకారిని ఎవరూ ఇష్టపడరు, అందరూ  వారికి దూరంగా ఉంటారు. వారు ఆశీర్వాదాలను, గౌరవాన్ని కోల్పోవడమే కాకుండా ఆత్మగౌరవాన్ని కూడా కోల్పోతారు. అహంకారి సంతోషంగా ఉండలేరు మరియు వారు సాధించిన వాటితో అనగా నేను అందంగా ఉన్నాను, నేను తెలివైనవాడిని, నేను ధనవంతుడిని, నేను చురుకైనవాడిని, నేను అందమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాను, నేను సాధకుడిని, నా సంబంధాలు అందంగా ఉంటాయి …  అని ఇతరులపై  ఆధిపత్యం చేయడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తారు. అలాగే, వినయంతో పాటు, మీ నిజాయితీ మరియు సత్యత కూడా మిమ్మల్ని విజయవంతం చేస్తాయి. కొందరు వ్యక్తులు తమ జీవితంలో పెద్ద మైలురాళ్లను చేరుకుంటారు, కానీ వారు అక్కడకు చేరడానికి ఏదో ఒక రకమైన అబద్ధం లేదా మోసపూరితంగా ఉంటారు, ఇది అసత్యమైన  విజయం.

5. చివరగా, విజయం అంటే అడుగడుగునా ఇవ్వడం. మీరు కలిగి ఉన్న ప్రతి మంచిని ఇచ్చేవారుగా ఉండటం – అది భౌతిక లేదా భౌతికేతరమైనది కావచ్చు. ఈ గుణాన్ని కలిగి ఉన్నవారు సరైన మరియు సంపూర్ణ రీతిలో విజయం సాధించిన మంచి మానవులు. కాబట్టి, మీరు కలిగి ఉన్న వాటిని ఇతరులు కలిగి ఉండకపోయినా ఎల్లప్పుడూ వారిని గౌరవంగా చూడండి. అలాగే, వ్యక్తులపై ఆధిపత్యం చెలాయించే బదులు, వారిని ప్రభావితం చేసి, శక్తివంతం చేయండి. భౌతిక సంపదను, భౌతికేతర జ్ఞాన సంపదను కూడా అందరితో పంచుకోవాలి. అప్పుడు మీరు నిజమైన దాత, మీ విజయాల ప్రతికూల ప్రభావంతో మీరు తాకబడలేనట్టు. మీరు మీ విజయాలతో  పురోగతి పొందుతారు మరియు వాటిపై ఎప్పుడూ అసత్యమైన ఆహాన్ని కలిగి ఉండరు, ఇదే నిజమైన విజయం.

రికార్డు

22nd May 2025 Soul Sustenance Telugu

భోజనం చేసే ముందు భగవంతునికి ఆహారాన్ని అర్పించడం వల్ల కలిగే 7 ప్రయోజనాలు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం అలవర్చుకోవల్సిన ఒక అందమైన అలవాటు, భగవంతుని ధ్యానంలో ప్రతి భోజనాన్ని వండడం. అలాగే, ఒక రోజులో

Read More »
21st May 2025 Soul Sustenance Telugu

మీ వాస్తవిక సత్య గుణానికి తిరిగి వెళ్లడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సత్యం మన వాస్తవిక గుణం, కానీ ఎప్పటికప్పుడు మన సౌలభ్యం కోసం లేదా స్వల్పకాలిక లాభాల కోసం అబద్ధాలు చెబుతాము. ఆసక్తికరమైన

Read More »
20th May 2025 Soul Sustenance Telugu

మీ పిల్లలతో తగినంత సమయం గడపకపోవడంపై అపరాధ భావాన్ని అధిగమించండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు వివిధ రకాల వ్యక్తిగత మరియు వృత్తిపరమైన నిబద్ధతలను గౌరవించేటప్పుడు, చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు తగినంత నాణ్యమైన సమయాన్ని ఇవ్వకపోవడం

Read More »