Hin

13th-oct-2023-soul-sustenance-telugu

October 13, 2023

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 3)

  1. జీవితంలోని వివిధ లక్ష్యాలను సాధించేటప్పుడు మనం ఎంత వినయంగా మరియు నిజాయితీగా ఉన్నాము అనేదే మన విజయం. నమ్రత అన్నింటికంటే గొప్ప గుణం. కోపం మరియు అహం వినయం యొక్క అతిపెద్ద శత్రువులు, ఇతరులు మనల్ని చూసే విధానాన్ని, వారి హృదయాలలో మన గురించి భావనను పాడుచేస్తాయి. అహంకారిని ఎవరూ ఇష్టపడరు, అందరూ వారికి దూరంగా ఉంటారు. వారు ఆశీర్వాదాలను, గౌరవాన్ని కోల్పోవడమే కాకుండా ఆత్మగౌరవాన్ని కూడా కోల్పోతారు. అహంకారి సంతోషంగా ఉండలేరు మరియు వారు సాధించిన వాటితో అనగా నేను అందంగా ఉన్నాను, నేను తెలివైనవాడిని, నేను ధనవంతుడిని, నేను చురుకైనవాడిని, నేను అందమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాను, నేను సాధకుడిని, నా సంబంధాలు అందంగా ఉంటాయి …  అని ఇతరులపై  ఆధిపత్యం చేయడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తారు. అలాగే, వినయంతో పాటు, మీ నిజాయితీ మరియు సత్యత కూడా మిమ్మల్ని విజయవంతం చేస్తాయి. కొందరు వ్యక్తులు తమ జీవితంలో పెద్ద మైలురాళ్లను చేరుకుంటారు, కానీ వారు అక్కడకు చేరడానికి ఏదో ఒక రకమైన అబద్ధం లేదా మోసపూరితంగా ఉంటారు, ఇది అసత్యమైన  విజయం.
  2. చివరగా, విజయం అంటే అడుగడుగునా ఇవ్వడం. మీరు కలిగి ఉన్న ప్రతి మంచిని ఇచ్చేవారుగా ఉండటం – అది భౌతిక లేదా భౌతికేతరమైనది కావచ్చు. ఈ గుణాన్ని కలిగి ఉన్నవారు సరైన మరియు సంపూర్ణ రీతిలో విజయం సాధించిన మంచి మానవులు. కాబట్టి, మీరు కలిగి ఉన్న వాటిని ఇతరులు కలిగి ఉండకపోయినా ఎల్లప్పుడూ వారిని గౌరవంగా చూడండి. అలాగే, వ్యక్తులపై ఆధిపత్యం చెలాయించే బదులు, వారిని ప్రభావితం చేసి, శక్తివంతం చేయండి. భౌతిక సంపదను, భౌతికేతర జ్ఞాన సంపదను కూడా అందరితో పంచుకోవాలి. అప్పుడు మీరు నిజమైన దాత, మీ విజయాల ప్రతికూల ప్రభావంతో మీరు తాకబడలేనట్టు. మీరు మీ విజయాలతో పురోగతి పొందుతారు మరియు వాటిపై ఎప్పుడూ అసత్యమైన ఆహాన్ని కలిగి ఉండరు, ఇదే నిజమైన విజయం.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

20th march 2025 soul sustenance telugu

సంబంధాల్లో కలిగే బాధ నుండి విముక్తిని పొందడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ రంగాలలో వేర్వేరు సంబంధాలలోకి వచ్చినప్పుడు, కొన్నిసార్లు మన అంతర్గత ప్రపంచంలోకి మరొక ఆత్మను అనుమతించినప్పుడు, మనల్ని వారు అర్థం

Read More »
19th march 2025 soul sustenance telugu

జీవితంలోని వివిధ దృశ్యాలలో సాకులు చెప్పడం మానుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలా మంది మన విశ్వసనీయతను కాపాడుకోవడానికి, ఇతరులపై లేదా పరిస్థితులపై నిందలు వేయడానికి సాకులు చెబుతారు. కొన్నిసార్లు మనకు, మన

Read More »
18th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు అంతర్గత బలం యొక్క సానుకూల సంస్కారాలను సృష్టించడానికి, మనం ముందుగా పట్టుదల యొక్క మొదటి అడుగు వేయాలి. పట్టుదల అంటే నేను

Read More »