Hin

Soul-sustenance-1st-june-telugu. Jpeg

June 1, 2024

విమర్శలకు స్థిరంగా ఉండటం

ఏ ఉద్దేశంతో అయినా,  ఏ రకమైన విమర్శను అంగీకరించడం కష్టం. కానీ మనం దానిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంటే మనకు ఖచ్చితంగా లాభమే. మన పట్ల వచ్చిన  విమర్శలు మన నియంత్రణలో ఉండవు , కానీ మనం దానికి ఎలా స్పందిస్తున్నామనేది ఎల్లప్పుడూ మన ఎంపిక. మీరు ఏమి చేసినా, ఎవరైనా మిమ్మల్ని ఎల్లప్పుడూ విమర్శిస్తూ ఉంటారా? అన్నీ బాగా జరుగుతున్నట్లు అనిపించినప్పటికీ, మీ ఆలోచనలు, ప్రవర్తనలు, ప్రతిభ, ప్రయత్నాలు లేదా ఫలితాలను విమర్శించే వ్యక్తులు కనిపిస్తుంటారా? ఇష్టం ఉన్నా లేకున్నా, విమర్శలను తప్పించుకోలేము  కాబట్టి అది మనం ముందుకు వెళ్లడంలో సహాయపడుతుంది. విమర్శలు ఎదురైనా మనం స్థిరంగా ఉండాలి. విమర్శ సాధారణంగా కోపం, అవమానం, అగౌరవం లేదా తిరస్కరణ భావంతో వస్తుంది. కాబట్టి, అభిప్రాయం కంటే, దానితో పాటు వచ్చే వైబ్రేషన్లు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. అయినప్పటికీ, అభిప్రాయాన్ని మాత్రమే అంగీకరించి, దానితో పాటు వచ్చే ప్రతికూల వైబ్రేషన్లను మనకు తాకకుండా ఉండటం మన చేతుల్లో ఉంది. ఇతరుల విమర్శలు మనకంటే వారి గురించి తెలుపుతాయి. వారి బాధలు, వారి ఆందోళనలు, వారి అభద్రత మరియు వారి వ్యక్తిత్వాల రూపంలో వారి బలహీనమైన మానసిక స్థితిని ప్రతిబింబిస్తుంది. వారు బాధలో ఉండి దానిని మనకు వ్యక్తం చేస్తున్నారు. వారిని అర్థం చేసుకోవడం, సానుభూతి చూపడం మరియు ప్రతికూల శక్తిని తిరిగి ప్రసరింపజేయకుండా ఉండటం మన పాత్ర. మనల్ని విమర్శించినప్పుడు ఆ విషయాలను మంచిగా లేదా అధ్వానంగా చేయగల శక్తి మనకు ఉంది. వారితో మర్యాదగా ఉండండి, వారి మాటలను నిర్ధారించుకొని అవసరమైతే మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోండి. లేకుంటే ఆ దృశ్యాన్ని మీ మనసులోంచి తొలగించండి. మిమ్మల్ని ప్రశంసించినప్పుడు స్థిరంగా ఉన్నట్లే, విమర్శించినప్పుడు కూడా స్థిరంగా ఉండండి. మిమ్మల్ని మీరు బాగా తెలుసుకొని ఎవరైనా మిమ్మల్ని విమర్శించినప్పుడు కలవరపడకండి.

కొన్నిసార్లు వారి అభిప్రాయాన్ని పంచుకునేటప్పుడు, వ్యక్తులు మొరటుగా ఉంటారు, వారు మిమ్మల్ని విమర్శిస్తారు. కాసేపు ఆగి, విమర్శల గురించి ఆలోచించండి, అది సరైనదా? కాదా?  అని చెక్ చేసుకోండి. సరైనదే అయితే, వారికి ధన్యవాదాలు తెలిపి మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోండి. సరైనది కాకపోతే, వదిలేయండి, వారు చెప్పే దాని గురించి ఆలోచించవద్దు. స్థిరంగా ఉండండి, ప్రతిస్పందించవద్దు, వాదించవద్దు లేదా సమర్థించుకోవద్దు. మీ అభిప్రాయాలను దృఢంగా చెప్పండి. వారు కలవరపడతూ ఉండవచ్చని, అసూయతో లేదా అసురక్షితంగా ఉండవచ్చని అర్థం చేసుకోండి. వారు భిన్నంగా ఉన్నారని, వారు తమ అభిప్రాయాన్ని మాత్రమే వ్యక్తం చేస్తున్నారని, ఇది వారి వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటుందని అర్థం చేసుకోండి. మీ బలాలను తెలుసుకొని మీ బలహీనతలపై పని చేయండి.  విమర్శలను వ్యక్తిగతంగా తీసుకోవద్దు. మీరు వారి స్వభావాన్ని చూసినప్పుడు నిర్లిప్తంగా ఉండండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

22nd june2024 soul sustenance telugu

మీ మనస్సు ఒక బిడ్డ వంటిది

మనస్సు మన బిడ్డలాంటిది. మనం మన బాధ్యతలను నిర్వర్తిస్తున్నప్పటికీ, మీలో ఉన్న ఈ బిడ్డ  శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలి. మనం దానిని ప్రేమించాలి, పాలన చేయాలి మరియు ఓదార్చాలి. మనుష్యులు తమ మనస్సుపై నియంత్రణ

Read More »
21st june2024 soul sustenance telugu

మనుష్యుల వైబ్రేషన్లను అనుభూతి చెందడం ప్రారంభించండి

మీరు ఎవరినైనా కలిసినప్పుడు, మీ దృష్టి ఎటు వెళుతుంది? ఒకటి: వారి రూపం మరియు వస్త్రాలు పై మీ దృష్టి వెళుతుంది. రెండు: వారి మాటలు మరియు చేతల పై దృష్టి వెళుతుంది. ఇపుడు

Read More »
20th june2024 soul sustenance telugu

పోటీ పడటం మానండి… ఈ క్షణాన్ని ఆస్వాదించండి (పార్ట్ 4)

మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు సమతుల్య మనస్సును ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. కోపం, ఆవేశం, అహం లేదా దురాశ మన ఆలోచనలలో అసమతుల్యతను సృష్టించవచ్చు. మనల్ని మనం మనలాగే అనుభవం చేసుకున్నప్పుడు మరియు

Read More »