Hin

14th june2024 soul sustenance telugu

June 14, 2024

వినయంగా ఉంటూ ప్రతి ఒక్కరికీ గౌరవం ఇవ్వండి

ప్రతి సమాజం మరియు ప్రతి కుటుంబం కూడా ప్రవర్తనలో కొన్ని నియమాలను పాటిస్తుంది. వ్యక్తుల పాత్రలు, పదవుల ఆధారంగా వారిని గౌరవించడానికి ఆ నియమాలు మనకు ప్రవర్తనా నియమావళిగా పనిచేస్తాయి. నిర్దిష్ట పాత్రలలో ఉన్న వ్యక్తులను మనం ఎలా గౌరవించాలి,  వారితో ఎలా ప్రవర్తించాలి, పరస్పరం ఎలా వ్యవహరించాలి అనే దాని గురించి నియమాలను కలిగి ఉండటం ఆ పాత్ర యొక్క గౌరవాన్ని కాపాడుకోవడానికి చాలా ముఖ్యం. కొన్నిసార్లు, ప్రత్యేకించి మనకు ఇబ్బంది పెట్టిన అనుభవం లేదా వ్యక్తులపై ప్రతికూల అభిప్రాయం ఉన్నపుడు, మన అహం ఈ నియమాలను అనుసరించనివ్వదు. అనుసరించే నియమాలు మనల్ని మరియు మన సంబంధాలను బలోపేతం చేస్తాయి.

  1. వివిధ స్థాయిలలో అనుసరించే సంబంధిత నియమాలను తెలుసుకోండి: అది మీ కుటుంబం, సమాజం, నమ్మకాలు లేదా దేశం స్థాయి లో కావచ్చు. అడుగుతూ, గమనిస్తూ నేర్చుకోండి.
  2. మీకు తెలిసిన వ్యక్తుల గురించి మీ అభిప్రాయాలను చెక్ చేసుకోండి. మీ కంటే ఉన్నత స్థానంలో ఉన్న పెద్దవారితో, మీ కంటే మెరుగ్గా పని చేసి ప్రశంసలు పొందిన వారితో ప్రారంభించండి. అసూయ, న్యూనత లేదా ఉదాసీనత వంటి ఆలోచనలు ఉంటే, మీ మనస్సుకు ఇలా చెప్పుకోండి – వారి పాత్ర మరియు పదవికి గౌరవం ఇవ్వడం నా బాధ్యత.
  3. వయసులో చిన్నవారైనా, తక్కువ లేదా సమానమైన పాత్ర ఉన్న వారితో కూడా వినయంగా ఉండండి. ఇతరులు వారితో వేరేలా ప్రవర్తించినప్పటికీ, వారితో మర్యాదగా ఉండండి.
  4. మీరు గౌరవం ఇచ్చినప్పుడు, ఏర్పడిన సానుకూలత మీకు సద్భావనను పెంపొందించడానికి సహాయపడుతుంది. ఏ పని చేసే వారితో అయినా మర్యాదగా ఉండడం బలానికి సంకేతం. మీ నైతికతను అహంపై గెలవనివ్వండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

17th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న జీవితంలో మనలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జ్ఞానంతో మాత్రమే కాకుండా శక్తులతో సిద్ధపరుచుకోవాలి. చాలా సంవత్సరాల పాటు

Read More »
16th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు వివిధ రకాల సంఘటనలతో, కొన్నిసార్లు ప్రతికూలతతో నిండిన వాటితో జీవితాన్ని అనుభవం చేయడం  కష్టతరం కావచ్చు మరియు జీవితాన్ని ఒడిదుడుకుల కష్టతరమైన

Read More »
15th march 2025 soul sustenance telugu

ద్వేషం నుండి మిమ్మల్ని మీరు విముక్తి చేసుకోవడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనం అనేక విభిన్న సంబంధాల ప్రపంచంలో జీవిస్తున్నాం. ఒక అందమైన సంబంధం ఎలాంటి ద్వేషం లేని నిజమైన ఆత్మిక ప్రేమ పై

Read More »