Hin

13th march 2025 soul sustenance telugu

March 13, 2025

విశ్రాంతి తీసుకొని, రిఫ్రెష్ అయి మీ మనస్సును చైతన్య పరుచుకోండి

మన మనస్సులో ఆలోచనల ప్రవాహం నెమ్మదించాలని మనం కోరుకుంటాము. ప్రతిరోజూ 40,000 నుండి 50,000 ఆలోచనలు ఉత్పన్నమవుతూ, వాటిలో చాలా వరకు నెగెటివ్ లేదా వ్యర్థమైనవి ఉండడంతో మన మనస్సు అలసిపోతుంది. అది ఫోకస్ చేయడం, సరైన పదాలను ఉపయోగించడం లేదా పాజిటివ్ గా ఉండడం కష్టంగా చేస్తుంది.

మీ మనస్సుకు విశ్రాంతిని ఇచ్చి, రిఫ్రెష్ చేసుకొని చైతన్య పరుచుకోవడానికి ఈ విధానాలను అనుసరించండి –

  1. ప్రతి ఉదయం, మీ శరీరం, సంబంధాలు, పని వంటి ప్రతిదాన్ని మేనేజ్ చేస్తున్నందుకు మీ మనస్సుకు ధన్యవాదాలు చెప్పండి.
  2. 15 నిమిషాల మెడిటేషన్ తో దానిని శక్తివంతం చేయండి. శాంతి మరియు ఆనందంతో ప్రభావం  చేసే కంటెంట్‌ను చదవండి.
  3. మీ రోజు ఎలా ఉండాలో సంకల్పం చేసి దాన్ని విజువలైజ్ చేసుకోండి.
  4. మీ పనిలో, వ్యక్తులు మరియు పరిస్థితులలో పాజిటివ్ విషయాల పై మాత్రమే దృష్టి పెట్టండి.
  5. ప్రతి గంట తర్వాత ఒక నిమిషం పాజ్ చేసి మీ మనస్సుకు విశ్రాంతినిస్తూ నెగెటివిటీ లేకుండా క్లీన్ చేసుకోండి.
  6. మంచి నిద్ర కోసం నిద్రపోయే ముందు మెడిటేషన్ చేసి మీ మనస్సులో ఏదైనా సమస్య ఉంటే  దాన్ని పరిష్కరించుకోండి.

మీ మనస్సుతో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి మరియు క్లీన్ చేసుకోవడానికి క్రమం తప్పకుండా ఈ సంకల్పాలను 3 సార్లు రిపీట్ చేయండి.

నేనొక శక్తివంతమైన వ్యక్తిని … నేను నా మనస్సును జాగ్రత్తగా చూసుకుంటాను … నేను ప్రతిరోజూ ఉదయం 15 నిమిషాలు మెడిటేషన్ చేస్తాను … నేను పాజిటివ్ ఆలోచనలు చేస్తున్నాను … నేను నా రోజును నేను కోరుకున్న విధంగా ఉంటూ అనుకున్నవి చేస్తున్నట్టుగా విజువలైజ్ చేస్తాను… నేను 15 నిమిషాలు చదువుకుంటాను … ప్రతి పరిస్థితికి నేను సరిగ్గా స్పందిస్తాను … మీడియా, సోషల్ మీడియా మరియు వ్యక్తుల నుండి నెగెటివ్  సమాచారానికి నేను దూరంగా ఉంటాను  … ప్రతి గంటలో ఒక నిమిషం నేను పాజ్ అవుతాను … నా మనస్సుకు విశ్రాంతి ఇవ్వడానికి … నేను నిద్రపోయే ముందు మెడిటేషన్ చేస్తాను … అది నా మనస్సును చార్జ్ చేస్తుంది. 

మీరు మీ ఆలోచనలకు బాధ్యత వహించి, వాటిని నియంత్రించడం మొదలుపెడితే, మీ మనస్సు సహజంగానే నెమ్మదించి ప్రతి పరిస్థితిలోనూ సరిగ్గా ఆలోచిస్తుంది. వ్యక్తులు మరియు పరిస్థితుల పట్ల శ్రద్ధ వహించడానికి, మీ మనస్సును జాగ్రత్తగా చూసుకోవడమే మొదటి అడుగు.

రికార్డు

20th march 2025 soul sustenance telugu

సంబంధాల్లో కలిగే బాధ నుండి విముక్తిని పొందడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ రంగాలలో వేర్వేరు సంబంధాలలోకి వచ్చినప్పుడు, కొన్నిసార్లు మన అంతర్గత ప్రపంచంలోకి మరొక ఆత్మను అనుమతించినప్పుడు, మనల్ని వారు అర్థం

Read More »
19th march 2025 soul sustenance telugu

జీవితంలోని వివిధ దృశ్యాలలో సాకులు చెప్పడం మానుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలా మంది మన విశ్వసనీయతను కాపాడుకోవడానికి, ఇతరులపై లేదా పరిస్థితులపై నిందలు వేయడానికి సాకులు చెబుతారు. కొన్నిసార్లు మనకు, మన

Read More »
18th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు అంతర్గత బలం యొక్క సానుకూల సంస్కారాలను సృష్టించడానికి, మనం ముందుగా పట్టుదల యొక్క మొదటి అడుగు వేయాలి. పట్టుదల అంటే నేను

Read More »