Hin

10th May 2025 Soul Sustenance Telugu

May 10, 2025

విసుగు ను(కోపం యొక్క మరో రూపం) అధిగమించండి

జీవితంలో మనం ఎప్పటికీ మార్చలేని రెండు విషయాలు:

– గతం మరియు

– వ్యక్తులు

ఇది మనల్ని ఎదో ఒక రకంగా విసిగిస్తుంది ప్రత్యేకంగా మనం కోరుకున్న ఫలితాలను పొందనప్పుడు. వైఫల్యానికి మరోక గుర్తు విసుగు, మరియు మీరు మరొకరి నుండి మీకు కావలసినదాన్ని పొందడంలో విఫలమైన ప్రతిసారీ మీ ఆత్మగౌరవం మరియు ఆత్మవిశ్వాసం తగ్గుతాయి.

 

విసుగు అనేది కోపం యొక్క మరొక రూపం

నెగెటివ్ ఎమోషన్ మిమ్మల్ని కంట్రోల్ చేసేందుకు మీరు అనుమతిస్తారు, అందువల్ల మీరు కంట్రోల్ కోల్పోతారు. చాలా సార్లు వ్యక్తులు, పరిస్థితులు మీరు కోరుకున్నట్లుగా ఉండవు. కాబట్టి, మీరు వారి  ప్రవర్తనకు అనుగుణంగా మీ రియాక్షన్ ఉండాలా లేదా వారు ఎలా ప్రవర్తించినా మీరు మీ రెస్పాన్స్ గా ఏమి ఆలోచించాలి, ఎలా ఫీల్ అవ్వాలి అనేది  నిర్ణయించుకోవచ్చు. వారి ప్రవర్తనకు అనుగుణంగా మీ ప్రతిచర్యలు ఉంటే మీరు మీ నియమాలు మరచి మీపై కంట్రోల్ ను మరియు మీ ఆంతరిక శక్తిని కోల్పోతారు. కానీ  మీరు మీ రెస్పాన్స్ ఎలా ఉండాలో నిర్ణయించుకుంటే మీపై మీకు కంట్రోల్ ఉంటుంది.

మరొకరు మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించి, వారు కోరుకున్నది మీరు చేయనందున లేదా వారు ఆశించినట్లు మీరు లేకపోయినందున విసిగిపోయి, వారి మూడ్ పాడవుతుంది; వారు మిమ్మల్ని కోపంగా చూస్తారు అప్పుడు మీరు ఏమి చేస్తారు? అప్పుడు మీకు వారికి మధ్య ఒక గుప్తమైన అడ్డంకిని ఉంచుతారు. వారు మీ ప్రపంచంలోకి ప్రవేశించలేరు మరియు మీరు కూడా మీ ప్రపంచాన్ని వదిలిపెట్టరు, వారు మీపై తమ ప్రభావాన్ని కోల్పోతారు. అదే విధంగా, మీరు వ్యక్తులను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తే  మీరు వారిపై మీ ప్రభావాన్ని కోల్పోతారు మరియు దూరం ఏర్పడుతుంది.

రికార్డు

22nd May 2025 Soul Sustenance Telugu

భోజనం చేసే ముందు భగవంతునికి ఆహారాన్ని అర్పించడం వల్ల కలిగే 7 ప్రయోజనాలు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం అలవర్చుకోవల్సిన ఒక అందమైన అలవాటు, భగవంతుని ధ్యానంలో ప్రతి భోజనాన్ని వండడం. అలాగే, ఒక రోజులో

Read More »
21st May 2025 Soul Sustenance Telugu

మీ వాస్తవిక సత్య గుణానికి తిరిగి వెళ్లడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సత్యం మన వాస్తవిక గుణం, కానీ ఎప్పటికప్పుడు మన సౌలభ్యం కోసం లేదా స్వల్పకాలిక లాభాల కోసం అబద్ధాలు చెబుతాము. ఆసక్తికరమైన

Read More »
20th May 2025 Soul Sustenance Telugu

మీ పిల్లలతో తగినంత సమయం గడపకపోవడంపై అపరాధ భావాన్ని అధిగమించండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు వివిధ రకాల వ్యక్తిగత మరియు వృత్తిపరమైన నిబద్ధతలను గౌరవించేటప్పుడు, చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు తగినంత నాణ్యమైన సమయాన్ని ఇవ్వకపోవడం

Read More »