Hin

10th-nov-2023-soul-sustenance-telugu

November 10, 2023

విసుగు ను(కోపం యొక్క మరో రూపం) అధిగమించండి

జీవితంలో మనం ఎప్పటికీ మార్చలేని రెండు విషయాలు:

– గతం మరియు

– వ్యక్తులు

ఇది మనల్ని ఎదో ఒక రకంగా విసిగిస్తుంది ప్రత్యేకంగా మనం కోరుకున్న ఫలితాలను పొందనప్పుడు. వైఫల్యానికి మరోక గుర్తు విసుగు, మరియు మీరు మరొకరి నుండి మీకు కావలసినదాన్ని పొందడంలో విఫలమైన ప్రతిసారీ మీ ఆత్మగౌరవం మరియు ఆత్మవిశ్వాసం తగ్గుతాయి.

విసుగు అనేది కోపం యొక్క మరొక రూపం

నెగెటివ్ ఎమోషన్ మిమ్మల్ని కంట్రోల్ చేసేందుకు మీరు అనుమతిస్తారు, అందువల్ల మీరు కంట్రోల్ కోల్పోతారు. చాలా సార్లు వ్యక్తులు, పరిస్థితులు మీరు కోరుకున్నట్లుగా ఉండవు. కాబట్టి, మీరు వారి  ప్రవర్తనకు అనుగుణంగా మీ రియాక్షన్ ఉండాలా లేదా వారు ఎలా ప్రవర్తించినా మీరు మీ రెస్పాన్స్ గా ఏమి ఆలోచించాలి, ఎలా ఫీల్ అవ్వాలి అనేది  నిర్ణయించుకోవచ్చు. వారి ప్రవర్తనకు అనుగుణంగా మీ ప్రతిచర్యలు ఉంటే మీరు మీ నియమాలు మరచి మీపై కంట్రోల్ ను మరియు మీ ఆంతరిక శక్తిని కోల్పోతారు. కానీ  మీరు మీ రెస్పాన్స్ ఎలా ఉండాలో నిర్ణయించుకుంటే మీపై మీకు కంట్రోల్ ఉంటుంది.

మరొకరు మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించి, వారు కోరుకున్నది మీరు చేయనందున లేదా వారు ఆశించినట్లు మీరు లేకపోయినందున విసిగిపోయి, వారి మూడ్ పాడవుతుంది; వారు మిమ్మల్ని కోపంగా చూస్తారు అప్పుడు మీరు ఏమి చేస్తారు? అప్పుడు మీకు వారికి మధ్య ఒక గుప్తమైన అడ్డంకిని ఉంచుతారు. వారు మీ ప్రపంచంలోకి ప్రవేశించలేరు  మరియు మీరు కూడా మీ ప్రపంచాన్ని వదిలిపెట్టరు, వారు మీపై తమ ప్రభావాన్ని కోల్పోతారు. అదే విధంగా, మీరు వ్యక్తులను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తే  మీరు వారిపై మీ ప్రభావాన్ని కోల్పోతారు మరియు దూరం ఏర్పడుతుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

11th october 2024 soul sustenance telugu

ఆంతరిక రావణుడిని కాల్చి స్వేచ్ఛను అనుభవం చేసుకోవటం  (పార్ట్ 1)

దసరా నాడు ఆధ్యాత్మిక సందేశం-అక్టోబర్ 12 దసరా అంటే చెడుపై మంచి సాధించిన విజయాన్ని జరుపుకునే పండుగ. ఇది శ్రీరాముడు మరియు రావణుడి మధ్య యుద్ధం రూపంలో చూపబడుతుంది. ఇందులో శ్రీరాముడు రావణుడిని ఓడించి

Read More »
10th october 2024 soul sustenance telugu

ఆలోచనలపై ప్రతికూల ప్రభావాలను అధిగమించడం (పార్ట్ 3)

నిన్న మనం బాహ్య ప్రభావాల గురించి చర్చించుకున్నాము. మన ఆలోచనలపై కొన్ని ఆంతరిక ప్రభావాలు ఈ క్రింది విధంగా ఉంటాయి: – ప్రశంసలు, కీర్తి, ప్రతీకారం, దురాశ, పరిస్థితి లేదా వ్యక్తి యొక్క నియంత్రణలో

Read More »
9th october 2024 soul sustenance telugu

ఆలోచనలపై ప్రతికూల ప్రభావాలను అధిగమించడం (పార్ట్ 2)

కేంద్రీకృత ఆలోచన యొక్క ఆరోగ్యకరమైన, సానుకూల అనుభవంలో ఉండనివ్వని ఒక ముఖ్యమైన అంశం మన జీవితంలో మనం ఎదుర్కొనే అనేక రకాల ప్రభావాలు. రెండు రకాలైన ప్రభావాలు ఉన్నాయి – బాహ్యమైనవి మరియు ఆంతరికమైనవి.

Read More »