Hin

24th October 2024 Soul Sustenance Telugu

October 24, 2024

వ్యక్తులతో ఆన్లైన్లో కాకుండా ముఖాముఖిగా మరింత కనెక్ట్ అవ్వండి.

డిజిటల్ కమ్యూనికేషన్ వచ్చినప్పటి నుండి, మనము ఆన్లైన్లో వ్యక్తులని చేరుకోవడానికి ఇష్టపడతాము. మిమ్మల్ని, మీ సంబంధాలని శక్తివంతం చేసుకోవడానికి ముఖాముఖి సంభాషణలను ఎంత ఇష్టపడతారో ఒక్కసారి కూర్చుని ఆలోచించండి. గత కొన్ని సంవత్సరాలుగా, మన పరస్పర చర్యలకు సాంకేతికత-ముఖ్యంగా సోషల్ మీడియా వాస్తవ ప్రపంచంతో పోలిస్తే మరింత ఆకర్షణీయంగా మారింది. మనం వ్యక్తుల నుండి దూరంగా ఉండి, ఆన్లైన్లో కనెక్ట్ అవుతున్నాము.

  1. మీరు నిజ జీవితంలో వ్యక్తులను కలవడం ఆనందిస్తారా లేదా వారితో ఆన్లైన్లో మాట్లాడటానికి ఇష్టపడతారా? మీరు డిజిటల్గా ఎక్కువ మందితో కనెక్ట్ అవుతున్నారా? కుటుంబంతో కూర్చున్నప్పుడు కూడా, మీరు తరచుగా ఫోన్లో ఎవరితోనైనా మాట్లాడుతున్నారా?
  2. ఎక్కువ మంది వ్యక్తులతో త్వరగా సంభాషించడానికి సాంకేతికత మీకు సహాయపడుతుంది. కానీ మీరు ఏ విధంగా అయితే ఎవరినైనా వ్యక్తిగతంగా కలిసినప్పుడు వారి ఎమోషన్స్ అర్ధం చేసుకుంటారో ఆ విధంగా అది కనెక్ట్ చేయదు.
  3. ఆన్లైన్లో పరస్పర చర్యలలో ఎప్పుడు పాల్గొనాలో, మరీ ముఖ్యంగా ఎప్పుడు లాగ్ ఆఫ్ చేయాలి అని జాగ్రత్తగా ఎంచుకోండి. దానికి బదులుగా ముఖాముఖి సంభాషణలు చేయండి, ఎందుకంటే అవి అర్ధవంతమైన సంబంధాలకు చాలా ముఖ్యమైనవి. అవి మీ ఆనందం, సామరస్యం మరియు శ్రేయస్సును పెంచే శక్తివంతమైన సంబంధాలను సృష్టిస్తాయి.
  4. మీ కరుణ, ప్రేమ మరియు దయ లక్షణాలను బలోపేతం చేయడానికి ప్రతిరోజూ ధ్యానం చేయండి, తద్వారా మీరు ఇతరుల అవసరాలకు మరింత సున్నితంగా ఉంటారు. స్వయానికి, కుటుంబానికి, స్నేహితులకు, సామాజిక సమావేశాలకు మరియు సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడానికి సమయాన్ని కేటాయించండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

21st June 2025 Soul Sustenance Telugu

ప్రశంసలు మరియు విమర్శలలో స్థిరత్వం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు ప్రశంసలు మన అహంభావాన్ని పెంచితే, విమర్శించినప్పుడు మనం ఖచ్చితంగా కలత చెందుతాము. ప్రశంసలు లేదా విమర్శల వల్ల ప్రభావితం కాకుండా మనం

Read More »
20th June 2025 Soul Sustenance Telugu

బేషరతు ప్రేమలోని చక్కదనం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనం అందరినీ బేషరతుగా ప్రేమించాలనే అనుకుంటాం, కానీ ఎదుటివారి నుండి కోపం, అహం లేక ద్వేషం వస్తే, అప్పుడు కూడా వారితో

Read More »
19th June 2025 Soul Sustenance Telugu

నేను ప్రయత్నిస్తాను అని కాదు నేను తప్పకుండా చేస్తాను అని అనండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు ఏదైనా చేయాలనుకున్నప్పుడు, నేను చేస్తాను అనే బదులుగా నేను ప్రయత్నిస్తాను అని అంటాము. ప్రయత్నించడం వేరు,  చేయడం వేరు. ప్రయత్నం అనే

Read More »