Hin

8th jan 2024 soul sustenance telugu

January 8, 2024

వ్యక్తుల భావాలలో చిక్కుకోవడం ఆపండి

మనం తరచుగా, బాధ్యత పేరుతో ఇతరుల జీవన విధానాన్ని మార్చడానికి ప్రయత్నిస్తాము. అలా చేయడం వల్ల మనం గొడవలు పడి వారి భావాలలో చిక్కుకుపోతాం. ప్రతికూల సంస్కారాలను కలిగి ఉన్న వ్యక్తి యొక్క భావాలతో మనం కనెక్ట్ అయినట్లయితే, వారు మన వైబ్రేషన్స్ భాగమయ్యి మనం ప్రతికూలతను అనుభవిస్తాము. మీరు మీ భావాలని పరిశీలిస్తే, దానిలో నొప్పి, కోపం లేదా గందరగోళం వంటి ఇతర వ్యక్తుల భావోద్వేగాల మరకలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? ఇతరుల బలహీనతలను గురించి మథనపడడం, వివాదాలలోకి రావడం లేదా మనం ఇతరుల భావోద్వేగాలతో చిక్కుకున్నప్పుడు వారి ఎనర్జీని మన ప్రకాశంలో భాగం చేసుకుంటామని మీకు తెలుసా? స్వచ్ఛమైన ఎనర్జీతో అధిక-ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ చేయడమే మన ఉద్దేశ్యం. మామూలుగా చాలా మంది వ్యక్తులతో పరస్పర చర్యకు రావడం అనివార్యం. కానీ వారితో చిక్కుకోవడం అనేది ప్రశ్నార్థకమైన ప్రవర్తన, ఎందుకంటే అది వారి కంటే మనకు ఎక్కువ హాని చేస్తుంది. వ్యక్తులకు బలహీనతలు ఉండవచ్చు. మన అభిప్రాయాలు వారి అభిప్రాయాలకు భిన్నంగా ఉంటాయి. కానీ మనం వాటి గురించి ఆలోచిస్తూ, మాట్లాడుకుంటూ ఉంటే, మనకు గొడవలు వస్తే, మన శక్తిని మనం తగ్గించుకుంటాము. అలజడి పరిస్థితులలో, మనం వారి ప్రతికూల ప్రకంపనలను గ్రహిస్తాము. ఇది భావోద్వేగ చిక్కుముడి. మన సంస్కారాలు మరియు మన శక్తులపై దృష్టి కేంద్రీకరిద్దాం. నేను సంతోషకరమైన జీవిని. నేను వ్యక్తులతో చిక్కుకోను. నా ప్రకాశం నేను ఎంచుకున్న స్వచ్ఛమైన ఆలోచనలు మరియు భావోద్వేగాలను మాత్రమే కలిగి ఉంది అని మీకు మీరే గుర్తు చేసుకోండి.

మీ అంతర్గత శాంతి మరియు శక్తిని అనుభూతి చెందడం ప్రారంభించండి. మీరు మీ ప్రకాశాన్ని శుభ్రంగా ఉంచుకోవడంపై దృష్టి సారిస్తే, మీ స్వచ్ఛత మీ జీవితంలోకి అలాంటి శక్తులను ఆకర్షిస్తుంది. నేను శక్తి స్వరూపాన్ని. ఎవరితోనూ మోహం పెంచుకోకూడదు, బేషరతుగా  ఇతరులను ప్రేమించే కళ నాకుంది అని మీకు మీరు గుర్తు చేసుకోండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

3rd dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 2)

స్టెప్ 2 – సానుకూలమైన మరియు శక్తివంతమైన మానసిక స్థితిని సృష్టించడం – ఏదైనా ప్రతికూల పరిస్థితిని పరిష్కరించడంలో తదుపరి దశ ఆధ్యాత్మిక ధృవీకరణలు లేదా ఆంతరిక శక్తి, దృఢత్వంతో నిండిన ఆలోచనల సహాయంతో

Read More »
2nd dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 1)

మనం అనూహ్యమైన జీవితాన్ని గడుపుతున్నాము. మన జీవితంలో తరచూ ఊహించని పరిస్థితులు వస్తున్నాయి. దీనికంతటికీ కారణం ఏమిటి? ఈ రోజు మన జీవితాలలో క్లిష్ట పరిస్థితులు ఎందుకు పెరుగుతున్నాయి? భగవంతుడు వెల్లడించిన ప్రపంచ నాటకం

Read More »
1st dec 2024 soul sustenance telugu

దివ్యమైన ఆత్మ యొక్క 12 లక్షణాలు (పార్ట్  2)

స్వయంలోని బలహీనతలను, లోపాలను సులభంగా పరిశీలించుకోగలిగే అద్దం లాంటి వారు దివ్యమైన ఆత్మ. వారిలో భగవంతుని మంచితనాన్ని, శక్తులను చూడగలుగుతాము. వారు భగవంతునితో స్వచ్ఛంగా, సత్యంగా ఉంటారు. వారు ప్రతిదీ ఎలా ఆచరణలోకి తీసుకురావాలనే

Read More »