Hin

15th dec 2023 soul sustenance telugu (1)

December 14, 2023

వ్యక్తులనుండి భావోద్వేగ స్వతంత్ర్యత

మనకున్న బంధాలలో, కొన్ని బంధాలపై మనం భావోద్వేగంగా ఆధారపడి ఉంటాం. మనం ఇతరుల అవసరాలు, అభిప్రాయాలు మరియు భావాల గురించి ఆలోచిస్తూ అసమంజసంగా సమయాన్ని వెచ్చిస్తాము.  మన సొంత అవసరాలు ప్రక్కకు వెళ్ళిపోతాయి ఎందుకంటే మన భావాలు, నిర్ణయాల నియంత్రణను పూర్తిగా ఇతరులకు ఇచ్చేసాము. వారు మనల్ని ప్రేమించాలని వారి నుండి ఆశిస్తూ వారిపై ఆధారపడి ఉంటాం, ఇది ఇరువురికీ మంచిది కాదు. మీ మనసు ఎవరితోటైనా భావోద్వేగంగా చిక్కుబడి ఉండటాన్ని ఎప్పుడైనా గమనించారా? ఏ వ్యక్తి అయినా ఎప్పుడూ మీ మనసులో ఉంటున్నారా? అటువంటి వ్యక్తి ప్రవర్తనలో కొద్దిగా తేడా వచ్చినా మనసు పాడవుతుందా? భావోద్వేగంగా ఇతరులపై ఆధారపడటం మనమనుకున్న దానికన్నా చాలా ప్రమాదకరమైనది. ఇది గాఢమైన వ్యసనంలా కూడా మారవచ్చు. మన మనసు కొందరి ప్రవర్తనపై ఆధారపడి ఉన్నప్పుడు, వారు మనం కోరుకున్న విధంగా ఉండాలని ఆశిస్తాం. ఎప్పుడూ వారి నుండి ప్రేమ, హాజరు, అభిప్రాయాలు మరియు సమ్మతిని కోరుకుంటాము. ఇందులో ఏ ఒక్కటి లభించకపోయినాగానీ మనకు అభద్రతా భావన కలుగుతుంది. నిజానికి మనకు భావోద్వేగంగా చాలా శక్తి ఉంది. మనకు వారి నుండి ఏమీ అవసరం లేదు. వారు ఎలాంటి వారో అర్థం చేసుకుని వారితో అలాగే వ్యవహరిద్దాం, అంతేకానీ నాకు భావోద్వేగ హాయిని అందిస్తారని కాదు. నిజమైన ప్రేమ విడుదలను తెస్తుంది. ఆధారపడి ఉంటే అది వారినీ, మనల్నీ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీ మనసుతో సమయాన్ని గడపండి. మనసుకు గుర్తుచేయండి – నా బంధాలు భావోద్వేగ స్వతంత్ర్యత మరియు ప్రేమ అను పునాదిపై నిల్చుని ఉన్నాయి.

ప్రశాంతంగా కూర్చుని, వ్యక్తులనుండి భావోద్వేగంగా ఆశ్రితమై ఉండే స్వభావాన్ని ఎలా తొలగించుకోవాలి, తిరిగి స్వాతంత్ర్యాన్ని ఎలా పొందాలి అని ఆలోచించండి. మిమ్మల్ని మీరు స్పష్టంగా చూసుకోండి, మీ అవసరాలను గుర్తించండి. మీ ఆత్మ గౌరవం పెరుగుతుంది, మీ మమకారాలు, ఆశ్రితతత్వం తగ్గుతాయి. మీకు మీరు గుర్తు చేసుకోండి – నేను శక్తిశాలి స్వరూపాన్ని. నేను భావోద్వేగపరంగా స్వతంత్రంగా ఉన్నాను, నాకు ఎలా కావాలో, ఏమి కావాలో నాకు తెలుసు. నా ఆంతరిక ప్రపంచాన్ని ఎవ్వరూ ప్రభావితం చేయలేరు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

Aalochanalu mariyu chitraala sukshma paatra (part 2)

ఆలోచనలు మరియు చిత్రాల సూక్ష్మమైన పాత్ర (పార్ట్ 2)

ఆత్మ సృష్టించే ఆలోచనలు, చిత్రాల నాణ్యత అనేది ఆత్మ యొక్క సంస్కారాలపై ఆధారపడి ఉంటుంది. నాణ్యతను బట్టి, ఆత్మ సానుకూలమైన లేదా ప్రతికూలమైన వివిధ భావోద్వేగాలను అనుభవం చేసుకుంటుంది. పరంధామం నుండి భౌతిక ప్రపంచ

Read More »
Aalochanalu mariyu chitraala sukshma paatra (part 1)

ఆలోచనలు మరియు చిత్రాల సూక్ష్మ పాత్ర (పార్ట్ 1)

మానవ ఆత్మ ఒక సూక్ష్మమైన (భౌతికం కాని) స్టేజి. నిద్రిస్తున్నప్పుడు చాలా తక్కువగా ఉన్నప్పటికీ, రోజంతా మరియు నిద్రిస్తున్నప్పుడు కూడా ఆలోచనలు, చిత్రాల సూక్ష్మ పాత్ర నిరంతరం దానిపై జరుగుతుంది. మన ఆలోచనలు 4

Read More »
కార్యాలయంలో నిజాయితీ

కార్యాలయంలో నిజాయితీ

మీ కార్యాలయంలో నిజాయితీ అనేది కేవలం ఒక పద్ధతి మాత్రమే కాదు, విజయం మరియు సంతుష్టతలకు రహస్యం కూడా. నిజాయితీని విలువైనదిగా భావించే ఉద్యోగికి విజయం, నమ్మకం లభిస్తాయి. మన నిజాయితీ విషయంలో రాజీ

Read More »