Hin

15th dec 2024 soul sustenance telugu

December 15, 2024

వ్యక్తులను నిజాయితీగా, ఉదారంగా మెచ్చుకోవడం

మన చుట్టూ ఉన్న వ్యక్తులు వారు ఎవరో, వారు ఏమి చేస్తున్నారో అనే దానికి ఇప్పటికే పొందిన దానికంటే కొంచెం ఎక్కువ ప్రశంసలు కోరుకుంటారు. గుర్తింపు అనేది వ్యక్తి యొక్క స్ఫూర్తిని మరియు సమర్థతను అద్భుతంగా పెంచుతుంది. కానీ ప్రశంసలోని గొప్పదనాన్ని మనం అర్థం చేసుకోలేదు, ఇతరులను ప్రశంసించడాన్ని వ్యక్తిగతంలోగానీ లేక వృత్తి సంబంధాలలోగానీ మనం తక్కువగా అంచనా వేస్తున్నాం. మీరు గనక మీ చుట్టూ ఉన్నవారిని బాగా గమనిస్తే, మీకు ఆసరాగా నిలిచే అద్భుతమైన వ్యక్తులు చాలా మందే ఉన్నారని గమనిస్తారు. వారు నిస్వార్థమైన ప్రేమతో ఉంటారు. వారు పరిమితులను విస్తరిస్తూ వివిధ స్థాయిలలో త్యాగాలు చేస్తున్నారు. వారిని మెచ్చుకోవడానికి మీరు సమయాన్ని వెచ్చించారా? మనం ఎల్లప్పుడూ వ్యక్తులను వారు ఎవరో గుర్తించము. మనం వారి మంచితనాన్ని, దయను స్వల్పంగా పరిగణిస్తాము. ఇంట్లో లేదా కార్యాలయంలో మన జీవితాన్ని మెరుగుపరచడానికి వారు చేసే ప్రయత్నాలను కూడా మనం విస్మరిస్తాము. వారు ఫిర్యాదు చేయకపోయినా, మనం ముందుకు వచ్చి మాట్లాడాలి. వెనుతట్టడాన్ని లేదా నిజమైన ధన్యవాదాలను ఎవరు ఇష్టపడరు? అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ, వారు చేయగలిగినంత ఉత్తమంగా చేస్తూ ఉన్నారని అంగీకరించండి. వారికి ఘనతను ఇవ్వకుండా అడ్డుకునే మన సంకోచాన్ని లేదా అజ్ఞానాన్ని దాటి వెళ్ళాల్సిన సమయం ఇది. ఇతరులను మెచ్చుకునే మన శక్తి తక్కువగా అంచనా వేయబడుతుంది. ఎవరినైనా ప్రశంసించడానికి ఈ రోజు కొన్ని సెకన్లు కేటాయించి ఆ రోజు అది వారికి, మీకు చేసే మార్పును చూడండి.

ఈ రోజు నుండి, ప్రతిరోజూ అందరినీ మెచ్చుకుంటూ సాధికారత కల్పించండి, వారిలో ఉన్న గొప్పతనాన్ని ప్రేరేపించడం ప్రారంభించండి. ప్రతి ఒక్కరూ మంచి లక్షణాలను పెంపొందించుకుంటారని గుర్తించండి. వారు చేసే పనిని మాత్రమే కాకుండా వారు ఎవరో గమనించి అభినందించండి. వారి మంచితనం గురించి అనుకొని మనసులోనే కృతజ్ఞత చూపించకండి, మీ మాటలలో మరియు చర్యలలో దానిని వ్యక్తపరచండి. వారికి చెప్పడానికి ఒక సందర్భం కోసం వేచి ఉండకండి, దానిని వాయిదా వేయవద్దు. నిజమైన ధన్యవాదాలు చెప్పడానికి వెంటనే సమయాన్ని వెచ్చించండి. మీ దయ, ప్రేమ ఇతరులకు సుఖంగా, ప్రేరణాత్మకంగా ఉంటాయి. ఇది మీకు మరియు వారికి మార్పును కలిగిస్తుంది. బేషరతుగా మీ కోసం ఉన్న మీ కుటుంబాన్ని, మీకు సహాయపడే మీ స్నేహితులను, పని గడువును తీర్చడంలో సహకరిస్తూ చాలా నైపుణ్యాలతో, వారి ఉత్తమమైనదాన్ని ఇచ్చే మీ సహోద్యోగులను ప్రశంసించండి. యాదృచ్ఛికంగా దయతో వ్యవహరించే అపరిచితులను కూడా మెచ్చుకోండి. మీరు వారికి అభినందనలు తెలియజేసేటప్పుడు ముందు మీకు మీరు మంచి వైబ్రేషన్లను అనుభవం చేసుకోండి. మీరు అందరినీ ఎంత ఎక్కువగా మెచ్చుకుంటారో, మీరు అభినందించడానికి అంత ఎక్కువ కారణాలను కనుగొంటారు.

రికార్డు

24th april 2025 soul sustenance telugu

వెళ్ళిపోయిన ప్రియమైన వ్యక్తికి శాంతిని, ప్రేమను ప్రసరింపజేయండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో ప్రతి ఒక్కరూ కూడా వేరు వేరు జన్మల ప్రయాణంలో ఉన్నారు, అలాగే మన చుట్టూ ఉన్న ఆత్మలు కూడా. బంధువు,

Read More »
23rd april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు   మంచి కర్మలు మరియు చెడు కర్మలు రెండూ ఈ సమాజంలో ఉన్నాయి. మన జీవితంలో అనేక కర్మలు చేస్తూ ఉంటాము,

Read More »
22nd april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు   మంచి కర్మలు మరియు చెడు కర్మలు అనేవి జీవితమనే నాణానికి ఉన్న రెండు వైపుల వంటివి.  మన కర్మలు ఎంత

Read More »