Hin

12th feb 2024 soul sustenance telugu

February 12, 2024

వ్యక్తులను, పరిస్థితులను దీవించడం ఎలా?

కుటుంబ సభ్యులలోగానీ, స్నేహితులు లేక  సహోద్యోగులలో ఎవరిలోనైనా చెడు అలవాట్లు ఉంటే, మనకు నచ్చదు. అలాగే, ప్రపంచంలో, మన చుట్టూ అశాంతియుత పరిస్థితులు తలెత్తితే కూడా మనకు సౌకర్యంగా అనిపించదు. వ్యక్తులు, పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసి మనం డిస్టర్బ్ అవ్వడం కాకుండా వారికి దీవెనలు అనే మంచి శక్తిని అందించడం మన కర్తవ్యం. మనం అందించే తరంగాల శక్తి వారి మార్పుకు ఎంతో దోహదపడుతుంది. జీవితంలో సవాళ్ళు ఎదురైనప్పుడు, లేక వ్యక్తులలో అనారోగ్యకర అలవాట్లు చూసినప్పుడు, మీరు కలవరపడుతున్నారా? కోపంతో, వ్యాకులతతో మీ ఆలోచనలు, మాటలు నిండి ఉంటున్నాయా? లేక మీ దీవెనల శక్తిని వినియోగించి మీరు వారి మార్పుకు దోహదపడుతున్నారా? దీవెనలు అంటే మనం అందించే శక్తివంతమైన ఆలోచనలు మరియు మాటలు. వారిలో మనం ఆశించే మార్పును మనసులో ముందుగా మనం చూడాలి, ఆ శక్తిని వ్యక్తి లేక పరిస్థితికి అందించండి. ఇలా మనం ప్రతి పనిని, ప్రతి వస్తువును, వ్యక్తిని, ప్రకృతిని దీవించవచ్చు. మన ఆశీర్వాదాల వలన వ్యక్తులు ఉత్తమంగా ప్రవర్తించి పనిలో విజయాన్ని పొందగలుగుతారు. విమర్శ, చింత, భయం, తిరస్కారం ఆత్మ శక్తిని హరిస్తాయి, ఇది పని నాణ్యతను కూడా తగ్గిస్తుంది. కాబట్టి ఆశీర్వాదాలకు భిన్నమైన ఆలోచనలను చేయకుండా ఉండేలా మనం జాగ్రత్త పడాలి. తెలియకుండానే మనం నెగిటివ్ ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఇప్పుడు అర్థమయింది కనుక, ప్రపంచానికి ఉపయోగపడే సానుకూల, ఆశీర్వాదాలతో కూడిన ఆలోచనలనే చేద్దాం. గుర్తు పెట్టుకోండి – నేను వ్యక్తులను, పరిస్థితులను, వస్తువులను, పనులను, ప్రకృతిని, కాలాన్ని… అన్నిటినీ ఆశీర్వదిస్తాను… నా ఆశీర్వాదాలు నా తరంగాల నాణ్యతను మార్చి ఆశించిన వాస్తవాన్ని సాకారం చేస్తాయి.

ఈరోజు నుండి ఆశీర్వాదాలను అందించేవారిగా అవ్వండి. వ్యక్తులను, పరిస్థితులను దీవించేటప్పుడు మీరు తక్కువ స్థాయి నుండి ఎక్కువ స్థాయి తరంగాలను సృష్టిస్తున్నారని అర్థం. మీ ఈ పాజిటివ్ తరంగాలు మీలో మరియు ఇతరులలో సమర్థవంతమైన మార్పును తెస్తాయి. గుర్తు పెట్టుకోండి – వ్యక్తులు, పరిస్థితులను మార్చే శక్తి నా ఆశీర్వాదాలకు ఉంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

8th october 2024 soul sustenance telugu

ఆలోచనలపై ప్రతికూల ప్రభావాలను అధిగమించడం (పార్ట్ 1)

మన ఆలోచనలు వివిధ రకాలు, వివిధ తీవ్రతలను కలిగి ఉంటాయి. వాటి సంఖ్య  కూడా మెలకువగా ఉన్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఆ నిర్దిష్ట సమయంలో మనం ఏ చర్య చేస్తున్నాం లేదా

Read More »
7th october 2024 soul sustenance telugu

వైఫల్యాలను సులభంగా అంగీకరించడం

మనం ఎంత కష్టపడినా కొన్నిసార్లు విఫలమవుతాము అనేది జీవితంలో ముఖ్యమైన పాఠాలలో ఒకటి. మనం వైఫల్యాలు, లోపాలను మన ప్రయాణంలో భాగంగా పరిగణించి అంగీకరించాలి. మనలో చాలా మంది జీవితంలో వైఫల్యాలకు భయపడతాము .

Read More »
6th october 2024 soul sustenance telugu

నిర్లిప్తంగా ఉండి, గమనించి మరల్చుకోండి

మన జీవితాలు ఎప్పటికప్పుడు వివిధ రకాల పరిస్థితులతో నిండి ఉంటాయి. మనం తరచుగా పరిస్థితుల వల్ల ప్రతికూలంగా ప్రభావితమవ్వడంతో మన ఆంతరిక శక్తి తగ్గుతుంది. నిర్లిప్తంగా ఉండి, గమనించి మరల్చుకోవటం అనేది ఆధ్యాత్మికత యొక్క

Read More »