Hin

Vyaktulanu swachchamyna palakalaa kalavandi

September 5, 2023

వ్యక్తులను స్వచ్ఛమైన పలకలా కలవండి

మీ ఆఫీసులోని సహోద్యోగి ఈరోజు ఏదైనా పొరపాటు చేసాడనుకోండి, అతను దానిని రేపు కూడా చేస్తాడా? ఈరోజు మీ కుటుంబ సభ్యులలో ఒకరు మీతో పరుషంగా వ్యవహరిస్తే, వారు రేపు మారరా? మెరుగైన రేపటి రోజును చూడకుండా, ‘వీళ్ళు మారరు’ అన్న నిర్థారణకు వచ్చేసి నెగిటివ్ అభిప్రాయాలలోకి వెళ్ళిపోతున్నారా? మనం గుర్తించినా గుర్తించకపోయినా కానీ, వ్యక్తులు ఎప్పుడూ మారుతూ ఉంటారు అన్నది వాస్తవం, అది మంచి వైపుకు కావచ్చు చెడు వైపుకు కావచ్చు. అంటే ఈరోజు మనకు ఇబ్బందిని కలిగించిన వారు రేపటి రోజు మనకు ఆనందాన్ని కలిగించవచ్చు. మరింత మెరుగ్గా అవ్వాలన్న అటెన్షన్ మనపై మనం ఉంచితే సరిపోతుంది – మరింత అంగీకరిస్తూ, గౌరవిస్తూ, ప్రేమను అందిస్తూ ఉండేలా మారాలి. ఫిర్యాదులు చేయడం మరియు విమర్శించడం మన శక్తిని మరింత క్షీణింపజేస్తాయి. అవతలి వ్యక్తికి ఈరోజు మంచిగా లేనట్లుంది అని అర్థం చేసుకుందాం. వారిని, మనలను ఇరువురినీ శుభ భావనతో దీవించుకుందాం – అతనితో నా తదుపరి కమ్యూనికేషన్ మంచిగా ఉండబోతుంది. మన నుండి వచ్చే తరంగాలు మనల్ని పైకి లేపి వారినీ సాధికారపరుస్తాయి.  ప్రతి రోజు ఒక కొత్త ప్రారంభం; ప్రతి గంట కొత్త ప్రారంభం. ప్రతిసారీ క్లీన్ స్లేట్‌తో వ్యక్తులను కలుద్దాం – మన మనస్సు నుండి అప్రియమైన జ్ఞాపకాలు, అవగాహనలు మరియు ముందస్తు ఆలోచనలను తొలగిద్దాము.

                 మనకు అర్థమయినా కాకపోయినా కానీ, మన చుట్టూ ఉన్న సమాచారం కారణంగా కావచ్చు, మనకున్న గత అనుభావాల కారణంగా కావచ్చు, మారాలి అన్న మనకున్న కోరిక కారణంగా కావచ్చు, మనం ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నాం. నిన్నటిలా, గత నెలలో ఉన్నట్లుగా, గత సంవత్సరంలో ఉన్నట్లుగా మనమైనా, ఇతరులైనా ఇప్పుడు లేము. వ్యక్తులపట్ల మనకున్న గత అభిప్రాయాలను తుడిపేస్తే వారిని కలిసిన ప్రతిసారీ తాజాగా కలవచ్చు. ఈరోజు ప్రతి ఒక్కరినీ మంచి అభిప్రాయంతో కలవాలి అన్న ఆలోచన చేయడానికి కాస్త సమయాన్ని కేటాయించండి. గత అనుభవం వలన ఇతరులపట్ల మీక కలిగిన అభిప్రాయం అనే ఫిల్టర్‌ను తొలగించినప్పుడు ఇతరులు ఈరోజు ఎలా ఉన్నారో అలాగే మీరు వారిని చూడగలుగుతారు. మీరు పదే పదే గతాన్ని గుర్తు చేసుకోవడం లేదు కనుక మీరు మీ వర్తమానాన్ని, భవిష్యత్తును గతం యొక్క నెగిటివ్ శక్తితో ప్రభావితం చేయడం లేదు. ఇలా చేయడం ద్వారా మీరు స్వయానికి ఉపశమనం అందించుకుంటారు, మీ సంబంధాలకు ఉపశమనాన్ని ఇస్తారు తద్వారా స్వచ్ఛమైన తరంగాలను వ్యాప్తి చేస్తారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

18th feb 2025 soul sustenance telugu

భగవంతుడు సర్వోన్నతుడైన తండ్రి మరియు తల్లి

ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మత సంప్రదాయాలలో, భగవంతుడిని ఎల్లప్పుడూ పురుషుడిగా సూచిస్తారు. కానీ, ఆత్మకు లింగం లేదు, అది పురుష లేదా స్త్రీలింగం కాదు. అలాగే భగవంతుడిని అనగా పరమ ఆత్మ యొక్క లింగం

Read More »
17th feb 2025 soul sustenance telugu

చక్కటి సంబంధాలను బలపరుచుకోవడానికి అహంకారాన్ని త్యాగం చేయడం (పార్ట్ 3)

ప్రతి సంబంధంలో ఆ సంబంధం ఎలా ఉన్నా కూడా ఎదుటి వారిని ముందు ఉంచే వ్యక్తి సంబంధాన్ని నడిపిస్తాడని గుర్తుంచుకోండి. ఎదుటి వ్యక్తిని ముందు ఉంచడం అంటే కొన్ని సమయాల్లో మీరు ఒక నిర్దిష్ట

Read More »
16th feb 2025 soul sustenance telugu

చక్కటి సంబంధాలను బలపరుచుకోవడానికి అహంకారాన్ని త్యాగం చేయడం (పార్ట్ 2)

మీరు మరొక వ్యక్తిని కలిసినప్పుడల్లా, మీరు మీలాగే ఉండాలి అని నిర్ధారించుకుంటూ, అదే సమయంలో ఎదుటి వ్యక్తిని కూడా వారిని వారిలానే ఉండనివ్వడం ద్వారా మీరు వారికీ ఒక స్వేచ్చని కలిపిస్తారు. దాని అర్థం

Read More »