Hin

31st may 2025 soul sustenance telugu

May 31, 2025

వ్యక్తులను విమర్శించవద్దు, వారిని గౌరవంగా సరిదిద్దండి

మనము అందరి పట్ల మంచి ఉద్దేశ్యాన్ని కలిగి ఉంటాము, కానీ మనకు కావలసిన విధంగా లేనప్పుడు వారిని విమర్శిస్తూ మన నిరాశను వ్యక్తపరుస్తాము. విమర్శలో కోపం లేదా తిరస్కరణల ఎనర్జీ ఉంటుంది కనుక  విమర్శించిన వ్యక్తిలో బాధను సృష్టించడమే కాకుండా, అది మన ఆంతరిక శక్తిని క్షీణింపజేస్తుంది. అదే అభిప్రాయాన్ని మనం స్థిరంగా ఉండి చెప్తే, అది ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు సాధ్యమైనంత ఉత్తమమైన ఫీడ్‌బ్యాక్‌లను అందించినా, అవతలి వ్యక్తి దానిని విమర్శ మరియు తిరస్కరణగా అర్థం చేసుకున్నారా? మీ సూచన లేదా సలహా తరచుగా కఠినంగా మరియు అవమానకరంగా భావించబడుతుందా? ప్రభావవంతంగా ఎలా చెప్పాలో మీకు తెలియనందున, మీరు ఇతరులకు సలహా ఇవ్వడం ఆపివేస్తున్నారా? ఫీడ్‌బ్యాక్ ఇచ్చేటప్పుడు, మనం చెప్పే విషయం కన్నా ఎలా చెప్పామనేది ముఖ్యం. కుటుంబం, స్నేహితులు మరియు సహోద్యోగుల కోసం మన ఉద్దేశాలు స్వచ్ఛమైనవే కానీ మీ అభిప్రాయాన్ని తెలియజేసేటప్పుడు మనం మన ఎనర్జీ ని  గమనించుకోవాలి. మనం విమర్శించినట్లయితే, అవతలి వ్యక్తి తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేస్తారు, వారి శక్తి క్షీణించి గాయపడతారు. వారి బాధకు మనల్ని బాధ్యులను చేస్తారు మరియు ఆ నెగెటివిటీ మనకు తిరిగి ప్రసరిస్తుంది.

 

విమర్శ అనేది ఎమోషనల్ గా నింద చేయడం. ఇది ఆ చర్యకు బదులుగా ఆ వ్యక్తిపై ఎక్కువగా దృష్టి పెడుతుంది. మనం అవగాహన, ప్రేమ మరియు గౌరవం యొక్క శక్తితో అభిప్రాయాన్ని అందిస్తే అవతలి వ్యక్తి దానిని అంగీకరించి, మారడానికి ఇష్టపడతాడు. ఇంకొకసారి ఎవరైనా మీ ఆలోచనకు సరిపోని విధంగా ప్రవర్తించినప్పుడు వారికి సాధికారమివ్వండి. వారితో మధురంగా మాట్లాడుతూ, తక్కువ పదాలను ఉపయోగిస్తూ వారిని గైడ్ చేయండి. నా మర్యాదపూర్వకమైన మరియు సహాయకరమైన అభిప్రాయాలతో నేను వ్యక్తులను శక్తివంతం చేస్తాను. నేను పరివర్తన కలిగించి వారి ఆశీర్వాదాలను పొందుతాను అని మీకు మీరే గుర్తు చేసుకోండి. వ్యక్తులను అంగీకరించి విమర్శలను ముగించండి. ఇతరులను నియంత్రించే లేదా అధికారం చూపే బదులుగా శ్రద్ధ మరియు దయ చూపండి. మీరు విమర్శించడం మానేస్తే  మీ జీవితాన్ని మీరు మరింత ఇష్టపడతారు. నేను వ్యక్తులను గౌరవంగా సరిదిద్దుతాను. నేను తప్పుగా ఉన్న పనిపై అభిప్రాయాన్ని తెలియజేసి  వాటిని సరిదిద్దు కోవడంలో వారికి సహాయపడతాను అని మీకు మీరు గుర్తు చేసుకోండి.

 

రికార్డు

16th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మెడిటేషన్ ని మీ ఔషధంగా చేసుకొని ఆ ఔషధాన్ని ప్రతి రోజు తీసుకోండి మెడిటేషన్ మన మనస్సును మరింత శక్తివంతంగా చేసి

Read More »
15th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు రోజంతా మీ ఆలోచనలను జాగ్రత్తగా పరిశీలించుకోండి   మన భావోద్వేగ ఆరోగ్యం అనేది ముఖ్యంగా మన ఆధ్యాత్మిక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది.

Read More »
14th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మానవాత్మలం అనగా మొదట ఆత్మలం, ఇది మన ఆధ్యాత్మిక గుర్తింపు. మనం మన భౌతిక శరీరం ద్వారా మన పాత్రను

Read More »