Hin

5th-nov-2023-soul-sustenance-telugu

November 5, 2023

వ్యక్తులను విమర్శించవద్దు, వారిని గౌరవంగా సరిదిద్దండి

మీ జీవితంలో ఎన్నిసార్లు గతంలో మీకు హాని చేసిన, బాధపెట్టిన లేదా అవమానించిన వారికి చెడు జరిగినప్పుడు,  వెంటనే  లేదా తరువాత అయినా మీరు ఆనందించి ఉంటారు. ఎన్నిసార్లు కనీసం స్వల్పమైన ఆనందం కలిగిందో మీరు చాలా నిజాయితీగా ప్రశ్నించుకోండి. ఈ రకమైన నెగిటివ్ రూపమైన ఆనందం మీలో కనిపించినప్పుడు, అది మీ మాటలలో లేదా చర్యలలో లేనప్పటికీ,  సూక్ష్మమైన ఆలోచనలో ఉన్నప్పటికీ,  ఇది తప్పుడు ఆనందం. భౌతికంగా మీరు మీకు హాని చేసిన వ్యక్తికి తిరిగి హాని చేయనప్పటికీ అది సూక్ష్మమైన ప్రతీకార వాంఛ. తిరిగి హాని చేయలేదు అనే భావన బాగున్నప్పటికీ ఇతరుల బాధను ఆస్వాదించే ఆనందం చాలా తక్కువ స్థాయి ఆనందం. కొన్నిసార్లు, మన ప్రతీకార సంతోషాన్ని సమర్థించుకునే ప్రక్రియలో మనం దానిని న్యాయం అని అంటాము.

ఈ రకమైన ప్రతీకారాన్ని నడిపించే శక్తి లేదా ఇంధనం ద్వేషం లేదా కోపం. వారు చేసిన పనికి వారు బాధపడటం చూసి నేను చాలా సంతోషించాను, ఇది వారికి శిక్ష అనే ఒక ఫీలింగ్ ఒక రకమైన ఆనందం. ఈ  ఆనందం మన దుఃఖాన్ని తగ్గిస్తున్నట్లు కాసేపు అనిపించినప్పటికీ, అది మన దుఃఖాన్ని తగ్గించడానికి బదులుగా, మరొక వ్యక్తితో నెగెటివ్ కర్మల యొక్క మన ఖాతాలను పెంచుతుంది. ఈ రకమైన ఆనందం అవతలి వ్యక్తికి నెగెటివ్ ఎనర్జీ మాత్రమే కలిగిస్తుంది, ఇది అవతలి వ్యక్తికి నొప్పిని ఇవ్వడమే కాకుండా, అవతలి వ్యక్తి నుండి మనకు ద్వేషం యొక్క నెగెటివ్ ఎనర్జీని ఇస్తుంది. మనకు దీర్ఘకాలిక ఆనందాన్ని ఎప్పుడూ ఇవ్వదు. ఎవరైనా రోడ్డుపై ప్రమాదానికి గురై చాలా బాధలో ఉన్నారనుకోండి. ఆ వ్యక్తికి వెంటనే సహాయం చేయడానికి బదులుగా మనం వారికి జరిగిన దానితో సంతోషంగా నవ్వుతే,  అలాంటి వ్యక్తి మనకు ప్రతిఫలంగా ఎలాంటి ఎనర్జీని పంపుతాడు? ఇది భౌతిక స్థాయిలో ఉన్న ఉదాహరణ, కానీ అదే సూత్రం సూక్ష్మ స్థాయికి వర్తిస్తుంది. కాబట్టి, మన జీవితంలో ఇంకొక సారి ఇలాంటివి జరిగినప్పుడు, మనలో స్వల్పమైన ఆనందం లేకపోయినా, ప్రతీకారం తీర్చుకోవాలనే కోరిక లేకున్నా మనం ప్రతీకార వాంఛ నుండి సురక్షితంగా ఉన్నామని చెప్పగలమని మనం గుర్తుచేసుకోవాలి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

5th dec 2024 soul sustenance telugu

ప్రతి కర్మపై ధ్యాస పెట్టడం

మన ప్రతి ఆలోచన, మాట మరియు చర్య మనం ప్రపంచానికి పంపే శక్తి, ఇది మన కర్మ. పరిస్థితులు, వ్యక్తుల ప్రవర్తనలు అనేవి తిరిగి వచ్చే శక్తి, ఇది మన విధి. ప్రతి కర్మ

Read More »
4th dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 3)

స్టెప్ 3 – పరిష్కారానికి సానుకూల చర్యలు తీసుకోవడం – మూడవ దశ మరియు చాలా ముఖ్యమైనది పరిస్థితిని సరిచేయడానికి భౌతిక స్థాయిలో సానుకూలంగా ఏదైనా చేయడం. కొన్నిసార్లు, మనం సానుకూలంగా ఆలోచించి భగవంతుడిని

Read More »
3rd dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 2)

స్టెప్ 2 – సానుకూలమైన మరియు శక్తివంతమైన మానసిక స్థితిని సృష్టించడం – ఏదైనా ప్రతికూల పరిస్థితిని పరిష్కరించడంలో తదుపరి దశ ఆధ్యాత్మిక ధృవీకరణలు లేదా ఆంతరిక శక్తి, దృఢత్వంతో నిండిన ఆలోచనల సహాయంతో

Read More »