Hin

15th june 2025 soul sustenance telugu

June 15, 2025

వ్యక్తులు మీపై ఆధారపడేలా చేయవద్దు

కొంతమందికి లేదా కొన్ని పరిస్థితులకు మనమే ఎంతో ముఖ్యమని, మనం లేకుండా వారు జీవితాన్ని గడపలేరనే నమ్మకంతో మనం తరచుగా జీవిస్తుంటాము. ఎవరికైనా మన అవసరం ఉంటే అది మంచిగా అనిపించవచ్చు, కానీ వారు మనపై ఆధారపడటం ఆరోగ్యకరమైనది కాదు. మనల్ని మనం శక్తివంతం చేసుకోవడం, స్వతంత్రంగా ఉండటానికి ఇతరులను శక్తివంతంగా చేయడం మన బాధ్యత. ఇది వారికి మనం చేసే నిజమైన సహాయం. మన నిర్లిప్తత మరియు వారు తమను తాము నిలబెట్టుకునేందుకు స్వతంత్రాన్ని ఇచ్చే అవకాశం ద్వారా, వారు నిజమైన లాభాన్ని పొందుతారు.

  1. మీ కుటుంబం మరియు స్నేహితులు మిమ్మల్ని ప్రేమిస్తారు, మిమ్మల్ని విశ్వసిస్తారు మరియు మిమ్మల్ని గౌరవిస్తారు. వారు మీపై ఆధారపడాలని మీరు కోరుకుంటున్నారా? ఎప్పుడూ ఎవరికైనా మన అవసరం ఉన్నట్టు మరియు మనల్ని కోరుకున్నట్టు ఉండటం మీకు సంతోషంగా అనిపిస్తుందా? వారితో మీ సంబంధానికి ఇది సరైన మరియు ప్రయోజనకరమైన కర్మ అని మీరు అనుకుంటున్నారా? 
  2. మీరు ఎంతగానో ప్రేమించబడినా, అభిమానించబడినా, నైపుణ్యం కలవారైనా, సహాయపడేవారైనా, ఎవరూ మనపై ఆధారపడేలా చేయవద్దు. అది మీలో అహంకారాన్ని కలిగిస్తుంది మరియు సంబంధాలలో మీ ప్రేమను బ్లాక్ చేస్తుంది. ఇతరులకు సహాయం చేసి, వారిని జాగ్రత్తగా చూసుకోవాలి కానీ అహంకారం లేకుండా, వారిని లేదా వారి ఆలోచనలు, భావాలను స్వంతం చేసుకొనే వైఖరి లేకుండా చూసుకోండి.
  3. ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన ప్రయాణం ఉందని మరియు అతని స్వంత విధిని ఏర్పరుస్తుందని గుర్తుంచుకోండి. సరైన మార్గంలో నడవడానికి వారిని శక్తివంతం చేయడం మరియు ఆ మార్గంలో ఎదురయ్యే ఏదైనా అడ్డంకిని అధిగమించడానికి వారిని బలోపేతం చేయడం మీ పాత్ర. వారిని ప్రోత్సహించండి మరియు వారిలో ఉన్న సామర్థ్యాలను, వాటిని ఎలా ఉపయోగించుకోవాలో వారికి చూపించండి. వారు మీ సామర్థ్యాలపై ఆధారపడేలా చేయవద్దు. మీ నైపుణ్యాలు, ఆలోచనలు, వనరులు, నిపుణత మరియు అనుభవాన్ని అందరితో పంచుకోండి. కానీ ప్రతి ఒక్కరిని స్వావలంబిగా మారేలా చేస్తూ వారు సృజనాత్మకంగా అభివృద్ధి చెందేలా సహాయపడండి.
  4. ప్రతిరోజూ స్వయాన్ని ఆధ్యాత్మికంగా శక్తివంతం చేసుకోండి. ఇది మీకు వినమ్రతను నిలుపుకోవడంలో సహాయపడుతుంది మరియు ప్రతి ఒక్కరినీ సమానంగా, శక్తివంతులుగా చూడడంలో దోహదపడుతుంది. ఈ సమానత్వ భావన అందరికీ భావోద్వేగపరంగా స్వతంత్రంగా ఉండే మార్గాన్ని చూపుతుంది. వారు మీ ఉనికిని ఆస్వాదించడం, దాని నుంచి లాభపడటమే కాకుండా, మీరు లేని సమయంలో కూడా తమ జీవితాన్ని స్వయంగా నిర్వహించగలుగుతారు.

రికార్డు

16th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మెడిటేషన్ ని మీ ఔషధంగా చేసుకొని ఆ ఔషధాన్ని ప్రతి రోజు తీసుకోండి మెడిటేషన్ మన మనస్సును మరింత శక్తివంతంగా చేసి

Read More »
15th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు రోజంతా మీ ఆలోచనలను జాగ్రత్తగా పరిశీలించుకోండి   మన భావోద్వేగ ఆరోగ్యం అనేది ముఖ్యంగా మన ఆధ్యాత్మిక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది.

Read More »
14th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మానవాత్మలం అనగా మొదట ఆత్మలం, ఇది మన ఆధ్యాత్మిక గుర్తింపు. మనం మన భౌతిక శరీరం ద్వారా మన పాత్రను

Read More »