Hin

24th feb 2024 soul sustenance telugu

February 24, 2024

వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా మనకు హాని చేయరు

వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా మనల్ని బాధపెట్టాలని అనుకోరు. వారి స్వభావం మరియు అలవాట్ల ద్వారా వారు ఆ  ప్రవర్తన కలిగి ఉంటారు. కొన్నిసార్లు, ఇతరులు ద్రోహం చేయవచ్చు, అబద్ధం చెప్పవచ్చు, తిరస్కరించవచ్చు లేదా విస్మరించవచ్చు, అది మనకు బాధ, చేదుతనం కలిగించవచ్చు. కానీ వారు ఉద్దేశపూర్వకంగా చేయడం లేదు. వారు బాధలో ఉన్నారు, వారి అస్తవ్యస్తమైన అంతర్గత ప్రపంచాన్ని మనపై ప్రదర్శిస్తున్నారు.

 

  1. ఎవరైనా మీతో సరిగ్గా ఉండకపోతే, అప్పుడు వారి మనోదశ ఎలా ఉందో గమనించడం ముఖ్యం కానీ మీతో వారెలా ఉన్నారన్నిది కాదు. ఏది ఏమైనా, మీరు వారితో సరిగ్గా వ్యవవహిస్తున్నారా అని చూసుకోండి, కేవలం మాటలు మరియు చేతలలోనే కాదు, మీ ఆలోచనలలో కూడా.

 

  1. నయంకాని మానసిక గాయాల కారణంగా వ్యక్తులు లోలోపల బాధ పడవచ్చు. వారి జీవితంలో ఏదో ఒక సమయంలో వారు అభద్రత, అసూయ, భయం లేదా కోపం అనుభవించారు. వారు అంతర్గతంగా గాయపడి ఈ భావాలకు బాధితులు అయ్యారు.

 

  1. మీకు హాని కలిగించే వ్యక్తి కూడా స్వచ్ఛమైన వారు అయినప్పటికీ వారి అసలైన సుగుణాలు శాంతి మరియు ప్రేమ నుండి తాత్కాలికంగా దూరం అయ్యారు. స్థిరంగా ఉండి, మీరు వారి ప్రవర్తన వెనుక బాధను చూసిన తర్వాత, సహించలేని సమస్యగా కాకుండా ఇప్పుడు ఉన్న వాస్తవంగా అంగీకరించండి.

 

  1. వ్యక్తులను సరిదిద్దడం అంటే దయాభావంతో ఉండడం. మీ ధోరణులను నియంత్రణ, క్రమశిక్షణ లేదా అధికారం నుండి … ఒక ఫెసిలిటేటర్, గైడ్ మరియు కౌన్సెలర్‌గా మార్చుకోవ డానికి ప్రతిరోజూ ఉదయం మెడిటేషన్ చేయండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

3rd november 2024 soul sustenance telugu

త్వరగా నిద్రపోవడం, త్వరగా మేల్కొనడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు

మానసిక స్వచ్ఛత, ఆంతరిక శక్తిని అనుభవం చేసుకోవడం – ఆధ్యాత్మికత యొక్క ఒక ముఖ్యమైన అంశం త్వరగా నిద్రపోవడం, త్వరగా మేల్కొనడం. మనకు హాయిగా అనిపించటానికి మనం ఎన్ని గంటలు నిద్రపోతున్నామనే దానిపై మాత్రమే

Read More »
2nd november 2024 soul sustenance telugu

మీ సంబంధాలలో దాతగా ఉండండి

ఈ రోజు మన సంబంధాలలో మనం శ్రద్ధ చూపేవారిలా, ధ్యాస పెట్టేవారిలా మరియు క్షమించేవారిలా ఉన్నామా అని చెక్ చేసుకుందాము. మనం ఇచ్చేవారిగా ప్రారంభిస్తాము, కానీ క్రమంగా వస్తువుల కోరిక వైపు మారుతాము. మనం

Read More »
1st november 2024 soul sustenance telugu

ఈ దీపావళికి దివ్యమైన జ్యోతిని వెలిగించండి (పార్ట్ 2)

దీపాలను వెలిగించడం దీపావళికి అత్యంత ముఖ్యమైన అంశం. ఒక్క దీపం అపారమైన అందాన్ని కలిగి ఉండి చీకటిని తొలగిస్తుంది. ఆధ్యాత్మికంగా, మనం తొలగించాల్సిన చీకటి ఏమిటి? మన అసత్యపు గుర్తింపు మరియు అజ్ఞానం.  బంకమట్టితో

Read More »