Hin

17th november 2024 soul sustenance telugu

November 17, 2024

యువత కొరకు 5 సానుకూల ధృవీకరణలు

  1. నేను ఈ ప్రపంచంలో ప్రత్యేకమైన విశేషతలను, లక్షణాలను కలిగిన ప్రత్యేకమైన ఆత్మను. నన్ను నేను పరిపూర్ణమైన మరియు దివ్యమైన మానవునిగా మార్చుకోవడానికి నా సానుకూల నైపుణ్యాలను ఉపయోగించుకుంటాను. నా ఆంతరిక మార్పు మరియు సానుకూలత, సానుకూల ప్రకంపనల రూపంలో ప్రపంచానికి ప్రసరిస్తాయి తద్వారా ప్రపంచాన్ని నివసించడానికి అందమైన ప్రదేశంగా మారుస్తాయి.
  2. నేను ఈ ప్రపంచంలో ఒక మెరిసే నక్షత్రాన్ని. నేను భగవంతునికి చాలా దగ్గరగా ఉన్నాను. నేను ప్రతి ఉదయం మేల్కొని భగవంతుని ద్వారా లభించిన అందమైన ప్రాప్తులతో నా హృదయాన్ని నింపుకుంటాను. నేను ఈ రోజు కలిసే ప్రతి వ్యక్తికి ఈ ప్రాప్తులను బహుమతిగా ఇస్తూ వారి విశేషతలను వారికి గుర్తు చేయిస్తాను … నా సమక్షంలో ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉన్నారు మరియు నా ఆధ్యాత్మిక వ్యక్తిత్వం నుండి ప్రేరణ పొందుతారు…
  3. నేను ఆంతరిక జ్ఞానం మరియు అంతర్ద్రుష్టితో నిండి ఉన్నాను… నేను భగవంతుని నుండి ఆధ్యాత్మికత యొక్క లోతైన అంశాలను తెలుసుకున్నాను… మంచి కర్మలు మంచి విధిని ఎలా సృష్టిస్తాయో నేను ప్రపంచానికి తెలియజేస్తాను… నేను భగవంతునితో ఎలా కనెక్ట్ అవ్వాలో, ధ్యానం యొక్క సాంకేతికతను ప్రపంచంతో పంచుకుంటాను… నేను అందరి ఆశీర్వాదాలను తిరిగి పొంది జీవిత ప్రయాణంలో తేలికగా ఎగిరిపోతాను…
  4. నేను కాంతి మరియు శక్తి యొక్క రెక్కలను కలిగిన ఒక దేవదూతను. నేను ప్రతి ఒక్కరినీ ఆత్మ స్మృతితో చూస్తాను… నేను అందరితో మధురంగా మాట్లాడతాను. నేను అందరినీ చూసి చిరునవ్వుతో శుభ భవనలు తెలియజేస్తాను… నేను ఈ ప్రపంచంలో నా ఇంటిని, కార్యాలయాన్ని స్వర్గంగా చేస్తాను. నేను ప్రతి చర్యలో భగవంతుని చేతిని పట్టుకుంటాను. నేను ప్రపంచాన్ని ఏకం చేసి, దానిని ఒకటిగా చేస్తాను.
  5. నేను అపారమైన స్వచ్ఛత మరియు శారీరక శక్తితో ఆశీర్వదించబడ్డాను… మానవులు, జంతువులు, పక్షులు మరియు ప్రకృతి యొక్క ఐదు అంశాలు సంపూర్ణ పవిత్రత, శాంతి, ప్రేమ, ఆనందం మరియు మంచితనంతో నిండిన పూర్తి పవిత్రమైన ప్రపంచాన్ని సృష్టించడంలో భగవంతునికి సహాయపడటానికి ఈ శక్తులను ఉపయోగించడం నా పాత్ర. నేను ప్రతి క్షణం ఈ పాత్రను పోషిస్తున్నాను.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

9th july 2025 soul sustenance telugu

ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ బ్యాలన్స్ ను సాధించడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితం ఒక ప్రవాహంవంటిది, కనుక, మనం మన బాధ్యతల ప్రాధాన్యతలను మారుస్తూ ఉండాలి, మనకు మద్దతు ఇచ్చే జీవితంలోని అన్ని అంశాల

Read More »
8th july 2025 soul sustenance telugu

ప్రేమను ఆపేక్షలతో సమానం చేయకండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన స్వభావాలు, విలువలు, లక్ష్యాలకు అనుగుణంగానే ఇతరులు ప్రవర్తించాలని మనం సాధారణంగా కోరుకుంటాం. ఎవరైనా మన అంచనాలకు తగ్గట్లుగా ఉంటే, వారు

Read More »
7th july 2025 soul sustenance telugu

గతాన్ని వదిలేసేందుకు 7 పద్ధతులు (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సరిదిద్దుకోవటం – ఆత్మలో జ్ఞాపకాలు ఆత్మపై ముద్రలు వంటివి. కొన్ని ముద్రలు లోతైనవి, కొన్ని కాకపోవచ్చు. గత నెగిటివ్ అనుభవాలు ఆత్మపై

Read More »