‘‘బాప్దాదా ఆశ - సంపూర్ణంగా మరియు సంపన్నంగా అవ్వండి’’
ఈరోజు విశేషంగా దూరదేశవాసి, దూరదేశీ పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. ఇంత దూరము నుండి కలుసుకునేందుకు వచ్చారు. ఇంత దూరము నుండి ఏ తపనతో వస్తారు? బాప్దాదాకు పిల్లల తపన గురించి తెలుసు. ఒకవైపు మనసుతో మిలనం యొక్క తపన ఉంది. రెండవ వైపు తండ్రిని కలుసుకునేందుకు ధైర్యం కూడా ఉంచారు కనుక ఆ ధైర్యానికి ఫలితాన్ని విశేషమైన రూపంలో ఇచ్చేందుకు వచ్చారు. విశేషంగా కలుసుకునేందుకు వచ్చారు. డబల్ విదేశీ పిల్లలందరి స్నేహ సంకల్పాలు, మనసులో మిలనము చేయాలనే ఉల్లాసాన్ని అన్నివేళలా బాప్దాదా చూస్తూ ఉంటారు మరియు వింటూ ఉంటారు. దూరంగా కూర్చుని ఉన్నా స్నేహము కారణంగా సమీపంగా ఉన్నారు. పిల్లలు పూర్తి రాత్రంతా మేల్కొని దృష్టి మరియు వైబ్రేషన్ల ద్వారా స్నేహాన్ని, శక్తిని ఎలా క్యాచ్ చేస్తారో బాప్దాదా అన్నివేళలా చూస్తూ ఉంటారు. ఈరోజు విశేషంగా మురళీని నడిపించేందుకు రాలేదు. మురళీలైతే చాలా విన్నారు - ఇప్పుడు బాప్దాదా ఈ సంవత్సరం విశేషంగా ప్రత్యక్షతా స్వరూపాన్ని, బాప్దాదా స్నేహానికి ఋజువునిచ్చే స్వరూపాన్ని, సంపూర్ణము మరియు సంపన్నంగా అయ్యే సమీపతా స్వరూపాన్ని, శ్రేష్ఠమైన సంకల్పాలు, శ్రేష్ఠమైన మాటలు, శ్రేష్ఠమైన కర్మలు, శ్రేష్ఠమైన సంబంధ-సంపర్కాలు కలిగిన శ్రేష్ఠమైన స్వరూపాన్ని చూడాలని కోరుకుంటున్నారు. ఏదైతే విన్నారో, వినడం మరియు స్వరూపంగా అవ్వడం - ఈ సమానతను చూడాలనుకుంటున్నారు. ప్రాక్టికల్ పరివర్తన యొక్క శ్రేష్ఠమైన సమారోహాన్ని చూడాలని అనుకుంటున్నారు. ఈ సంవత్సరంలో సిల్వర్, గోల్డెన్ జుబ్లీలు జరుపుకున్నారు మరియు జరుపుకుంటారు కానీ బాప్దాదా సత్యమైన, మచ్చలేని అమూల్యమైన వజ్రాల మాలను తయారుచేయాలని అనుకుంటున్నారు. ఒక్కొక్క అమూల్యమైన వజ్రము ఎలా ప్రకాశిస్తూ ఉండాలంటే దాని లైట్, మైట్ యొక్క మెరుపు కేవలం హద్దు వరకు కాదు, అనంతం వరకు వెళ్ళాలి. బాప్దాదా, పిల్లల హద్దు సంకల్పాలు, హద్దు మాటలు, హద్దు సేవలు, హద్దు సంబంధాలు చాలాకాలం చూశారు కానీ ఇప్పుడు, అనంతమైన తండ్రి ఉన్నారు - అనంతమైన సేవల అవసరముంది. వాటి ముందు ఈ దీపాల వెలుగు ఏమనిపిస్తుంది? ఇప్పుడు లైట్ హౌస్, మైట్ హౌస్గా అవ్వాలి. అనంతం వైపు దృష్టి ఉంచండి. మీ దృష్టి అనంతంగా అయినప్పుడే సృష్టి పరివర్తనవుతుంది. సృష్టి పరివర్తన అనే ఇంత గొప్ప కార్యాన్ని కొద్ది సమయంలో సంపన్నం చేయాలి. కనుక గతి, విధులు కూడా అనంతమైన వేగం కలవిగా ఉండాలి.
మీ వృత్తి ద్వారా దేశ, విదేశాల వాయుమండలంలో - అనంతమైన అధికారులు, విశ్వాధికారులు, అనంతమైన రాజ్యాధికారులు, అనంతమైన సత్యమైన సేవాధారులు, మా దేవాత్మలు వచ్చేశారు అన్న ఒక్క శబ్దము మారుమ్రోగాలి. ఇప్పుడు ఈ ఒక్క అనంతమైన శబ్దము దేశ విదేశాలలో మారుమ్రోగాలి. అప్పుడు సంపూర్ణత మరియు సమాప్తి సమీపంగా అనుభవమవుతాయి. అర్థమయిందా! అచ్ఛా.
నలువైపులా ఉన్న శ్రేష్ఠమైన భావన, శ్రేష్ఠమైన కామనలను పూర్తి చేసేవారికి, ఫరిశ్తాల నుండి దేవతలుగా అయ్యే ఆత్మలకు, సదా ఉన్నతమైన స్థితిలో స్థితులై ఉండే లైట్ హౌస్, మైట్ హౌస్ విశేషమైన ఆత్మలకు, బాప్దాదా సూక్ష్మమైన సూచనలను అర్థం చేసుకునే విశాలబుద్ధి గల పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దేశ - విదేశాలలోని పిల్లలందరికీ బాప్దాదా సందేశము రూపంలో ప్రియస్మృతులను ఇచ్చారు:-
నలువైపులా ఉన్న స్నేహీ, సహయోగీ మరియు శక్తిశాలీ పిల్లల రకరకాల అలలతో కూడిన ఉత్తరాలు చూసి బాప్దాదా స్నేహ సాగరంలో ఇమిడిపోయారు. అందరి రకరకాల అలలు వారి వారి ఉల్లాస-ఉత్సాహాల అనుసారం శ్రేష్ఠంగా ఉన్నాయి. బాప్దాదా ఆ అలలను చూసి హర్షితమవుతారు. ఉల్లాసము కూడా చాలా బాగుంది, ప్లాన్లు కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు ప్రాక్టికల్ మార్కులు బాప్దాదా నుండి తీసుకోవాలి, భవిష్య ఖాతాను జమ చేసుకోవాలి. ఈ సమయంలో బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి ప్రాక్టికల్ కోర్సు మార్కులను నోట్ చేస్తున్నారు. ఈ సంవత్సరం విశేషంగా ప్రాక్టికల్ కోర్సు మరియు ప్రాక్టికల్ ఫోర్సు యొక్క అదనపు మార్కులు తీసుకోవాలి కనుక సమయానుసారంగా ఏ సూచనలైతే లభించాయో ఆ సూచనలను ప్రతి ఒక్కరు నా కొరకే అని భావించి ప్రాక్టికల్లోకి తీసుకొచ్చినట్లయితే మొదటి నంబరు తీసుకోగలరు. విదేశములోని పిల్లలైనా లేక దేశములోని పిల్లలైనా, ఎవరికైతే దూరంగా కూర్చుని ఉన్నా సమీప స్నేహము సదా అనుభవమవుతుందో మరియు సదా ఉల్లాసము ఉంటుందో, ఏదైనా చేసి చూపించాలి, ఇది చేయాలి, ఇలా చేయాలి... అనే ఈ ఉల్లాసము ఉంటే ఇప్పుడు అనంతమైన సేవకు ఋజువుగా అయి ఉల్లాసాన్ని ప్రాక్టికల్లోకి తీసుకొచ్చేందుకు విశేషమైన ఛాన్స్ ఉంది. కనుక ఎగిరే కళలోకి వెళ్ళే రేస్ చేయండి. స్మృతిలో, సేవలో, దివ్య గుణమూర్తులుగా అవ్వడంలో, అలాగే జ్ఞానస్వరూపులుగా అయి జ్ఞాన చర్చను చేయడంలో, నాలుగు సబ్జెక్టులలో ఎగిరే కళ యొక్క రేసులో విశేషమైన నంబర్ తీసుకునేందుకు ఈ సంవత్సరం ఛాన్స్ ఉంది. ఈ విశేషమైన ఛాన్స్ తీసుకోండి. కొత్త అనుభవాన్ని చేయండి. నవీనతను ఇష్టపడతారు కదా. కనుక ఈ నవీనతను చేసి నంబరు తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ సంవత్సరంలో అదనంగా చేసే రేసుకు అదనపు మార్కులున్నాయి. అదనపు సమయం లభించింది. పురుషార్థమనుసారంగా ప్రారబ్ధమైతే సదా ఉండనే ఉన్నది. కానీ ఈ సంవత్సరం విశేషంగా అదనపు మార్కులు లభించే సంవత్సరం కనుక చాలా బాగా ఎగిరే కళ యొక్క అనుభవీలుగా అయి ముందుకు వెళ్తూ ఇతరులను కూడా ముందుకు తీసుకువెళ్ళండి. బాబా పిల్లలందరి మెడలో బాహువుల మాలను వేస్తారు. హృదయాన్ని విశాలంగా చేసుకుంటే సాకారంలో వచ్చి చేరుకోవడం కూడా సహజమైపోతుంది. ఎక్కడైతే మనసుంటుందో అక్కడ ధనం రానే వస్తుంది. మనసు ధనాన్ని ఎక్కడో ఒకచోట నుండి తీసుకొస్తుంది కనుక మనసుంది కానీ ధనం లేదు అని అంటే ఇది బాప్దాదా ఒప్పుకోరు. మనసున్నవారికి ఏదో ఒక రకంగా టచింగ్ జరుగుతుంది మరియు వారు చేరుకుంటారు. కష్టపడి సంపాదించిన ధనం అయి ఉండాలి, కష్టపడి సంపాదించిన ధనం పదమారెట్ల లాభాన్ని ఇస్తుంది. స్మృతి చేస్తూ చేస్తూ సంపాదిస్తారు కదా. కనుక స్మృతి ఖాతాలో జమ అవుతుంది మరియు చేరుకుంటారు కూడా. అచ్ఛా - అందరూ తమ తమ పేరు మరియు విశేషతలతో బాహువుల మాల సహితంగా ప్రియస్మృతులు స్వీకరించండి. అచ్ఛా!
*** ఓంశాంతి ***
