"సఫలతకు ఆధారము - దృఢత"
(డబల్ విదేశీ సోదరీ - సోదరుల సమర్పణ సమారోహంలో అవ్యక్త బాప్‌దాదా మహావాక్యాలు)
ఈరోజు బాప్‌దాదా ఈ విశేషమైన, శ్రేష్ఠమైన రోజున విశేషంగా స్నేహభరిత శుభాకాంక్షలను తెలుపుతున్నారు. ఈరోజు ఏ సమారోహాన్ని జరుపుకున్నారు? బాహ్య దృశ్యమైతే సుందరంగా ఉండనే ఉన్నది. అందరి ఉల్లాస-ఉత్సాహాల, దృఢ సంకల్పాల మనసా శబ్దము మనోభిరాముడైన తండ్రి వద్దకు చేరుకుంది. కనుక ఈ రోజును విశేషంగా ఉల్లాస-ఉత్సాహాలతో నిండిన దృఢ సంకల్పాల సమారోహమని అంటాము. ఎప్పటి నుండైతే తండ్రికి చెందినవారిగా అయ్యారో, అప్పటి నుండి సంబంధం ఉంది మరియు ఇక మీదట కూడా ఉంటుంది. ఈ విశేషమైన రోజును విశేషమైన రూపంతో జరుపుకున్నారు, దీనినే దృఢ సంకల్పం చేసారు అని అంటాము. ఏం జరిగినా కానీ, మాయా తుఫాన్లు వచ్చినా, లోకుల నుండి రకరకాల విషయాలు వచ్చినా, ప్రకృతికి చెందిన ఎటువంటి అలజడి దృశ్యము వచ్చినా, లౌకిక మరియు అలౌకిక సంబంధాలలో ఏ విధమైన పరిస్థితులు ఉన్నా, మనసా సంకల్పాలలో చాలా తీవ్రమైన తుఫాను ఉన్నా కూడా, ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు. ఒకే బలము, ఒకే నమ్మకము అన్న ఇటువంటి దృఢ సంకల్పాన్ని చేసారా లేక కేవలం స్టేజీపై కూర్చున్నారా! డబల్ స్టేజీపై కూర్చున్నారా లేక సింగల్ స్టేజీపై కూర్చున్నారా? ఒకటేమో ఈ స్థూలమైన స్టేజీ, రెండవది దృఢ సంకల్పమనే స్టేజీ, దృఢతా స్థితి. మరి డబల్ స్టేజీపై కూర్చున్నారు కదా? హారాలు కూడా చాలా సుందరమైనవి ధరించారు. కేవలం ఈ హారాన్నే ధరించారా లేక సఫలతా హారాన్ని కూడా ధరించారా? సఫలత మెడలోని హారము. ఈ దృఢతయే సఫలతకు ఆధారము. ఈ స్థూలమైన హారముతో పాటు సఫలతా హారము కూడా వేయబడి ఉన్నది కదా. బాప్‌దాదా డబల్ దృశ్యాన్ని చూస్తారు. కేవలం సాకార రూపంలో ఉన్న దృశ్యాన్నే చూడరు, సాకార దృశ్యముతో పాటు ఆత్మిక స్థితి, మనసు యొక్క దృఢ సంకల్పము మరియు సఫలత అనే శ్రేష్ఠమైన మాల, ఈ రెండింటిని చూశారు. డబల్ మాలలు, డబల్ స్టేజీని చూస్తున్నారు. అందరూ దృఢ సంకల్పము చేశారు. చాలా మంచిది. ఏమి జరిగినా కానీ సంబంధాన్ని నిలబెట్టుకోవాలి. పరమాత్మ పట్ల ప్రీతి యొక్క రీతిని ఎల్లప్పుడూ నిలబెట్టుకుంటూ సఫలతను పొందాలి. సఫలత మెడలోని హారము అన్నది నిశ్చితము. ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు - ఇదే దృఢ సంకల్పము. ఒక్కరే ఉన్నప్పుడు, ఏకరస స్థితి స్వతహాగా మరియు సహజంగా ఉంటుంది. సర్వ సంబంధాల యొక్క అవినాశీ దారము జోడింపబడి ఉంది కదా. ఒకవేళ ఒక్క సంబంధము తక్కువైనా అలజడి కలుగుతుంది కనుక సర్వ సంబంధాల దారాన్ని కట్టుకున్నారు. సంబంధాన్ని జోడించారు. సంకల్పాన్ని చేసారు. సర్వ సంబంధాలు ఉన్నాయా లేక కేవలం ముఖ్యమైన మూడు సంబంధాలే ఉన్నాయా? సర్వ సంబంధాలు ఉంటే సర్వ ప్రాప్తులు ఉంటాయి. సర్వ సంబంధాలు లేనట్లయితే ఏదో ఒక ప్రాప్తి తక్కువైపోతుంది. అందరి సమారోహము జరిగింది కదా. దృఢసంకల్పము చేసినట్లయితే ఇక ముందు పురుషార్థంలో కూడా విశేషమైన రూపంలో లిఫ్ట్ లభిస్తుంది. ఈ విధి కూడా విశేషంగా ఉల్లాస-ఉత్సాహాలను పెంచుతుంది. బాప్‌దాదా కూడా పిల్లలందరికీ దృఢ సంకల్పము చేసే సమారోహానికి అభినందనలు తెలుపుతారు. అంతేకాక సదా అవినాశీ భవ, అమర భవ అనే వరదానాలను ఇస్తారు.
ఈరోజు ఆసియా గ్రూపు కూర్చుని ఉంది. ఆసియా విశేషత ఏమిటి? విదేశాల సేవ యొక్క మొదటి గ్రూపు జపాన్‌కు వెళ్ళారు, ఇది విశేషతే కదా. సాకార బాబా ప్రేరణ అనుసారంగా విశేషంగా విదేశీ సేవకు నిమంత్రణ మరియు సేవ యొక్క ఆరంభము జపాన్ నుండి జరిగింది. కనుక స్థాపనలో ఆసియా నంబరు ముందుంది కదా. విదేశాల నుండి మొదటి నిమంత్రణ వచ్చింది. ఇతర ధర్మాలవారు నిమంత్రణ ఇచ్చి పిలవడం ఆసియా నుండే ప్రారంభమయింది. కనుక ఆసియా ఎంత భాగ్యశాలి! ఇక రెండవ విశేషత - ఆసియా భారతదేశానికి అన్నిటికంటే సమీపంగా ఉంది. ఎవరైతే సమీపంగా ఉంటారో వారిని అల్లారుముద్దు పిల్లలని అంటాము. అల్లారుముద్దు పిల్లలు దాగి ఉన్నారు, ప్రతి స్థానం నుండి ఎంత మంచి మంచి రత్నాలు వెలువడ్డారు. క్వాంటిటీ తక్కువగా ఉన్నా క్వాలిటీ వారిగా ఉన్నారు. శ్రమకు ఫలితం బాగుంది. ఈ విధంగా నెమ్మది నెమ్మదిగా ఇప్పుడు సంఖ్య పెరుగుతూ ఉంది. అందరూ స్నేహీలే, అందరూ ప్రియమైనవారే. ప్రతి ఒక్కరూ ఒకరి కంటే ఒకరు ఎక్కువ స్నేహీలుగా ఉన్నారు. ఇదే బ్రాహ్మణ పరివారములోని విశేషత. నాకు బాబాపై అందరికంటే ఎక్కువ స్నేహముంది మరియు బాబాకు కూడా నేనంటే ఎక్కువ స్నేహముంది, నన్నే బాప్‌దాదా ముందుకు తీసుకువెళ్తారు అని ప్రతి ఒక్కరూ ఈ అనుభవం చేస్తారు. అందుకే భక్తిమార్గంలోని వారు కూడా ఒక మంచి చిత్రాన్ని చాలా అర్థసహితంగా తయారుచేశారు. ప్రతి గోపికతోనూ వల్లభుడు ఉన్నాడు. కేవలం ఒక్క రాధతోనే లేక కేవలం 8 మంది పట్టపురాణులతోనే కాదు, ప్రతి గోపికతోనూ గోపీవల్లభుడు ఉన్నాడు. ఎలాగైతే మీరు దిల్వాడా మందిరానికి వెళ్ళినప్పుడు, ఇది నా చిత్రము లేక ఇది నా గది అని నోట్ చేసుకుంటారు కదా. అయితే ఈ రాస మండలిలో కూడా మీ అందరి చిత్రము ఉందా? దీనినే మహా రాస్ అని అంటాము. ఈ మహా రాస్కు చాలా గొప్ప మహిమ ఉంది. బాప్‌దాదాకు ప్రతి ఒక్కరిపట్ల ఒకరి కంటే ఒకరిపై ఎక్కువ ప్రేమ ఉంది. పిల్లలు ప్రతి ఒక్కరి శ్రేష్ఠ భాగ్యాన్ని చూసి బాప్‌దాదా హర్షితులవుతారు. ఎవరైనా కానీ, కోట్లలో కొందరిగా ఉన్నారు. పదమాపదమ్ భాగ్యశాలురుగా ఉన్నారు. ప్రపంచము లెక్కలో చూస్తే ఇన్ని కోట్లమందిలో కొందరు కదా. జపాన్ అయితే ఎంత పెద్దది కానీ బాబా పిల్లలు ఎంతమంది ఉన్నారు! కనుక కోట్లలో కొందరిగా అయ్యారు కదా. బాప్‌దాదా ప్రతి ఒక్కరి విశేషతను, భాగ్యాన్ని చూస్తారు. కోట్లలో కొద్దిమంది అయిన గారాబాల పిల్లలు. తండ్రికి అందరూ విశేషమైన ఆత్మలే. బాబా కొందరిని సాధారణమైనవారిగా, కొందరిని విశేషమైనవారిగా చూడరు. అందరూ విశేషమైనవారే. ఈ వైపు ఇంకా ఎక్కువగా వృద్ధి చెందాలి ఎందుకంటే పూర్తిగా ఈ వైపంతా విశేషంగా డబల్ సేవ ఉంది. ఒకటేమో అనేక వెరైటీ ధర్మాలవారు ఉన్నారు, అంతేకాక ఇటువైపు సింధ్ నుండి వెలువడిన ఆత్మలు కూడా చాలామంది ఉన్నారు. వారి సేవను కూడా బాగా చేయవచ్చు. వారిని సమీపంగా తీసుకొస్తే వారి సహయోగంతో ఇతర ధర్మాల వరకు కూడా సహజంగా చేరుకోగలరు. డబల్ సేవతో డబల్ వృద్ధిని చేయగలరు. వారిలో ఏదో ఒక రీతిలో, మంచిగానో, చెడుగానో బీజము నాటబడి ఉంది. పరిచయం ఉన్న కారణంగా సహజంగా సంబంధంలోకి రాగలరు. చాలా సేవ చేయగలరు ఎందుకంటే ఇది ఆత్మలందరి పరివారము. బ్రాహ్మణులు అన్ని ధర్మాలలో చెల్లాచెదురై ఉన్నారు. అందులో బ్రాహ్మణులు చేరుకోనటువంటి ధర్మము ఏదీ లేదు. ఇప్పుడు అన్ని ధర్మాల నుండి బయటపడి వస్తున్నారు మరియు ఎవరైతే బ్రాహ్మణ పరివారానికి చెందినవారిగా ఉంటారో, వారు నా వారని అనిపిస్తుంది కదా. ఏదో లెక్కాచారముతో వెళ్ళారు, మళ్ళీ తమ పరివారంలోకి వచ్చి చేరుకున్నారు. ఎక్కడెక్కడ నుండో వచ్చి చేరుకొని తమ సేవా భాగ్యాన్ని తీసుకునేందుకు నిమిత్తమయ్యారు. ఇదేమీ తక్కువ భాగ్యము కాదు. చాలా శ్రేష్ఠమైన భాగ్యము. చాలా గొప్ప పుణ్యాత్మలుగా అవుతారు. మహాదానులు, మహాన్ సేవాధారుల లిస్టులోకి వచ్చేస్తారు. కనుక నిమిత్తంగా అవ్వడం కూడా ఒక విశేషమైన గిఫ్ట్ మరియు డబల్ విదేశీయులకు ఈ గిఫ్ట్ లభిస్తుంది. కొద్దిగా అనుభవం చేస్తూనే సెంటరు స్థాపన చేసేందుకు నిమిత్తంగా అయిపోతారు. కనుక ఇది కూడా లాస్ట్ సో ఫాస్ట్ వెళ్ళేందుకు విశేషమైన గిఫ్ట్. సేవ చేయడం వల్ల మెజారిటీ వారికి, నిమిత్తులమైన మేము ఏది చేస్తామో మరియు ఎలా నడుస్తామో, అలా మమ్మల్ని చూసి ఇతరులు చేస్తారు అనే స్మృతి ఉంటుంది. కనుక ఇది డబల్ అటెన్షన్ అయిపోతుంది. డబల్ అటెన్షన్ ఉన్నందుకు డబల్ లిఫ్ట్ అయిపోతుంది. అర్థమయిందా - డబల్ విదేశీయులకు డబల్ లిఫ్ట్ ఉంది. ఇప్పుడు అన్ని వైపులా ధరణి మంచిగా అయిపోయింది. నాగలితో దున్నిన తర్వాత భూమి మంచిగా అయిపోతుంది కదా. తర్వాత ఫలాలు కూడా మంచిగా మరియు సహజంగా వెలువడుతాయి. అచ్ఛా - ఆసియాకు చెందిన పెద్ద మైకు చేసే శబ్దము భారతదేశానికి త్వరగా చేరుకుంటుంది. కనుక అటువంటి మైకును తయారుచేయండి. అచ్ఛా.
పెద్ద దాదీలతో: - మీ మహిమను ఏమని చేయాలి! ఎలాగైతే బాబా కొరకు చెప్తారు కదా - సాగరాన్ని సిరాగా చేసుకొని, భూమిని కాగితంగా చేసుకొని... అలాంటి మహిమయే మీ దాదీలందరికీ ఉంది. ఒకవేళ మహిమ చేయడం ప్రారంభిస్తే, పూర్తి రాత్రింబవళ్లు ఒక సప్తాహ కోర్సుగా అవుతుంది. బాగున్నారు, అందరి రాస్ బాగుంది. అందరి రాశి కలుస్తుంది, అంతేకాక అందరూ రాస్ కూడా బాగా చేస్తారు. చేతిలో చేతిని కలపడం అనగా ఆలోచనలను కలపడం - ఇదే రాస్. మరి బాప్‌దాదా దాదీల ఈ రాస్నే చూస్తూ ఉంటారు. ఇదే అష్టరత్నాల రాస్.
దాదీలైన మీరందరూ పరివారానికి విశేషమైన అలంకారము. ఒకవేళ అలంకారము లేకపోతే శోభ ఉండదు. కనుక అందరూ మిమ్మల్ని అదే స్నేహంతో చూస్తారు.
బృజ్ఇంద్రా దాదీతో:- బాల్యము నుండి లౌకికంలో, అలౌకికంలో అలంకారము చేస్తూ ఉండేవారు, మరి అలంకారము చేస్తూ-చేస్తూ స్వయం అలంకారంగా అయిపోయారు. ఇలాగే ఉన్నారు కదా. బాప్‌దాదా మహావీరులు, మహారథులైన పిల్లలను సదా గుర్తు చెయ్యడమే కాదు, ఇమిడిపోయి ఉంటారు. ఎవరైతే ఇమిడిపోయి ఉంటారో వారిని గుర్తు చేయాల్సిన అవసరం కూడా లేదు. బాప్‌దాదా సదా ప్రతి విశేషమైన రత్నాన్ని విశ్వం ముందు ప్రత్యక్షం చేస్తారు. కనుక మీరు విశ్వం ముందు ప్రత్యక్షమయ్యే విశేషమైన రత్నము. అదనంగా అందరి సంతోషమనే సహయోగముంది. మీ సంతోషాన్ని చూసి అందరికీ సంతోషమనే ఔషధం లభిస్తుంది కనుక మీ అందరి ఆయువు పెరుగుతోంది, ఎందుకంటే అందరి స్నేహమనే ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. ఇప్పుడింకా చాలా కార్యాన్ని చేయాలి కనుక మీరు పరివారానికి అలంకారము. అందరూ ఎంత ప్రేమగా చూస్తారు. ఎలాగైతే ఎవరిదైనా ఛత్రము పడిపోతే వారి తల ఎలా అనిపిస్తుంది. ఒకవేళ ఛత్రం ధరించేవారు, ధరించకపోతే, ఎలా ఉంటుంది. మరి మీరందరూ కూడా పరివారానికి ఛత్రముగా ఉన్నారు.
నిర్మల్శాంత దాదీతో:- మీ స్మృతిచిహ్నాన్ని సదా మధువనంలో చూస్తూ ఉంటారు. స్మృతిచిహ్నాలు స్మృతి చేసేందుకే ఉన్నాయి. కానీ మీ స్మృతి, స్మృతిచిహ్నాన్ని తయారుచేస్తుంది. నడుస్తూ-తిరుగుతూ పరివారమంతటికీ, నిమిత్తంగా ఉన్న ఆధారమూర్తులు గుర్తుకొస్తూ ఉంటారు. కనుక మీరు ఆధారమూర్తులు. స్థాపనా కార్యానికి ఆధారమూర్తులు దృఢంగా ఉన్న కారణంగా ఈ వృద్ధి చేసారు మరియు ఉన్నతి యొక్క భవనము ఎంత దృఢంగా అవుతుంది. కారణమేమిటి? ఆధారము దృఢంగా ఉంది. అచ్ఛా!
*** ఓంశాంతి ***
