‘‘సంగమయుగము సర్వ శ్రేష్ఠ ప్రాప్తుల యుగము’’
ఈరోజు బాప్దాదా నలువైపుల ఉన్న ప్రాప్తి స్వరూపులైన విశేష ఆత్మలను చూస్తున్నారు. ఒకవైపు అల్పకాలిక ప్రాప్తులు పొందే అనేకమంది ఆత్మలున్నారు. వారిలో ప్రాప్తితో పాటు అప్రాప్తి కూడా ఉంది. ఈరోజు ప్రాప్తి ఉంది, రేపు అప్రాప్తి ఉంది. కావున ఒకవైపు అనేక ప్రాప్తులతో అప్రాప్తి స్వరూపులుగా ఉన్నారు. ఇంకొకవైపు చాలా కొద్దిమంది సదాకాలిక ప్రాప్తి స్వరూపులైన విశేషాత్మలుగా ఉన్నారు. వారిరువురి మధ్య ఉన్న గొప్ప తేడాను బాప్దాదా చూస్తున్నారు. బాప్దాదా ప్రాప్తి స్వరూపులైన పిల్లలను చూసి హర్షిస్తున్నారు. ప్రాప్తి స్వరూపలైన పిల్లలు ఎంత పదమా పదమ్ భాగ్యశాలురు! ఎంత ప్రాప్తిని పొందారంటే విశేష ఆత్మలైన మీ ప్రతి అడుగులో పదమాలు ఉన్నాయి. లౌకికంలో ప్రాప్తి స్వరూప జీవితంలో విశేషంగా నాలుగు విషయాలలో ప్రాప్తి అవసరము. 1. సుఖమయ సంబంధాలు ఉండాలి. 2. స్వభావ-సంస్కారాలు సదా శీతలంగా, స్నేహీగా ఉండాలి. 3. సత్యంగా సంపాదించిన శ్రేష్ఠమైన సంపద ఉండాలి. 4. శ్రేష్ఠ కర్మలు, శ్రేష్ఠ సంపర్కం ఉండాలి. ఒకవేళ ఈ నాలుగు విషయాలు ప్రాప్తించి ఉంటే లౌకిక జీవితంలో కూడా సఫలత మరియు సంతోషము ఉంటాయి. కానీ లౌకిక జీవితములోని ప్రాప్తులు అల్పకాలికమైనవి. ఈరోజు సుఖమయమైన సంబంధాలు ఉంటాయి, రేపు అవే సంబంధాలు దు:ఖమయంగా అవుతాయి. ఈరోజు సఫలత ఉంటుంది, రేపు ఉండదు. వీటితో పోలిస్తే పాప్తి స్వరూపులైన, శ్రేష్ఠ ఆత్మలైన మీకు ఈ అలౌకిక శ్రేష్ఠ జీవితంలో నాలుగు విషయాలూ సదా ప్రాప్తించి ఉన్నాయి. ఎందుకంటే నేరుగా సుఖదాత, సర్వ ప్రాప్తుల దాతతో అవినాశి సంబంధముంది. ఈ అవినాశి సంబంధము ఎప్పుడూ దు:ఖము కలిగించదు, మోసము చేయదు. వినాశి సంబంధాలలో వర్తమాన సమయంలో దు:ఖము లేక మోసము ఉంది. అవినాశి సంబంధంలో సత్యమైన స్నేహముంది, సుఖమూ ఉంది. ఎందుకంటే సదా స్నేహము మరియు సుఖమయమైన సర్వ సంబంధాలు తండ్రి ద్వారా ప్రాప్తించాయి. ఒక్క సంబంధము లోటు కూడా లేదు. ఏ సంబంధము కావాలనుకుంటే ఆ సంబంధము ద్వారా ప్రాప్తిని అనుభవం చేయండి. ఏ ఆత్మకు ఏ సంబంధము ప్రియమైనదో ఆ సంబంధములో భగవంతుడు ప్రీతి యొక్క రీతిని నిభాయిస్తున్నారు. భగవంతుని సర్వ సంబంధీకునిగా చేసుకున్నారు. ఇటువంటి శ్రేష్ఠ సంబంధము కల్పమంతటిలో ఎప్పుడూ ప్రాప్తించజాలదు. కావున సంబంధాలు కూడా లభించాయి, అలాగే ఈ అలౌకిక దివ్యజన్మలో సదా శ్రేష్ఠ స్వభావము, ఈశ్వరీయ సంస్కారాలు ఉన్న కారణంగా స్వభావ సంస్కారాలు ఎప్పుడూ దు:ఖమునివ్వవు. బాప్దాదా సంస్కారాలేవైతే ఉన్నాయో, అవే పిల్లల సంస్కారాలు. బాప్దాదా స్వభావమేదైతే ఉందో, అదే పిల్లల స్వభావము. స్వ-భావము అనగా సదా ప్రతి ఒక్కరి పట్ల స్వ-అనగా ఆత్మిక భావము. స్వ అని శ్రేష్ఠమును కూడా అంటారు. స్వయం యొక్క భావము లేక శ్రేష్ఠ భావమే స్వభావంగా ఉండాలి. సదా మహాదాని, దయాహృదయులు, విశ్వకళ్యాణకారి తండ్రి యొక్క ఈ సంస్కారాలే మీ సంస్కారాలు. అందువలన స్వభావ-సంస్కారాలు సదా సంతోషాన్ని కలిగిస్తాయి. అదే విధంగా సత్యమైన సంపాదన ద్వారా చేసుకున్న సుఖమయ సంపాదన ఉంది. కావున అవినాశి ఖజానాలు ఎన్ని లభించాయి! ప్రతి ఖజానా యొక్క గనులకు మీరు యజమానులు. కేవలం ఒక్క ఖజానా కాదు, తరగని లెక్కలేనన్ని ఖజానాలు లభించాయి. వాటిని ఖర్చు పెట్టండి, తినండి పెంచుకుంటూ ఉండండి. అవి ఎంతగా ఖర్చు చేస్తే అంతగా పెరుగుతూ ఉంటాయి. మీరు అనుభవజ్ఞులే కదా! స్థూల సంపదను ఎందుకు సంపాదిస్తారు? పప్పు, రొట్టె(పప్పు, అన్నం) సుఖంగా తినేందుకు, పరివారము సుఖంగా ఉండేందుకు, ప్రపంచంలో మంచి పేరు ఉండేందుకు కదా! ఎంతటి సుఖ సంతోషాల భోజనం లభిస్తుందో మిమ్ములను మీరు చూసుకోండి. పప్పు, రొట్టె తినండి, భగవంతుని గుణగానం చేయండి అన్న మహిమ కూడా ఉంది. ఇటువంటి మహిమ గల భోజనాన్ని మీరు తింటున్నారు. అంతేకాక బ్రాహ్మణ పిల్లలైన మీకు, బ్రాహ్మణ పిల్లలు భోజనం నుండి ఎప్పుడూ వంచితులుగా అవ్వరని బాప్దాదా గ్యారెంటీ ఉంది. రుచులతో కూడిన భోజనం లభించకపోవచ్చు, కానీ పప్పు, రొట్టె (సాధారణ భోజనం) తప్పకుండా లభిస్తుంది. భోజనము కూడా ఉంది, మంచి పరివారము కూడా ఉంది మరియు పేరు కూడా ఎంత ప్రఖ్యాతంగా ఉంది! మీ పేరు ఎంత ప్రసిద్ధమైనదంటే, ఇప్పుడు చివరి జన్మ వరకు మీరు చేరుకున్నా కానీ మీ జడ చిత్రాల పేర్లతో అనేక ఆత్మలు తమ పనులను సిద్ధింపజేసుకుంటున్నారు. దేవీ దేవతలైన మీ పేర్లు వారు వాడుకుంటూ తమ పనులను సిద్ధింపజేసుకుంటున్నారు. మీ పేరు ఇంతగా ప్రసిద్ధమయ్యాయి. ఒక్క జన్మ మాత్రమే పేరు ప్రసిద్ధమవ్వడం కాదు, మొత్తం కల్పమంతా మీ పేరు ప్రసిద్ధమయ్యింది. కావున మీరు సుఖమయమైన, సత్యమైన సంపన్నవంతులు. తండ్రి సంపర్కములోకి రావడంతో సంపర్కము కూడా శ్రేష్ఠంగా తయారయ్యింది. మీ సంపర్కము ఎంత శ్రేష్ఠమైనదంటే ఒక్క క్షణ కాలపు మీ జడచిత్రాల సంపర్కం కొరకు కూడా ఎంతో దాహంతో ఉన్నారు. కేవలం ఒక్క సెకండు దర్శన సంపర్కానికి కూడా ఎంత దాహంతో ఉన్నారు! ఎన్నో రాత్రులు జాగరణ చేస్తూ ఉంటారు. కేవలం క్షణ మాత్రపు దర్శన సంపర్కము కొరకు పిలుస్తూ ఉంటారు, ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. పిలుస్తూ కేవలం ముందుకు వెళ్లేందుకు ఎంతగా సహిస్తూ ఉంటారు! అది కేవలం చిత్రమే, అలాంటి చిత్రాలు ఇంట్లో కూడా ఉంటాయి అయినా ఒక్క క్షణ మాత్రపు సన్ముఖ సంపర్కము కొరకు ఎంతగా దాహంతో ఉన్నారు! ఒక్క అనంతమైన తండ్రికి చెందినవారిగా అయిన కారణంగా మొత్తం విశ్వంలోని సర్వ ఆత్మలతో సంబంధము ఏర్పడింది. కావున నాలుగు విషయాలు అవినాశిగా ప్రాప్తించాయి. అందువలన మీది సదా సుఖమయమైన జీవితము, ప్రాప్తి స్వరూప జీవితము. బ్రాహ్మణుల జీవితంలో అప్రాప్తి వస్తువేదీ ఉండదు - ఇదే మీ పాట. మీరు ఇటువంటి ప్రాప్తి స్వరూపులుగా ఉన్నారు కదా లేక అలా అవ్వాలా? కావున ఈరోజు ప్రాప్తి స్వరూప పిల్లలను చూస్తున్నారని వినిపించాము కదా! ఈ శ్రేష్ఠమైన జీవితము కొరకు ప్రపంచములోని వారు ఎంత కష్టపడ్తున్నారు! కానీ మీరు ఏం చేశారు? కష్టపడ్డారా లేక ప్రేమించారా? ప్రేమతో తండ్రిని మీ వారిగా చేసేసుకున్నారు. ప్రపంచంలోని వారు కష్టపడ్తున్నారు, మీరు ప్రేమతో పొందేశారు. బాబా అని అన్నారు, ఖజానాల తాళంచెవి లభించింది. ప్రపంచంలోని వారిని అడిగితే వారేమంటారు? సంపాదించడం చాలా కష్టం, ఈ ప్రపంచంలో నడవడం చాలా కష్టం అని అంటారు. మరి మీరేమంటారు? ప్రతి అడుగులో పదమాలు సంపాదించాలని అంటారు. నడవడం ఎంత సహజం! ఇప్పుడు ఎగిరేకళ ఉంది కావున నడవడం నుండి కూడా రక్షింపబడ్డారు. నడవడమేమిటి, మేము ఎగరాలి అని మీరంటారు. ఎంత వ్యత్యాసము! బాప్దాదా ఈరోజు విశ్వంలోని పిల్లలందరిని చూస్తున్నారు. అందరూ తమ తమ ప్రాప్తుల లగ్నంలో నిమగ్నమై ఉన్నారు. కానీ రిజల్ట్ ఏమిటి? అందరూ వెతకడంలో నిమగ్నమై ఉన్నారు. సైన్సు వారిని చూడండి, తమ పరిశోధనలో ఎంతగా బిజీగా ఉన్నారంటే వారికి ఇంకేమీ తోచదు. మహాన్ ఆత్మలను చూడండి, ప్రభువును పొందే అన్వేషణలో నిమగ్నమై ఉన్నారు. చిన్న భ్రాంతి కారణంగా ప్రాప్తుల నుండి వంచితులై ఉన్నారు. ఆత్మయే పరమాత్మ లేక పరమాత్మ సర్వవ్యాపి అన్న ఈ భ్రాంతి కారణంగా వెతకడంలోనే ఉన్నారు. ప్రాప్తుల నుండి వంచితులుగా ఉన్నారు. సైన్సువారు కూడా ఇప్పుడు ఇంకా ముందు ఉంది, ముందు ఉందంటూ, చంద్రునిలో, తారలలో ప్రపంచాన్ని తయారు చేస్తామంటూ వెతుకుతూ, వెతుకుతూ తప్పిపోయారు. శాస్త్రవాదులను చూడండి, శాస్త్రాల వలయంలో పడి విస్తారంలో మునిగి పోయారు. శాస్త్రాలను అర్థం చేసుకోవాలనే లక్ష్యము ఉంచుకొని అర్థము నుండి వంచితులైపోయారు. రాజకీయ నేతలు కుర్చీల కొరకు(పదవుల కొరకు) ఉరుకులు, పరుగులు తీస్తూ నిమగ్నమై ఉన్నారు. ప్రపంచంలోని ఏమీ తెలియని అజ్ఞానీ ఆత్మలు వినాశీ ప్రాప్తుల గడ్డిపోచల ఆధారమునే నిజమైన ఆధారంగా భావిస్తూ కూరున్నారు. కానీ మీరేం చేశారు? వారన్నీ పోగొట్టుకున్నారు, మీరు పొందేసారు. భ్రాంతులను చెరిపేసుకున్నారు. కావున ప్రాప్తి స్వరూపులుగా అయిపోయారు. కావున మీరు సదా ప్రాప్తి స్వరూప శ్రేష్ఠ ఆత్మలు.
విశ్వంలోని అనేక ఆత్మల మధ్య శ్రేష్ఠ ఆత్మలైన మీ గుర్తించే నేత్రము శక్తిశాలిగా ఉందని బాప్దాదా విశేషంగా డబల్ విదేశీ పిల్లలకు అభినందనలు తెలుపుతున్నారు. మీరు గుర్తించారు, పొందారు. కావున బాప్దాదా డబల్ విదేశీ పిల్లల గర్తించే నేత్రమును చూసి వాహ్ నా పిల్లలూ! అంటూ పిల్లల గుణగానము చేస్తున్నారు. దూరదేశ వాసులుగా, భిన్న భిన్న ధర్మాలకు చెందినవారిగా, భిన్న భిన్న ఆచార వ్యవహారాలకు చెందినవారిగా, మీ వాస్తవిక తండ్రి నుండి దూరంగా ఉంటున్నా సమీపంగా గుర్తించేశారు. సమీప సంబంధంలోకి వచ్చేశారు. బ్రాహ్మణ జీవితములోని ఆచార వ్యవహారాలను, మీ ఆది ఆచార వ్యవహారాలుగా భావిస్తూ సహజంగానే మీ జీవితంలోకి స్వీకరించారు. ఇటువంటి వారినే విశేషమైన లవ్లీ మరియు లక్కీ(ప్రియమైనవారు మరియు అదృష్టవంతులైన) పిల్లలని అంటారు. ఎలాగైతే పిల్లలకు విశేషమైన సంతోషము ఉందో అలా బాప్దాదాకు కూడా విశేషమైన సంతోషము ఉంది. బ్రాహ్మణ ప్రపంచంలోని ఆత్మలు విశ్వంలో మూల మూలలకు చేరుకున్నారు. కానీ మూలమూలలో ఉన్న తప్పిపోయిన శ్రేష్ఠ ఆత్మలు మళ్లీ తమ పరివారంలోకి వచ్చి చేరుకున్నారు. తండ్రి వెతికారు, మీరు గుర్తించారు కావున ప్రాప్తులకు అధికారులుగా అయిపోయారు. అచ్ఛా.
ఇటువంటి అవినాశి ప్రాప్తి స్వరూపులైన పిల్లలకు, సదా సర్వ సంబంధాలను అనుభవం చేసుకునే పిల్లలకు సదా అవినాశి సంపన్నులైన పిల్లలకు, సదా తండ్రి సమానంగా శ్రేష్ఠ సంస్కారాలను కలిగి ఉంటూ సదా స్వయం యొక్క భావనతో ఉండే సర్వ ప్రాప్తుల భాండాగారాలైన సర్వ పాప్త్రుల మహాదాని పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
ఈ రోజు బాప్దాదా రాత్రంతా పిల్లలందరితో మిలనం జరిపారు. ఉదయం 7గంటలకు ప్రియస్మృతులు తెలిపి వీడ్కోలు తీసుకున్నారు. ఉదయం క్లాసు బాప్దాదాయే చేశారు.
బాప్దాదా ద్వారా మహావాక్యాలు రోజూ వింటూ వింటూ మహాన్ ఆత్మలుగా అయిపోయారు. కావున ఈ రోజున ఇదే పాఠాన్ని పూర్తి రోజంతా మహావాక్యాలు వింటూ మహాన్గా అయిపోయానని మనస్ఫూర్తిగా వినండి. గొప్పలో కంటే గొప్ప కార్యము చేసేందుకు సదా నిమిత్తంగా ఉన్నాను. ప్రతి ఆత్మ పట్ల మనసు ద్వారా, వాక్కు ద్వారా, సంపర్కము ద్వారా మహాదానీ ఆత్మలుగా అయ్యి సదా మహాన్ యుగాన్ని ఆహ్వానం చేసే అధికారీ ఆత్మలు మీరు. ఇదే గుర్తుంచుకోండి. సదా అటువంటి మహాన్ స్మృతిలో ఉండే శ్రేష్ఠ ఆత్మలకు, చాలాకాలం తర్వాత కలిసిన పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు శుభోదయం. కాబోయే మరియు వర్తమాన చకవ్రర్తులకు తండి నమస్తే. అచ్ఛా!
*** ఓంశాంతి ***
