‘‘మూడు-మూడు విషయాల పాఠం’’
నేడు బాప్‌దాదా తమ సదాకాలపు సహచరులైన పిల్లలను కలవడానికి వచ్చారు. పిల్లలే తండ్రికి సదా సహచరులు, సహయోగులు, ఎందుకంటే అతి స్నేహీలు. ఎక్కడైతే స్నేహం ఉంటుందో వారికే సదా సహయోగులు, సహచరులుగా మారతారు. కాబట్టి స్నేహీ పిల్లలు అయిన కారణంగా తండ్రి పిల్లలు లేకుండా ఏ కార్యమూ చేయలేరు. మరియు పిల్లలు తండ్రి లేకుండా ఏ కార్యమూ చేయలేరు. అందుకే స్థాపన ఆది నుండి తండ్రి బ్రహ్మాతో పాటు బ్రాహ్మణ పిల్లలను రచించారు. ఒక్క బ్రహ్మనే కాదు. బ్రహ్మాతో పాటు బ్రాహ్మణ పిల్లలు కూడా జన్మించారు. ఎందుకు? పిల్లలు సహయోగులు, సహచరులు కాబట్టే ఎప్పుడైతే తండ్రి జయంతిని జరుపుకుంటారో అప్పుడు తోడుగా ఏమంటారు? శివ జయంతి అనగా బ్రహ్మా జయంతి, బ్రాహ్మణుల జయంతి. కాబట్టి ఏకకాలంలో బాప్‌దాదా మరియు పిల్లలందరి ఆది రచన జరిగింది మరియు ఆది నుండే తండ్రికి సహయోగులు, సహచరులుగా మారారు. కాబట్టి మీరు మీ సహయోగులు, సహచరులను కలుస్తున్నారు. సహచరులు అనగా ప్రతి అడుగులోనూ, ప్రతి సంకల్పంలోనూ, మాటలోనూ తోడుగా నడిచేవారు. ఫాలో చేయడం అనగా తోడుని అందించడం. ఇలా ప్రతి అడుగులోనూ తోడుని అందించేవారు అనగా ఫాలో ఫాదర్ చేసేవారే సత్యమైన సహచరులు. అవినాశి సహచరులు. ఎవరైతే సత్యమైన సహచరులుగా ఉంటారో వారి ప్రతి ఒక్క అడుగు స్వతహాగానే తండ్రి సమానంగా నడుస్తూ ఉంటుంది. అటు ఇటు కాలేదు. సత్యమైన సహచరులు శ్రమ పడాల్సిన అవసరం ఉండదు - ఈ అడుగు ఇలా వేయాలా లేక అలా వేయాలా అని. స్వతహాగానే తండ్రి అడుగుపైన అడుగు వేయడం తప్ప కొంచెం కూడా అటు ఇటు కాలేదు. ఇలాంటి సత్యమైన సహచరులైన పిల్లల మనస్సులో, బుద్ధిలో, హృదయంలో ఏమి ఇమిడి ఉంది? నేను తండ్రికి చెందినవాడిని, తండ్రి నావారు. బుద్ధిలో ఏముంది - తండ్రి యొక్క అనంతమైన ఖజానాల వారసత్వం నాది అని. హృదయంలో దిలారామ్ మరియు దిలారామ్ స్మృతి, ఇంకేమీ ఉండజాలదు. కాబట్టి ఎప్పుడైతే తండ్రే స్మృతి రూపంలో ఇమిడి ఉన్నారో, అప్పుడు ఎలాంటి స్మృతి ఉంటుందో అలాంటి స్థితి మరియు అలాంటి కర్మలే స్వతహాగా జరుగుతాయి. భక్తి మార్గంలో కూడా భక్తులు నిశ్చయాన్ని చూపించడానికి ఇదే అంటారు కదా – చూడండి మా హృదయంలో ఎవరున్నారో! మీరు అనరు కానీ స్వతహాగానే మీ హృదయం నుండి దిలారామ్ అందరికీ అనుభవమవుతారు అనగా కనిపిస్తారు. కాబట్టి సత్యమైన సహచరులు ప్రతి అడుగులోనూ తండ్రి సమానంగా మాస్టర్ సర్వశక్తిమంతులు.
ఈరోజు బాప్‌దాదా పిల్లలకు అభినందనలు తెలపడానికి వచ్చారు. సహయోగులు, సహచరులైన పిల్లలందరూ తమ-తమ ఉల్లాస-ఉత్సాహాలతో స్మృతిలో, సేవలో ముందుకు సాగుతూ వెళ్తున్నారు. ప్రతి ఒక్కరి మనస్సులో ఒకే దృఢ సంకల్పం ఉంది – విజయ జెండాను ఎగురవేసి తీరాలని. సమస్త విశ్వంలో ఒక్క ఆత్మిక తండ్రి ప్రత్యక్షత జెండా ఎగరబోతోంది. ఏ ఉన్నత జెండా కింద సమస్త విశ్వంలోని ఆత్మలందరూ ‘ఒక్క తండ్రి వచ్చేశారు’ అనే గీతాన్ని పాడతారు! ఇప్పుడు మీరందరూ జెండా ఎగురవేసినప్పుడు అందరూ జెండా కింద గీతం పాడతారు మరియు ఆ తర్వాత ఏం జరుగుతుంది! జెండా ఎగురవేయడం వల్ల అందరిపైన పూల వర్షం కురుస్తుంది. అలాగే అందరి హృదయం నుండి ఈ గీతం స్వతహాగా వెలువడుతుంది – సర్వుల ఒక్క తండ్రి, గతి సద్గతి దాత ఒక్క తండ్రి అని. ఇలా గీతాలు పాడగానే అవినాశి సుఖ శాంతుల వారసత్వాన్ని పూల వర్షం సమానంగా అనుభవం చేసుకుంటారు. తండ్రి అని అన్నారు మరియు వారసత్వాన్ని అనుభవం చేసుకున్నారు. కాబట్టి అందరి మనస్సులో ఈ ఒక్క ఉల్లాస-ఉత్సాహమే ఉంది. అందుకే బాప్‌దాదా పిల్లల ఉల్లాస-ఉత్సాహాలను చూసి పిల్లలకు అభినందనలు తెలుపుతున్నారు. వీడ్కోలు అయితే ఇవ్వరు కదా. అభినందనలు. సంగమయుగంలోని ప్రతి సమయం అభినందనల సమయమే. కాబట్టి మనస్సు యొక్క లగ్నానికి, సేవా లగ్నానికి బాప్‌దాదా పిల్లలందరికీ అభినందనలు తెలుపుతున్నారు. సేవలో సదా ముందుకు సాగాలనే ఉల్లాసం అందరిలోనూ ఉంది. సేవలో ముందుకు సాగాలనే ఉల్లాసం లేనివారు ఎవరూ ఉండరు. ఒకవేళ ఉల్లాసం లేకపోతే ఇక్కడికి ఎలా వచ్చేవారు! ఇది కూడా ఉల్లాసానికి చిహ్నమే కదా! ఉల్లాస-ఉత్సాహాలు ఉన్నాయి మరియు సదా ఉంటాయి. తోడుతోడుగా ఉల్లాస-ఉత్సాహాలతో ముందుకు సాగుతూ సేవలో సదా నిర్విఘ్నంగా ఉన్నారా? ఉల్లాస-ఉత్సాహాలు అయితే చాలా బాగున్నాయి, కానీ నిర్విఘ్న సేవ మరియు విఘ్నాలను దాటుకుంటూ సేవ చేయడం - ఈ రెండింటి మధ్య తేడా ఉంది. నిర్విఘ్నత అనగా ఎవరికీ విఘ్న రూపంగా మారకపోవడం మరియు ఏ విఘ్న రూపాన్ని చూసి భయపడకపోవడం. ఈ విశేషతను ఉల్లాస-ఉత్సాహాలతో పాటు అనుభవం చేసుకుంటున్నారా? లేక విఘ్నాలు వస్తున్నాయా? ఒకటి – విఘ్నాలు పాఠం నేర్పించడానికి వస్తాయి, రెండవది – విఘ్నాలు కదిలించడానికి వస్తాయి. ఒకవేళ పాఠం నేర్చుకుని పక్కాగా మారిపోతే, ఆ విఘ్నాలు లగ్నంగా పరివర్తన చెందుతాయి. ఒకవేళ విఘ్నాలకు భయపడిపోతే రిజిస్టర్లో మరక పడిపోతుంది. తేడా ఉంది కదా.
బ్రాహ్మణులుగా మారడం అంటే మాయకు ఛాలెంజ్ చేయడం – విఘ్నాల్లారా, రండి, మేము విజయులము, మీరు ఏమీ చేయలేరు అని. మొదట మాయకు ఫ్రెండ్స్‌గా ఉండేవారు. ఇప్పుడు మాయాజీతులుగా మారతామని ఛాలెంజ్ చేస్తున్నారు. ఛాలెంజ్ చేస్తున్నారు కదా. లేకపోతే ఎవరిపై విజయులుగా మారతారు? మీపైన మీరు విజయులుగా అవుతారా? విజయి రత్నాలుగా మారతారంటే విజయాన్ని మాయపైనే కదా పొందేది! విజయ మాలలో గుచ్చబడతారు, పూజించబడతారు. కాబట్టి మాయాజీతులుగా మారడం అనగా విజయులుగా మారడం. బ్రాహ్మణులుగా మారడం అనగా మాయకు ఛాలెంజ్ చేయడం. ఛాలెంజ్ చేసేవారు ఆట ఆడుకుంటారు. వచ్చింది మరియు వెళ్ళిపోయింది. దూరం నుంచే తెలుసుకుంటారు, దూరం నుంచే పారద్రోలుతారు. సమయం వృథా చేయరు. సేవలో అయితే అందరూ చాలా బాగున్నారు. సేవతో పాటు నిర్విఘ్న సేవ యొక్క రికార్డు ఉండాలి. పవిత్రతకు ఆది నుండి రికార్డు పెట్టుకున్నట్లుగానే. ఆది నుండి ఇప్పటివరకు సంకల్పంలో కూడా అపవిత్రులు కానివారు ఎవరున్నారు? కాబట్టి ఈ విశేషతను చూస్తారు కదా. కేవలం ఈ ఒక్క పవిత్రత విషయంతోనే పాస్ విత్ ఆనర్ అయితే కారు. కానీ సేవలో, స్వస్థితిలో, సంపర్కంలో, సంబంధంలో, స్మృతిలో - అన్నింటిలోనూ ఎవరైతే ఆది నుండి ఇప్పటివరకు అచలంగా ఉన్నారో, అలజడిలోకి రాలేదో, విఘ్నాలకు వశం కాలేదో వారే పాస్ విత్ ఆనర్ అవుతారు. విన్నారు కదా – విఘ్నాలకు వశం కాకూడదు మరియు స్వయంగా ఎవరి ఎదుటా విఘ్న రూపంగా మారకూడదు. దీనికి కూడా మార్కులు జమ అవుతాయి. ఒకటి ప్యూరిటీ, రెండవది అవ్యభిచారి స్మృతి. స్మృతి మధ్యలో కొంచెం కూడా ఏ విఘ్నమూ ఉండకూడదు. ఇదే రీతిగా సేవలో సదా నిర్విఘ్నంగా ఉండాలి మరియు గుణాలలో సదా సంతృప్తంగా ఉండాలి మరియు సంతృప్తి పరిచేవారుగా ఉండాలి. సంతృప్తి అనే గుణం సర్వ గుణాల ధారణకు అద్దం. కాబట్టి గుణాలలో సంతృప్తి గురించి స్వయం పట్ల మరియు ఇతరుల నుండి సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇదే పాస్ విత్ ఆనర్‌కు నిదర్శనం, అష్ట రత్నాలకు నిదర్శనం. అన్నింటిలోనూ నంబర్ తీసుకునేవారే కదా, అంతేతప్ప కేవలం ఒక్క దానిలోనే బాగున్నాము, సేవలో బాగున్నాను అని కాదు. అభినందనలైతే బాప్‌దాదా ఇస్తూనే ఉన్నారు. అష్ట రత్నాలుగా మారాలి, ఇష్ట దేవతలుగా మారాలి. అష్ట రత్నాలుగా మారితే ఇష్ట దేవతలుగా కూడా అంతే మహత్తరంగా మారతారు. దాని కోసం మూడు విషయాలను సంవత్సరమంతా గుర్తుంచుకోండి మరియు చెక్ చేసుకోండి. మరియు ఈ మూడు విషయాలు ఏవైనా కొద్దిపాటి సంకల్ప మాత్రంలో మిగిలి ఉన్నా వాటికి వీడ్కోలు ఇచ్చేయండి. నేడు అభినందనల రోజు కదా. సెలవు ఇచ్చేటప్పుడు వీడ్కోలులో ఏం ఇస్తారు? (పటికబెల్లం, బాదం, యాలకులు ఇస్తారు) అందులో మూడు వస్తువులు ఉంటాయి. కాబట్టి బాప్‌దాదాకు కూడా మూడు వస్తువులు ఇస్తారు కదా. వీడ్కోలు కాదు, అభినందనలు కాబట్టే నోరు తీపి చేయిస్తారు. ఇక్కడ ఈ మూడు వస్తువులను ఎందుకు ఇస్తారు? మళ్ళీ త్వరగా రావాలనే స్మృతి ఉంటుంది అని. బాప్‌దాదా కూడా నేడు మూడు విషయాలు చెబుతున్నారు, ఇవి సేవలో అప్పుడప్పుడు విఘ్న రూపంగా కూడా మారిపోతాయి. కాబట్టి ఈ మూడు విషయాలపై మళ్ళీ విశేషంగా బాప్‌దాదా అటెన్షన్ కలిగిస్తున్నారు; ఈ అటెన్షన్ ద్వారా స్వతహాగానే పాస్ విత్ ఆనర్ అయి తీరుతారు.
ఒకటవ విషయం – ఎలాంటి హద్దు మమకారం (లగావ్) ఉండకూడదు. తండ్రితో అనుబంధం వేరే విషయం, కానీ హద్దు అనుబంధం ఉండకూడదు. రెండవది – ఎలాంటి స్వయంతో స్వయానికి లేదా ఇతరులతో ఒత్తిడి అనగా లాగుడు-పీకుడు ఉండకూడదు. మమకారం ఉండకూడదు, మాయతో యుద్ధం చేయడానికి బదులుగా పరస్పరం లాగుడు-పీకుడు ఉండకూడదు. మూడవది – ఎలాంటి బలహీన స్వభావం ఉండకూడదు. అనుబంధం, ఒత్తిడి మరియు బలహీన స్వభావం. వాస్తవానికి స్వభావం అనే పదం చాలా మంచిది. స్వభావం అనగా స్వ యొక్క భావం. స్వ అంటే శ్రేష్ఠమైనదని అర్థం. శ్రేష్ఠ భావం, స్వ యొక్క భావం, ఆత్మ-అభిమానం. కానీ భావ-స్వభావం, భావ-స్వభావం అనే పదాన్ని చాలా ఎక్కువగా పలుకుతారు కదా. కాబట్టి ఇది బలహీన స్వభావం. ఇది సమయానుసారం ఎగిరే కళలో విఘ్న రూపంగా మారిపోతుంది. దీనినే మీరందరూ రాయల్ రూపంలో ‘నా నేచర్ ఇలాంటిది’ అని అంటారు. నేచర్ శ్రేష్ఠమైనదైతే తండ్రి సమానంగా ఉంటారు. విఘ్న రూపంగా మారితే అది బలహీన స్వభావం. కాబట్టి మూడు పదాల అర్థం తెలుసు కదా. అనేక రకాల ఒత్తిడులు ఉన్నాయి, ఒత్తిడికి కారణం “నేను-అనే భావం”. నేను ఇది చేశాను. నేను ఇది చేయగలను! నేనే చేస్తాను! ఈ ‘నేను-అనే భావం’ ఒత్తిడిని పుట్టిస్తుంది. “నేను” అనేది దేహాభిమానానికి చెందినది. ఒకటి ‘నేను శ్రేష్ఠ ఆత్మను’. మరొకటి ‘నేను ఫలానా వారిని, నేను తెలివైనవాడిని, నేను యోగిని, నేను జ్ఞానిని, నేను సేవలో ముందు నంబర్లో ఉన్నాను’. ఈ ‘నేను-అనే భావం’ ఒత్తిడిని పుట్టిస్తుంది. ఇదే కారణంగా సేవలో అక్కడక్కడా ఉండాల్సిన తీవ్రగతికి బదులుగా మందగతి ఏర్పడుతుంది. నడుస్తూ ఉంటారు కానీ వేగం ఉండదు. వేగాన్ని తీవ్రం చేయడానికి ఆధారం – ఇతరులు ముందుకు సాగడాన్ని చూస్తూ సదా ఇతరులను ముందుకు నడిపించడమే తన ఎదుగుదలగా భావించడం. సేవలో ఎలా ‘నేను-అనే భావం’ వస్తుందో అర్థమవుతోంది కదా? ఈ ‘నేను-అనే భావమే’ తీవ్రగతిని సమాప్తం చేసేస్తుంది. అర్థమైందా!
ఈ మూడు విషయాలను ఇచ్చేస్తారు కదా లేక మళ్ళీ వెంట తీసుకువెళ్తారా? దీనినే త్యాగం ద్వారా లభించిన భాగ్యం అంటారు. సదా పంచుకుని తినండి మరియు పెంచండి. ఈ త్యాగపు భాగ్యం లభించింది. సేవకు సాధనం ఈ త్యాగపు భాగ్యం. కానీ ఈ భాగ్యాన్ని ‘నేను-అనే భావంలో’ పరిమితం చేసుకుంటే పెరగదు. సదా త్యాగపు భాగ్యపు ఫలాన్ని ఇతరులను కూడా సహయోగులుగా చేసుకుంటూ పంచుకుని ముందుకు సాగండి. కేవలం నేను, నేను అనకండి, మీరు కూడా తినండి. పంచుకుంటూ ఒకరి చేయి మరొకరు కలుపుతూ ముందుకు సాగండి. ప్రస్తుతం సేవ మధ్యలో ఈ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఇందులో విశాల హృదయులుగా మారండి. దీనినే ‘భారాన్ని మోసేవారే అర్జునులు’ అంటారు. ఒకరినొకరు చూసుకోకండి – వీరు కూడా ఇలాగే చేస్తున్నారు కదా అని! ఇది జరుగుతూనే ఉంటుంది, కానీ నేను విశేషతను చూపించడానికి నిమిత్తం కావాలి. బ్రహ్మా బాబా విశేషత ఏమిటి! సదా పిల్లలను ముందుంచారు. నాకంటే పిల్లలు తెలివైనవారు, పిల్లలే చేస్తారు! ఇంతవరకు త్యాగపు భాగ్యాన్ని కూడా త్యాగం చేశారు. ఎవరైనా ప్రేమ కారణంగా, ప్రాప్తి కారణంగా బ్రహ్మ మహిమ చేసినా, వారికి కూడా తండ్రి స్మృతినే చేయించేవారు. బ్రహ్మ నుండి వారసత్వం లభించదు, బ్రహ్మ ఫోటో పెట్టుకోకూడదు, బ్రహ్మనే సర్వస్వంగా భావించకూడదు. కాబట్టి దీనినే త్యాగపు భాగ్యాన్ని కూడా త్యాగం చేసి సేవలో నిమగ్నమవ్వడం అంటారు. ఇందులో డబల్ మహాదానులుగా అయిపోతారు. ఇతరులు ఆఫర్ చేయాలి తప్ప స్వయంగా తమ వైపుకు లాక్కోకూడదు. ఒకవేళ స్వయంగా తమ మహిమ చేసుకుంటూ, తమ వైపుకు లాక్కుంటే దానిని ఏ పదంతో అంటారు! మురళీలలో విన్నారు కదా. అలా మారకూడదు. ఏ విషయాన్నయినా స్వయంగా తమ వైపుకు లాక్కునే లాగుడు-పీకుడు ఎన్నడూ చేయకండి. సహజంగా లభించేదే శ్రేష్ఠ భాగ్యం. లాక్కుని తీసుకునే దానిని శ్రేష్ఠ భాగ్యం అనరు. అందులో సిద్ధి ఉండదు. శ్రమ ఎక్కువ, సఫలత తక్కువ, ఎందుకంటే అందరి ఆశీర్వాదం లభించదు. ఏదైతే సహజంగా లభిస్తుందో అందులో అందరి ఆశీర్వాదం నిండి ఉంటుంది. అర్థమైందా.
ఒత్తిడి అంటే ఏమిటో తెలిసింది కదా! మమకారం గురించి ఆ రోజు స్పష్టం చేశాము. ఎలాంటి బలహీన స్వభావం ఉండకూడదు. నేను ఈ దేశానికి చెందినవాడిని, అందుకే నా స్వభావం, నా నడవడిక, నా జీవనశైలి ఇలా ఉన్నాయి అని కూడా భావించకండి, అలా కాదు. దేశం కారణంగా, ధర్మం కారణంగా, సాంగత్యం కారణంగా నా స్వభావం ఇలా ఉంది – ఇలా కాదు. మీరు ఏ దేశానికి చెందినవారు! ఇవి సేవ కోసం నిమిత్తంగా లభించిన స్థానాలు. ఎవరూ విదేశీయులు కారు, అలాగే నేను భారతవాసిని అనే నషా కూడా ఉండకూడదు. అందరూ ఒక్క తండ్రి పిల్లలే. భారతవాసులు కూడా బ్రాహ్మణ ఆత్మలే, విదేశాలలో ఉండేవారు కూడా బ్రాహ్మణ ఆత్మలే. తేడా లేదు. భారతవాసులు ఇలాంటివారు, విదేశీయులు ఇలాంటివారు అని కాదు – ఈ మాటలు కూడా ఎన్నడూ పలకకండి. అందరూ బ్రాహ్మణ ఆత్మలే. ఇవి సేవ కొరకు లభించిన స్థానాలు. విన్నారు కదా - మీరు విదేశాలకు ఎందుకు చేరుకున్నారు? అక్కడ ఎందుకు జన్మించారు? భారతదేశంలో ఎందుకు జన్మించలేదు? సేవా స్థానాలు తెరవడానికి అక్కడికి వెళ్ళారు. లేకపోతే భారతవాసులకు వీసా సమస్య ఎంతగా ఉంటుందో! మీరందరూ అక్కడే సహజంగా ఉన్నారు. ఎన్ని దేశాలలో సేవ జరుగుతోంది! కాబట్టి సేవ కోసం విదేశాలకు వెళ్ళారు. మిగతా అందరూ బ్రాహ్మణ ఆత్మలే. అందుకే దేని ఆధారంతోనూ స్వభావాన్ని ఏర్పరచుకోకండి. తండ్రి స్వభావం ఏదైతే ఉందో అదే పిల్లల స్వభావం. తండ్రి స్వభావం ఏమిటి? సదా ప్రతి ఆత్మ పట్ల కళ్యాణం లేదా కరుణ భావన కలిగి ఉండే స్వభావం. ప్రతి ఒక్కరినీ ఉన్నతంగా లేపే స్వభావం, మధురమైన స్వభావం, నిరాడంబరత స్వభావం. నా స్వభావం ఇలాంటిది అని ఎన్నడూ అనకండి. ‘నాది’ అనేది ఎక్కడి నుండి వచ్చింది? నాకు గట్టిగా మాట్లాడే స్వభావం ఉంది, నాకు ఆవేశపడే స్వభావం ఉంది, స్వభావం కారణంగా అలా జరిగిపోతుంది – ఇది మాయ. కొందరికి అభిమాన స్వభావం, ఈర్ష్య, ఆవేశపడే స్వభావం ఉంటుంది, నిరుత్సాహపడే స్వభావం ఉంటుంది. మంచివారిగా ఉన్నా తమను తాము మంచివారిగా భావించరు. ఎల్లప్పుడూ తమను తాము బలహీనులుగానే భావిస్తారు – నేను ముందుకు వెళ్ళలేను, చేయలేను అని. ఈ నిరుత్సాహ స్వభావం కూడా తప్పు. అభిమానంలోకి రాకండి, కానీ స్వమానంలో ఉండండి. కాబట్టి ఇలాంటి స్వభావాలనే బలహీన స్వభావం అంటారు. కనుక ఈ మూడు విషయాలపై సంవత్సరమంతా అటెన్షన్ ఉంచండి. ఈ మూడు విషయాల నుండి సురక్షితంగా ఉండాలి. కష్టమేమీ కాదు కదా. సహచరులు ఆది నుండి అంతం వరకు సహయోగులు, సహచరులు. సహచరులు సమానంగా ఉండాలి కదా. ఒకవేళ సహచరులలో సమానత లేకపోతే సహచరులు ప్రేమ రీతిని నిర్వర్తించలేరు. అచ్ఛా, ఈ 3 విషయాలను అటెన్షన్లో ఉంచుకుంటారు. కానీ ఈ మూడు విషయాల నుండి సదా దూరంగా ఉండటానికి మరో 3 విషయాలను గుర్తుంచుకోవాలి. నేడు మూడింటి పాఠం నేర్పిస్తున్నాము. సదా మీ జీవితంలో ఒక బ్యాలెన్స్ ఉంచుకోవాలి. అన్ని విషయాలలోనూ బ్యాలెన్స్ ఉండాలి. స్మృతి మరియు సేవలో బ్యాలెన్స్. స్వమానం అభిమానాన్ని సమాప్తం చేస్తుంది. స్వమానంలో స్థితులై ఉండాలి. ఈ విషయాలన్నీ స్మృతిలో ఉండాలి. మరీ ఎక్కువ సరదాగానూ కాదు, మరీ ఎక్కువ గంభీరంగానూ కాదు, బ్యాలెన్స్ ఉండాలి. సమయానికి సరదాగా, సమయానికి గంభీరంగా. కాబట్టి ఒకటి – బ్యాలెన్స్. రెండవది – సదా అమృతవేళ తండ్రి నుండి విశేష బ్లెస్సింగ్ తీసుకోవాలి! రోజూ అమృతవేళ బాప్‌దాదా పిల్లల పట్ల బ్లెస్సింగ్ జోలెను తెరుస్తారు. దాని నుండి ఎంత తీసుకోవాలనుకుంటే అంత తీసుకోవచ్చు. కాబట్టి బ్యాలెన్స్, బ్లెస్సింగ్, మూడవది బ్లిస్ఫుల్ లైఫ్ (ఆనందమయ జీవితం). ఈ మూడు విషయాలు స్మృతిలో ఉండటం వల్ల అటెన్షన్ ఇవ్వాల్సిన ఆ మూడు విషయాలు స్వతహాగానే సమాప్తమైపోతాయి. అర్థమైందా! అచ్ఛా, ఇంకో మూడు విషయాలు వినండి :-
లక్ష్య రూపంలో లేదా ధారణ రూపంలో విశేషంగా మూడు విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. అవి వదిలేయాలి మరియు ఇవి ధారణ చేయాలి. వదిలేయాల్సినవి సదాకాలం కొరకు వదిలేశారు కదా, వాటిని గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ ఇప్పుడు వినిపించే ఈ మూడు విషయాలను స్మృతిలో ఉంచుకోవాలి మరియు ధారణ స్వరూపంలో విశేషంగా గుర్తుంచుకోవాలి. ఒకటి – అన్ని విషయాలలోనూ రియాలిటీ ఉండాలి, మిక్స్ ఉండకూడదు. దీనినే రియాలిటీ అంటారు. సంకల్పంలో, మాటలో, అన్ని విషయాలలోనూ రియల్. సత్యమైన హృదయానికి భగవంతుడు ప్రసన్నుడవుతారు. సత్యానికి గుర్తు ఏమిటి? సత్యం ఉన్నవారు నాట్యం చేస్తారు. ఎవరైతే సత్యవంతులుగా ఉంటారో వారు సదా సంతోషంతో నాట్యం చేస్తూ ఉంటారు. కాబట్టి ఒకటి రియాలిటీ, రెండవది రాయల్టీ. చిన్న-చిన్న విషయాలలో ఎన్నడూ బుద్ధి ఆకర్షితం కాకూడదు. రాయల్ పిల్లలు ఉంటారు కదా, వారి చూపు ఎన్నడూ చిన్న వస్తువు పైన వెళ్ళదు. ఒకవేళ చూపు వెళ్తే వారిని రాయల్ అనము. ఎలాంటి చిన్న-చిన్న విషయాలలోనైనా బుద్ధి మొగ్గు చూపితే దానిని రాయల్టీ అనము. ఎవరైతే రాయల్‌గా ఉంటారో వారు సదా ప్రాప్తి స్వరూపులుగా ఉంటారు. ఎక్కడికీ కళ్ళు లేదా బుద్ధి వెళ్ళవు. కాబట్టి ఇది ఆత్మిక రాయల్టీ. వస్త్రాల రాయల్టీ కాదు. కనుక రియాలిటీ, రాయల్టీ మరియు మూడవది యూనిటీ. ప్రతి విషయంలోనూ, సంకల్పంలో, మాటలో, కర్మలో కూడా సదా ఒకరిలో ఒకరికి యూనిటీ కనిపించాలి. బ్రాహ్మణులు అంటేనే ఒక్కటి. లక్ష కాదు, ఒక్కటి. దీనినే యూనిటీ అంటాము. అక్కడ అనేక స్థితుల కారణంగా ఒక్కరు కూడా అనేకంగా అయిపోతారు, మరియు ఇక్కడ అనేకంగా ఉన్నప్పటికీ ఒక్కటిగా ఉన్నారు. దీనినే యూనిటీ అంటాము. ఇతరులను చూడకూడదు – మేము యూనిటీతో ఉండాలనుకుంటున్నాము కానీ వీరు చేయడం లేదు అని. ఒకవేళ మీరు చేస్తూ ఉంటే, వారికి డిస్-యూనిటీ చేసే అవకాశమే లభించదు. ఒకరు చేయి ఇలా చప్పట్లు కొట్టడానికి పెట్టి, మరొకరు పెట్టకపోతే శబ్దం రాదు. ఎవరైనా డిస్-యూనిటీకి సంబంధించిన ఏ కార్యం చేసినా, మీరు యూనిటీలో ఉంటే డిస్-యూనిటీ చేసేవారు ఎన్నడూ ఆ పని చేయలేరు. యూనిటీలోకి రావాల్సిందే. అందుకే మూడు విషయాలు – రియాలిటీ, రాయల్టీ మరియు యూనిటీ. ఈ మూడు విషయాలు సదా తండ్రి సమానంగా మారడంలో సహయోగులు అవుతాయి. అర్థమైందా, నేడు మూడింటి పాఠం చదువుకున్నారు కదా. తండ్రికి అయితే పిల్లల పట్ల ఎంతో గర్వం ఉంది. ఇంతటి యోగ్యులైన పిల్లలు మరియు యోగీ పిల్లలు ఏ తండ్రికీ ఉండనే ఉండరు. యోగ్యులుగానూ ఉన్నారు, యోగులుగానూ ఉన్నారు మరియు ఒక్కొక్కరూ పదమా పదమ భాగ్యవంతులు. పూర్తి కల్పంలో ఇంతమంది మరియు ఇలాంటి పిల్లలు ఉండనే ఉండరు. అందుకే విశేషంగా అమృతవేళ సమయాన్ని బాప్‌దాదా బ్రాహ్మణ పిల్లల కోసం ఎందుకు పెట్టారు? ఎందుకంటే విశేషంగా బాప్‌దాదా ప్రతి బిడ్డ యొక్క విశేషతను, సేవను, గుణాలను సదా ఎదురుగా తీసుకువస్తారు. మరియు ఏం చేస్తారు? ప్రతి బిడ్డలో ఉన్న విశేషత, గుణం, సేవలను విశేష వరదానంతో అవినాశిగా చేస్తారు. అందుకే ప్రత్యేకంగా ఈ సమయాన్ని పిల్లల కోసం పెట్టారు. ఇది అమృతవేళ యొక్క విశేష పాలన. ప్రతి ఒక్కరికీ బాప్‌దాదా స్నేహపు సహకారం, వరదానాల పాలనను అందిస్తారు. ఏం చేస్తారో అర్థమైందా, మరియు మీరందరూ ఏం చేస్తారు? శివబాబా సుఖదాత, శాంతి దాత... అని అంటారు కదా. మరియు తండ్రి పాలన ఇస్తారు. తల్లిదండ్రులు పిల్లలను ఉదయాన్నే తయారుచేసి, శుభ్రపరిచి, ఆ తర్వాత ‘ఇక రోజంతా తినండి, తాగండి, చదువుకోండి’ అని అన్నట్లుగా, బాప్‌దాదా కూడా అమృతవేళ ఈ పాలన ఇస్తారు అనగా రోజంతటి కొరకు శక్తిని నింపుతారు. విశేష పాలన సమయం ఇది. ఇది ఎక్స్ట్రా వరదానాల, పాలన సమయం. అమృతవేళ వరదానాల జోలె తెరుచుకుంటుంది. సత్యమైన హృదయంతో ఎంత వరదానం తీసుకోవాలనుకుంటే అంత తీసుకోవచ్చు, స్వార్థంతో కాదు. స్వార్థం ఉన్నప్పుడు ‘మాకు ఇది ఇవ్వండి’ అని అంటారు; ఎవరైతే స్వార్థంతో అడుగుతారో అప్పుడు బాప్‌దాదా ఏం చేస్తారు! వారి స్వార్థం సిద్ధించడానికి అంత శక్తిని ఇస్తారు, పని పూర్తి కాగానే అది సమాప్తమైపోతుంది. అయినప్పటికీ పిల్లలు కదా, వద్దని అనరు. కానీ సదా వరదానాలతో పాలించబడుతూ ఉండాలి, నడుస్తూ ఉండాలి, ఎగురుతూ ఉండాలి; దాని కోసం అమృతవేళను ఎంత శక్తివంతంగా చేసుకుంటారో అంతగా రోజంతా సహజంగా ఉంటుంది. అర్థమైందా.
ఇప్పుడు ఈ సంవత్సరం గోల్డెన్ జూబ్లీ తయారీ అయితే చేస్తున్నారు, కానీ ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క సేవాకేంద్రంలో ఇంకా ఏ విశేషత చేయాలో చెబుతున్నారు. గోల్డెన్ జూబ్లీ అయితే జరుపుకోవాలి, దానిని మర్చిపోకూడదు; అలాగే బాప్‌దాదా అన్ని స్థానాలలో చక్కర్లు కొడుతూ, క్లాసులను చూస్తుంటారు. రెగ్యులర్ స్టూడెంట్స్‌ని చూస్తారు, అప్పుడప్పుడు వచ్చేవారిని చూస్తారు, సంపర్కంలో ఉన్నవారిని చూస్తారు. ఇవన్నీ చూస్తూ ఈ సంవత్సరం ఈ లక్ష్యం పెట్టుకోండి – ప్రతి సెంటర్లో ప్రతి రకమైన వెరైటీ ఉండాలి. వకీలు కూడా ఉండాలి, జడ్జి కూడా ఉండాలి, డాక్టర్ కూడా ఉండాలి, సైన్స్ వారు మొదలైన... అందరూ ఉండాలి. అన్ని ధర్మాల వారు కూడా ఉండాలి. అన్ని రకాల వెరైటీ వీలైనంత ఎక్కువగా ఎంతైనా ఉండవచ్చు, కానీ కనీసం ఏ ఒక్క వృత్తి వారూ తక్కువ కాకుండా అన్ని వెరైటీలు ప్రతి స్థానంలో ఉండాలి. స్టూడెంట్ ఉంటే వృద్ధులు కూడా ఉండాలి, యువకులు కూడా ఉండాలి, పిల్లలు కూడా ఉండాలి. అన్ని రకాల వెరైటీ ఉండాలి. ప్రవృత్తిలో ఉండే యుగళులు కూడా ఉండాలి. మీరందరూ రిజల్ట్ తీసేటప్పుడు ఒకటి వయస్సు ప్రకారం వెరైటీ తీస్తారు, రెండవది సేవ ప్రకారం వర్గాలను తీస్తారు. ఏ ఒక్క వృత్తి వారూ తక్కువ కాకూడదు. దీనినే వెరైటీ రకాల పుష్పగుచ్ఛం అంటాము. ఏ ఒక్క రంగు, రూపం గల పుష్పం తక్కువ కాకూడదు. ప్రతి ఒక్క సేవాకేంద్రం ఇలా అన్ని రకాల సంఖ్యను పెంచాలి. ఎంత పెంచితే అంత ముందు నంబర్లో ఉంటారు. ఈ సంవత్సరంలో ఇలాంటి వెరైటీ రకాల స్టూడెంట్స్‌ని తయారుచేయండి. ఎవరైనా ఏ క్లాసులోకి వెళ్ళినా వారికి అన్ని రకాల వృత్తుల వారు కనిపించాలి. మరియు ఆ ఒక్కరు మళ్ళీ తమ తోటి వృత్తి వారికి తప్పకుండా సేవ చేయాలి; అప్పుడు సంఖ్య కూడా పెరుగుతుంది మరియు వెరైటీ కూడా ఉంటుంది. ఇక వి.ఐ.పి. సర్వీస్ అయితే చేస్తూనే ఉన్నారు. అందులో కూడా అడిషన్ చేయాలి. బాప్‌దాదా వినిపించారు కదా – కేవలం వినడానికి రాకూడదు, పొందడానికి రావాలి, ఏదో ఒకటి మారి వెళ్ళాలి. కేవలం ‘విన్నాము చాలా బాగుంది’ అని కాదు, ‘ఏదో పొంది వెళ్తున్నాను, మారి వెళ్తున్నాను’ అని అనాలి. వి.ఐ.పి. సేవను ఎంత పెంచుతూ వెళ్తారో అంతగా నినాదం గట్టిగా మారుతూ వెళ్తుంది. నెమ్మది నెమ్మదిగా గళం విప్పబడుతోంది, కానీ ఒక వైపు నుండి ఒక పెద్ద శబ్దం వస్తుంది, అన్ని వైపుల నుండి రావడం లేదు. అప్పుడు ఒక వైపు శబ్దం దాగిపోతుంది. నలువైపుల నుండి గట్టి నినాదం వస్తే విజయ నగారా మోగిపోతుంది. విజయ నగారా మోగించేటప్పుడు నలువైపులా చక్కర్లు కొడతారు, నలువైపులా శబ్దం వ్యాపిస్తుంది. కాబట్టి సేవలో ఏం చేయాలో అర్థమైంది కదా. స్వస్థితి మరియు సేవ యొక్క ఉన్నతి. స్వస్థితే సేవా ఉన్నతికి సహజ సిద్ధి లేదా సహజ సాధనం. స్వయం ఉన్నతి లేకుండా సేవా ఉన్నతి అవినాశిగా, నిర్విఘ్నంగా తయారవ్వదు. అందుకే రెండింటి బ్యాలెన్స్ ఉండాలి. స్వ-ఉన్నతిని వదిలేసి కేవలం సేవా ఉన్నతి మాత్రమే చేయకండి, రెండింటినీ ఏకకాలంలో చేయండి. లేకపోతే ఎవరికైతే నిమిత్తమవుతారో వారు కూడా బలహీనులుగా అవుతారు, వారికి కూడా చాలా శ్రమ పడాల్సి వస్తుంది. అందుకే స్వ-ఉన్నతి, సేవా ఉన్నతి రెండింటినీ సదా తోడుగా ఉంచుకుంటూ ఎగురుతూ సాగండి. అచ్ఛా.
సదా స్వయాన్ని పాస్ విత్ ఆనర్ అయ్యే లక్ష్యం మరియు లక్షణాలలో నడిపించుకునేవారు, సదా స్వయాన్ని బ్రహ్మా బాబా సమానంగా త్యాగపు భాగ్యాన్ని పంచేవారు, నంబర్‌వన్ త్యాగిగా శ్రేష్ఠ భాగ్యాన్ని నిర్మించుకునేవారు, సదా సహజ ప్రాప్తికి అధికారులై స్వ-ఉన్నతి మరియు సేవా ఉన్నతి చేసేవారు, సదా ప్రతి అడుగులోనూ సహయోగులుగా, సహచరులుగా మారి ముందుకు సాగేవారు, స్మృతి, స్థితిని శక్తివంతంగా చేసుకోవడం ద్వారా సదా తండ్రిని ఫాలో చేసేవారు – ఇలాంటి సదా సహయోగులు, సహచరులు, ఆజ్ఞాపాలకులు, ఆజ్ఞాకారులు, సంతృప్తిగా ఉండేవారు, సర్వులను ప్రసన్నులను చేసే రహస్యాన్ని తెలుసుకున్నవారు, ఇలాంటి శ్రేష్ఠ ఆత్మలకు, మహా పుణ్యాత్మలకు, డబల్ మహాదానులైన పిల్లలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో అవ్యక్త బాప్‌దాదా మిలనము:-
ఆది నుండి ఇప్పటివరకు ప్రతి కార్యంలో తోడుగా నడుస్తూ వస్తున్న వారి విశేషత ఇది – బ్రహ్మా బాబా ప్రతి అడుగులోనూ అనుభవజ్ఞులై అనుభవపు అథారిటీతో విశ్వ రాజ్యపు అథారిటీని తీసుకున్నట్లుగానే, మీరందరూ కూడా బహుకాలపు అన్ని రకాల అనుభవాల అథారిటీ కారణంగా బహుకాలపు రాజ్యపు అథారిటీలో కూడా సహచరులుగా కాబోతున్నారు. ఎవరైతే ఆది నుండి సంకల్పం చేశారో – ఎక్కడ కూర్చుండబెడితే అక్కడ, ఎలా నడిపిస్తే అలా నడుస్తూ తోడుగా సాగుతామని, కాబట్టి తోడుగా నడిచే మొదటి వాగ్దానాన్ని బాప్‌దాదా నిర్వర్తించి తీరాలి. బ్రహ్మా బాబాతో కూడా ఉండేవారు. రాజ్యంలోనూ తోడుగా ఉంటారు, భక్తిలోనూ తోడుగా ఉంటారు. ఇప్పుడు బుద్ధి ద్వారా ఎంతగా సదాకాలపు తోడు ఉంటుందో, ఆ లెక్క ప్రకారం రాజ్యంలోనూ సదా తోడుగా ఉంటారు. ఒకవేళ ఇప్పుడు కొద్దిగా దూరమైతే ఏదో ఒక జన్మలో దూరమైపోతారు, ఏదో ఒక జన్మలో దగ్గర అవుతారు. కానీ ఎవరైతే సదా బుద్ధి ద్వారా తోడుగా ఉంటారో వారు అక్కడ కూడా కలిసి ఉంటారు. సాకారంలో అయితే మీరందరూ 14 సంవత్సరాలు కలిసి ఉన్నారు; సంగమయుగపు 14 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలకు సమానమైపోయాయి! సంగమయుగంలో ఇంత సమయం సాకార రూపంలో తోడుగా ఉన్నారు, ఇది కూడా ఎంతో గొప్ప భాగ్యం. మళ్ళీ బుద్ధి ద్వారా కూడా తోడుగా ఉన్నారు, ఇంటిలోనూ తోడుగా ఉంటారు, రాజ్యంలోనూ తోడుగా ఉంటారు. సింహాసనంపైన కొందరే కూర్చున్నప్పటికీ, రాయల్ ఫ్యామిలీకి దగ్గరి సంబంధంలో, రోజంతటి దినచర్యలో తోడుగా ఉండే పాత్ర తప్పకుండా పోషిస్తారు. కాబట్టి ఈ ఆది నుండి తోడుగా ఉండే వాగ్దానం కల్పమంతా నడుస్తూనే ఉంటుంది. భక్తిలో కూడా చాలా సమయం తోడుగా ఉంటారు. చివరి జన్మలలో కొద్దిగా ఎవరైనా దూరం, ఎవరైనా దగ్గర అయినప్పటికీ కల్పమంతా ఏదో ఒక రూపంలో తోడుగానే ఉంటారు. ఇలాంటి వాగ్దానం ఉంది కదా! అందుకే మిమ్మల్ని అందరూ ఏ దృష్టితో చూస్తారు! తండ్రి రూపాలుగా చూస్తారు. దీనినే భక్తిలో వారందరూ ‘వీరంతా భగవంతుని రూపాలు’ అని అన్నారు! ఎందుకంటే తండ్రి సమానంగా మారారు కదా! మీ రూపం ద్వారా తండ్రి కనిపిస్తారు, అందుకే తండ్రి రూపాలు అని అనేస్తారు. ఎవరైతే తండ్రికి సదా తోడుగా ఉండేవారో వారి విశేషత ఇదే ఉంటుంది – వారిని చూడగానే తండ్రి గుర్తుకు వస్తారు, వారిని స్మరించరు కానీ తండ్రిని స్మరిస్తారు. వారి నుండి తండ్రి చరిత్ర, తండ్రి దృష్టి, తండ్రి కర్మలు అన్నీ అనుభవమవుతాయి. వారు స్వయంగా కనిపించరు కానీ వారి ద్వారా తండ్రి కర్మలు లేదా దృష్టి అనుభవమవుతాయి. ఇదే అనన్య, సమాన బిడ్డ యొక్క విశేషత. అందరూ ఇలాగే ఉన్నారు కదా! మీలో అయితే చిక్కుకోవడం లేదు కదా! ‘ఫలానా వారు చాలా మంచివారు’ అని అనరు కదా, తండ్రి వీరిని మంచివారిగా తయారుచేసారు అంటారు. తండ్రి దృష్టి, తండ్రి పాలన వీరి నుండి లభిస్తాయి, తండ్రి మహావాక్యాలు వీరి నుండి వింటాము. ఇది విశేషత. దీనినే ప్రియమైనవారుగానూ మరియు అతీతంగానూ ఉండటం అంటాము. అందరికీ ప్రియమైనవారిగా ఉండండి కానీ చిక్కుకునేలా చేసేవారు కాకూడదు. తండ్రికి బదులుగా మిమ్మల్ని స్మరించకూడదు. తండ్రి శక్తిని పొందడానికి, తండ్రి మహావాక్యాలను వినడానికి మిమ్మల్ని స్మరించాలి. వీరినే ప్రియమైనవారు మరియు అతీతులు అంటాము. ఇలాంటి గ్రూపే కదా. సాకార తండ్రి పాలన తీసుకున్నారంటే ఏదో విశేషత ఉండి తీరుతుంది కదా! మీ వద్దకు వస్తే ఏమని అడుగుతారు – తండ్రి ఏం చేసేవారు, ఎలా నడిచేవారు... ఇదే గుర్తుకు వస్తుంది కదా. ఇలాంటి విశేష ఆత్మలు, దీనినే డివైన్ యూనిటీ అంటాము. డివైన్ స్మృతిని కలిగించి డివైన్‌గా తీర్చిదిద్దుతారు, అందుకే డివైన్ యూనిటీ. 50 సంవత్సరాలు అవినాశిగా ఉన్నారు కాబట్టి ‘అవినాశి భవ’ అనే శుభాకాంక్షలు. ఎందరో వచ్చారు, ఎందరో చక్కర్లు కొట్టి వెళ్ళిపోయారు. మీరైతే అనాది అవినాశిగా అయిపోయారు. అనాదిలోనూ తోడు, ఆదిలోనూ తోడు. వతనంలో తోడుగా ఉంటే సేవ ఎలా చేస్తారు! మీరైతే కొద్దిగా విశ్రాంతి కూడా తీసుకుంటారు, తండ్రికి విశ్రాంతి అవసరం కూడా లేదు. బాప్‌దాదా దీని నుండి కూడా విముక్తులయ్యారు. అవ్యక్తులకు విశ్రాంతి అవసరం లేదు, వ్యక్తులకు అవసరం ఉంది. ఇందులో మీ సమానంగా చేసుకుంటే పని సమాప్తమైపోతుంది. అయినప్పటికీ చూడండి, ఎప్పుడైనా సేవా అవకాశం వస్తే తండ్రి సమానంగా అలసట లేనివారిగా మారిపోతారు, అప్పుడు అలసిపోరు. అచ్ఛా.
దాదీజీతో:- చిన్నతనం నుండే తండ్రి కిరీటధారిగా తయారుచేశారు. రాగానే సేవా బాధ్యత అనే కిరీటాన్ని ధరింపజేశారు మరియు సమయానుసారం ఏ పాత్ర నడిచినా సరే – పేదరికపు పాత్ర నడిచినా, ఆనందాల పాత్ర నడిచినా, అన్ని పాత్రలలోనూ బాధ్యత అనే కిరీటాన్ని డ్రామా ప్రకారం ధరిస్తూ వచ్చారు. అందుకే అవ్యక్త పాత్రలో కూడా కిరీటధారి నిమిత్తమయ్యారు. కాబట్టి ఇది ఆది నుండి ఉన్న విశేష పాత్ర. సదా బాధ్యతను నిర్వర్తించేవారు. తండ్రి బాధ్యత వహించేవారు కాబట్టి బాధ్యత అనే కిరీటధారిగా మారే విశేష పాత్ర ఉంది. అందుకే అంతిమంలో కూడా దృష్టి ద్వారా కిరీటం, తిలకం అన్నీ ఇచ్చి వెళ్ళారు. అందుకే మీ స్మృతి చిహ్నంలో కిరీటం తప్పకుండా ఉంటుంది. శ్రీకృష్ణుడికి చిన్నతనం నుండే కిరీటం చూపించినట్లుగా, స్మృతి చిహ్నంలో కూడా చిన్నతనం నుండే కిరీటధారి రూపంలో పూజిస్తారు. మిగతా అందరూ సహచరులు కానీ మీరు కిరీటధారి. తోడు అయితే అందరూ ఇస్తారు కానీ సమాన రూపంలో తోడు ఇవ్వడంలో తేడా ఉంది.
వీడ్కోలు సమయంలో పిల్లలందరికీ ప్రియస్మృతులు:- అన్ని వైపులా ఉన్న స్నేహీ సహకారులైన పిల్లలకు బాప్‌దాదా యొక్క విశేష స్నేహ సంపన్న ప్రియస్మృతులు స్వీకారమగుగాక. నేడు బాప్‌దాదా పిల్లలందరికీ సదా నిర్విఘ్నులుగా, విఘ్న వినాశకులుగా మారి విశ్వాన్ని నిర్విఘ్నంగా చేసే కార్యానికి అభినందనలు తెలుపుతున్నారు. ప్రతి బిడ్డ సేవలో సదా ముందుకు సాగాలనే ఈ శ్రేష్ఠ సంకల్పమే చేస్తారు; ఈ శ్రేష్ఠ సంకల్పం సేవలో సదా ముందుకు సాగుతోంది మరియు నడిపిస్తూ ఉంటుంది. సేవతో పాటు స్వ-ఉన్నతి మరియు సేవా ఉన్నతి యొక్క బ్యాలెన్స్ ఉంచుకుంటూ ముందుకు సాగితే, బాప్‌దాదా మరియు మీరు ఎవరికైతే నిమిత్తమవుతారో ఆ సర్వ ఆత్మల హృదయపూర్వక దీవెనలు లభిస్తూ ఉంటాయి. కాబట్టి సదా బ్యాలెన్స్ ద్వారా బ్లెస్సింగ్ తీసుకుంటూ ముందుకు సాగండి. స్వ-ఉన్నతి మరియు సేవా ఉన్నతి రెండూ కలిసి ఉండటం వల్ల సదా మరియు సహజ సఫలత స్వరూపులుగా మారిపోతారు. అందరూ తమ-తమ పేరుతో విశేష ప్రియస్మృతులను స్వీకరించండి. అచ్ఛా!
*** ఓంశాంతి ***
