“తపస్వీ మూర్తులు, త్యాగ మూర్తులు, విధాతలే విశ్వ రాజ్య అధికారులు”
ఈరోజు ఆత్మిక దీపము తమ ఆత్మిక దీపపు పురుగులను చూస్తున్నారు. ఆత్మిక దీపపు పురుగులందరూ దీపముతో మిలనం జరుపుకునేందుకు నలువైపుల నుండి వచ్చి చేరుకున్నారు. ఆత్మిక దీపపు పురుగుల ప్రేమ ఆత్మిక దీపానికి తెలుసు మరియు ఆత్మిక దీపపు పురుగులకే తెలుసు. పిల్లలందరి హృదయపూర్వక స్నేహము ఆకర్షించి అందరినీ ఈ అలౌకిక మేళాలోకి తీసుకొచ్చిందని బాప్‌దాదాకు తెలుసు. ఈ అలౌకిక మేళా గురించి అలౌకిక పిల్లలకు తెలుసు మరియు తండ్రికి తెలుసు! ప్రపంచంలోని వారికి ఈ మేళా గుప్తమైనది. మేము ఆత్మిక మేళాకు వెళ్తున్నామని ఒకవేళ ఎవరికైనా చెప్తే వారికేమి అర్థమవుతుంది? ఈ మేళా సదాకాలానికి సంపన్నంగా చేసే మేళా. ఈ పరమాత్మ మేళా సర్వ ప్రాప్తి స్వరూపులుగా చేసే మేళా. బాప్‌దాదా పిల్లలందరి మనసులోని ఉల్లాస-ఉత్సాహాలను చూస్తున్నారు. ప్రతి ఒక్కరి మనసులో స్నేహసాగరుని అలలు వస్తున్నాయి. ఈ అలలను బాప్‌దాదా చూస్తూ కూడా ఉన్నారు, అంతేకాక ఈ తపన విఘ్నవినాశకులుగా చేసి మధువన వాసులుగా చేసిందని కూడా తెలుసు. అందరి యొక్క అన్ని విషయాలు స్నేహంలో సమాప్తమైపోయాయి. ఈ స్నేహము ఎవరెడీగా ఉండే రిహార్సల్‌ను చేసి చూపించింది. ఎవరెడీగా అయ్యారు కదా. మధురమైన డ్రామాలోని ఈ మధురమైన పాత్రను చూసి బాప్‌దాదా మరియు బ్రాహ్మణ పిల్లలు హర్షితులవుతున్నారు. స్నేహములో అన్ని విషయాలు సహజంగా కూడా అనిపిస్తాయి మరియు ప్రియంగా కూడా అనిపిస్తాయి. ఏదైతే డ్రామా తయారయిందో, ఆ డ్రామా వాహ్! అన్నట్లుగా ఉంది. ఇలా ఎన్నిసార్లు పరుగు-పరుగున వచ్చారు. ట్రైన్లో వచ్చారా లేక రెక్కలతో ఎగురుతూ వచ్చారా? ఎక్కడైతే మనసుంటుందో అక్కడ అసంభవం కూడా సంభవమవుతుందని దీనినే అంటారు. స్నేహ స్వరూపమునైతే చూపించారు, ఇక మున్ముందు ఏం చెయ్యాలి? ఇప్పటివరకు ఏదైతే జరిగిందో అది శ్రేష్ఠంగా ఉంది మరియు శ్రేష్ఠంగా ఉంటుంది.
ఇప్పుడు సమయ ప్రమాణంగా సర్వ స్నేహీలు, సర్వ శ్రేష్ఠమైన పిల్లల నుండి బాప్‌దాదా ఇంకా విశేషంగా ఏం ఆశిస్తున్నారు? పూర్తి సీజన్లో ఎప్పటికప్పుడు బాప్‌దాదా సూచనలైతే ఇస్తారు. ఇప్పుడు ఆ సూచనలను ప్రత్యక్ష రూపంలో చూసే సమయం వస్తుంది. మీరు స్నేహీ ఆత్మలు, సహయోగీ ఆత్మలు, సేవాధారి ఆత్మలు కూడా. ఇప్పుడు మహా తపస్వీ ఆత్మలుగా అవ్వండి. మీ సంగఠిత స్వరూప తపస్సు యొక్క ఆత్మిక జ్వాల ద్వారా ఆత్మలందరినీ దుఃఖము, అశాంతుల నుండి ముక్తులుగా చేసే మహోన్నతమైన కార్యము చేసే సమయము. ఒకవైపు అనవసర రక్తపాతము జరిగే ఆట యొక్క అలలు పెరుగుతూ ఉన్నాయి, ఆత్మలందరూ తమను తాము ఆధారహీనులుగా అనుభవం చేస్తున్నారు, ఇటువంటి సమయంలో అందరికీ ఆధారాన్ని అనుభూతి చేయించేందుకు మహాతపస్వీ ఆత్మలైన మీరు నిమిత్తంగా ఉన్నారు. నలువైపులా ఈ తపస్వీ స్వరూపం ద్వారా ఆత్మలకు ఆత్మిక ప్రశాంతతను అనుభూతి చేయించాలి. పూర్తి విశ్వంలోని ఆత్మలు ప్రకృతితో, వాయుమండలంతో, మనుష్యాత్మలతో, తమ మనసులోని బలహీనతలతో, తనువుతో కలత చెంది ఉన్నారు. అటువంటి ఆత్మలకు ఒక్క సెకండు కొరకైనా సుఖ-శాంతుల స్థితిని అనుభవం చేయిస్తే వారు మీకు పదే పదే హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతారు. వర్తమాన సమయంలో సంగఠిత రూపంలో జ్వాలా స్వరూపము యొక్క ఆవశ్యకత ఉంది. ఇప్పుడు విధాత పిల్లలైన మీరు విధాత స్వరూపంలో స్థితులై, ప్రతి సమయము ఇస్తూ వెళ్ళండి. అఖండమైన మహా లంగరు వేయండి ఎందుకంటే రాయల్ బికారులు చాలామంది ఉన్నారు. కేవలం ధనం లేనివారే బికారులు కాదు, కానీ మానసిక బికారులు కూడా అనేక రకాలుగా ఉన్నారు. ప్రాప్తి యొక్క బిందువు కొరకు దప్పికతో ఉన్న అప్రాప్త ఆత్మలు ఎంతోమంది ఉన్నారు కనుక ఇప్పుడు సంగఠనలో విధాతాతనపు అలను వ్యాపింపజేయండి. ఏ ఖజానాలనైతే జమ చేసుకున్నారో వాటిని మాస్టర్ విధాతలుగా అయి ఎంతగా ఇస్తూ ఉంటారో అంతగా నిండుతూ ఉంటాయి. ఎంత విన్నారు. ఇప్పుడిది చేసేటువంటి సమయము. తపస్వీ మూర్తులంటే అర్థము - తపస్సు ద్వారా శాంతి శక్తి యొక్క కిరణాలు నలువైపులా వ్యాపిస్తున్నట్లు అనుభవమవ్వాలి. కేవలం స్వయం కోసం స్మృతి స్వరూపులుగా అయి శక్తిని తీసుకోవడం లేక మిలనం జరుపుకోవడం వేరే విషయము. కానీ తపస్వీ స్వరూపము అనగా ఇతరులకు ఇచ్చేటువంటి స్వరూపము. ఎలాగైతే సూర్యుడు విశ్వానికి ప్రకాశాన్ని మరియు అనేక వినాశీ ప్రాప్తులను అనుభవం చేయిస్తాడో, అలా మహాన్ తపస్వీ రూపము ద్వారా ప్రాప్తుల కిరణాలను అనుభవం చేయించండి. దీని కొరకు మొదట జమా ఖాతాను పెంచుకోండి. స్మృతి ద్వారా లేక జ్ఞాన మననం ద్వారా స్వయాన్ని శ్రేష్ఠంగా తయారుచేసుకున్నాము, మాయాజీత్ విజయులుగా తయారుచేసుకున్నాము అని కేవలం ఇందులోనే సంతోషపడకండి. కానీ అన్ని ఖజానాలతో రోజంతటిలో ఎంతమంది పట్ల విధాతలుగా అయ్యారు. అన్ని ఖజానాలను ప్రతి రోజూ కార్యంలో ఉపయోగించారా లేక కేవలం జమా అయ్యింది చూసుకొని సంతోషిస్తున్నారా? ఇప్పుడు సంతోషపు ఖజానా, శాంతి యొక్క ఖజానా, శక్తుల ఖజానా, జ్ఞానపు ఖజానా, గుణాల ఖజానా, సహయోగమునిచ్చే ఖజానా, వీటిని ఎంత పంచారు అనగా ఎంత పెంచుకున్నారు అనే చార్టును పెట్టండి, దీని ద్వారా ఏదైతే సాధారణమైన చార్టును పెడుతున్నారో, అది స్వతహాగానే శ్రేష్ఠంగా అవుతుంది. పరోపకారులుగా అయితే స్వ ఉపకారులుగా స్వతహాగానే అవుతారు. అర్థమయిందా - ఇప్పుడు ఏ చార్టును పెట్టాలి? ఈ తపస్వీ స్వరూపము యొక్క చార్టుయే విశ్వ కళ్యాణకారులుగా అవ్వడము. కనుక ఎంతమంది కళ్యాణం చేశారు? లేక స్వకళ్యాణములోనే సమయము గడిచిపోతుందా? స్వకళ్యాణము చేసుకునే సమయము చాలా గడిచిపోయింది. ఇప్పుడు విధాతలుగా అయ్యే సమయం వచ్చేసింది కనుక బాప్‌దాదా మళ్ళీ సమయం యొక్క సూచన ఇస్తున్నారు. ఒకవేళ ఇప్పటివరకు కూడా విధాతాతనపు స్థితిని అనుభవం చెయ్యలేదంటే అనేక జన్మలు విశ్వరాజ్యాధికారులుగా అయ్యే పదమాపదమ భాగ్యాన్ని ప్రాప్తి చేసుకోలేరు, ఎందుకంటే విశ్వంపై రాజ్యం చేసేవారు, విశ్వానికి మాత-పితలు అనగా విధాతలుగా ఉంటారు. ఇప్పటి విధాతాతనపు సంస్కారమే అనేక జన్మలకు ప్రాప్తిని కలిగిస్తూ ఉంటుంది. ఒకవేళ ఇప్పటివరకు ఏ రూపంలోనైనా తీసుకునే సంస్కారము ఉంటే - పేరు తీసుకునే, హోదా తీసుకునే లేక ఏ రకమైన తీసుకునే సంస్కారమున్నా, అది విధాతలుగా అవ్వనివ్వదు.
తపస్యా స్వరూపమనగా లేవత (తీసుకునే సంస్కారం) యొక్క త్యాగమూర్తులు. ఈ హద్దులోని లేవత (తీసుకునే సంస్కారం), త్యాగమూర్తులుగా, తపస్వీమూర్తులుగా అవ్వనివ్వదు కనుక తపస్వీమూర్తులనగా హద్దు యొక్క ఇచ్ఛా మాత్రమ్ అవిద్య (కోరికలంటే తెలియని) రూపము. ఎవరైతే తీసుకోవాలనే సంకల్పం చేస్తారో, వారు అల్పకాలానికి తీసుకుంటారు కానీ సదాకాలానికి పోగొట్టుకుంటారు కనుక బాప్‌దాదా పదే-పదే ఈ విషయం పట్ల సూచన ఇస్తున్నారు. తపస్వీ రూపంలో విశేషంగా ఈ అల్పకాలిక కోరికలే విఘ్నరూపంగా అవుతాయి కనుక ఇప్పుడు విశేషంగా తపస్సు యొక్క అభ్యాసం చెయ్యండి. సమానంగా అయ్యేటువంటి ఈ ఋజువునివ్వాలి. స్నేహానికైతే ఋజువునిచ్చారు, ఇది సంతోషకరమైన విషయమే. ఇప్పుడు తపస్వీ మూర్తులుగా అయ్యే ఋజువునివ్వండి. అర్థమయిందా. భిన్న సంస్కారాలు ఉన్నప్పటికీ విధాతతనపు సంస్కారము ఇతర సంస్కారాలను అణిచివేస్తుంది. కనుక ఇప్పుడు ఈ సంస్కారాన్ని ఇమర్జ్ చేసుకోండి. అర్థమయిందా. ఎలాగైతే మధువనానికి పరుగెత్తుకుని వచ్చి చేరుకున్నారో, అలా తపస్వీ స్థితి అనే గమ్యం వైపు పరుగెత్తండి. అచ్ఛా, తప్పకుండా విచ్చేయండి. ఇప్పుడే వినాశనమవుతుందేమో అన్నట్లు అందరూ పరుగెత్తుకుని వచ్చారు. ఏదైతే చేశారో, ఏదైతే జరిగిందో అది బాప్‌దాదాకు ప్రియమే, ఎందుకంటే పిల్లలు ప్రియమైనవారు. ప్రతి ఒక్కరూ మేము వెళ్తున్నాము అనే ఆలోచించారు కానీ ఇతరులు కూడా వస్తున్నారా అన్నది ఆలోచించలేదు. సత్యమైన కుంభమేళా అయితే ఇక్కడే ఏర్పడింది. అందరూ అంతిమ మిలనము జరుపుకునేందుకు, అంతిమ మునక వేసేందుకు వచ్చారు. ఇంతమంది వెళ్తున్నాము అంటే మిలనము జరుపుకునే విధి ఎలా ఉంటుంది అన్న ఆలోచన నుండి కూడా అతీతమైపోయారు. స్థానాన్ని చూడలేదు, రిజర్వేషన్ కూడా చూడలేదు. ఇకమీదట ఎప్పుడూ కూడా రిజర్వేషన్ దొరకదు అనే సాకును చెప్పలేరు. డ్రామాలో ఇది కూడా ఒక రిహార్సల్‌లా జరిగింది. సంగమయుగంలో మన రాజ్యము లేదు. స్వరాజ్యమైతే ఉంది కానీ భూమిపై రాజ్యము లేదు, బాప్‌దాదాకు తమ స్వంత రథము కూడా లేదు, పరాయి రాజ్యము, పరాయి శరీరము కనుక సమయ ప్రమాణంగా కొత్త విధిని ప్రారంభించేందుకు ఇది సీజన్‌గా అయింది. ఇక్కడైతే నీటి కోసం కూడా ఆలోచిస్తూ ఉంటారు, అక్కడైతే జలపాతాలలో స్నానం చేస్తారు. ఎవరెవరైతే వచ్చారో, వారందరి స్నేహానికి బదులుగా బాప్‌దాదా స్నేహంతో స్వాగతం చేస్తారు.
ఇప్పుడు విశేషంగా ఫైనల్ పరీక్షకు ముందు తయారీ కోసం సమయమిచ్చారు. ఫైనల్ పరీక్షకు ముందు సమయాన్ని ఇస్తారు. సెలవులు ఇస్తారు కదా. కనుక బాప్‌దాదా అనేక రహస్యాలతో ఈ విశేషమైన సమయాన్ని ఇస్తున్నారు. కొన్ని రహస్యాలు గుప్తంగా ఉంటాయి, కొన్ని రహస్యాలు ప్రత్యక్షంగా ఉంటాయి. కానీ విశేషంగా ప్రతి ఒక్కరూ సదా బిందువు పెట్టాలనే అటెన్షన్ ఉంచాలి అనగా గడిచిపోయిందేదో గడిచిపోయిందన్న బిందువును పెట్టాలి. మరియు బిందువు స్థితిలో స్థితులై రాజ్యాధికారిగా అయి కార్యాన్ని చెయ్యాలి. సర్వ ఖజానాల బిందువు, సర్వుల పట్ల విధాతగా అయ్యి, సింధువుగా (సాగరంగా) అయ్యి అందరినీ సంపన్నంగా చెయ్యాలి. కనుక బిందువు మరియు సింధువు, ఈ రెండు విషయాలను విశేషంగా స్మృతిలో ఉంచుకొని శ్రేష్ఠమైన సర్టిఫికెట్ తీసుకోవాలి. సదా శ్రేష్ఠ సంకల్పాల సఫలత ద్వారా ముందుకు వెళ్తూ ఉండాలి. కనుక బిందువుగా అవ్వాలి, సింధువుగా అవ్వాలి అనేదే పిల్లలందరికీ వరదాత ఇచ్చే వరదానము. వరదానము తీసుకునేందుకు పరుగెత్తుకుంటూ వచ్చారు కదా. వరదాత ఇచ్చిన ఈ వరదానాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. అచ్ఛా!
నలువైపులా ఉన్న సర్వ స్నేహీ, సహయోగీ పిల్లలకు, సదా తండ్రి ఆజ్ఞను పాలన చేసే ఆజ్ఞాకారి పిల్లలకు, సదా ప్రాక్టికల్‌గా విశాల హృదయంతో అందరికీ సర్వ ఖజానాలను పంచే చాలా గొప్ప పుణ్యాత్మలైన పిల్లలకు, సదా తండ్రి సమానంగా అవ్వాలనే ఉల్లాస-ఉత్సాహాలతో ఎగిరేకళలో ఎగిరే పిల్లలకు, విధాత, వరదాత, సర్వ ఖజానాలకు సాగరుడైన బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
వీడ్కోల సమయంలో:-
అందరూ జాగరణ చేశారా! మీ భక్తులు జాగరణ చేస్తున్నారంటే, ఆ భక్తులకు నేర్పించేవారు ఇష్టదేవతలే, ఎప్పుడైతే ఇక్కడ ఇష్టదేవతలు జాగరణ చేస్తారో, అప్పుడు భక్తులు కాపీ చేస్తారు. అందరూ జాగరణ చేశారు అనగా తమ ఖాతాలో సంపాదన జమా చేసుకున్నారు. కనుక ఈ రాత్రి, సంపాదన చేసుకునే సీజన్‌లోని రాత్రిగా అయింది. ఎలాగైతే సంపాదించే సీజన్ ఉన్నప్పుడు, సీజన్లో మేల్కొని ఉండవలసి వస్తుంది. ఇది సంపాదించే సీజన్ కనుక మేల్కోవడం అనగా సంపాదించడం. కనుక ప్రతి ఒక్కరూ యథాశక్తి తమ జమా చేసుకున్నారు, అంతేకాక ఇలా జమా చేసుకున్న దానిని మహాదానులుగా అయి ఇతరులకు కూడా ఇస్తూ ఉంటారు మరియు స్వయం కూడా అనేక జన్మలకు తింటూ ఉంటారు. ఇప్పుడు పిల్లలందరికీ పరమాత్మ మిలనమనే గోల్డెన్ ఛాన్స్ యొక్క గోల్డెన్ మార్నింగ్ చెప్తున్నారు. చెప్పాలంటే ఇది గోల్డెన్ కంటే కూడా డైమండ్ మార్నింగ్ అయింది. స్వయం కూడా డైమండ్గా ఉన్నారు, మార్నింగ్ కూడా డైమండ్గా ఉంది మరియు జమా కూడా డైమండ్గా చేసుకుంటున్నారు కావున డైమండ్ మార్నింగ్ చెప్తున్నాము. అచ్ఛా!
*** ఓంశాంతి ***
