“సర్వ శక్తి సంపన్నులుగా అయ్యే మరియు వరదానాలను పొందే సంవత్సరము”
ఈరోజు సర్వ ఖజానాల యజమాని, తమ మాస్టర్ పిల్లలను చూస్తున్నారు. బాలకుల నుండి యజమానులుగా ఎంతవరకు అయ్యారో చూస్తున్నారు. ఈ సమయంలోని శ్రేష్ఠమైన ఆత్మలు, ఎవరైతే సర్వ శక్తులకు, సర్వ ఖజానాలకు యజమానులుగా అవుతారో, వారి ఆ యజమానత్వము యొక్క సంస్కారము భవిష్యత్తులో కూడా విశ్వానికి యజమానులుగా తయారుచేస్తుంది. మరి ఏమి చూశారు? అందరూ బాలకులుగా అయితే ఉన్నారు, తండ్రి మరియు నేను అనే తపన పిల్లలందరిలో బాగా ఏర్పడింది. బాలకులము అనే నషా అయితే అందరిలోనూ ఉంది కానీ బాలకుల నుండి యజమానులు అంటే తండ్రి సమానంగా సంపన్నము. కనుక బాలకులుగా ఉండే స్థితి మరియు యజమానులుగా ఉండే స్థితి, వీటి మధ్యన ఉన్న వ్యత్యాసాన్ని చూశారు. యజమానత్వము అనగా ప్రతి అడుగు స్వతహాగానే, స్వయం పట్ల మరియు ఇతరుల పట్ల కూడా సంపన్న స్థితిలో ఉంటుంది. దీనినే మాస్టర్‌గా అనగా బాలకుల నుండి యజమానులుగా అవ్వడమని అంటాము. యజమానత్వము యొక్క విశేషత - ఎంతగా యజమానత్వము యొక్క నషా ఉంటుందో, అంతగా విశ్వ సేవాధారి యొక్క సంస్కారం సదా ఇమర్జ్ (ప్రత్యక్ష) రూపంలో ఉంటుంది. ఎంతగా యజమానత్వము యొక్క నషా ఉంటుందో, అంతగా విశ్వ సేవాధారిని అనే నషా కూడా ఉంటుంది. రెండింటిలో సమానత ఉండాలి. ఇదే తండ్రి సమానంగా యజమానులుగా అవ్వడము. కనుక బాలకులు మరియు యజమానులు అనే ఈ రెండు స్వరూపాలు సదా ప్రత్యక్ష కర్మల్లోకి వస్తున్నాయా లేక కేవలం జ్ఞానము వరకేనా అన్న రిజల్టును చూస్తూ ఉన్నారు! అయితే జ్ఞానము మరియు ప్రత్యక్ష కర్మలో వ్యత్యాసముంది. చాలామంది పిల్లలు ఈ రెండింటి సమానతలో, తండ్రి సమానమైన ప్రత్యక్ష కర్మల రూపంలో బాగా కనిపించారు. చాలామంది పిల్లలు ఇప్పటికీ బాలకుల స్థితిలోనే ఉంటున్నారు కానీ యజమానత్వము యొక్క ఆ ఆత్మిక నషాలో, తండ్రి సమానంగా అయ్యే శక్తిశాలి స్థితిలో అప్పుడప్పుడు స్థితులవుతారు మరియు అప్పుడప్పుడు ఆ స్థితిలో స్థితి అయ్యే ప్రయత్నంలోనే సమయం గడిచిపోతుంది.
పిల్లలందరికీ తండ్రి సమానంగా అవ్వవలసిందే అన్న శ్రేష్ఠమైన లక్ష్యము ఉంది. లక్ష్యము శక్తిశాలిగా ఉంది. ఇప్పుడు లక్ష్యాన్ని సంకల్పము, మాట, కర్మ, సంబంధ-సంపర్కములోకి తీసుకురావాలి. ఇందులో వ్యత్యాసం వచ్చేస్తుంది. కొంతమంది పిల్లలు సంకల్పము వరకు సమాన స్థితిలో స్థితులవుతారు. కొందరు సంకల్పముతో పాటు మాటల వరకు కూడా వస్తారు, అప్పుడప్పుడు కర్మల వరకు కూడా వచ్చేస్తారు. కానీ ఎప్పుడైతే సంబంధ-సంపర్కంలోకి వస్తారో, సేవా సంబంధంలోకి వస్తారో, పరివార సంబంధంలోకి వస్తారో, ఈ సంబంధ-సంపర్కంలోకి వచ్చేటప్పుడు ఒక్కోసారి పర్సంటేజ్ తక్కువ అవుతుంది. తండ్రి సమానంగా అవ్వడమనగా ఒకే సమయంలో సంకల్పము, మాట, కర్మ, సంబంధము, అన్నింటిలోనూ తండ్రి సమానమైన స్థితిలో ఉండడం. కొందరు రెండింటిలో ఉంటారు, కొందరు మూడింటిలో ఉంటారు. కానీ ఏవైతే నాలుగు స్థితులు తెలిపామో, వాటిలో ఒకసారి ఒకలా, మరోసారి మరొకలా అవుతారు. బాప్‌దాదా అయితే పిల్లల పట్ల సదా అతి స్నేహీలుగా కూడా ఉన్నారు. స్నేహ స్వరూపమనగా కేవలం అవ్యక్తంలో ఉన్నవారిని వ్యక్త రూపంలో కలవడం కాదు. కానీ స్నేహ స్వరూపమనగా సమానంగా అవ్వడం. చాలామంది పిల్లలు బాప్‌దాదా నిర్మోహిగా అవుతున్నారని భావిస్తారు. కానీ ఇది నిర్మోహులుగా అవ్వడం కాదు. ఇది విశేషమైన స్నేహ స్వరూపము.
బహుకాలపు ప్రాప్తిని పొందే సమయము ఇప్పుడు లెక్క ప్రకారం చాలా తక్కువగా ఉంది కనుక బాప్‌దాదా పిల్లలకు సదా బహుకాలము కొరకు విశేషంగా, దృఢత యొక్క తపస్సు ద్వారా స్వయాన్ని తాపముతో దృఢంగా చేసుకునేందుకు, పరిపక్వంగా చేసుకునేందుకు ఈ విశేషమైన సమయాన్ని ఇస్తున్నారని బాప్‌దాదా మొదటే వినిపించారు. గోల్డెన్ జూబ్లీలో కూడా అందరూ మేము సమానంగా అవుతాము, విఘ్నవినాశకులుగా అవుతాము, సమాధాన స్వరూపులుగా అవుతాము అనే సంకల్పము చేశారు. ఈ ప్రతిజ్ఞలన్నీ తండ్రి వద్ద చిత్రగుప్తుని రూపంలో లెక్కలను తెలిపే ఖాతాలో నోట్ అయ్యి ఉన్నాయి. ఈరోజు కూడా ఎంతో మంది పిల్లలు దృఢ సంకల్పం చేశారు. సమర్పణ అవ్వడం అనగా స్వయాన్ని సర్వ ప్రాప్తులలో పరిపక్వంగా చేసుకోవడం. సమర్పణత అంటేనే అర్థం - సంకల్పాలు, మాటలు, కర్మలు మరియు సంబంధము, ఈ నాల్గింటిలోనూ తండ్రి సమానంగా అవ్వడం. ఏవైతే ఉత్తరాలు వ్రాసి ఇచ్చారో, ఆ ఉత్తరాలు మరియు సంకల్పాలు సూక్ష్మవతనంలో బాప్‌దాదా వద్ద సదా కొరకు రికార్డులో ఉండిపోయాయి. అందరి ఫైల్స్ అక్కడ వతనంలో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ చేసిన ఈ సంకల్పం అవినాశీగా అయ్యింది.
ఈ సంవత్సరము, పిల్లల యొక్క దృఢమైన తపస్సు ద్వారా ప్రతి సంకల్పాన్ని అమరంగా, అవినాశీగా చేసుకునేందుకు, దృఢమైన అభ్యాసము ద్వారా పదే-పదే స్వయంతో ఆత్మిక సంభాషణ చేసుకునేందుకు, రియలైజేషన్ చేసుకునేందుకు మరియు అవతార స్వరూపంగా అయ్యి కర్మల్లోకి వచ్చేందుకు, ఈ స్థితిని సదాకాలం కోసం ఇంకా దృఢంగా చేసుకునేందుకు, బాప్‌దాదా ఈ సమయాన్ని ఇస్తున్నారు. అలాగే విశేషంగా శుద్ధ సంకల్పాల శక్తితో జమ ఖాతాను ఇంకా పెంచుకోవాలి. శుద్ధ సంకల్పాల శక్తి యొక్క విశేషమైన అనుభవాన్ని ఇప్పుడింకా అంతర్ముఖులుగా అయి చేయాల్సిన అవసరము ఉంది. శుద్ధ సంకల్పాల శక్తి సహజంగా వ్యర్థ సంకల్పాలను సమాప్తం చేసి, ఇతరుల పట్ల కూడా శుభ భావన, శుభ కామనల స్వరూపంతో వారిని పరివర్తన చెయ్యగలరు. ఇప్పుడు ఈ శుద్ధ సంకల్పాల శక్తి యొక్క విశేషమైన అనుభవం సహజంగానే వ్యర్థ సంకల్పాలను సమాప్తం చేస్తుంది. కేవలం మీ వ్యర్థ సంకల్పాలనే కాదు, మీ శుద్ధ సంకల్పాలు, ఇతరుల పట్ల కూడా శుభ భావన, శుభ కామనల స్వరూపంతో వారిని పరివర్తన చెయ్యగలవు. ఇప్పుడు ఈ శుద్ధ సంకల్పాల శక్తి యొక్క స్టాకును స్వయం పట్ల కూడా జమ చేసుకునే అవసరము ఎంతో ఉంది. మురళీ వినాలి అన్న తపన అయితే చాలా బాగుంది. మురళీ అనగా ఖజానా. మురళీలోని ప్రతి పాయింటును శక్తి రూపంలో జమ చేసుకోవడం - ఇదే శుద్ధ సంకల్పాల శక్తిని పెంచుకోవడం. శక్తి రూపంలో ప్రతి సమయం కార్యంలో ఉపయోగించండి. ఇప్పుడు ఈ విశేషతపై విశేషమైన అటెన్షన్ పెట్టాలి. శుద్ధ సంకల్పాల శక్తి యొక్క మహత్వాన్ని ఇప్పుడు ఎంతగా అనుభవం చేస్తూ ఉంటారో, మనసా సేవ చేసేందుకు కూడా అంతే సహజ అనుభవీలుగా అవుతూ ఉంటారు. మొదట స్వయం పట్ల శుద్ధ సంకల్పాల శక్తి జమ అయ్యి ఉండాలి, దీనితోపాటు మీరందరూ తండ్రితో పాటు విశ్వ కళ్యాణకారి ఆత్మలు, విశ్వ పరివర్తక ఆత్మలుగా ఉన్నారు. కనుక విశ్వం పట్ల కూడా ఈ శుద్ధ సంకల్పాల శక్తి ద్వారా పరివర్తన చేసే కార్యము ఇంకా చాలా మిగిలి ఉంది. ఉదాహరణకు వర్తమాన సమయంలో బ్రహ్మా తండ్రి అవ్యక్త రూపధారిగా అయి శుద్ధ సంకల్పాల శక్తి ద్వారా మీ అందరి పాలన చేస్తున్నారు. సేవ వృద్ధి కోసం సహయోగిగా అయి ముందుకు తీసుకువెళ్తున్నారు. శుద్ధ సంకల్పాల శక్తి ద్వారా ఈ విశేషమైన సేవ నడుస్తూ ఉంది. కనుక ఇప్పుడు బ్రహ్మా తండ్రి సమానంగా ఈ విశేషతను మీలో పెంచుకునేందుకు తపస్సు రూపంలో అభ్యాసం చెయ్యాలి. తపస్సు అనగా దృఢతా సంపన్నమైన అభ్యాసము. సాధారణతను తపస్సు అని అనరు కనుక ఇప్పుడు తపస్సు కోసం సమయాన్ని ఇస్తున్నాము. ఇప్పుడే ఎందుకు ఇస్తున్నాము? ఎందుకంటే ఈ సమయంలో మీకు బహుకాలం కోసం జమ అవుతుంది. బాప్‌దాదా అందరికీ బహుకాలపు ప్రాప్తి చేయించేందుకు నిమిత్తంగా ఉన్నారు. బాప్‌దాదా పిల్లలందరినీ బహుకాలపు రాజ్య భాగ్యానికి అధికారులుగా చేయాలని ఆశిస్తున్నారు. బహుకాలపు సమయం ఇక కొద్దిగానే ఉంది కనుక ప్రతి విషయాన్ని తపస్సు రూపంలో అభ్యాసం చేసేందుకు ఈ విశేషమైన సమయాన్ని ఇస్తున్నారు ఎందుకంటే ఇక సమయం ఎటువంటిది వస్తుందంటే - మీరందరూ దాతలుగా, వరదాతలుగా అయి కొద్ది సమయంలోనే అనేకమందికి ఇవ్వాల్సి వస్తుంది. కనుక సర్వ ఖజానాల జమ ఖాతాను సంపన్నంగా చేసుకునేందుకు సమయాన్ని ఇస్తున్నారు.
రెండవ విషయము - విఘ్నవినాశకులుగా మరియు సమాధాన స్వరూపులుగా అవుతాము అన్న ప్రతిజ్ఞ చేసారు కనుక స్వయం పట్ల మరియు సర్వుల పట్ల కూడా విఘ్నవినాశకులుగా అయ్యేందుకు విశేషంగా దృఢ సంకల్పము మరియు దృఢ స్వరూపము రెండూ ఉండాలి. కేవలం సంకల్పమే కాదు స్వరూపం కూడా ఉండాలి. కనుక ఈ సంవత్సరం బాప్‌దాదా అదనపు ఛాన్స్ ఇస్తున్నారు. ఎవరైతే విఘ్నవినాశకులుగా అయ్యే విశేషమైన భాగ్యాన్ని తీసుకోవాలనుకుంటారో, వారు ఈ సంవత్సరంలో తీసుకోవచ్చు. ఈ సంవత్సరానికి విశేషమైన వరదానముంది. కానీ వరదానమును తీసుకునేందుకు విశేషంగా రెండు విషయాలపై అటెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది. మొదటిది - సదా తండ్రి సమానంగా ఇచ్చేవారిగా అవ్వాలి, తీసుకునే భావన పెట్టుకోకూడదు. గౌరవము లభిస్తే, స్నేహము లభిస్తే, అప్పుడు స్నేహీలుగా అవ్వడము, గౌరవం లభించినప్పుడు గౌరవం ఇవ్వడము, ఇలా కాదు. దాత సంతానంగా అయి నేను ఇవ్వాలి, తీసుకునే భావన పెట్టుకోకూడదు. శ్రేష్ఠ కర్మలు చేస్తూ రెండవ వైపు నుండి నాకు లభించాలి అనే భావన పెట్టుకోకూడదు. శ్రేష్ఠ కర్మల ఫలితం శ్రేష్ఠంగా ఉండనే ఉంటుంది. ఈ జ్ఞానమైతే మీకు తెలుసు, కానీ చేసే సమయంలో ఈ సంకల్పాన్ని పెట్టుకోకూడదు. కనుక మొదటిది ఏమిటంటే, వరదానము తీసుకునేందుకు పాత్రులుగా అవ్వాలంటే సదా దాతలుగా ఉండాలి మరియు రెండవది - విఘ్నవినాశకులుగా అవ్వాలి, కనుక ఇముడ్చుకునే శక్తిపై సదా విశేషమైన రూపంలో అటెన్షన్ ఉంచాలి. స్వయం పట్ల కూడా ఇముడ్చుకునే శక్తి అవసరము. మీరు సాగరుని పిల్లలు, సాగరము యొక్క విశేషతయే ఇముడ్చుకోవడం. ఎవరిలోనైతే ఇముడ్చుకునే శక్తి ఉంటుందో, వారికే శుభ భావన, కళ్యాణ కామన ఉంటుంది కనుక దాతలుగా అవ్వండి, ఇముడ్చుకునే శక్తి స్వరూప సాగరులుగా అవ్వండి. ఈ రెండు విశేషతలను సదా కర్మల వరకు తీసుకురావాలి. చాలాసార్లు చాలామంది పిల్లలు - మేము ఇదే చేయాలని అనుకున్నాము కానీ చేసేంతలో మారిపోయింది అని అంటారు. కనుక ఈ సంవత్సరం నాలుగు విషయాలలోనూ ఒకే సమయంలో సమానత ఉండే విశేషమైన అభ్యాసము చేయాలి. అర్థమయిందా! కనుక ఒక విషయము - ఖజానాలను జమ చేసుకొని, దాతగా అయ్యి, ఇచ్చే సంస్కారాన్ని సహజ రూపంలో ధారణ చేసేందుకు సమయాన్ని ఇస్తున్నాము. కనుక విఘ్నవినాశకులుగా అయ్యి ఇతరులను కూడా అలా తయారు చేసేందుకు, సదాకాలానికి మీ నంబరును నిశ్చితం చేసుకునే అవకాశమిస్తున్నాము. ఏమి జరిగినా కానీ స్వయం తపస్సు చేయండి మరియు ఇతరుల విఘ్నాలను సమాప్తం చేసేందుకు సహయోగులుగా అవ్వండి. స్వయం ఎంతగా వంగాల్సి వచ్చినా కానీ ఇలా వంగడం అనగా సదా కొరకు ఊయలలో ఊగడం. ఎలాగైతే శ్రీకృష్ణుడిని ఎంతో ప్రేమగా ఊపుతూ ఉంటారో, అలా తండ్రి ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని తమ ఒడి అనే ఊయలలో ఊపుతారు, తర్వాత భవిష్యత్తులో రత్నజడిత ఊయలలో ఊగుతారు, అంతేకాక భక్తిలో పూజ్యులుగా అయ్యి ఊయలలో ఊగుతారు. కనుక వంగడం, మరణించడము అన్నది మహానత. నేనెందుకు వంగాలి, వీళ్ళు వంగాలి, ఇందులో స్వయాన్ని తక్కువగా భావించకండి. ఇలా వంగడం అన్నది మహానత. ఇలా మరణించడం, మరణించడం కాదు, అవినాశీ ప్రాప్తులలో జీవించడం కనుక సదా విఘ్న వినాశకులుగా అవ్వాలి మరియు ఇతరులను కూడా తయారుచెయ్యాలి. ఇందులో ఫస్ట్ డివిజన్‌లోకి వచ్చే అవకాశాన్ని ఎవరు కావాలంటే వారు తీసుకోవచ్చు. ఈ విశేషమైన అవకాశాన్ని తీసుకునే సమయం యొక్క మహత్వాన్ని బాప్‌దాదా వినిపిస్తున్నారు. కనుక సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని తపస్సు చేయండి.
మూడవ విషయం - సమయానుసారంగా వాయుమండలంలో అశాంతి మరియు అలజడి ఎంతగా పెరుగుతూ వెళ్తున్నాయో దాని అనుసారంగా బుద్ధి రూపి లైను చాలా స్పష్టంగా ఉండాలి ఎందుకంటే సమయానుసారంగా టచింగ్ మరియు క్యాచింగ్ ఈ రెండు శక్తుల అవసరము ఉంది. ఒకటేమో బాప్‌దాదా ఇచ్చే డైరెక్షన్లను (సూచనలు) బుద్ధి ద్వారా క్యాచ్ చెయ్యగలగాలి. ఒకవేళ లైను క్లియర్‌గా లేకపోతే తండ్రి ఇచ్చే డైరెక్షన్లో మన్మతము కూడా మిక్స్ అవుతుంది. ఇలా మిక్స్ అయిన కారణంగా సమయానికి మోసపోగలరు. ఎంతగా బుద్ధి స్పష్టంగా ఉంటుందో, తండ్రి ఇచ్చే డైరెక్షన్‌ను అంతే స్పష్టంగా క్యాచ్ చెయ్యగలరు. మరియు బుద్ధి లైను ఎంతగా క్లియర్‌గా ఉంటుందో, అంతగా స్వ ఉన్నతి పట్ల, సేవా వృద్ధి పట్ల మరియు సర్వ ఆత్మల పట్ల దాతగా అయ్యి, ఇచ్చే శక్తులు సహజంగా పెరుగుతూ ఉంటాయి మరియు ఈ సమయంలో ఈ ఆత్మ పట్ల సహజమైన సేవా సాధనము లేక స్వ ఉన్నతికి యథార్థమైన సాధనము ఇదే అని టచింగ్ అవుతుంది. కనుక వర్తమాన సమయ ప్రమాణంగా ఈ రెండు శక్తులు చాలా అవసరము. వీటిని పెంచుకునేందుకు ఏక్నామీ (ఒక్కరి నామము) మరియు ఎకానమీ (పొదుపు) కలవారిగా అవ్వండి. ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు. ఇతరుల పట్ల ఆకర్షణ వేరే విషయము. ఆకర్షణ కలగడం అనేది ఎలాగో తప్పే కానీ ఇతరుల స్వభావాల ప్రభావము మీ స్థితిని అలజడిలోకి తీసుకొస్తుంది. ఇతరుల సంస్కారము బుద్ధిని ఘర్షణలోకి తీసుకొస్తుంది. ఆ సమయము బుద్ధిలో బాబా ఉన్నారా లేక సంస్కారముందా? ఆకర్షణ రూపంలో బుద్ధిని ప్రభావితం చేసినా కానీ, ఘర్షణ రూపంలో బుద్ధిని ప్రభావితం చేసినా కానీ బుద్ధి లైను సదా క్లియర్‌గా ఉండాలి. దీనినే ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అని అంటారు. ఏక్నామీ, ఎకానమీ అంటే ఏమిటి? కేవలం స్థూల ధనాన్ని పొదుపు చేయడాన్ని ఎకానమీ అని అనరు. అది కూడా అవసరమే కానీ సమయం కూడా ధనమే, సంకల్పము కూడా ధనమే, శక్తులు కూడా ధనమే, వీటన్నిటినీ పొదుపు చేయాలి. వ్యర్థంగా పోగొట్టుకోకండి. ఎకానమీ చేయడమనగా జమ ఖాతాను పెంచుకోవడం. ఏక్నామీ మరియు ఎకానమీ సంస్కారం కలవారు ఈ రెండు శక్తులను (టచింగ్ మరియు క్యాచింగ్ పవర్) అనుభవం చెయ్యగలరు. ఈ అనుభవాన్ని వినాశన సమయంలో చెయ్యలేరు, ఈ అభ్యాసము ఇప్పటి నుండే చెయ్యాలి. ఈ అభ్యాసము కారణంగా సమయానికి చివర్లో శ్రేష్ఠ మతమును మరియు గతిని పొందగలరు. ఉదాహరణకు ఇప్పుడు వినాశనానికి ఇంకా కొంత సమయం ఉందనుకోండి, సరే, ఒకవేళ 10 సంవత్సరాలని అనుకుంటే, ఆ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ పురుషార్థము చెయ్యలేరు. ఎంత శ్రమ చేసినా సరే, చెయ్యలేరు. బలహీనంగా అయిపోతారు. తర్వాత అంతిమ సమయం యుద్ధంలో గడిచిపోతుంది. సఫలతలో కాదు. త్రేతాయుగం వారిగా అయితే అవ్వకూడదు కదా. శ్రమ అనగా విల్లు-బాణము. సదా ప్రేమలో ఉండడం, సంతోషంలో ఉండడం అనగా మురళీధరులుగా అవ్వడము, సూర్యవంశీయులుగా అవ్వడము. మురళీ నాట్యం చేయిస్తుంది మరియు విల్లు-బాణము గురి చూడడములో శ్రమ చేయిస్తాయి. కనుక విల్లు ధరించేవారిగా కాకుండా మురళీధరులుగా అవ్వాలి, ఇక చివర్లో మళ్ళీ కొంత అదనపు సమయం ఇవ్వండి, అవకాశమివ్వండి, కృప చూపించండి అని ఎవ్వరూ ఫిర్యాదు చెయ్యకండి. అలా జరగదు కనుక ముందు నుండే వినిపిస్తున్నాము. వెనుక వచ్చినా లేక ముందు వచ్చినా సమయ ప్రమాణంగా అందరూ అంతిమ స్థితికి చేరుకునే సమయము. కనుక ఇలా తీవ్ర వేగంతో నడవాల్సి వస్తుంది. అర్థమయిందా. అచ్ఛా!
నాలుగవ విషయం - నలువైపులా దేశంలో అయినా సరే, విదేశాలలో అయినా సరే ఇలాంటి చిన్నచిన్న స్థానాలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుత సమయానుసారంగా అవి సాధారణ స్థానాలు కావచ్చు, కానీ మాలామాల్ అయిన పిల్లలు ఉన్నారు. కాబట్టి నిమిత్తమైన పిల్లలు తమ వైపు చక్కర్లు కొట్టాలని చాలా కాలం నుండి ఆశగా ఎదురుచూస్తున్న వారు కూడా ఎంతోమంది ఉన్నారు. కానీ వారి ఆశ నెరవేరడం లేదు. ఆ ఆశను కూడా బాప్‌దాదా పూర్తి చేస్తున్నారు. విశేష మహారథి పిల్లలు ప్రణాళిక (ప్లాన్) తయారుచేసుకుని, నలువైపులా ఆశా దీపాలను సిద్ధం చేసుకుని ఉన్నవారి వద్దకు వెళ్ళి ఆ దీపాలను వెలిగించాలి. ఆశా దీపాలను వెలిగించాల్సి ఉంది కాబట్టే బాప్‌దాదా విశేష సమయాన్ని ఇస్తున్నారు. మహారథులందరూ కలిసి వేర్వేరు ప్రాంతాలను (ఏరియాలను) పంచుకుని, సమయ కారణంగా ఇప్పటివరకు వెళ్ళలేకపోయిన గ్రామాల పిల్లల ఆశను పూర్తి చేయాలి. ముఖ్య స్థానాలకు అయితే ముఖ్య కార్యక్రమాల కారణంగా వెళ్తూనే ఉంటారు; కానీ చిన్నచిన్న స్థానాలలో వారి యథాశక్తి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, అవే పెద్ద కార్యక్రమాలు. వారి భావనే అన్నింటికంటే పెద్ద ఫంక్షన్. బాప్‌దాదా వద్ద ఇలాంటి ఎంతోమంది పిల్లల అర్జీలు చాలా కాలం నుండి ఫైలులో పడి ఉన్నాయి. ఈ ఫైలును కూడా బాప్‌దాదా పూర్తి చేయాలనుకుంటున్నారు. మహారథి పిల్లలకు చక్రవర్తులుగా మారేందుకు విశేష అవకాశం ఇస్తున్నారు. అంతేతప్ప ‘అన్ని చోట్లకు దాదీయే వెళ్ళాలి’ అని అనకూడదు. కాదు, ఒకవేళ ఒక్క దాదీయే అన్ని వైపులా వెళ్ళాలంటే అప్పుడు 5 సంవత్సరాలు పడుతుంది. మరి 5 సంవత్సరాలు బాప్‌దాదా రాకపోవడం మీకు సమ్మతమేనా? బాప్‌దాదా సీజన్ ఇక్కడ జరుగుతుండగా దాదీ చక్కర్లపై వెళ్ళడం కూడా బాగుండదు. అందుకే మహారథుల ప్రోగ్రామ్ రూపొందించండి. ఎక్కడికైతే వెళ్ళలేదో అక్కడికి వెళ్ళేలా ఏర్పాటు చేయండి; మరియు విశేషంగా ఈ సంవత్సరం ఎక్కడికి వెళ్ళినా సరే, ఒక రోజు బయటి వారి సేవ, ఒక రోజు బ్రాహ్మణుల తపస్సు కార్యక్రమం – ఈ రెండు కార్యక్రమాలు తప్పకుండా ఉండాలి. కేవలం ఫంక్షన్‌కు వెళ్ళి, హడావుడి చేసి తిరిగి రావడం కాదు. వీలైనంత వరకు బ్రాహ్మణులకు విశేష రిఫ్రెష్మెంట్ కలిగేలా ప్రోగ్రామ్ తయారుచేయండి. మరియు దాంతోపాటు వి.ఐ.పి.ల సంపర్కం కూడా జరిగేలా కార్యక్రమం ఉండాలి. కానీ షార్ట్ ప్రోగ్రామ్ అయి ఉండాలి. ముందు నుండే బ్రాహ్మణులకు కూడా విశేష ఉల్లాస-ఉత్సాహాల శక్తి లభించేలా, నిర్విఘ్నంగా మారేందుకు ధైర్యం, ఉత్సాహం నిండేలా ప్రోగ్రామ్ రూపొందించండి. కాబట్టి నలువైపులా చక్కర్లు కొట్టే ప్రోగ్రామ్ తయారుచేసేందుకు కూడా విశేష సమయాన్ని ఇస్తున్నాము. ఎందుకంటే సమయానుసారంగా పరిస్థితులు కూడా మారుతున్నాయి మరియు మారుతూనే ఉంటాయి. అందుకే ఫైలును సమాప్తం చేయాలి. కాబట్టి బాప్‌దాదా విశేషంగా ఏమి చూడాలనుకుంటున్నారో, దానిని మళ్ళీ రివైజ్ చేస్తున్నారు.
1. సదా స్వయాన్ని, సర్వులను సంతుష్టపరిచే ‘సంతుష్ట మణులు’గా మారాలి.
2. స్వయం పురుషార్థం పట్ల లేదా సేవ పట్ల లేదా సంగఠనలో ఒకరి పట్ల ఒకరు సదా విశాల బుద్ధిని కలిగి ఉండాలి. హద్దు బుద్ధిలోకి రాకూడదు. ‘నేను ఇది కోరుకుంటున్నాను, నా ఆలోచన అయితే ఇది’ అని అనడం విశాలత కాదు. ఎక్కడైతే మెజారిటీ వెరిఫై చేస్తారో, నిమిత్తమైన వారు వెరిఫై చేస్తారో, అది – ‘విశాల బుద్ధి’. ఎక్కడ మెజారిటీ ఉంటుందో అక్కడ నేను ఉండాలి, ఇది సంగఠన శక్తిని పెంచడం. ఇందులో ‘నా ఆలోచన చాలా గొప్పది’ అని గొప్పలు చూపించకండి. అది ఎంత గొప్పదైనా సరే, ఎక్కడైతే సంగఠన విచ్ఛిన్నమవుతుందో, ఆ గొప్పది కూడా సాధారణమైపోతుంది. సంగఠన శక్తిని పెంచే విశాలత ఉండాలి. ఇందులో కొంత మీ ఆలోచనను త్యాగం చేయాల్సి వచ్చినా, ఆ త్యాగంలోనే భాగ్యం ఉంది. ఒకవేళ ఇక్కడ సంగఠన నుండి వేరుగా ఉంటే, అక్కడ విశ్వ రాయల్ ఫ్యామిలీలోకి రాలేము అనే విషయాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. ఇప్పటి సంగఠనే 21 జన్మల సమీప సంబంధంలోకి తీసుకువస్తుంది; అందుకే సంగఠన శక్తిని పెంచడం – ఇదే బ్రాహ్మణ జీవితపు మొట్టమొదటి శ్రేష్ఠ కార్యం. ఇందులోనే సఫలత ఉంది. కనుక ఇందులో విశాల బుద్ధి కలవారిగా మారండి. అనంతమైన వారిగా కండి, కేవలం మీ వైపుకే దుప్పటిని లాక్కోకండి. ఇతరులకు కూడా ఇస్తే వారు మీకు ఇస్తారు. లేకపోతే వారూ కొద్దికొద్దిగా ఇచ్చి ఆ తర్వాత పూర్తిగా లాగేసుకుంటారు.
3. మూడవ విషయం – ‘ప్రసన్నత’. సంతుష్టత మరియు విశాలత యొక్క ప్రత్యక్ష స్వరూపం ప్రతి బ్రాహ్మణ ఆత్మ ముఖంపై, మనస్సుపై ప్రసన్నత అనే గుర్తుగా కనిపించాలి. ప్రశ్నచిత్తులుగా కాదు, ప్రసన్నచిత్తులుగా ఉండాలి. ముఖంపై సంకల్పము మరియు స్వరూపం యొక్క అవినాశి ప్రసన్నత ఉండాలి. కాబట్టి ‘సంతుష్టత, విశాలత మరియు ప్రసన్నత’ – ఇదే 18వ అధ్యాయపు సమాప్తి. అర్థమైందా! ఇప్పుడు ఈ ఫలితం కోసం తపస్సు చేయండి. ఒకరినొకరు చూసుకుంటూ ‘వీరు చేయట్లేదు కదా మరి నేనెందుకు చేయాలి’ అని అనుకోకండి. కాదు, నేను చేసి చూపించాలి. నేను నిమిత్తమై వాతావరణంలో వైబ్రేషన్స్ వ్యాపింపజేయాలి. అర్థమైందా!
దీని భావం తండ్రికి స్నేహం లేదని కాదు. మరింత విశేష స్నేహం ఉంది, మరియు విశేషంగా బాప్‌దాదా జనవరి 18న వచ్చి సగం ఫలితాన్ని వినిపిస్తారు. సీజన్ ప్రారంభం కాదు కానీ జనవరి 18న మురళి వినిపించడానికి వస్తారు. 18 మరియు 21 ఈ రెండు తేదీలు విశేషమైనవి. ఈ అవ్యక్త దినోత్సపు స్మృతిచిహ్నాన్ని అవ్యక్త బాప్‌దాదా జరుపుకోవడానికి వస్తారు. విడివిడిగా మిలనము ఉండదు. కేవలం మురళి వినిపిస్తారు, టోలీ ఇస్తారు. ఎందుకంటే ఇది సాకార వతనం కదా. హద్దు ప్రపంచంలో నివసించడానికి, నడవడానికి కూడా హద్దు ఉంచాల్సి ఉంటుంది. తండ్రి ఎలాగైతే దేహ బంధనంలోకి వస్తారో, మీరు కూడా నియమాల బంధనంలోకి రావాల్సి ఉంటుంది. సూక్ష్మవతనంలో అన్నీ నిర్బంధనాలు. భట్టీలు మొదలైనవి ఇక్కడైనా ఉంచండి లేదా అక్కడికి వెళ్ళి అయినా చేయించండి. ఆ స్థానాన్ని బట్టి బాప్‌దాదా స్వాతంత్ర్యం ఇస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో రిఫ్రెష్ అయ్యేలా ప్రోగ్రామ్ తయారుచేయాలి. మధుబన్ వాతావరణం ప్రత్యేకమైనది అయినప్పటికీ, మహారథులు ఎక్కడికి వెళ్ళినా అక్కడ కూడా మధుబన్ వాతావరణాన్ని సృష్టిస్తారు. జంగల్‌ను (అడవిని) మంగళంగా మార్చగలిగినప్పుడు, సెంటర్‌ను మధుబన్గా మార్చలేరా! మధుబన్కు అవినాశి మహత్తు ఉంది, అది ఎన్నడూ తగ్గదు. ఎందుకంటే ఇక్కడ మహాన్ అయిన ఆత్మ మరియు పరమాత్మల చాలాకాలపు శక్తివంతమైన వైబ్రేషన్స్ అణువణువునా నిండి ఉన్నాయి. అణువణువులో పరమాత్మ లేరు కానీ వైబ్రేషన్స్ నిండి ఉన్నాయి. మధుబన్ మహత్తు మరింతగా పెరుగుతూ వెళ్తుంది. అమెరికాలోని వైట్ హౌస్ ఎలాగైతే ప్రసిద్ధి చెందిందో, అలాగే ఈ విశ్వపు పీస్ హౌస్ – మధుబన్ ప్రసిద్ధి చెందుతుంది. అందరి దృష్టి ఈ వైపుకు వెళ్తుంది. చేరుకోలేకపోయినా అటెన్షన్ అయితే తప్పకుండా వెళ్తుంది. ఆకర్షణ కలుగుతుంది, బుద్ధి ద్వారా కూడా అనుభవం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి సమయంలో ఈ శక్తులు పనికొస్తాయి. వారికి సంకల్ప శక్తి సహకారాన్ని అందించి, సంకల్ప శక్తి అనే విమానం ద్వారా మధుబన్కు చేర్చగలరు. మీ వద్ద ఈ విమానాన్ని అడుగుతారు. అనేకులకు పరోపకారం చేయగలిగేంతటి శుభ శ్రేష్ఠ సంకల్పాల శక్తిని జమ చేసుకోండి. చాలాకాలపు వరదానం యొక్క పూర్తి ప్రయోజనాన్ని పొందండి. అర్థమైందా!
ఇది లాస్ట్ ఛాన్స్ కాదు, ఫాస్ట్ ఛాన్స్. ఏ విషయాన్నయినా సరే స్వార్థం లేకుండా, మనస్ఫూర్తిగా త్యాగం చేసేవారికి ఎంతో భాగ్యం ఉంటుంది. స్వార్థంతో చేసే త్యాగానికి అంత భాగ్యం ఉండదు. నిస్వార్థ త్యాగం యొక్క భాగ్యం చాలా గొప్పది. బాప్‌దాదా అయితే పిల్లలందరినీ ఒకరి కంటే ఒకరిని ముందుకు వెళ్తున్న వారిగా చూస్తారు. నంబర్లు తెలిసినప్పటికీ ప్రస్తుతం నంబర్‌వారీగా చూడటం లేదు. ఇప్పుడు అందరినీ నంబర్‌వన్ దృష్టితోనే చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ లాస్ట్ నుండి ఫస్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ సమయం కొద్దిగానే ఉంది. బాప్‌దాదాకు పిల్లలందరి పట్ల ఇదే శ్రేష్ఠ భావన మరియు శ్రేష్ఠ కామన ఉంటాయి. సదా ఫాస్ట్ మరియు ఫస్ట్‌గా చూస్తారు. వినిపించాము కదా – ఇంకా విజిల్ మోగలేదు. అందరూ కుర్చీ కోసం పరుగెడుతున్నారు. ఎప్పుడైతే విజిల్ మోగుతుందో అప్పుడు నంబర్‌వారీగా చేస్తారు. బాప్‌దాదా అందరికీ స్నేహ సంపన్నమైన స్వాగతం పలుకుతున్నారు. అచ్ఛా!
నలువైపులా ఉన్న స్నేహీ పిల్లలందరికీ, సదా హృదయ సింహాసనాధికారి పిల్లలకు, సదా సంతుష్టత యొక్క మెరుపును చూపించే పిల్లలకు, సదా ప్రసన్నతా పర్సనాలిటీతో ఉండే పిల్లలకు, సదా అనంతమైన విశాల హృదయాన్ని, అనంతమైన విశాల బుద్ధిని ధారణ చేసే విశాలమైన ఆత్మలకు బాప్‌దాదా యొక్క స్నేహ సంపన్న ప్రియస్మృతులు మరియు నమస్తే.
విదేశీ సేవలో ఉపస్థితమైన టీచర్లతో:-
నిమిత్త సేవాధారి పిల్లలను బాప్‌దాదా సదా ‘సమాన భవ’ అనే వరదానంతో ముందుకు నడిపిస్తూ ఉంటారు. బాప్‌దాదా పాండవులైనా, శక్తులైనా, సేవకు నిమిత్తమైన వారందరినీ విశేషమైన పదమా పదమ భాగ్యవాన్ శ్రేష్ఠ ఆత్మలుగా భావిస్తారు. సేవ యొక్క ప్రత్యక్ష ఫలం సంతోషం మరియు శక్తి – దీని విశేష అనుభవాన్ని ఎలాగూ చేస్తున్నారు. ఇప్పుడు ఎంతగా స్వయం శక్తివంతమైన లైట్ హౌస్, మైట్ హౌస్‌గా మారి సేవ చేస్తారో, అంత త్వరగా నలువైపులా ప్రత్యక్షత యొక్క జెండాను ఎగురవేస్తారు. ప్రతి ఒక్క నిమిత్త సేవాధారి విశేష సేవా సఫలత కొరకు రెండు విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి – మొదటి విషయం సదా సంస్కారాలను కలుపుకునే ఐక్యత (యూనిటీ), ప్రతి స్థానం నుండి ఈ విశేషత కనిపించాలి. రెండవది సదా ప్రతి నిమిత్త సేవాధారి మొదట తమకు తాము ఈ రెండు సర్టిఫికేట్లు ఇచ్చుకోవాలి – ఒకటి ‘ఏకత’, రెండవది ‘సంతుష్టత’. సంస్కారాలు భిన్నభిన్నంగా ఉంటాయి మరియు ఉంటాయి కూడా; కానీ సంస్కారాల ఘర్షణ లేదా పక్కకు తప్పుకుని (కినారా చేసి) స్వయాన్ని సురక్షితంగా (సేఫ్‌గా) ఉంచుకోవడం అనేది మనపైనే ఆధారపడి ఉంది. ఏదైనా జరిగినప్పుడు ఒకరి సంస్కారం అలా ఉంటే, రెండవ వారు చప్పట్లు కొట్టకూడదు (ప్రోత్సహించకూడదు). వారు మారినా మారకపోయినా, మీరైతే మారగలరు కదా! ప్రతి ఒక్కరూ తమను తాము మార్చుకుంటే, ఇముడ్చుకునే శక్తిని ధారణ చేస్తే, రెండవ వారి సంస్కారం కూడా తప్పకుండా శీతలమైపోతుంది. కాబట్టి సదా ఒకరికొకరు స్నేహ భావనతో, శ్రేష్ఠత భావనతో సంపర్కంలోకి రండి; ఎందుకంటే నిమిత్త సేవాధారులు – తండ్రి ముఖానికి అద్దం (దర్పణం). కాబట్టి మీ ప్రాక్టికల్ జీవితమే తండ్రి ముఖాన్ని చూపించే అద్దంగా మారిపోతుంది. అందుకే సదా ఎలాంటి జీవితమనే అద్దంగా ఉండాలంటే – అందులో తండ్రి ఎలా ఉన్నారో అచ్చం అలాగే కనిపించాలి. ఇక శ్రమ చాలా బాగా చేస్తున్నారు, ధైర్యమూ బాగుంది. సేవా వృద్ధి పట్ల ఉత్సాహం కూడా చాలా బాగుంది. అందుకే విస్తరణను పొందుతున్నారు. సేవ అయితే బాగుంది, ఇప్పుడు కేవలం తండ్రిని ప్రత్యక్షం చేయడానికి ప్రత్యక్ష జీవితపు నిదర్శనాన్ని సదా చూపించండి. తద్వారా అందరూ ఒకే స్వరంతో ‘వీరు జ్ఞాన ధారణలలో అయితే ఒకటిగా ఉన్నారు, కానీ సంస్కారాలను కలుపుకోవడంలో కూడా నంబర్‌వన్‌గా ఉన్నారు’ అని పలకాలి. ఇండియా టీచర్ వేరు, ఫారిన్ టీచర్ వేరు అని కూడా కాదు; అందరూ ఒక్కటే. కేవలం సేవకు నిమిత్తమయ్యారు, స్థాపనలో సహయోగులుగా మారారు మరియు ఇప్పటికీ సహకారం అందిస్తున్నారు, అందువల్ల స్వతహాగానే అందరిలో విశేష పాత్ర పోషించాల్సి వస్తుంది. నిజానికి బాప్‌దాదా మరియు నిమిత్త ఆత్మల వద్ద విదేశీ లేదా స్వదేశీ అనే భేదం ఏమీ లేదు. ఎక్కడ ఎవరి సేవా విశేషత ఉంటే, వారు ఎవరైనా సరే, అక్కడ వారి విశేషత నుండి ప్రయోజనం పొందాల్సి ఉంటుంది. ఇక ఒకరికొకరు గౌరవం (రిగార్డ్) ఇచ్చుకోవడం కూడా బ్రాహ్మణ కుల మర్యాద. స్నేహం తీసుకోవడం మరియు రిగార్డ్ ఇవ్వడం. విశేషతకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది తప్ప వ్యక్తికి కాదు. బాప్‌దాదాకు వెనువెంటనే వచ్చేవారు మరింత విశేష స్నేహానికి పాత్రులు. చిన్న పిల్లలు ఉన్నప్పుడు వారికి అదనపు (ఎక్స్ట్రా) ప్రేమ ఇస్తారు కదా. మీరైతే చిన్నవారు కారు, పెద్దవారే; అయినప్పటికీ బాప్‌దాదా వద్ద సేవాధారుల పట్ల సదా గౌరవం ఉంది, ఎందుకంటే సహచరులు (సాథీ) కదా! ఒకవేళ మీరు సేవకు నిమిత్తం కాకపోతే తండ్రిని ఎవరు తెలుసుకునేవారు! బాప్‌దాదా మీలాంటి రైట్ హ్యాండ్స్ లేకుండా స్థాపన చేయలేరు. అందుకే చూడండి, దూరదూరాల నుండి ఎంచుకుని రైట్ హ్యాండ్స్‌గా చేసుకున్నారు. అందుకే బ్రహ్మ భుజాలు అని గాయనం చేయబడింది. మరి మీరందరూ రైట్ హ్యాండ్సే కదా? లెఫ్ట్ హ్యాండ్ కాదు కదా! లెఫ్ట్ హ్యాండ్ అంటే బాప్‌దాదా ఏమంటారంటే పనికిరాని సరుకు (పఛడ్ మాల్). రైట్ హ్యాండ్ అనగా సదా న్యాయబద్ధమైన (రైటియస్) కార్యాలు చేసేవారు, సదా తమ హక్కు, అధికారం యొక్క ఆత్మిక నషాలో ఉండేవారు. అలాగే ఉన్నారు కదా. ఏది ఏమైనా బాప్‌దాదాకు ఇష్టమైనవారు, కేవలం ఇదే సంతోషంలో ఉండండి. మంచిది, బాప్‌దాదా చూస్తున్నారు - చిన్నచిన్న వారు కూడా చక్కటి అద్భుతాలు (కమాల్) చేశారు. స్థితిలో పెద్దవారు, స్థితిలో చిన్నవారు కారు. అయినా త్యాగం అయితే తక్కువేమీ చేయలేదు! త్యాగానికి శుభాకాంక్షలు. అందుకే బాప్‌దాదా డబల్ విదేశీ, డబల్ భాగ్యవాన్, డబల్ కిరీటధారి అని అన్నీ డబల్ అంటారు. కాబట్టి సర్టిఫికేట్ కూడా డబల్ కదా. అచ్ఛా, డబల్ విదేశీయులు 108 మాలలో ఎంతమంది వస్తారు? అందరూ వస్తే డబల్ మాల చేయాల్సి వస్తుంది. ఒక జంట పూసకు బదులుగా అన్నీ జంట పూసలే తయారుచేయాల్సి వస్తుంది. అది భక్తిలోని 108; మీరు సిద్ధమైతే బాప్‌దాదా జంట పూసల మాలనే తయారుచేస్తారు, దీనికి పరిమితి (లిమిట్) ఫిక్స్ కాలేదు, ఇంకా పెరగవచ్చు. ఇవి కేవలం నంబర్లు చూపించబడ్డాయి. అందుకే 108 అనే హద్దు పెట్టుకోకండి, రేసు చేయండి. అది భక్తి మాల, ఇది ప్రాక్టికల్ మాల. ఇప్పుడు ఈ సంవత్సరం మేకప్ చేసుకోవడానికి ఇచ్చారు కాబట్టి జంప్ చేయండి. మాలలోని నంబర్లు మారవచ్చు, అందులో ఆశ్చర్యమేమీ లేదు. అచ్ఛా, ఇప్పుడు ఒక సంవత్సరం పాటు ఎవరూ సమస్య స్వరూపంగా మారము, సమాధాన స్వరూపంగా ఉంటాము అనే ఈ రికార్డును చూపించండి. ఆ తర్వాత భట్టీలు చేయిస్తాము, సమస్యలలో సమయం వృథా చేయము. భారతదేశంలో మొదట సేవ ప్రారంభమైనప్పుడు పరీక్షించడానికి, సెట్ చేయడానికి సమయం పట్టింది. ఇప్పుడు అర్థం చేసుకున్నారు కాబట్టి సహజమైపోయింది. ఎప్పుడైనా ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు ఆ సమయంలో బుద్ధి లైన్ క్లియర్‌గా ఉండాలి; అప్పుడు దీనిని ఏ విధి ద్వారా సరిచేయాలి అనే టచింగ్ వస్తుంది. కేవలం ఆ సమయంలో స్వయం కంగారుపడకండి. స్వయం శక్తి రూపంలో ఉంటే రెండవ వారు స్వతహాగానే తేలికైపోతారు. వారి దాడి జరగలేదు. సదా సురక్షితంగా ఉంటారు. అయినప్పటికీ ఒకరికొకరు సమీపంగా ఉండండి, అనుభవజ్ఞులైన వారి నుండి సలహాలు కూడా తీసుకోవచ్చు. ఒక పని తప్పకుండా చేయండి - సెంటర్లో ఉండేవారందరూ రోజంతటిలో ఒకసారి పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం (మాట్లాడుకోవడం - లేన్-దేన్) తప్పక చేయండి. లేకపోతే ఒకరు ఒకవైపు, మరొకరు ఇంకోవైపు ఉంటారు. దానివల్ల కుటుంబ ప్రేమ అనుభూతి కలగదు. మరియు స్వయంలో ఆ స్నేహ శక్తి లేకపోతే ఇతరులను కూడా తండ్రి స్నేహీలుగా తయారుచేయలేరు. అందుకే ఒకరినొకరు తప్పకుండా అడగండి - ఏమిటి, ఎలా ఉన్నారు అని. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా, మనస్సు బాధ ఉన్నా, శరీర బాధ ఉన్నా, అడగడం వల్ల ‘మాకూ ఒకరు ఉన్నారు’ అని వారు భావిస్తారు. ఏదైనా సేవా ప్లాన్ తయారుచేసినా ఇద్దరు ముగ్గురు కలిసి, చిన్నవారైనా సరే, వారితో కూడా ‘హా జీ’ అనిపిస్తే వారు కూడా సంతోషిస్తారు. ‘ఇందులో నా చేయి కూడా ఉంది’ అని భావిస్తారు; మరియు విశేషంగా సర్వీసబుల్ సలహాలు ఇచ్చేవారితో కూడా తప్పకుండా మీటింగ్ చేయాలి, ఎందుకంటే వారి సహకారం లేకుండా మీరైనా ఏం చేయగలరు! స్నేహము మరియు శక్తి యొక్క బ్యాలెన్స్ ఉంచుతూ హ్యాండిల్ చేయండి మరియు ముందుకు సాగండి. అచ్ఛా!
*** ఓంశాంతి ***
