“మనసా శక్తి మరియు నిర్భయతా శక్తి”
ఈరోజు వృక్షపతి తన నూతన వృక్షానికి పునాది అయిన పిల్లలను చూస్తున్నారు. వృక్షపతి తన వృక్షం యొక్క కాండాన్ని చూస్తున్నారు. వృక్షపతి పాలనలో పాలింపబడిన శ్రేష్ఠమైన ఫలస్వరూప పిల్లలందరినీ చూస్తున్నారు. ఆదిదేవ్ తమ ఆదిరత్నాలను చూస్తున్నారు. ప్రతి ఒక్క రత్నం యొక్క మహానత, విశేషత ఎవరిది వారిదే. కానీ అందరూ కొత్త రచనకు నిమిత్తంగా అయిన విశేష ఆత్మలే ఎందుకంటే తండ్రిని గుర్తించడంలో, తండ్రి కార్యంలో సహయోగులుగా అవ్వడంలో నిమిత్తంగా అయ్యారు మరియు అనేకమంది ఎదురుగా ఉదాహరణగా అయ్యారు. ప్రపంచాన్ని చూడకుండా, కొత్త ప్రపంచాన్ని తయారుచేసే వారిని చూశారు. చలించని నిశ్చయానికి మరియు ధైర్యానికి ప్రపంచం ఎదుట ఉదాహరణగా అయి చూపించారు కనుక అందరూ విశేష ఆత్మలే. విశేషాత్మలను విశేషంగా సంగఠిత రూపంలో చూసి బాప్‌దాదా కూడా హర్షిస్తున్నారు మరియు అటువంటి పిల్లలను మహిమ చేస్తూ పాట పాడుతున్నారు. తండ్రిని గుర్తించారు మరియు తండ్రి, పిల్లలను, వారు ఎవరైనా, ఎలా ఉన్నా, ఇష్టపడ్డారు ఎందుకంటే హృదయాభిరామునికి సత్యమైన హృదయం కల వారే ఇష్టం. ప్రపంచపు తెలివి లేకపోవచ్చు కానీ తండ్రికి ప్రపంచపు తెలివి ఇష్టం ఉండదు, హృదయం కలవారు ఇష్టం. తండ్రి ఎంత గొప్ప బుద్ధిని ఇస్తారంటే దానితో రచయితను తెలుసుకోవడం ద్వారా రచన యొక్క ఆది, మధ్య, అంత్యముల జ్ఞానాన్ని తెలుసుకుంటారు, అందుకే బాప్‌దాదా హృదయపూర్వకంగా ఇష్టపడతారు. నంబరు కూడా సత్యమైన, స్వచ్ఛమైన హృదయం ఆధారంగానే తయారవుతుంది. సేవ ఆధారంతో కాదు. సేవలో కూడా సత్యమైన హృదయంతో సేవ చేశారా లేక కేవలం బుద్ధి ఆధారంతో సేవ చేశారా! హృదయం నుండి వచ్చే శబ్దం హృదయం వరకు చేరుకుంటుంది, బుద్ధి యొక్క శబ్దం బుద్ధి వరకు చేరుకుంటుంది.
ఈరోజు బాప్‌దాదా దిల్ ఉన్న (హృదయమున్న) పిల్లల లిస్టును చూస్తున్నారు. బుద్ధికలవారు పేరు సంపాదిస్తారు, హృదయమున్న వారు ఆశీర్వాదాలు సంపాదిస్తారు. కనుక రెండు మాలలు తయారవుతున్నాయి ఎందుకంటే ఈరోజు వతనంలో అడ్వాన్స్‌లో వెళ్ళిన ఆత్మలు ఇమర్జ్ అయ్యారు. ఆ విశేషాత్మలు ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. ముఖ్యమైన ఆత్మిక సంభాషణ ఏముంటుంది? మీరందరూ కూడా విశేషాత్మలను ఇమర్జ్ చేశారు కదా! సమయం మరియు సంపూర్ణత, రెండిటి మధ్యన ఎంత తేడా మిగిలి ఉంది అనే విషయంపై వతనంలో కూడా ఆత్మిక సంభాషణ జరిగింది. ఎంతమంది తయారయ్యారు! నంబరు తయారయిందా లేక ఇంకా తయారవ్వాలా? నంబరువారుగా అందరూ స్టేజీపైకి వస్తున్నారు కదా. అడ్వాన్స్ పార్టీ వారు ఇలా అడిగారు - ఇప్పుడైతే మేము అడ్వాన్స్ కార్యాన్ని చేస్తున్నాము కానీ మా సహచరులు మా కార్యంలో విశేషంగా ఏ సహయోగాన్ని ఇస్తున్నారు? వారు (అడ్వాన్స్ పార్టీ) కూడా మాలను తయారుచేస్తున్నారు. ఏ మాలను తయారుచేస్తున్నారు? ఎక్కడెక్కడ ఎవరెవరు కొత్త ప్రపంచాన్ని ఆరంభించేందుకు జన్మ తీసుకుంటారో అది నిశ్చితమవుతూ ఉంది. వారికి కూడా వారి కార్యంలో విశేషంగా సూక్ష్మమైన శక్తిశాలి మనసా సహయోగం కావాలి. ఎవరైతే శక్తిశాలి స్థాపనకు నిమిత్తంగా అయ్యే ఆత్మలున్నారో వారు స్వయం పావనంగా ఉన్నారు కానీ వ్యక్తుల వాయుమండలము, ప్రకృతి వాయుమండలము తమోగుణీగా ఉంది. అతి తమోగుణీ ఆత్మల మధ్యలో కొంతమంది సతోగుణీ ఆత్మలు కమలపుష్ప సమానంగా ఉన్నారు. కనుక ఈ రోజు ఆత్మిక సంభాషణ చేస్తూ మీ అతి స్నేహీ శ్రేష్ఠమైన ఆత్మలు చిరునవ్వుతో ఇలా అన్నారు - మా సహచరులకు ఇంత పెద్ద సేవ యొక్క స్మృతి ఉన్నదా లేక సెంటర్లలోనే బిజీ అయిపోయారా లేక జోన్లోనే బిజీ అయిపోయారా?
ఇంతటి ప్రకృతినంతా పరివర్తన చేసే కార్యం, తమోగుణీ సంస్కారం కల ఇంతమంది ఆత్మల వినాశనం, ఏదో ఒక విధి ద్వారా జరుగుతుంది కానీ అకస్మాత్తు మృత్యువులు, అకాల మృత్యువులు, సామూహిక రూపంలో మృత్యువులు, ఆ ఆత్మల వైబ్రేషన్లు ఎంత తమోగుణీగా ఉంటాయి, వాటిని పరివర్తన చేయడం మరియు స్వయాన్ని కూడా అటువంటి అనవసర రక్తపాత వాయుమండలపు వైబ్రేషన్ల నుండి సురక్షితంగా ఉంచుకోవడం మరియు ఆ ఆత్మలకు సహయోగమివ్వడం - ఈ విశాలమైన కార్యం కొరకు ఏర్పాట్లు చేస్తున్నారా? లేక కేవలం ఎవరో వచ్చారు, వారికి అర్థం చేయించారు మరియు తిన్నారు, ఇందులోనే సమయం పోవడం లేదు కదా అని వారు (అడ్వాన్స్ పార్టీ) అడుగుతున్నారు. ఈరోజు బాప్‌దాదా వారి సందేశాన్ని వినిపిస్తున్నారు. ఇంత అనంతమైన కర్తవ్యం చేసేందుకు ఎవరు నిమిత్తంగా ఉన్నారు? ఆదిలో నిమిత్తమైనందుకు అంతిమంలో కూడా పరివర్తన యొక్క అనంతమైన కార్యంలో నిమిత్తంగా అవ్వాలి కదా. ఎవరైతే ముగింపు చేశారో, వారు పూర్తిగా చేశారు అనే సామెత కూడా ఉంది. గర్భమహల్ కూడా తయారుచేయాలి, అప్పుడే యోగబలం ద్వారా కొత్త రచన ప్రారంభమవుతుంది. యోగబలం కోసం మనసాశక్తి అవసరం. తమ రక్షణకు కూడా మనసాశక్తి సాధనంగా అవుతుంది. మనసాశక్తి ద్వారానే స్వయం యొక్క అంతిమాన్ని సుందరంగా తయారుచేసుకోవడంలో నిమిత్తంగా అవ్వగలరు. లేకపోతే సమయానికి పరిస్థితుల అనుసారంగా సాకార రూపంలో సహయోగం ప్రాప్తి అవ్వకపోవచ్చు కూడా. ఆ సమయంలో ఒకవేళ మనసాశక్తి అనగా శ్రేష్ఠ సంకల్పశక్తి లేకపోతే, ఒక్కరితోనే లైన్ క్లియర్‌గా లేకపోతే తమ బలహీనతలు పశ్చాత్తాప రూపంలో భూతాల వలె అనుభవమవుతాయి ఎందుకంటే బలహీనత స్మృతిలోకి వస్తూనే భయమనేది, భూతం వలె అనుభవమవుతుంది. ఇప్పుడైతే ఎలాగోలా నడిపిస్తారు కానీ అంతిమంలో భయం అనుభవమవుతుంది, కనుక ఇప్పటి నుండే అనంతమైన సేవ చేసేందుకు, స్వయం సురక్షితంగా ఉండేందుకు మనసా శక్తిని మరియు నిర్భయతా శక్తిని జమ చేసుకోండి, అప్పుడే అంతిమం సుందరంగా ఉంటుంది మరియు అనంతమైన కార్యంలో సహయోగులుగా అయి అనంతమైన విశ్వ రాజ్యాధికారులుగా అవుతారు. ఇప్పుడు మీ సహచరులు, మీ సహయోగం కోసం వేచి ఉన్నారు. కార్యము వేరు-వేరుగా ఉండవచ్చు కానీ పరివర్తన కోసం ఇరువురూ నిమిత్తంగా ఉన్నారు. వారు తమ రిజల్టును వినిపించారు.
అడ్వాన్స్ పార్టీ వారు కొంతమంది స్వయంగా శ్రేష్ఠాత్మలను ఆహ్వానించేందుకు తయారుగా ఉన్నారు మరియు తయారవుతూ ఉన్నారు, కొంతమంది తయారు చేయించడంలో నిమగ్నమై ఉన్నారు. వారి సేవకు సాధనం స్నేహం మరియు సమీప సంబంధం. వీటి ద్వారా ఇమర్జ్ రూపంలో జ్ఞానచర్చ చేయరు కానీ జ్ఞానీ ఆత్మల సంస్కారమున్న కారణంగా పరస్పరంలో శ్రేష్ఠ సంస్కారాలు, శ్రేష్ఠ వైబ్రేషన్లు మరియు సదా హోలీ మరియు హ్యాపి ముఖాల ద్వారా ఒకరికొకరు ప్రేరణనిచ్చే కార్యాన్ని చేస్తున్నారు. వేరు-వేరు పరివారాలలో ఉన్నారు కానీ ఏదో ఒక సంబంధం లేక మైత్రి ఆధారంగా ఒకరికొకరు సంపర్కంలోకి వచ్చినప్పుడు జ్ఞాన స్వరూప ఆత్మలుగా ఉన్న కారణంగా వీరు మా వారు లేక సమీపంలోని వారు అనే ఈ అనుభూతి కలుగుతూ ఉంటుంది. నా వారు అనే భావన ఆధారంగా ఒకరినొకరు గుర్తిస్తారు. ఇప్పుడు సమయం సమీపంగా వస్తుంది కనుక అడ్వాన్స్ పార్టీ వారి కార్యం తీవ్ర వేగంతో నడుస్తుంది. వతనంలో ఇలా ఇచ్చి-పుచ్చుకోవడం జరిగింది. విశేషంగా జగదంబ, పిల్లలందరి పట్ల రెండు మధురమైన మాటలు మాట్లాడారు. రెండు మాటలలో, అందరికీ - సఫలతకు ఆధారం సదా సహనశక్తి మరియు ఇముడ్చుకునే శక్తి, ఈ విశేషతల ద్వారా సఫలత సదా సహజంగా మరియు శ్రేష్ఠంగా అనుభవమవుతుంది అని స్మృతినిప్పించారు. ఇతరులది కూడా వినిపించాలా? ఈరోజు విశేషంగా చిట్‌చాట్ చేసేందుకు కలిశాము కనుక ప్రతి ఒక్కరూ తమ అనుభవాన్ని వర్ణించారు. అచ్ఛా, ఇంకెవరిది వింటారు? (విశ్వకిశోర్ భావూది). వారు మామూలుగానే తక్కువగా మాట్లాడుతారు కానీ ఏదైతే మాట్లాడుతారో అది శక్తిశాలిగా మాట్లడుతారు. వారి అనుభవమంతా కూడా ఒకే మాటలో ఉంది - ఏదైనా కార్యంలో సఫలతకు ఆధారం - చలించని నిశ్చయం మరియు సంపన్నమైన నషా. ఒకవేళ నిశ్చయం చలించకుండా ఉంటే స్వతహాగానే ఇతరులకు కూడా నషా అనుభవమవుతుంది కనుక నిశ్చయం మరియు నషా సఫలతకు ఆధారమయ్యాయి. ఇది వారి అనుభవం. ఎలాగైతే సాకార బాబాకు సదా నేను భవిష్యత్తులో విశ్వ మహారాజుగా అయ్యే ఉన్నాను అనే నిశ్చయం మరియు నషా ఉండేదో, అదేవిధంగా విశ్వకిశోర్కు కూడా నేను మొదటి విశ్వ మహారాజుకు మొదటి రాకుమారుడను అనే నషా ఉండేది. ఈ వర్తమాన మరియు భవిష్య నషా స్థిరంగా ఉండేది. కనుక సమానత ఉన్నట్లు కదా. ఎవరైతే తోడుగా ఉండేవారో, వారు ఇలా చూశారు కదా!
అచ్ఛా - దీదీ ఏం చెప్పారు? దీదీ చాలా బాగా ఆత్మిక సంభాషణ చేశారు. దీదీ అన్నారు - మీరు అందరినీ ఏ సూచన ఇవ్వకుండా ఎందుకు పిలిచేశారు, శెలవు తీసుకొని వచ్చేదానిని కదా, ఒకవేళ మీరు చెప్పి ఉంటే నేను శెలవు తీసుకుని తయారయ్యి వచ్చేదానిని. మీరు శెలవు ఇచ్చేవారా? బాప్‌దాదా పిల్లలతో ఆత్మిక సంభాషణ చేశారు - దేహ సహితంగా దేహపు సంబంధాలు, దేహపు సంస్కారాలు, అందరి సంబంధాలు, లౌకిక సంబంధాలు లేకపోయినా అలౌకిక సంబంధాలైతే ఉన్నాయి కదా. అలౌకిక సంబంధాలతో, దేహంతో, సంస్కారాలతో నష్టోమోహులుగా అయ్యేందుకు డ్రామాలో ఈ విధి నిర్ణయించబడి ఉంది కనుక అంతిమంలో అన్నిటి నుండీ నష్టోమోహులుగా అయి తమ డ్యూటీలోకి వచ్చి చేరుకున్నారు. విశ్వకిశోర్కు ముందు కొద్దిగా తెలుసు కానీ ఎప్పుడైతే వెళ్ళే సమయం వచ్చిందో, ఆ సమయంలో వారు కూడా మర్చిపోయారు. డ్రామాలో నష్టోమోహులుగా అయ్యే ఈ విధి ఏదైతే నిర్ణయించబడిందో, అది రిపీట్ అయ్యింది ఎందుకంటే కొంత మీ శ్రమ మరియు కొంత తండ్రి కూడా డ్రామానుసారంగా కర్మబంధన ముక్తులుగా చేయడంలో సహయోగం కూడా చేస్తారు. ఎవరైతే చాలాకాలపు సహయోగీ పిల్లలుగా ఉన్నారో, ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు అనే ముఖ్యమైన సబ్జెక్టులో పాస్ అయ్యారో, ఇలా ఒకే అనుభవం చేసేవారికి బాబా విశేషంగా ఇలాంటి ఒక సమయంలో తప్పకుండా సహయోగం ఇస్తారు. కొంతమంది వీరందరూ కర్మాతీతులుగా అయిపోయారా, కర్మాతీత స్థితి అంటే ఇదేనా అని ఆలోచిస్తారు. కానీ ఈ విధంగా ఆది నుండి సహయోగులుగా ఉన్న పిల్లలకు అదనపు సహయోగం లభిస్తుంది కనుక వారి శ్రమ కొంత తక్కువగా కనిపించినా కూడా అంతిమ సమయంలో తండ్రి సహాయం అదనపు మార్కులిచ్చి పాస్ విత్ ఆనర్‌గా చెయ్యనే చేస్తుంది. అది గుప్తంగా జరుగుతుంది - కనుక ఏమిటి ఇలా జరిగింది అనే ప్రశ్న తలెత్తుతుంది. కానీ ఇది సహయోగానికి రిటర్న్. సమయానికి పనికొస్తుంది అనే సామెత ఉంది కదా. కనుక ఎవరైతే హృదయపూర్వకంగా సహయోగులుగా ఉన్నారో వారికి అలాంటి సమయంలో అదనపు మార్కులు రిటర్న్ రూపంలో ప్రాప్తిస్తాయి. ఈ రహస్యాన్ని అర్థం చేసుకున్నారా? కనుక నష్టోమోహులుగా అయ్యే విధితో అదనపు మార్కుల గిఫ్ట్ ద్వారా సఫలతను ప్రాప్తి చేసుకున్నారు. అర్థమయిందా - అఖరికి విషయమేమిటి అని అడుగుతారు కదా. అందుకే ఈరోజు ఈ ఆత్మిక సంభాషణ వినిపిస్తున్నాము. అచ్ఛా - దీదీ ఏం చెప్పారు? వారి అనుభవమైతే అందరికీ తెలుసు కూడా. వారు ఇవే మాటలు చెప్పారు - సదా బాబా మరియు దాదా యొక్క వేలు పట్టుకోండి లేక మీ వేలును ఇవ్వండి. కావాలంటే కొడుకుగా చేసుకుని వేలు పట్టుకోండి, కావాలంటే తండ్రిగా చేసుకుని వేలు ఇవ్వండి. రెండు రూపాలలో ప్రతి అడుగులో వేలు పట్టుకుని తోడును అనుభవం చేస్తూ నడవడం, ఇదే నా సఫలతకు ఆధారం. ఈ విశేషమైన ఆత్మిక సంభాషణ నడిచింది. ఆదిరత్నాల సంగఠనలో దీదీ ఎలా మిస్ అవుతారు కనుక వారు కూడా ఇమర్జ్ అయ్యారు. అచ్ఛా, ఇవి అడ్వాన్స్ పార్టీ వారి విషయాలు, మీరేం చేస్తారు?
అడ్వాన్స్ పార్టీ తన పని చేస్తూ ఉంది. మీరు అడ్వాన్స్ ఫోర్స్ నింపండి, దాని ద్వారా పరివర్తన చేసే కార్యం యొక్క కోర్సు సమాప్తమైపోవాలి ఎందుకంటే పునాదిలో ఉన్నారు. పునాదిలో ఉన్నవారే అనంతమైన సేవాధారులుగా అయి అనంతమైన తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. త్వరలో ఈ సృష్టిపై ప్రత్యక్షత యొక్క ఢంకా మోగడాన్ని వింటారు. నలువైపులా ఒకే ఢంకా, ఒకే రాగంతో మోగుతుంది – ‘‘లభించేశారు, వచ్చేశారు’’ అని. ఇప్పుడింకా చాలా పని ఉంది. పూర్తయిపోతుందని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడింకా వాణి ద్వారా పరివర్తన చేసే కార్యం నడుస్తూ ఉంది. ఇప్పుడు వృత్తి ద్వారా వృత్తులు మారాలి, సంకల్పం ద్వారా సంకల్పాలు మారిపోవాలి. ఈ రిసర్చ్ను ఇప్పుడింకా ప్రారంభించలేదు. కొద్ది-కొద్దిగా చేస్తే ఎలా అవుతుంది. ఈ సూక్ష్మ సేవ స్వతహాగానే చాలా బలహీనతలను దాటిస్తుంది. ఇదెలా జరుగుతుందని భావిస్తారు కానీ, ఎప్పుడైతే ఈ సేవలో బిజీగా ఉంటారో అప్పుడు స్వతహాగా వాయుమండలం ఎలా తయారవుతుందంటే తమ బలహీనతలు స్వయానికే స్పష్టంగా అనుభవమవుతాయి మరియు వాయుమండలం కారణంగా స్వయమే సిగ్గుపడి పరివర్తనైపోతారు. చెప్పాల్సిన అవసరం ఉండదు. చెప్పి చూశారు, ఇప్పుడు ఇలాంటి ప్లాన్ తయారుచేయండి. జిజ్ఞాసువులు ఇంకా చాలా పెరుగుతారు, ఆ చింత చేయకండి. రాబడి కూడా చాలా పెరుగుతుంది, దీని గురించి కూడా చింత చేయకండి. ఇళ్ళు కూడా లభిస్తాయి, దీని గురించి కూడా చింత చేయకండి. అన్నీ సిద్ధిస్తాయి. ఈ విధి ఎలాంటిదంటే సిద్ధి స్వరూపులుగా అయిపోతారు. అచ్ఛా.
శక్తులు చాలామంది ఉన్నారు, ఆదిలో చాలామంది శక్తులే నిమిత్తంగా అయ్యారు. గోల్డెన్ జూబ్లీలో కూడా శక్తులే చాలామంది ఉన్నారు. పాండవులు కొద్దిగానే లెక్కపెట్టే విధంగా ఉన్నారు. అయినా పాండవులు ఉన్నారు. అచ్ఛా, ఆది సమయంలో ధైర్యముంచి సహనం చేయడంలో ఈ ఆదిరత్నాలే ఋజువుగా నిలిచారు. విఘ్న-వినాశకులుగా అయి నిమిత్తులుగా అయి, నిమిత్తంగా తయారుచేసే కార్యంలో అమరులుగా ఉన్నారు కనుక బాప్‌దాదాకు కూడా అవినాశీ, అమరభవ వరదాని పిల్లలు సదా ప్రియమైనవారు. మరియు ఈ ఆదిరత్నాలు స్థాపనా సమయంలో, అవసరమైన సమయంలో సహయోగులుగా అయ్యారు కనుక ఇలా నిమిత్తంగా అయ్యే ఆత్మలకు, సమయానికి సహయోగులుగా అయ్యే ఆత్మలకు, ఏదైనా అలాంటి కష్టం వచ్చినప్పుడు బాప్‌దాదా కూడా వారికి దాని రిటర్న్ ఇస్తారు. కావున మీరందరూ ఎవరైతే అలాంటి సమయంలో నిమిత్తంగా అయ్యారో దానికి ఈ అదనపు గిఫ్ట్ డ్రామాలో నిర్ణయించబడి ఉంది కనుక మీరు అదనపు బహుమతికి అధికారులు.
అర్థమయిందా - మాతల చుక్క-చుక్కతో తయారైన కొలను ద్వారా స్థాపనా కార్యం ప్రారంభమయింది మరియు ఇప్పుడు సఫలతకు సమీపంగా చేరుకుంది. మాతలది హృదయపూర్వక సంపాదన, వ్యాపారం ద్వారా సంపాదించింది కాదు. హృదయం ద్వారా సంపాదన, ఒకటి - వేలతో సమానం. స్నేహమనే బీజం వేశారు కనుక స్నేహమనే బీజం యొక్క ఫలాలు ఫలీభూతమవుతున్నాయి, తోడుగా అయితే పాండవులు కూడా ఉన్నారు. పాండవులు లేకుండా కూడా కార్యం జరగదు కానీ శక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది కనుక 5 మంది పాండవులని వ్రాసేశారు. అయినా కూడా ప్రవృత్తిని నిర్వహిస్తూ అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా అయి ధైర్యం మరియు ఉల్లాసానికి ఋజువునిచ్చారు కనుక పాండవులు కూడా తక్కువేమీ కాదు. శక్తుల యొక్క సర్వశక్తివంతుడని గాయనం ఉంది, అలాగే పాండవుల పాండవపతి అని కూడా గాయనం ఉంది కనుక ఏ విధంగా నిమిత్తంగా అయ్యారో, ఆ విధంగా నిమిత్త భావాన్ని సదా స్మృతిలో ఉంచుకుని ముందుకు సాగుతూ ఉండండి. అచ్ఛా.
సదా పదమాపదమ భాగ్యానికి అధికారులు, సదా సఫలతకు అధికారులు, సదా స్వయాన్ని శ్రేష్ఠమైన ఆధారమూర్తులమని భావించి అందరినీ ఉద్ధరించే శేష్ఠాత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో:- ఇంటి గేటు ఎవరు తెరుస్తారు? గోల్డెన్ జూబ్లీ వారా లేక సిల్వర్ జూబ్లీ వారా? బ్రహ్మా బాబాతో కలిసి గేటు తెరుస్తారు కదా. లేక వెనుక వస్తారా? వెంట వెళ్తే వధువుగా వెళ్తారు, వెనుక వెళ్తే బరాతీగా (పెళ్ళిబృందంగా) వెళ్తారు. బంధువులను కూడా బరాతీలే అంటారు. సమీపంలో అయితే ఉంటారు కానీ పెళ్ళిబృందం (బరాత్) వచ్చింది అనే అంటారు. మరి ఎవరు గేటు తెరుస్తారు? గోల్డెన్ జూబ్లీ వారా లేక సిల్వర్ జూబ్లీ వారా? ఎవరైతే ఇంటి గేటు తెరుస్తారో వారే స్వర్గపు గేటును కూడా తెరుస్తారు.
ఇప్పుడు సూక్ష్మవతనానికి రావడానికి ఎవరికీ అభ్యంతరం లేదు. సాకారంలో అయితే సమయం, పరిస్థితుల బంధనం ఉంటుంది. వతనానికి రావడానికి ఎలాంటి బంధనమూ లేదు. ఎవరూ ఆపరు, టర్న్ కోసం వేచి చూడాల్సిన అవసరం కూడా లేదు. అభ్యాసం ద్వారా ఎలా అనుభవం చేసుకుంటారంటే - ఇక్కడ శరీరంలో ఉంటూనే ఒక్క సెకనులో చక్కర్లు కొట్టి తిరిగి వచ్చేసినట్లు అనుభూతి చెందుతారు. అంతఃవాహక శరీరంతో చక్కర్లు కొట్టడమనే ఏ గాయనమైతే ఉందో, ఇక్కడ ఈ లోపలి ఆత్మయే వాహనంగా మారిపోతుంది. అప్పుడు ఎలా అనిపిస్తుందంటే - అచ్చం బటన్ నొక్కగానే విమానం ఎగిరి, చక్కర్లు కొట్టి తిరిగి వచ్చేసినట్లు ఉంటుంది; మరియు ఇతరులు కూడా ‘వీరు ఇక్కడ ఉంటూనే లేరు’ అని అనుభవం చేసుకుంటారు. సాకారంలో చూశారు కదా - మాట్లాడుతూ మాట్లాడుతూనే సెకనులో ఉన్నారు, ఇప్పుడే లేరు. ఇప్పుడే ఉన్నారు, ఇప్పుడే లేరు. ఇలా అనుభవం చేసుకున్నారు కదా. ఇలాగే అనుభవించారు కదా.
ఇందులో కేవలం స్థూల విస్తారాన్ని కుదించుకునే (సమేట్నా) ఆవశ్యకత ఉంది. సాకారంలో చూశారు - ఇంత విస్తారం ఉన్నప్పటికీ అంతిమ స్థితి ఎలా నిలిచింది? విస్తారాన్ని కుదించుకునేది, ఉపరామంగా ఉండేది. ఇప్పుడే స్థూల డైరెక్షన్లు ఇస్తున్నారు, మరుక్షణమే అశరీరి స్థితి అనుభవాన్ని కలిగిస్తున్నారు. కాబట్టి ఈ సర్దుకునే శక్తి యొక్క ప్రత్యక్షతను చూశారు. మీరందరూ కూడా అనేవారు కదా - బాబా ఇక్కడ ఉన్నారా లేదా, వింటున్నారా లేదా అని. కానీ ఆ తీవ్రగతి ఎలా ఉంటుందంటే, ఏ కార్యాన్నీ మిస్ చేయరు. మీరు విషయం వినిపిస్తున్నారంటే ఆ విషయాన్ని మిస్ చేయరు. వేగం ఎంత తీవ్రంగా ఉంటుందంటే ఒకే నిమిషంలో రెండు పనులనూ చేయగలరు. సారాన్ని కూడా క్యాచ్ చేసుకుంటారు మరియు చక్కర్లు కూడా కొట్టి వస్తారు. ఎవరో మాట్లాడుతుంటే ‘నేను అసలు విననే లేదు’ అని అనేంతటి అశరీరిగా కాదు. వేగం ఫాస్ట్ అయిపోతుంది. బుద్ధి ఎంత విశాలంగా అయిపోతుందంటే ఒకే సమయంలో రెండు కార్యాలనూ చేస్తుంది. సర్దుకునే శక్తిని ఉపయోగించినప్పుడు ఇలా జరుగుతుంది. ప్రస్తుతం ప్రవృత్తి విస్తరించింది. అందులో ఉంటూనే ఈ అభ్యాసం ఫరిశ్తా తనం యొక్క సాక్షాత్కారాన్ని కలిగిస్తుంది! ప్రస్తుతం ఒక్కొక్క చిన్నచిన్న విషయం వెనుక ఏ శ్రమ అయితే పడాల్సి వస్తోందో, ఉన్నత స్థితికి వెళ్ళడం వల్ల ఆ చిన్న విషయాలు వ్యక్త భావానికి చెందినవిగా స్వతహాగానే అనుభవమవుతాయి. ఉన్నతంగా వెళ్ళడం వల్ల నీచత్వం తనంతట తానుగా వదిలిపోతుంది. శ్రమ నుండి తప్పించుకుంటారు. సమయమూ ఆదా అవుతుంది మరియు సేవ కూడా వేగంగా జరుగుతుంది; లేదంటే ఎంత సమయం ఇవ్వాల్సి వస్తోంది. అచ్ఛా.
“సిల్వర్ జూబ్లీకి విచ్చేసిన టీచర్ సోదరీమణుల గురించి అవ్యక్త మహావాక్యాలు”
అందరూ సిల్వర్ జూబ్లీ జరుపుకున్నారు! మారాల్సింది గోల్డెన్ ఏజ్డ్గా (స్వర్ణయుగపు దేవతలుగా) కానీ, సిల్వర్‌గా మారడం కాదు కదా! గోల్డెన్ ఏజ్డ్గా మారేందుకు ఈ సంవత్సరం ఏ ప్రణాళిక (ప్లాన్) తయారుచేశారు? సేవా ప్రణాళిక అయితే తయారుచేస్తూనే ఉంటారు; కానీ స్వ-పరివర్తన మరియు అనంతమైన పరివర్తన - వీటి కోసం ఏ ప్లాన్ తయారుచేశారు? ఎవరి స్థానానికి సంబంధించిన ప్లాన్ వారు తయారుచేసుకుంటారు ఇది చేస్తాము అని. కానీ ఆది నిమిత్తులు కాబట్టి మీరు అనంతమైన ప్లాన్ కలవారు. ‘మేము ఇంతటి సమస్త విశ్వానికీ కళ్యాణం చేయాలి’ అని బుద్ధిలో ఇమర్జ్ అవుతుందా? లేక ‘అది ఎవరి పనో వారికే తెలుసు’ అని భావిస్తారా? ఎప్పుడైనా అనంతపు ఆలోచన వస్తుందా లేక మీమీ స్థానాల ఆలోచనే ఉంటుందా? పేరేమో విశ్వ కళ్యాణకారి, ఫలానా స్థానపు కళ్యాణకారి అని అనరు కదా. మరి అనంతమైన సేవకు సంబంధించిన ఏ సంకల్పం నడుస్తోంది? అనంతానికి యజమానులు కావాలి కదా, ఒక రాష్ట్రానికి యజమానులుగా మారడం కాదు. సేవాధారి నిమిత్త ఆత్మలలో ఎప్పుడైతే ఈ అల ఉత్పన్నమవుతుందో, అప్పుడే ఆ అల ఇతరులలోనూ కలుగుతుంది. ఒకవేళ మీలోనే ఈ అల లేకపోతే ఇతరులలోకి రాలేదు. కాబట్టి సదా అనంతానికి అధికారులమని భావించి అనంతమైన ప్లాన్ తయారుచేయండి.
మొట్టమొదటి ముఖ్య విషయం - ఎలాంటి హద్దు బంధనాలలోనూ బంధించబడి లేరు కదా! బంధన ముక్తులైనవారే అనంతమైన సేవలో సఫలమవుతారు. ఇక్కడే ఇది ప్రత్యక్షమవుతూ వస్తోంది మరియు అవుతూనే ఉంటుంది. మరి ఈ సంవత్సరంలో ఏ విశేషతను చేసి చూపిస్తారు? దృఢ సంకల్పం అయితే ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటారు. ఎప్పుడు ఇలాంటి అవకాశం లభించినా అందులో దృఢ సంకల్పం చేస్తారు మరియు చేయిస్తారు. కాబట్టి ‘దృఢ సంకల్పం’ అనే ఈ పదం తీసుకోవడం కూడా సర్వసాధారణమై పోయింది. చెప్పడానికి దృఢ సంకల్పం అని వస్తుంది కానీ అది కేవలం సంకల్పంగానే మిగిలిపోతోంది. ఒకవేళ దృఢమైనదే అయితే మళ్ళీ మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం రాదు కదా. దృఢ సంకల్పం అనే పదం కామన్ అయిపోయింది. ఇప్పుడు ఏ పని చేసినా మామూలుగా అనేస్తారు ‘అవును దృఢ సంకల్పం చేస్తున్నాము’ అని; కానీ ఆలోచించడం మరియు చేయడం సమానంగా ఉండేలా ఏదైనా కొత్త సాధనాన్ని కనిపెట్టండి. ప్లాన్ మరియు ప్రాక్టికల్ రెండూ కలిసి ఉండాలి. ప్లాన్స్ అయితే చాలా ఉన్నాయి కానీ ప్రాక్టికల్‌లో సమస్యలూ వస్తాయి, శ్రమా పడుతుంది, ఎదుర్కోవాల్సి వస్తుంది; ఇదంతా జరుగుతుంది మరియు జరుగుతూనే ఉంటుంది. కానీ లక్ష్యం ఉన్నప్పుడు ప్రాక్టికల్‌లో సదా ముందుకు సాగుతూ ఉంటారు.
ఇప్పుడు ఏదైనా నవీనత కనిపించేలా ప్లాన్ తయారుచేయండి. లేదంటే ప్రతి సంవత్సరం కలుసుకుంటారు, ‘ఎప్పటిలాగే ఉంది’ అని అంటారు. ఒకరినొకరు ఎప్పటిలాగే చూసుకుంటారు. మనస్సుకు నచ్చినట్లు జరగదు. ఎంత కోరుకుంటారో అంతగా జరగదు. అది ఎలా సాధ్యమవుతుంది? దీని కోసం ‘ఓటే సో అర్జున్’ (నేనే అర్జునుడిని అని ముందుకు రావడం). ఒక్కరు నిమిత్తమైనా ఇతరులలో కూడా ఉల్లాస-ఉత్సాహాలు వస్తాయి. ఇంతమంది కలుసుకున్నారు కదా, ప్రాక్టికల్‌గా ఉండేలా ఏదైనా ప్లాన్ రూపొందించండి. థియరీ పేపర్లూ ఉంటాయి, ప్రాక్టికల్ పేపర్లూ ఉంటాయి. ఆది నుండి నిమిత్తమైన వారి భాగ్యం అయితే శ్రేష్ఠమైనదే. ఇప్పుడు కొత్తగా ఏమి చేస్తారు?
దీని కోసం విశేష అటెన్షన్ - ప్రతి కర్మ చేసే ముందు ‘నేను స్వయాన్ని సంపన్నంగా చేసుకుని శాంపిల్‌గా మారాలి’ అనే లక్ష్యాన్ని ఉంచుకోండి. ఏం జరుగుతుందంటే సంగఠన వల్ల లాభం ఉంటే నష్టం కూడా ఉంటుంది. సంగఠనలో ఒకరినొకరు చూసి అజాగ్రత్త కూడా వస్తుంది, అలాగే సంగఠనలో ఒకరినొకరు చూసి ఉల్లాస-ఉత్సాహాలూ వస్తాయి - రెండూ జరుగుతాయి. కాబట్టి సంగఠనను అజాగ్రత్త దృష్టితో చూడకూడదు. ఇప్పుడిదొక ఆచారమైపోయింది - ‘వీరూ చేస్తున్నారు, వారూ చేస్తున్నారు, మేమూ చేస్తే తప్పేముంది, ఇలా నడుస్తూనే ఉంటుంది’ అని. ఇది సంగఠనలో అజాగ్రత్త వల్ల కలిగే నష్టం. సంగఠన నుండి శ్రేష్ఠంగా మారడానికి సహకారం తీసుకోవడం వేరే విషయం. ‘నేను చేయాలి, నేను చేసి ఇతరుల చేత చేయించాలి’ అనే లక్ష్యం ఉంటే, అప్పుడు చేయాలనే ఉల్లాస-ఉత్సాహాలు ఉంటాయి మరియు చేయించాలనే ఉత్సాహమూ ఉంటుంది. మరియు ఈ లక్ష్యాన్ని మాటిమాటికీ ఇమర్జ్ చేసుకోండి. కేవలం లక్ష్యాన్ని పెట్టుకుని వదిలేస్తే అది మర్జ్ అయిపోతుంది. అందుకే ప్రాక్టికల్లోకి రావట్లేదు. కాబట్టి లక్ష్యాన్ని సమయానుసారంగా ఇమర్జ్ చేసుకోండి. లక్ష్యము మరియు లక్షణాలను కూడా మాటిమాటికీ సరిచూసుకుంటూ నడవండి. అప్పుడు శక్తివంతులుగా మారతారు. లేదంటే సాధారణంగా అయిపోతుంది.
ఇప్పుడు ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ ‘మేము సింపుల్ మరియు శాంపిల్‌గా మారాలి’ అని అర్థం చేసుకోండి. ఈ సేవా ప్రవృత్తి వృద్ధిని పొందుతూనే ఉంటుంది, కానీ ఈ ప్రవృత్తి ఉన్నతికి విఘ్నరూపంగా మారకూడదు. ఒకవేళ ఉన్నతికి విఘ్నంగా మారితే దానిని సేవ అని అనము. అచ్ఛా, చాలా పెద్ద సమూహమే ఉంది. ఇంత చిన్న ఆటమ్ బాంబు ఇంతటి అద్భుతం చేసి చూపించినప్పుడు, ఇంతమంది ఆత్మిక బాంబులు ఏమి చేయలేరు! స్టేజ్ పైకి రాబోయేది మీరే కదా. గోల్డెన్ జూబ్లీ వారు బ్యాక్‌బోన్ (వెన్నెముక) అయ్యారు, కానీ ప్రాక్టికల్‌గా స్టేజ్ పైకి రావాల్సింది మీరే. ఇప్పుడు గోల్డెన్ జూబ్లీ నిమిత్త ఆత్మల స్నేహ సంగఠన ఎలాగైతే కనిపిస్తుందో, ఆ స్నేహ సంఘటన ఎలాగైతే సేవా వృద్ధి మరియు సేవా సఫలత అనే ప్రత్యక్ష ఫలాన్ని చూపించిందో - అలాగే మీరు కూడా కోట రూపంలో ఉండే సంగఠనను నిర్మించండి. గోల్డెన్ జూబ్లీ నిమిత్త దీదీలు, దాదీలు స్నేహము మరియు సంగఠన శక్తి యొక్క ప్రత్యక్ష ఫలాన్ని చూపించినట్లుగానే మీరూ ప్రత్యక్ష ఫలాన్ని చూపించండి. ఒకరికొకరు సమీపంగా రావడానికి సమానంగా మారాల్సి ఉంటుంది. సంస్కారాలు భిన్నభిన్నంగా ఉన్నాయి మరియు ఉంటాయి కూడా. జగదాంబను చూడండి, బ్రహ్మా బాబాను చూడండి - సంస్కారాలు భిన్నంగానే నిలిచాయి. ఇప్పుడున్న నిమిత్త దీదీలు, దాదీల సంస్కారాలు ఒకేలా లేవు; కానీ సంస్కారాలను కలుపుకోవడం - ఇదే స్నేహానికి నిదర్శనం. ‘సంస్కారాలు కలిస్తేనే సంగఠన ఏర్పడుతుంది’ అని ఆలోచించకండి, అలా కాదు. సంస్కారాలను కలుపుకోవడం ద్వారా సంగఠన దృఢంగా మారిపోతుంది. అచ్ఛా, ఇది కూడా జరిగిపోతుంది. సేవ ఒక్కటే, కానీ నిమిత్తంగా మారడం, నిమిత్త భావంతో నడవడం - ఇదే విశేషత.
ఈ హద్దునే కదా తొలగించాల్సింది? దీని కోసం ఆలోచించారు కదా, అందరినీ మార్చేయండి (బదిలీ చేయండి). ఒక సెంటర్ వారు వేరే సెంటరుకు వెళ్ళాలి. అందరూ సిద్ధమేనా? ఆర్డర్ వెలువడుతుంది. మీరైతే హ్యాండ్స్-అప్ చేశారు కదా. మారడం వల్ల లాభం కూడా ఉంది. ఈ సంవత్సరం ఈ కొత్త పని చేద్దాం కదా. నష్టోమోహ అయితే కావాల్సిందే కదా. త్యాగి, తపస్విగా మారిన తర్వాత ఇదెంతటిది? త్యాగమే భాగ్యము. మరి భాగ్యం ముందు ఇదెంతటి త్యాగం? ఆఫర్ చేసేవారికి ‘ఆఫరీన్’ (శభాష్) లభిస్తుంది. కాబట్టి అందరూ బహాదుర్లు (వీరులు)! బదిలీ అనగా బదిలీ. ఎవరినైనా చేయవచ్చు. ధైర్యం ఉంటే పెద్ద విషయమేముంది. అచ్ఛా, అయితే ఈ సంవత్సరం ఈ నవీనతను చేస్తారు. ఇష్టమే కదా! ఆది నుండి ఎవరెడీ పాఠం చదువుకున్న వారిలో లోలోపలే ఈ బలం నిండి ఉంటుంది. ఎలాంటి ఆజ్ఞనైనా పాలించే బలం స్వతహాగానే లభిస్తుంది; కాబట్టి సదా ఆజ్ఞాకారులుగా మారే బలం లభించి ఉంది. అచ్ఛా, సదా శ్రేష్ఠ భాగ్యం ఉంది మరియు భాగ్యం కారణంగా సహకారం లభిస్తూనే ఉంటుంది. అర్థమైందా!
(2) సేవ వర్తమాన మరియు భవిష్యత్తు రెండింటినీ శ్రేష్ఠంగా చేస్తుంది. సేవ యొక్క బలం తక్కువేమీ కాదు. స్మృతి మరియు సేవ రెండింటి బ్యాలెన్స్ కావాలి. అప్పుడే సేవ ఉన్నతి అనుభవాన్ని కలిగిస్తుంది. స్మృతిలో ఉంటూ సేవ చేయడం సహజంగా (నేచురల్‌గా) ఉండాలి. బ్రాహ్మణ జీవితపు సహజ స్వభావం (నేచర్) ఏమిటి? స్మృతిలో ఉండటం. బ్రాహ్మణ జన్మ తీసుకోవడం అనగా స్మృతి అనే బంధనాన్ని కట్టుకోవడం. లౌకిక బ్రాహ్మణులు జీవితంలో ఏదో ఒక గుర్తును ఉంచుకున్నట్లు, ఈ బ్రాహ్మణ జీవితపు గుర్తు స్మృతి. స్మృతిలో ఉండటం సహజంగా ఉండాలి. అందుకే స్మృతి వేరుగా, సేవ వేరుగా చేయడం కాదు. రెండూ ఏకకాలంలో ఉండాలి. స్మృతి వేరుగా, సేవ వేరుగా చేయడానికి అంత సమయం ఎక్కడుంది! అందుకే స్మృతి మరియు సేవ సదా తోడుగానే ఉన్నాయి. ఇందులోనే అనుభవజ్ఞులుగా కూడా మారతారు, సఫలతనూ పొందుతారు. అచ్ఛా.
రజతోత్సవ శుభ సందర్భంలో ఆత్మిక పిల్లల పట్ల స్నేహపు సువర్ణ పుష్పాలు
సమస్త విశ్వంలో ఉన్నతోన్నతమైన మహాయుగంలో మహాన్ పాత్రధారులైన యుగ పరివర్తక పిల్లలకు శ్రేష్ఠమైన, సుందరమైన జీవితానికి శుభాకాంక్షలు. సేవా వృద్ధికి నిమిత్తమయ్యే విశేష భాగ్యానికి శుభాకాంక్షలు. ఆది నుండి పరమాత్మ స్నేహీలుగా, సహయోగులుగా మారినందుకు, శాంపిల్‌గా మారినందుకు శుభాకాంక్షలు. సమయానుసారంగా వచ్చే సమస్యల తుఫానును కానుకగా (తోఫాగా) భావించి సదా విఘ్న-వినాశకులుగా మారినందుకు శుభాకాంక్షలు.
బాప్‌దాదా సదా ఇలాంటి అనుభవాల ఖజానాలతో సంపన్నులైన సేవా పునాది పిల్లలను చూసి హర్షిస్తారు మరియు పిల్లల సాహస గుణాల మాలను స్మరిస్తారు. ఇలాంటి లక్కీ మరియు లవ్లీ సందర్భంలో విశేష సువర్ణ వరదానాలను ప్రసాదిస్తున్నారు - సదా ఏకమై, ఒక్కరిని ప్రత్యక్షం చేసే కార్యంలో సఫల భవ. ఆత్మిక జీవితంలో అమర భవ. ప్రత్యక్ష ఫలం మరియు అమర ఫలాన్ని ఆరగించే పదమా పదమ భాగ్యవాన్ భవ. అచ్ఛా!
*** ఓంశాంతి ***
