“దివ్య బ్రాహ్మణ జన్మ యొక్క భాగ్య రేఖలు”
ఈరోజు విశ్వ రచయిత అయిన బాప్‌దాదా తమ విశ్వం యొక్క సర్వ మనుష్యాత్మల రూపీ పిల్లలను చూస్తున్నారు. సర్వ ఆత్మలలో అనగా పిల్లలందరిలో రెండు రకాల పిల్లలున్నారు. ఒకరు - తండ్రిని గుర్తించినవారు మరియు రెండవ వారు - పిలిచేవారు లేదా గుర్తించేందుకు ప్రయత్నించేవారు. కానీ అందరూ పిల్లలే. మరి ఈ రోజు రెండు రకాల పిల్లలను చూస్తున్నాము. పిల్లలందరిలో గుర్తించినవారు లేక ప్రాప్తి చేసుకున్న పిల్లలు చాలా కొద్దిమందే ఉన్నారు మరియు గుర్తించేందుకు ప్రయత్నించేవారు అనేకమంది ఉన్నారు. గుర్తించిన పిల్లల మస్తకంపై శ్రేష్ఠ భాగ్య రేఖ మెరుస్తుంది. అన్నింటికంటే శ్రేష్ఠమైన భాగ్య రేఖ - తండ్రి ద్వారా దివ్య బ్రాహ్మణ జన్మ యొక్క రేఖ. దివ్య జన్మ యొక్క రేఖ అతి శ్రేష్ఠంగా మెరుస్తుంది. పిలిచేటువంటి పిల్లలు తెలియకుండానే - భగవంతుడే మమ్మల్ని రచించారు అని నమ్ముతారు. కానీ తెలియని వారిగా ఉన్న కారణంగా దివ్య జన్మ యొక్క అనుభూతిని చేయలేరు. మీరు కూడా అంటారు - మాకు బాప్‌దాదా దివ్య జన్మనిచ్చారు అని. వారు కూడా అంటారు - భగవంతుడు రచించారు, భగవంతుడే రచయిత, భగవంతుడే పాలన కర్త అని. కానీ ఇరువురు చెప్పేదానిలో ఎంత వ్యత్యాసముంది. మీరు అనుభవంతో, నషాతో, జ్ఞానంతో అంటారు - మమ్మల్ని తల్లదండ్రులైన బాప్‌దాదా రచించారు అనగా బ్రాహ్మణ జన్మనిచ్చారు అని. రచయితను, జన్మను, జన్మ పత్రికను, దివ్య జన్మ యొక్క విధిని మరియు సిద్ధిని - అన్నింటినీ తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరికీ తమ దివ్య జన్మ యొక్క బర్త్ డే (పుట్టిన రోజు) గుర్తుంది కదా! ఈ దివ్య జన్మ యొక్క విశేషత ఏమిటి? సాధారణ జన్మ తీసుకున్న ఆత్మలు తమ బర్త్ డే ను వేరుగా జరుపుకుంటారు, ఫ్రెండ్స్ డే (స్నేహితుల దినోత్సవం)ను వేరుగా జరుపుకుంటారు, చదువుకునే రోజును వేరుగా జరుపుకుంటారు. మరియు మీరు ఏమంటారు? మీకు బర్త్ డే కూడా అదే, మ్యారేజ్ డే (పెళ్ళి రోజు) కూడా అదే మరియు చదువుకునే రోజు కూడా అదే. మదర్స్ డే అనండి, ఫాదర్స్ డే అనండి, ఎంగేజ్మెంట్ డే (నిశ్చితార్థపు రోజు) అనండి అన్నీ ఒక్కటే. ఇటువంటి దివ్య జన్మ గురించి ఎప్పుడైనా విన్నారా? మొత్తం కల్పంలో ఆత్మలైన మీకు ఇటువంటి రోజు మళ్ళీ ఎప్పుడూ రాదు. సత్యయుగంలో కూడా బర్త్ డే మరియు మ్యారేజ్ డే ఒక్కటే ఉండదు. కానీ ఇది ఈ సంగమయుగంలోని ఈ మహాన్ జన్మ యొక్క విశేషత కూడా మరియు విచిత్రత కూడా. నిజానికి ఏ రోజునైతే బ్రాహ్మణులుగా అయ్యారో, ఆ రోజే జన్మదినము, ఆ రోజే మ్యారేజ్ డే ఎందుకంటే అందరూ ఇదే ప్రతిజ్ఞను చేస్తారు - ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు అని. ఈ దృఢ సంకల్పాన్ని ముందే చేస్తారు కదా. నీతోనే తింటాను, నీతోనే కూర్చొంటాను, నీతోనే సర్వ సంబంధాలు నిర్వర్తిస్తాను - అని అందరూ ప్రతిజ్ఞ చేసారు కదా. పాండవులు, మాతలు, కుమారీలు అందరూ ప్రతిజ్ఞ చేసారు. కనుక స్వప్నంలో కూడా మనసు ఎక్కడకూ వెళ్ళలేదు. ఇలా పక్కాగా ఉన్నారా లేక ఎవరైనా సాథీలు కావాలా? సేవ కోసం ఎవరైనా విశేషమైన సాథీలు కావాలా? అయితే సాథీ-దినం అని ఎవరిది జరుపుకుంటారు? సేవాధారీ సాథీదా లేక తండ్రి సాథీ కనుక వారి దివసాన్ని జరుపుకుంటారా? సేవ చేసేవారు కావచ్చు, సేవ తీసుకునేవారు కావచ్చు కానీ సేవ చేసే సమయంలో సేవ చేసారు, తర్వాత ఎంత అతీతంగా మరియు ప్రియంగా అవ్వాలంటే కొంచెం కూడా విశేషమైన ఇష్టం ఉండకూడదు. ఎవరైతే సేవలో సహాయం చేస్తారో, వారు విశేషమైనవారిగా ఉంటారు కదా. సోదరుడు కావచ్చు, సోదరి కావచ్చు, ఎవరైతే విశేషమైన సేవను చేస్తారో, వారు విశేషమైన అధికారాన్ని కూడా కలిగి ఉంటారు. కనుక సేవలో సాథీలుగా అవ్వండి, కానీ సాక్షిగా అయి సాథీగా అవ్వండి. సాక్షీతనాన్ని మర్చిపోతారు. సాక్షీతనాన్ని మర్చిపోయి, కేవలం సాథీలుగా అయినట్లయితే తండ్రిని మర్చిపోతారు. సాక్షీగా అయి పాత్రను అభినయించే అభ్యాసం చేయండి.
పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంపై విశేషంగా 4 భాగ్య రేఖలు మెరుస్తాయి. 1) దివ్య జన్మ యొక్క రేఖ 2) పరమాత్మ పాలన యొక్క రేఖ 3) పరమాత్మ చదువు యొక్క రేఖ మరియు 4) నిస్వార్థ సేవ యొక్క రేఖ. అందరి మస్తకంలో నాలుగు భాగ్య రేఖలు మెరుస్తున్నాయి. కానీ మెరుపులో మరియు సదా ఏకరస వృద్ధిని ప్రాప్తి చేసుకోవడంలో తేడా ఉన్న కారణంగా మెరుపులో అంతరం కనిపిస్తుంది. ఆది నుండి ఇప్పటివరకు నాలుగు రేఖలు సదా యథార్థ రూపంలో నడుస్తూ ఉండడమనేది చాలా కొద్దిమందికే ఉంది. మధ్య-మధ్యలో ఏదో ఒక విషయంలో భాగ్య రేఖ ఖండితమైనా అవుతుంది లేక మెరుపు తక్కవైనా అవుతుంది, స్పష్టంగా ఉండదు. ఎలాగైతే హస్తరేఖలను కూడా చూస్తారు కదా - కొందరికి ఖండితమై ఉంటాయి, కొందరికి ఏకరసంగా ఉంటాయి, కొందరికి స్పష్టంగా ఉంటాయి, కొందరికి స్పష్టంగా ఉండవు. బాప్‌దాదా కూడా పిల్లల భాగ్య రేఖలను చూస్తూ ఉంటారు. దివ్య జన్మనైతే అందరూ తీసుకున్నారు, కానీ దివ్య జన్మ యొక్క రేఖ ఖండితమవుతుంది లేదంటే స్పష్టంగా ఉండదు. ఎందుకంటే తమ జన్మ యొక్క ధర్మంలో అఖండంగా నడవరు కనుక వారి భాగ్యపురేఖ ఖండితమవుతుంది. ధర్మం అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి - వీటి గురించి తెలుసు కదా. అలాగే పరమాత్మ పాలనలో అయితే బ్రాహ్మణులందరూ నడుస్తున్నారు. సమర్పితమై ఉండవచ్చు లేదా ప్రవృత్తిలో ఉండవచ్చు, కానీ తండ్రి డైరెక్షన్పైన నడుస్తున్నారు. ప్రవృత్తి వారు ఏమంటారు? మీరు సంపాదించినది తింటున్నారా లేక తండ్రిది తింటున్నారా? తండ్రిది తింటున్నారు కదా. ఎందుకంటే తమదంతా తండ్రికిచ్చేసారు, కనుక తండ్రిదే అయినట్లు కదా. మీరు సంపాదిస్తూ ఉండవచ్చు, కానీ సంపాదించిన ధనాన్ని తండ్రి అధీనం చేస్తారా లేక మీ పనిలోనే ఉపయోగిస్తారా? ట్రస్టీలే కదా? ట్రస్టీలకు తమదంటూ ఏదీ ఉండదు. గృహస్థంలో ‘నాది’ అనేది ఉంటుంది, ట్రస్టీ అనగా అంతా తండ్రిది. తమ చేతితో భోజనం తయారుచేసినా కానీ, బ్రహ్మా భోజనం తింటున్నానని భావిస్తారు కదా. మొదట భోగ్ ఎవరికి పెడతారు? తండ్రికి అర్పిస్తారు కదా? అర్పించడం అనగా తండ్రిది తినడము. బ్రహ్మా భోజనాన్ని తింటారు. పిల్లల కోసం ఉపయోగించినా సరే, అది కూడా డైరెక్షన్ అనుసారంగా ఉపయోగిస్తారు. ఎలాగైతే సమర్పిత సోదరీలు లేక సోదరులు భిన్న-భిన్న కార్యాలలో తనువును, మనసును కూడా పెడతారు, అలాగే ధనాన్ని కూడా పెడతారు. అలాగే ప్రవృత్తిలో ఉండేవారు కూడా తనువును పెట్టినా, ధనాన్ని పెట్టినా తండ్రి శ్రీమతం అనుసారంగానే తాకట్టుగా భావిస్తూ కార్యంలో పెడతారు - ఇలాగే చేస్తారు కదా? తాకట్టులో మోసాన్ని అనగా మన్మతమును అయితే కలపడం లేదు కదా. కనుక పరమాత్మ పాలన బ్రాహ్మణాత్మలందరికీ లభిస్తూ ఉంది. శక్తిశాలిగా తయారుచేసేందుకు పాలన ఇవ్వడం జరుగుతుంది. తల్లి పాలనకు ప్రత్యక్ష రూపమేమిటి? పుత్రుడు శక్తిశాలిగా అవుతాడు. కనుక బ్రహ్మా-తల్లి పాలన ద్వారా అందరూ మాస్టర్ సర్వశక్తిమంతులుగా అయ్యారు. కానీ కొంతమంది పిల్లలు శక్తులను సదా కార్యంలో ఉపయోగిస్తారు, మరికొంతమంది పిల్లలు ప్రాప్తించిన శక్తులను అనగా పాలనను కార్యంలో ఉపయోగించరు అనగా పాలనను ప్రాక్టికల్ (ఆచరణ)లోకి తీసుకురారు. అందువలన శ్రేష్ఠమైన పాలన లభిస్తున్నా కూడా బలహీనంగా ఉండిపోతారు మరియు భాగ్య రేఖ ఖండితమైపోతుంది.
అలాగే చదువు యొక్క రేఖ - చదువు యొక్క లక్ష్యము-ఉద్దేశ్యమే శ్రేష్ఠ పదవిని ప్రాప్తి చేసుకోవడము. శిక్షకుడైన తండ్రి అందరికీ ఒకటే చదివిస్తారు, ఒకే సమయంలో చదివిస్తారు. కానీ శ్రేష్ఠమైన బ్రాహ్మణ జీవితం యొక్క, చదువు యొక్క పదవి లేక నషా ఏదైతే ఉందో అది అందరికీ ఒకే విధంగా ఉండదు. ఫరిస్తా నుండి దేవతగా అయ్యే హోదాను సదా స్మృతిలో ఉంచుకోరు. అందుకే భాగ్య రేఖలో తేడా వచ్చేస్తుంది.
అలాగే సేవ యొక్క రేఖ - బ్రహ్మా తండ్రి సాకార రూపంలో అంతిమ వరదాన రూపంలో స్మృతినిప్పించిన సేవా విశేషత - నిరాకారి, నిర్వికారి మరియు నిరహంకారి. నిరాకారి స్థితిలో స్థితులవ్వకుండా ఏ ఆత్మకు కూడా సేవా ఫలాన్ని ఇవ్వలేరు. ఎందుకంటే ఆత్మ నుండి వచ్చే బాణం ఆత్మకు తగులుతుంది. స్వయం సదా ఇటువంటి స్థితిలో స్థితులై ఉండనట్లయితే, ఎవరి సేవనైతే చేస్తారో వారు కూడా సదా స్మృతి స్వరూపులుగా అవ్వలేరు. అలాగే నిర్వికారీ - ఏ వికారపు అంశమైనా ఇతరాత్మల శూద్ర వంశాన్ని పరివర్తన చేసి బ్రాహ్మణ వంశీయులుగా తయారు చేయలేదు. ఆ ఆత్మ కూడా శ్రమ చేయాల్సి వస్తుంది, అందుకని ప్రేమ యొక్క ఫలాన్ని సదా అనుభవం చేయలేకపోతారు. నిరహంకారీ సేవకు అర్థమే ఫలస్వరూపులుగా అయి వంగటము. నమ్రచిత్తులుగా అవ్వకుండా నిర్మాణము అనగా సేవలో సఫలత లభించదు. కనుక నిరాకారి, నిర్వికారి, నిరహంకారి - ఈ మూడు వరదానాలను సదా సేవలో ప్రాక్టికల్లోకి తీసుకురావడము - దీనిని అఖండమైన భాగ్య రేఖ అని అంటాము. ఇప్పుడు 4 భాగ్య రేఖలు చెక్ చేసుకోండి - అఖండంగా ఉన్నాయా లేక ఖండితంగా ఉన్నాయా, స్పష్టంగా ఉన్నాయా లేక అస్పష్టంగా ఉన్నాయా? కోట్లలో కొందరిగా అయితే అయిపోయారు, కానీ ఆ కొందరిలో కూడా కొందరిగా అవ్వాలి. ఎవరైతే కొందరిలో కొందరిగా ఉంటారో, వారే ఇప్పుడు సర్వులకు గౌరవనీయులుగా మరియు భవిష్యత్తులో పూజ్యనీయులుగా అవుతారు. ఎవరైతే అఖండమైన భాగ్య రేఖలు కలవారిగా ఉంటారో, వారి గుర్తులు - వారు ఇప్పుడు కూడా సర్వ బ్రాహ్మణ పరివారానికి ప్రియమైనవారిగా ఉంటారు. గౌరవనీయులుగా ఉన్న కారణంగా సర్వుల ఆశీర్వాదాలు, శ్రేష్ఠ ఆత్మల భాగ్య రేఖలను మెరిపింపజేస్తూ ఉంటాయి. మరి స్వయాన్ని ప్రశ్నించుకోండి - నేను ఎవరు? మరి, ఈ రోజు ఏం చూసామో విన్నారా!
ప్రపంచం వారు పాలనకర్త, జన్మదాత అని అంటారు. కానీ జన్మదాత యొక్క పరిచయమే లేదు మరియు మీరు - పరమాత్మ జన్మదాతగా ఎలా అవుతారు, పరమాత్మ పాలనకర్తగా ఎలా అవుతారు అన్నది నషాతో చెప్పగలరు. బ్రహ్మా-తల్లి యొక్క పాలన కూడా లభిస్తుంది మరియు తండ్రి శ్రేష్ఠ మతంపై యోగ్యాత్మలుగా అయ్యారు. తండ్రి పిల్లలను యోగ్యులుగా తయారుచేస్తారు మరియు తల్లి శక్తిశాలిగా తయారుచేస్తుంది. రెండు అనుభవాలు ఉన్నాయి కదా అచ్ఛా!
గీతా పాఠశాలకు చెందినవారు ఎక్కువ మంది వచ్చారు. గీతా పాఠశాల వారు ఎవరు? గీతా జ్ఞానాన్ని వినే ‘‘అర్జునులు’’. అర్జునులుగా భావిస్తూ గీతా జ్ఞానాన్ని వింటారా లేక అర్జునుడంటే వేరే వారా? ‘‘నేనే అర్జునుడను’’ అని భావిస్తున్నారా? సదా ఇదే అనుభవం చేస్తూ వినండి - నేను అర్జునుడను, నాకు విశేషంగా భగవంతుడు గీతా జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. గీతా పాఠశాల వారైతే అందరికంటే నంబర్‌వన్‌గా తయారవుతారు. ఈ విధితో విన్నట్లయితే ముందుకు వెళ్ళిపోతారు. టీచర్లు బిజీగా ఉండేందుకు గీతా పాఠశాలలు బాగున్నాయి. గీతా పాఠశాల చక్రవర్తిగా కూడా తయారుచేస్తుంది, బిజీగా కూడా ఉంచుతుంది, బుద్ధి కూడా మంచిగా అవుతుంది. తక్కువ శ్రమ తీసుకుంటారు, సహాయకులుగా ఎక్కువగా అవుతారు. బలిహారమైతే గీతా పాఠశాల వారిదే కదా, అందుకే గ్రామాలలో నివసించేవారు తండ్రికి ప్రియమనిపిస్తారు. పెద్ద స్థానాలలో మాయ కూడా పెద్ద రూపంలో వస్తుంది. గ్రామాలలో ఉన్నవారికి మాయ కూడా గ్రామం వంటిదే వస్తుంది. అందుకే గ్రామాల వారు చాలా మంచివారు. ఎక్కువ సంఖ్య ఎక్కడ నుండి వచ్చారు? కానీ ఇప్పుడైతే అందరూ మధుబన్ నివాసులే.
టీచర్లందరి పర్మనెంట్ అడ్రస్ ఏమిటి? మధుబన్యే కదా. అది దుకాణం, ఇది ఇల్లు. ఎక్కువగా ఏది గుర్తుంటుంది, ఇల్లా లేక దుకాణమా? కొంతమందికి దుకాణం ఎక్కువగా గుర్తుంటుంది. నిదురిస్తున్నా కూడా దుకాణమే గుర్తుకొస్తుంది. మీరైతే ఎక్కడ కావాలనుకుంటే అక్కడ బుద్ధిని స్థితి చేయగలరు. సేవాకేంద్రంలో ఉంటూ కూడా మధుబన్ నివాసులుగా అవ్వగలరు మరియు మధుబన్‌లో ఉంటూ కూడా సేవాధారిగా అవ్వగలరు. ఈ అభ్యాసముంది కదా. సెకండులో ఆలోచించారు మరియు స్థితులయ్యారు. ఇది టీచర్ల స్థితి యొక్క విశేషత. బుద్ధి కూడా సమర్పణ అయింది కదా లేక కేవలం సేవ కోసమే సమర్పితమా? సమర్పిత బుద్ధి అనగా ఎక్కడ కావాలనుకుంటే అక్కడ, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు స్థితులవ్వడము. ఇది విశేషతకు గుర్తు. బుద్ధి సహితంగా సమర్పితము - ఇలా ఉన్నారు కదా లేక బుద్ధి ద్వారా సగం సమర్పితమై మరియు శరీరంతో పూర్తిగా సమర్పితమయ్యారా?
కొంతమంది టీచర్లు కూడా అంటారు - యోగంలో కూర్చున్నప్పుడు, ఆత్మాభిమానులుగా అయ్యేందుకు బదులుగా సేవ గుర్తుకొస్తుంది. కానీ అలా ఉండకూడదు ఎందుకంటే చివరి సమయంలో ఒకవేళ అశరీరిగా అయ్యేందుకు బదులుగా సేవ యొక్క సంకల్పాలు నడిచినా కూడా, సెకండు యొక్క పేపర్లో ఫెయిల్ అయిపోతారు. ఆ సమయంలో ఒక్క తండ్రి, నిరాకారి, నిర్వికారి, నిరహంకారి - ఇవి తప్ప ఇంకేమీ గుర్తుకు రాకూడదు. బ్రహ్మా తండ్రి అంతిమ స్థితి ఇదే తయారుచేసుకున్నారు కదా - పూర్తి నిరాకారి. సేవలో మళ్ళీ సాకారంలోకి వచ్చేస్తారు. అందుకే ఈ అభ్యాసం చేయండి - ఏ సమయంలో ఏ స్థితి కావాలనుకుంటే ఆ స్థితి లేకపోతే మోసపోతారు. ఇలా ఆలోచించకండి - సేవ యొక్క సంకల్పాలే వచ్చాయి, చెడు సంకల్పాలు, వికల్పాలైతే రాలేదు అని. కానీ కంట్రోలింగ్ పవర్ అయితే లేనట్లే కదా. కంట్రోలింగ్ పవర్ లేకపోతే రూలింగ్ పవర్ రాదు, తర్వాత రూలర్‌గా అవ్వలేరు. కనుక అభ్యాసం చేయండి. ఇప్పటి నుండే చాలాకాలపు అభ్యాసం కావాలి. దీనిని తేలికగా తీసుకొని వదలకండి. కనుక విన్నారా, టీచర్లు ఏ అభ్యాసం చేయాలో? అప్పుడే అంటారు - టీచర్లు తండ్రిని ఫాలో చేసేవారు అని. సదా బ్రహ్మా తండ్రిని ఎదురుగా ఉంచుకోండి మరియు మూడు వరదానాలను గుర్తుంచుకోండి మరియు ఫాలో చేయండి. ఇది సహజమే కదా. ఈ అంతిమ వరదానం చాలా శక్తిశాలి వరదానము. ఒకవేళ ఈ మూడు వరదానాలను సదా స్మృతిలో ఉంచుకుంటూ, ప్రాక్టికల్లోకి తీసుకువచ్చినట్లయితే తండ్రి హృదయసింహాసనానికి మరియు రాజ్య సింహాసనానికి అధికారులుగా తప్పకుండా అవుతారు. అచ్ఛా! తండ్రి సమానమైన, సదా నాలెడ్జ్‌ఫుల్, పవర్ఫుల్ పిల్లలందరికీ, సదా భాగ్యవిధాత ద్వారా స్పష్టమైన, శ్రేష్ఠ భాగ్య రేఖలు కల భాగ్యశాలీ పిల్లలకు, సదా తండ్రి సమానంగా మూడు వరదానాలు ప్రాప్తించుకున్న విశేషాత్మలకు, సదా బ్రాహ్మణ జన్మ యొక్క పాలన మరియు చదువును ముందుకు తీసుకువెళ్ళేవారు - ఇటువంటి అఖండ భాగ్యశాలీ పిల్లలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
అవ్యక్త బాప్‌దాదా జోన్ల వారీగా పిల్లలను కలిసారు
మహారాష్ట్ర గ్రూప్:- సదా స్వయాన్ని సర్వ ప్రాప్తులతో నిండుగా అనుభవం చేస్తున్నారా? ఎప్పుడూ ఖాళీగా అయిపోవడం లేదు కదా? ఎందుకంటే తండ్రి ఇన్ని ప్రాప్తులను చేయించారు. ఒకవేళ సర్వ ప్రాప్తులను స్వయంలో జమ చేసుకున్నట్లయితే, ఎప్పుడూ ఖాళీ అవ్వలేరు. ఈ జన్మ విషయమే కాదు, కానీ అనేక జన్మలు కూడా ఇక్కడి నిండుతనమే తోడుగా ఉంటుంది. కనుక భవిష్యత్తుకు కూడా సరిపడేంతగా ఇచ్చినప్పుడు, ఇప్పుడు ఖాళీగా ఎలా అవుతారు? ఒకవేళ బుద్ధి ఖాళీగా ఉంటే అలజడి ఉంటుంది. ఏ వస్తువైనా ఒకవేళ పూర్తిగా నిండుగా లేకపోతే, దానిలో అలజడి ఉంటుంది. కనుక నిండుగా ఉన్నదానికి గుర్తు - మాయకు వచ్చేందుకు మార్జిన్ (అవకాశం) ఉండదు. మాయనే కదిలిస్తుంది. మరి మాయ వస్తుందా, రాదా? సంకల్పంలోనైనా వస్తుందా? మాయ రాజ్యంలోనైతే అర్థకల్పము అనుభవం చేసారు మరియు ఇప్పుడు తమ రాజ్యంలోకి వెళ్తున్నారు. ఎప్పుడైతే మాయాజీతులుగా అవుతారో, అప్పుడు మళ్ళీ తమ రాజ్యం వస్తుంది మరియు మాయాజీతులుగా అయ్యేందుకు సహజ సాధనం - సదా ప్రాప్తులతో నిండుగా ఉండండి. ఏ ఒక్క ప్రాప్తితోనూ వంచితులుగా కాకండి. సర్వప్రాప్తులు ఉండాలి. అంతేకానీ, ఇలా ఉండకూడదు, ఒక్క విషయం లేకపోయినా ఏమీ ఫర్వాలేదు. ఒకవేళ ఏ కొంచెం లోపం ఉన్నా కూడా, మాయ విడిచిపెట్టదు, ఆ స్థానం నుండి కదిలిస్తుంది. కనుక మాయ వచ్చేందుకు మార్జినే ఉండకూడదు. అది రావడము, మళ్ళీ దానిని పారద్రోలడము, ఇందులో సమయం పోతుంది. కనుక మాయాజీతులుగా అయ్యారా? 2 సంవత్సరాలు లేక 3 సంవత్సరాలలో అయిపోతామని ఆలోచించకండి. బ్రాహ్మణుల కోసం స్లోగన్ - “ఇప్పుడు లేకపోతే ఇంకెప్పుడూ లేదు” ఇప్పుడు సమయం యొక్క వేగం అనుసారంగా ఏ సమయంలోనైనా ఏదైనా జరగవచ్చు. అందుకే తీవ్ర పురుషార్థులుగా అవ్వండి. అచ్ఛా!
రాజస్థాన్ - సౌరాష్ట్ర గ్రూప్ :- స్వయాన్ని బాబా హృదయ సింహాసనాధికారి శ్రేష్ఠ ఆత్మలుగా అనుభవం చేసుకుంటున్నారా? హృదయ సింహాసనమే సర్వశ్రేష్ఠమైన స్థానము. సదా బాబా హృదయ సింహాసనంపై ఉండేవారు సదా సురక్షితంగా ఉంటారు. రక్షణకు నిజమైన స్థానం ‘హృదయ సింహాసనం’. మరేదైనా భద్రతా స్థానాలను ఏర్పాటు చేసుకుంటే దానిని ఎవరైనా దాటవచ్చు. కానీ బాబా హృదయ సింహాసనాధికారిగా ఉండే ఆత్మను మాయ ఎన్నడూ దాటలేదు. మరి ఇలాంటి రక్షణ స్థానంలో స్థితులై ఉంటున్నారా? లేక అప్పుడప్పుడు ఆ సేఫ్టీ స్థానం నుండి బయటకు వచ్చేస్తున్నారా? రక్షణ స్థానం లభించినప్పుడు సురక్షితంగానే ఉండాలి కదా. పూర్తి కల్పంలోనూ ప్రశాంతంగా తింటూ, తాగుతూ, ఆనందిస్తూ మరియు సురక్షితంగా ఉండే ఇలాంటి స్థానం ఎక్కడా లభించదు. ఇలాంటి గ్యారెంటీని మరెవరూ ఇవ్వలేరు. ప్రభుత్వానికి చెందిన ఎంత పెద్ద అధికారైనా సరే, మీరు సురక్షితంగా ఉంటారు అనే గ్యారెంటీ ఇవ్వలేరు. మీ రక్షణ కొరకు కేవలం తుపాకులు కలవారినో, బ్లాక్ క్యాట్ కమాండోలనో కేటాయిస్తారు; దాంతో ఇంకా జైల్లో ఉన్నట్లే అనిపిస్తుంది, ఏదో రాయల్ జైల్లో ఉన్నట్లుగా ఉంటుంది. ఇటు చూసినా బ్లాక్ క్యాట్, అటు చూసినా బ్లాక్ క్యాట్. మరి ఇది జైలా లేక భద్రతా? కానీ బాబా అయితే మాయా బంధనాల నుండే విముక్తి కలిగిస్తారు, నిర్భయులుగా తయారుచేస్తారు. మరి ఇలాంటి స్థానం నచ్చిందా లేక అప్పుడప్పుడు కొద్దిగా బయటకు రావాలని మనసుకు అనిపిస్తుందా? సదా హృదయ సింహాసనాధికారులుగా ఉండేవారు నిశ్చయంగానే నిశ్చింతగా ఉంటారు. ‘జరగబోయేది తప్పదు, అచలమైనది’ అని లోకంలో అంటుంటారు కదా. అలాగే హృదయ సింహాసనాధికారి అయిన ఆత్మ నిర్భయంగా, నిశ్చింతగా ఉంటుంది - ఇది నిశ్చితమైనది, అచలమైనది. హృదయ సింహాసనంపైకి మాయ రాలేదు. కొద్దిగా ఆకర్షణ కలిగించి బయటకు లాగేందుకు ప్రయత్నం తప్పక చేస్తుంది. సీత గురించి చూపిస్తారు కదా - గీత దాటి బయటకు పాదం పెట్టగానే రావణుడు వచ్చాడు, లేకపోతే రాలేకపోయాడు. కాబట్టి బయటకు రావాలనే సంకల్పం వచ్చినా మాయ వచ్చేస్తుంది. అదే హృదయ సింహాసనంపై ఉంటే రాలేదు. కాబట్టి కేవలం హృదయ సింహాసనంపై కూర్చోండి. ఇందులో కష్టమైనదేముంది? కొందరికి లేవడం, కూర్చోవడం, తిరగడం అలవాటుగా ఉంటుంది, ఒక్కచోట స్థిరంగా కూర్చోలేరు. ఎంత మంచి స్థానం ఇచ్చి కూర్చోబెట్టినా కానీ నాట్యం చేస్తూనే ఉంటారు. కానీ మీ ప్రతిజ్ఞ ఏమిటి? ఎక్కడ కూర్చోబెడితే అక్కడ, ఏది తినిపిస్తే అది, ఏది తొడిగితే అది, ఏది చేయిస్తే అది చేస్తాము అని. ఈ ప్రతిజ్ఞ పక్కాగా ఉంది కదా లేక కొద్దిగా మీ ఇష్టప్రకారం, మిగిలినది బాబా ఇష్టప్రకారం చేస్తారా? బాబాకు వచ్చే నష్టమేమీ లేదు కానీ శ్రమ మీరే పడాల్సి వస్తుంది. పిల్లల శ్రమ బాబాకు నచ్చదు. శ్రమపడి పడి అలసిపోయారు. ఇప్పుడూ శ్రమపడటం బాబాకు నచ్చదు. అందువలన హృదయ సింహాసనాధికారులుగా కండి. ఇదే నషాలో ఉండండి. ఈ రోజుల్లో కుర్చీ (పదవి) వస్తేనే ఎంతో నషా ఉంటుంది. ఇదైతే సింహాసనం. ఎక్కడైతే ఆత్మిక నషా ఉంటుందో అక్కడ దుఃఖపు అల రాదు, సంతోషమే ఉంటుంది. కాబట్టి ఇప్పుడూ సింహాసనాధికారులము మరియు అనేక జన్మలు రాజ్య సింహాసనాధికారులుగా అవుతాము అనే ఈ స్మృతిని సదా ఉంచుకోండి. రాజస్థాన్‌కు రాజగద్దెపై కూర్చోవాలనే నషా ఉంది. కానీ రాజస్థాన్ ప్రజలను తక్కువగా తయారుచేసింది. గుజరాత్ పెద్ద సంఖ్యలో ప్రజలను తయారుచేసింది. గతసారి కూడా రాజస్థాన్‌కు చెప్పాము - ఇప్పుడు కాస్త వృద్ధి చేయండి అని. సరే, క్వాంటిటీ కాకపోతే క్వాలిటీ తీసుకురండి, అప్పుడూ సరిపోతుంది. రాజస్థాన్ ప్రజలు వారి పేరు వినగానే - ‘అవును, వీరు చెప్పేది నిజమే’ అని భావించేలాంటి క్వాలిటీని తీసుకురండి. కాబట్టి క్వాంటిటీ అయినా పెంచండి లేదా క్వాలిటీ అయినా పెంచండి. జరగనిది ఏముంది, బ్రాహ్మణుల భాగ్యంలో అంతా నిశ్చయించబడి ఉంది, కేవలం రిపీట్ చేయడమే. దీని కొరకు టచింగ్ కావాలి; బుద్ధి స్పష్టంగా (క్లియర్‌గా) ఉంటే టచ్ అవుతుంది మరియు సఫలత లభిస్తుంది. అచ్ఛా! గుజరాత్ వారికి కూడా బాప్‌దాదా చెప్తున్నారు - రాత్రి గడిచిపోయింది, గతించిపోయింది (రాత్ గుజర్ గయీ). ఇక రాజులుగా అవుతారు కదా. అచ్ఛా!
పంజాబ్ - బనారస్ గ్రూప్ :- సదా ప్రతి కర్మ చేస్తూ స్వయాన్ని కర్మయోగి ఆత్మగా అనుభవం చేసుకుంటున్నారా? ఏ కర్మ చేస్తున్నా స్మృతి మరచిపోకూడదు. కర్మ మరియు యోగం - రెండూ కంబైన్డ్ అయిపోవాలి. కలిసిపోయిన ఒక వస్తువును ఎవరూ ఎలాగైతే వేరు చేయలేరో, అలాగే కర్మయోగి ఆత్మలుగా ఉండాలి. శరీరం మరియు ఆత్మ కంబైన్డ్‌గా ఉన్నప్పుడే జీవించి ఉన్నారని అంటారు, అదే శరీరం నుండి ఆత్మ వేరైతే జీవితం సమాప్తమైంది అంటారు. అలాగే కర్మయోగి జీవితం అనగా యోగం లేకుండా కర్మ లేదు, కర్మ లేకుండా యోగం లేదు. సదా కంబైన్డ్. మరి యోగి జీవితం కలవారా లేక యోగం చేసేవారా? రెండు గంటలు యోగం చేసే యోగులైతే కారు కదా? అమృతవేళ యోగం చేస్తే యోగి అయ్యారు, కర్మలోకి రాగానే కర్మ మాత్రమే గుర్తుండిపోయింది - దీనిని యోగి జీవితం అనము. స్మృతి లేకుండా కర్మ లేదు. జీవితం నిరంతరం ఉంటుంది, రెండు గంటల జీవితం కాదు. ఎవరిదైతే యోగి జీవితమో వారి యోగం స్వతహాగా మరియు సహజంగా ఉంటుంది, శ్రమపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే యోగం అసలు తెగిపోనే తెగిపోదు, ఇక శ్రమ ఎందుకు పడతారు! విరిగిపోతే కదా జోడించే శ్రమ పడేది. ఇలా కంబైన్డ్ అనుభవం చేసుకునేవారు ఎన్నడూ మాయా వశమై - యోగం ఎలా చేయాలి, నిరంతర యోగం ఎలా కుదురుతుంది అని ప్రశ్నలు వేయరు. స్మృతి చేసేవారికి ఎలాంటి ఫిర్యాదు చేయవలసిన ఆవశ్యకతే ఉండదు. బాబా, నా ఈ పని చేసిపెట్టండి, ఇది చేయించండి, దీనిని సంభాళించండి, దీని తాళం తెరవండి - ఇవన్నీ ఫిర్యాదులు. ఆ తర్వాత స్వతహాగానే సర్వ కార్యాలూ సఫలమైపోతాయి. మీరు స్మృతి చేసేవారా లేక ఫిర్యాదులు చేసేవారా? తండ్రి ఎదుట అప్పుడప్పుడు ఆ ఫైలు, అప్పుడప్పుడు ఈ ఫైలు పెట్టేవారు కారు కదా? ఫైన్ (ఉన్నతంగా) అయ్యేవారికి ఎలాంటి ఫైలూ ఉండదు. కర్మయోగి జీవితం సర్వ ప్రాప్తుల జీవితం. ఎలాంటి అప్రాప్తీ మిగిలి ఉండదు. ఎందుకంటే దాత పిల్లలు. దాత పిల్లలు సదా సంపూర్ణులు. ఇతరులతో చెప్తారు కదా - ‘యోగి జీవితాన్ని గడిపి చూడండి’ అని. స్వయంగా అనుభవజ్ఞులైనప్పుడే కదా చెప్పేది. జీవించడమంటూ ఉంటే అది యోగి జీవితమే. బాప్‌దాదాకు యోగి జీవితం గల పిల్లలు అత్యంత ప్రియమైనవారు, అత్యంత సమీపమైనవారు. అచ్ఛా!
హైదరాబాద్ - భోపాల్ గ్రూప్ :- సదా తమను తాము సంతుష్ట ఆత్మగా అనుభవం చేసుకుంటున్నారా? ఎందుకంటే జ్ఞానీ-యోగీ ఆత్మల గుర్తే సంతుష్టత. ఎక్కడ సంతుష్టత ఉంటుందో అక్కడ సర్వ గుణాలు మరియు సర్వ శక్తులు ఉంటాయి. ఏ ఒక్క గుణం లేదా శక్తి అప్రాప్తిగా ఉన్నా ఆ అప్రాప్తికి గుర్తు ‘అసంతుష్టత’ మరియు ప్రాప్తుల గుర్తు ‘సంతుష్టత’. సంతుష్ట ఆత్మ డ్రామాలోని ప్రతి దృశ్యాన్నీ చూసి ‘వాహ్ డ్రామా వాహ్’ అంటుంది; సదా సంతుష్టంగా లేనివారైతే అప్పుడప్పుడు ‘వాహ్ వాహ్’ అంటారు, అప్పుడప్పుడు - ‘అయ్యో, ఇదేమి జరిగిపోయింది, ఇలా జరిగి ఉండకూడదు కానీ జరిగిపోయింది!’ అని అంటారు. కాబట్టి సంతుష్టత అనేది ఒక గని. అఖండమైన గని, ఎన్నటికీ తరగనిది. ఎంతగా ఇస్తూ ఉంటారో అంతగా పెరుగుతూనే ఉంటుంది. మరి మీరందరూ సంతుష్ట ఆత్మలే కదా. సంతుష్టంగా ఉండేందుకే మరజీవగా మారారు. ‘ఇచ్ఛా మాత్రమ్ అవిద్య’ - ఈ గానం ఎవరిది? దేవతలదా లేక బ్రాహ్మణులదా? దేవతా జీవితంలోనైతే కోరిక లేదా కోరిక లేకపోవడం అనే ప్రశ్నే రాదు. ఇక్కడే నాలెడ్జ్ ఉంది - కోరిక అంటే ఏమిటి, నిష్కామ స్థితి అంటే ఏమిటి అని. కాబట్టి నాలెడ్జ్ ఉంటూ ‘ఇచ్ఛా మాత్రమ్ అవిద్య’గా కావడాన్నే బ్రాహ్మణ జీవితం అంటాము. దేని పట్ల కోరిక ఉంటుంది? రచయితే మనవారైనప్పుడు ఇక రచన ఎక్కడికి పోతుంది? రచయితను తమవారిగా చేసుకున్నారు కదా, చక్కగా చేసుకున్నారా లేక ఢీలాగానా? భగవంతుడిని కూడా తాడుతో కట్టేశారు అని మాతల గురించి గాయనం ఉంది. మరి గట్టిగా కట్టేశారా? ఇది స్నేహం అనే తాడు. మరి స్నేహం అనే తాడు బలంగా ఉంది కదా, ఇది ఎన్నడూ తెగిపోదు. ఇవన్నీ కేవలం నిమిత్తమాత్ర దృష్టాంతాలు. ఎక్కడైతే బాబా ఉన్నారో అక్కడ సర్వస్వమూ ఉంది, అందుకే ‘బాబా లభించారు సర్వస్వం లభించింది’ అని పాడుకుంటారు. లభించినదంతా ఎంతగా లభించిందంటే - సర్వ కోరికలనూ ఒకచోట చేర్చినా దానికంటే పదమా రెట్లు ఎక్కువ లభించింది, ఇక దాని ఎదుట కోరిక ఏపాటిది? సూర్యుని ఎదుట దీపం లాంటిది. సర్వ ప్రాప్తుల ఎదుట ఎంతటి మంచి కోరికైనా సరే, అది చిన్న దీపంతో సమానం. అందువలన సదా సంతుష్టంగా ఉండాలి. ప్రశ్నే తలెత్తదు. కోరిక పుట్టే విషయం పక్కన పెడితే అసలు కోరిక అనేది కూడా ఉంటుందా - అనే ఈ ప్రశ్నే రాకూడదు. అంతటి సమాప్తి జరిగిపోయింది, నామరూపాలు లేవు. ఎందుకంటే కొద్దిగా అంశ మిగిలి ఉన్నా ఆ అంశ నుండే వంశం పుడుతుంది. అంశమాత్రంగా కూడా ఉండకూడదు. అందుకే చూడండి, రావణుడిని కాలుస్తారు కూడా; మొదట చంపుతారు, ఆ తర్వాత కాలుస్తారు. కాల్చివేసి పూర్తిగా సమాప్తం చేస్తారు. అంశమాత్రం కూడా మిగలకూడదు. మరి ఎలాంటి అంశమూ లేదు కదా? స్థూల రూపంలో రావణుడి తలలు సమాప్తమయ్యాయి, కానీ సూక్ష్మంలో లేవు కదా? చాలామంది - ‘కోరికైతే లేదు కానీ నచ్చుతుంది’ అని అంటారని గతంలో వినిపించాము. స్థూల రూపంలో ‘కోరిక లేదు’ అంటారు, సూక్ష్మ రూపంలో ‘బాగుంటుంది’ అంటారు. నచ్చింది అంటే బుద్ధి అటువైపు మొగ్గు చూపుతుంది కదా. బాగుంది బాగుంది అనుకుంటూ చివరకు కోరికగా మారిపోతుంది. మంచిగా అనిపిస్తే అంతా మంచిగానే అనిపిస్తుంది. ఒక వస్తువు మాత్రమే ఎందుకు నచ్చాలి, ఏదో ఒక వ్యక్తి మాత్రమే ఎందుకు నచ్చాలి, ఏదో ఒక పని మాత్రమే ఎందుకు బాగుండాలి? సర్వమూ మంచిదే. కొందరు ఈ ఆత్మ యొక్క యోగం బాగుంటుంది, ఈ ఆత్మ యొక్క ప్రసంగం బాగుంటుంది అని అంటుంటారు. కానీ ఇది కూడా ఫలానాది బాగుంది, ఫలానాది బాగోలేదు అనుకోవడం సరైనది కాదు. ఒకవేళ నచ్చినా అది బాబాది కదా. బాబా నచ్చాలి కదా. ఒకవేళ ఏదైనా వ్యక్తి నచ్చితే ఇక కోరికల వరుస మొదలైపోతుంది. బాబా నచ్చితే అంశమాత్రంగా కూడా మాయ రాలేదు. ఒకవేళ ఎవరిలోనైనా గుణాలు బాగుంటే అవి కూడా బాబా ప్రసాదించినవే. అందువలన బాబాయే నచ్చాలి. అప్పుడు సదా సంతుష్టంగా ఉంటారు. పిల్లపాపలను లోపల దాచిపెట్టుకోకండి. పిల్లపాపలు కూడా లోపల దాగి ఉంటే సదా సంతుష్టంగా ఉండలేరు. అనంతమైన సేవ విషయం వేరు; కానీ నా కొరకు ఇది జరగాలి, అది జరగాలి అనుకోవడం - ఈ హద్దు విషయాలే అసంతుష్టపరుస్తాయి. అనంతం కొరకు ఎంత కావాలంటే అంత ఆలోచించండి, మీ కొరకు హద్దు విషయాలను ఆలోచించకండి. మరి అందరూ సంతుష్టమణులే కదా? సంతుష్టమణి అనగా సదా ఆత్మికతతో ప్రకాశించేవారు. అచ్ఛా!
*** ఓంశాంతి ***
