‘‘తీవ్ర పురుషార్థము యొక్క తపనను జ్వాలా రూపంగా చేసి అనంతమైన వైరాగ్యము యొక్క అలను వ్యాపింపజేయండి’’
ఈరోజు బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకముపై మూడు రేఖలను చూస్తున్నారు. వాటిలోని మొదటి రేఖ - పరమాత్మ పాలన యొక్క భాగ్య రేఖ. ఈ పరమాత్మ పాలనా భాగ్యము మొత్తము కల్పములో ఇప్పుడు ఒక్కసారే లభిస్తుంది, ఈ సంగమయుగములో తప్ప ఈ పరమాత్మ పాలన మరెప్పుడూ ప్రాప్తించదు. ఈ పరమాత్మ పాలన చాలా కొద్దిమంది పిల్లలకే ప్రాప్తిస్తుంది. రెండవ రేఖ - పరమాత్మ చదువు యొక్క భాగ్య రేఖ. పరమాత్మ చదువు, ఇది ఎంతటి భాగ్యము, ఎందుకంటే స్వయంగా పరమాత్మ శిక్షకునిగా అయ్యి చదివిస్తున్నారు. మూడవ రేఖ - పరమాత్మ ప్రాప్తుల రేఖ. ఎన్ని ప్రాప్తులు ఉన్నాయో ఆలోచించండి. అందరికీ గుర్తుంది కదా - ప్రాప్తుల లిస్టు ఎంత పెద్దది! ప్రతి ఒక్కరి మస్తకముపై ఈ మూడు రేఖలు మెరుస్తూ ఉన్నాయి. స్వయాన్ని ఇటువంటి భాగ్యవంతులైన ఆత్మలుగా భావిస్తున్నారా? పాలన, చదువు మరియు ప్రాప్తులు. అలాగే బాప్‌దాదా పిల్లల నిశ్చయము ఆధారంగా కలిగే ఆత్మిక నషాను కూడా చూస్తున్నారు. పరమాత్ముని పిల్లలు ప్రతి ఒక్కరూ ఎంతటి ఆత్మిక నషా కల ఆత్మలు! మొత్తము విశ్వములో మరియు మొత్తము కల్పములో అందరికంటే హైయెస్ట్ (అతి ఉన్నతమైనవారు) కూడా, గొప్పవారు కూడా మరియు హోలియెస్ట్ (అతి పవిత్రమైనవారు) కూడా. మీ వలె తనువు ద్వారా కూడా, మనస్సు ద్వారా కూడా పవిత్ర ఆత్మలుగా మరియు దేవతా రూపంలో సర్వగుణ సంపన్నులుగా, సంపూర్ణ నిర్వికారులుగా ఇంకెవ్వరూ అవ్వరు. అంతేకాక మీరు హైయెస్ట్ కూడా, హోలియెస్ట్ కూడా, అలాగే రిచెస్ట్ కూడా (అతి ఉన్నతులు, అతి పవిత్రులు, అతి సంపన్నులు). బాప్‌దాదా స్థాపనా సమయంలో కూడా పిల్లలకు ఈ స్మృతిని ఇప్పించేవారు మరియు వార్తాపత్రికలలో కూడా ‘‘ఓం మండలి రిచెస్ట్ ఇన్ ది వరల్డ్’’ (ప్రపంచంలోకెల్లా ధనవంతమైనది ఓం మండలి) అని శుద్ధమైన నషాతో వేయించారు. స్థాపనా సమయంలో ఇది మీ అందరి మహిమ. ఎంత పెద్ద కోటీశ్వరుడైనా కానీ ఒక్క రోజులో మీ అంతటి రిచెస్ట్‌గా అవ్వలేరు. ఇంత రిచెస్ట్‌గా అయ్యేందుకు సాధనము ఏమిటి? అది చాలా చిన్న సాధనము. లోకులు చాలా రిచెస్ట్‌గా అయ్యేందుకు ఎంతగా కష్టపడుతుంటారు కానీ మీరు ఎంత సహజంగా సంపన్నులుగా అవుతూ ఉంటారు! సాధనము ఏమిటో తెలుసు కదా! కేవలం ఒక చిన్న బిందువును పెట్టాలి, అంతే. బిందువును పెట్టారు, సంపాదన కలిగింది. ఆత్మ కూడా బిందువు, బాబా కూడా బిందువు మరియు డ్రామాకు ఫుల్స్టాప్ పెట్టడము, అది కూడా బిందువే. కనుక బిందువైన ఆత్మను గుర్తు చేసారు, సంపాదన పెరిగింది. మామూలుగా లౌకికములో కూడా చూడండి, బిందువును పెట్టడం వల్ల సంఖ్య విలువ పెరుగుతుంది. 1 పక్కన బిందువు (సున్నా) పెట్టడం వల్ల ఏమవుతుంది? 10 అవుతుంది, రెండు బిందువులు పెట్టండి, మూడు బిందువులు పెట్టండి, నాలుగు బిందువులు పెట్టండి, అలా సంఖ్య విలువ పెరుగుతూ ఉంటుంది. మరి మీ సాధనము ఎంత సహజమైనది! ‘‘నేను ఆత్మను’’ - ఈ స్మృతి బిందువును పెట్టడము అనగా ఖజానా జమ అవ్వటము. అలాగే ‘‘బాబా’’ అన్న బిందువును పెట్టండి, ఖజానా జమ అవుతుంది. కర్మలలో, సంబంధ-సంపర్కాలలో డ్రామా అన్న ఫుల్‌స్టాప్‌ను పెట్టండి, గతానికి ఫుల్స్టాప్ పెట్టారంటే ఖజానా పెరుగుతుంది. మరి చెప్పండి, మొత్తము రోజంతటిలో ఎన్ని సార్లు బిందువును పెడుతున్నారు? బిందువును పెట్టడము కూడా ఎంత సహజము! కష్టమా? బిందువు జారిపోతుందా ఏమిటి?
బాప్‌దాదా సంపాదనకు సాధనంగా కేవలం ఇదే నేర్పించారు - బిందువును పెడుతూ వెళ్ళండి, మరి అందరికీ బిందువు పెట్టడం వస్తుందా? ఒకవేళ వస్తుంది అని అనుకుంటే ఒక్క చేతితో చప్పట్లు కొట్టండి. పక్కానే కదా! లేకపోతే ఒక్కోసారి జారిపోతుంది, ఒక్కోసారి పెడుతున్నారా? అన్నింటికన్నా సహజము - బిందువును పెట్టడము. ఎవరికైనా ఈ నేత్రాల పరంగా కళ్ళు కనిపించకపోయినా, వారు కూడా ఒకవేళ కాగితంపై పెన్సిల్ పెడితే బిందువు పడుతుంది, మరి మీరైతే త్రినేత్రులు, అందుకే ఈ మూడు బిందువులను సదా ఉపయోగించండి. ప్రశ్న చిహ్నం ఎంత వంకరగా ఉంటుంది. వ్రాసి చూడండి, వంకరగా ఉంటుంది కదా? కానీ బిందువు ఎంత సహజమైనది. అందుకే బాప్‌దాదా రకరకాల రూపాలలో పిల్లలకు సమానులుగా అయ్యే విధిని వినిపిస్తుంటారు. బిందువే విధి. మరే విధి లేదు. ఒకవేళ విదేహీగా అయినా, దానికి కూడా విధి - బిందువుగా అవ్వటమే, అశరీరిగా అయినా లేక కర్మాతీతులుగా అయినా అన్నింటికీ విధి - బిందువే. అందుకే బాప్‌దాదా ఇంతకుముందు కూడా చెప్పారు - అమృతవేళ బాప్‌దాదాతో మిలనము జరుపుకుంటూ, ఆత్మిక సంభాషణ చేస్తూ, ఎప్పుడైతే కార్యంలోకి వస్తారో, అప్పుడు మొదట 3 బిందువుల తిలకాన్ని మస్తకముపై పెట్టుకోండి, ఆ ఎరుపు రంగు బిందువులు కల తిలకాన్ని పెట్టుకోవటము మొదలుపెట్టకండి, స్మృతి అనే తిలకాన్ని పెట్టుకోండి. మరియు చెక్ చేసుకోండి - ఏ కారణం చేత కూడా ఈ స్మృతి తిలకము చెరిగిపోవటం లేదు కదా. ఇది అవినాశీ చెరిగిపోని తిలకము కదా?
బాప్‌దాదా పిల్లల ప్రేమను కూడా చూస్తారు, మిలనాన్ని జరుపుకోవటానికి ఎంత ప్రేమతో పరుగు పరుగున వస్తారు! ఈరోజు హాల్లో కూడా మిలనాన్ని జరుపుకునేందుకు ఎంత శ్రమతో, ఎంత ప్రేమతో నిద్ర, దప్పికలను కూడా మర్చిపోయి మొదటి నంబరులో సమీపంగా కూర్చునేందుకు ఎంతో పురుషార్థం చేస్తారు! ఏమేమి చేస్తున్నారో అవన్నీ బాప్‌దాదా చూస్తారు. ఆ డ్రామా అంతా చూస్తారు. బాప్‌దాదా పిల్లల ప్రేమపై బలిహారమవుతారు కూడా మరియు పిల్లలతో ఇదే చెప్తారు - ఏ విధంగా సాకారముగా మిలనము జరుపుకునేందుకు పరుగు పరుగున వస్తారో, అదే విధంగా బాబా సమానంగా అయ్యేందుకు కూడా తీవ్ర పురుషార్థము చెయ్యండి. అందరికంటే ముందు స్థానంలో కూర్చోవాలని అనుకుంటారు కదా. కానీ అది అందరికీ లభించదు, ఎందుకంటే ఇక్కడిది సాకారీ ప్రపంచము కదా, కనుక సాకార ప్రపంచ నియమాలను పాటించవలసే ఉంటుంది. అందరూ ముందు ముందు స్థానాలలో కూర్చోవాలనే ఆ సమయంలో బాప్‌దాదా అనుకుంటారు కానీ అది సాధ్యమవుతుందా? సాధ్యమవుతూ ఉంది కూడా, కానీ ఎలా? వెనుక ఉన్నవారిని బాప్‌దాదా సదా నయనాలలో ఇమిడి ఉన్నట్లుగా చూస్తారు. అన్నింటికంటే సమీపమైనవి నయనాలు. కనుక మీరు వెనుక కూర్చోలేదు కానీ బాప్‌దాదా నయనాలలో కూర్చున్నారు. మీరు కంటి రత్నాలు. వెనుక ఉన్నవారు విన్నారా? మీరు దూరంగా లేరు, సమీపంగా ఉన్నారు. శరీర పరంగా వెనుక కూర్చున్నారు కానీ ఆత్మ అందరికన్నా సమీపంగా ఉంది. మరియు బాప్‌దాదా అయితే అందరికంటే ఎక్కువగా వెనుక ఉన్నవారినే చూస్తారు. చూడండి, దగ్గరగా కూర్చున్నవారికి ఈ స్థూల నయనాల ద్వారా చూసేందుకు అవకాశము ఉంది మరియు వెనుక ఉన్నవారికైతే ఈ నయనాలతో దగ్గరగా చూసే అవకాశము లేదు, అందుకని బాప్‌దాదా వారిని తమ నయనాలలో ఇముడ్చుకుంటారు.
బాప్‌దాదా నవ్వుకుంటూ ఉంటారు - మధ్యాహ్నం 2 గం. లు అవ్వగానే లైన్ మొదలైపోతుంది. బాప్‌దాదాకు పిల్లలు నిలబడి-నిలబడి అలసిపోతారు కూడా అని అర్థమవుతుంది కానీ బాప్‌దాదా పిల్లలందరికీ ప్రేమ యొక్క మసాజ్ చేస్తారు. కాళ్ళకు మసాజ్ అయిపోతుంది. బాప్‌దాదా చేసే మసాజ్‌ను చూసారు కదా - అది చాలా అతీతమైనది మరియు ప్రియమైనది. మరి ఈరోజు అందరూ ఈ సీజన్‌లోని చివరి అవకాశాన్ని తీసుకునేందుకు నలువైపుల నుండి పరుగు పరుగున చేరుకున్నారు. మంచిది. బాబాతో మిలనము జరుపుకోవాలన్న ఉల్లాస-ఉత్సాహాలు సదా ముందుకు తీసుకువెళ్తాయి. కానీ బాప్‌దాదా అయితే పిల్లలను ఒక్క క్షణం కూడా మర్చిపోరు. బాబా ఒక్కరే మరియు పిల్లలు అనేకులు, అయినా కానీ అనేకులైన పిల్లలను కూడా బాప్‌దాదా ఒక్క క్షణం కూడా మర్చిపోరు ఎందుకంటే మీరు చాలా కాలం దూరమైన తర్వాత కలిసిన పిల్లలు. చూడండి, ఎక్కడెక్కడి నుండో, దేశ-విదేశాలలోని మూల-మూలల నుండి బాబాయే మిమ్మల్ని వెతికారు. మీరు బాబాను వెతకగలిగారా? భ్రమిస్తూనే ఉన్నారు కానీ కలుసుకోలేకపోయారు కానీ బాబా అయితే భిన్న-భిన్న దేశాలు, గ్రామాలు, పట్టణాలు ఎక్కడెక్కడైతే బాబా పిల్లలు ఉన్నారో అక్కడి నుండి వెతికారు, తమవారిగా చేసుకున్నారు. ‘నేను బాబా వాడిని మరియు బాబా నా వారు’ అని పాట పాడుతారు కదా! జాతినీ చూడలేదు, దేశాన్నీ చూడలేదు, రంగునూ చూడలేదు, అందరి మస్తకముపై ఒకే ఆత్మిక రంగును చూసారు - జ్యోతిర్బిందువు. డబల్ విదేశీయులు ఏమనుకుంటున్నారు? బాబా జాతిని చూసారా? నల్లగా ఉన్నారు, తెల్లగా ఉన్నారు, శ్యామంగా ఉన్నారు, సుందరంగా ఉన్నారు అని చూసారా? అవేమీ చూడలేదు. ‘నా వారు’ అన్నదానినే చూసారు. మరి చెప్పండి, బాబాకు ప్రేమ ఉందా లేక మీకు ప్రేమ ఉందా? ఎవరికి ఉంది? (ఇద్దరికీ ఉంది). పిల్లలు కూడా సమాధానం చెప్పటంలో తెలివైనవారు. పిల్లలు అంటారు - బాబా, ప్రేమను ప్రేమ ఆకర్షిస్తుంది అని మీరే చెప్పారు కదా, మరి మీకు ప్రేమ ఉంటే మాకు కూడా ఉంటుంది కదా, అదే కదా ఆకర్షిస్తుంది. పిల్లలు కూడా తెలివైనవారు మరియు నా పిల్లలు ఇంతటి ధైర్యాన్ని మరియు ఉల్లాస-ఉత్సాహాన్ని చూపించేవారు అని బాబాకు కూడా సంతోషంగా ఉంది.
బాప్‌దాదా వద్దకు చాలామంది పిల్లలది 15 రోజుల చార్టు యొక్క రిజల్టు చేరుకుంది. ఒక విషయాన్ని అయితే బాప్‌దాదా నలువైపుల నుండి వచ్చిన రిజల్టులో చూసారు, అదేమిటంటే - మెజారిటీ పిల్లలలో అటెన్షన్ ఉంది. కానీ పర్సెంటేజ్ అనేది స్వయం ఎంత కోరుకుంటున్నారో అంతైతే లేదు, కానీ అటెన్షన్ ఉంది. అంతేకాక తీవ్ర పురుషార్థీ పిల్లలు ఎవరైతే ఉన్నారో, వారు తమ మనసు లోలోపలే ప్రతిజ్ఞను పూర్తి చెయ్యాలన్న లక్ష్యముతో ముందుకు వెళ్తున్నారు కూడా మరియు ముందుకు వెళ్తూ-వెళ్తూ గమ్యానికి తప్పకుండా చేరుకుంటారు. కొద్దిమంది మాత్రం ఇప్పుడు కూడా అప్పుడప్పుడు నిర్లక్ష్యానికి, సోమరితనానికి వశమై అటెన్షన్ కూడా తక్కువగా పెడుతున్నారు. అటువంటివారిది ఒక విశేషమైన స్లోగన్ ఉంటుంది - అయిపోతాములే, అయిపోతాములే... అని అంటారు. అయిపోవాల్సిందే అని అనరు, అయిపోతాములే అని అంటారు. అయిపోతుందిలే అని అనుకోవటమంటే అది నిర్లక్ష్యము. అవ్వాల్సిందే అని అనుకుంటే అది తీవ్ర పురుషార్థము. బాప్‌దాదా ప్రతిజ్ఞలను చాలానే వింటారు, పదే-పదే ప్రతిజ్ఞలనైతే చాలా మంచివి చేస్తారు. పిల్లలు ఈ ప్రతిజ్ఞలను ఎంత మంచి ధైర్యంతో చేస్తారంటే, ఆ సమయంలో పిల్లలు బాప్‌దాదాకు కూడా దిల్ఖుష్ మిఠాయిని తినిపించేస్తారు, బాబా కూడా తినేస్తారు. కానీ ప్రతిజ్ఞ అనగా పురుషార్థములో ఎక్కువలో ఎక్కువ లాభాన్ని పొందటము. ఒకవేళ లాభం లేదంటే ఆ ప్రతిజ్ఞ సమర్థవంతమైనది కాదు. కనుక ప్రతిజ్ఞనైతే చెయ్యండి, ఎంతైనా దిల్ఖుష్ మిఠాయినైతే తినిపిస్తారు కదా! దీనితోపాటు తీవ్ర పురుషార్థము యొక్క తపనను అగ్ని రూపంలోకి తీసుకురండి. జ్వాలాముఖులుగా అవ్వండి. సమయమనుసారంగా మనసు యొక్క, సంబంధ-సంపర్కాల యొక్క లెక్కాచారాలు ఏవైతే మిగిలి ఉన్నాయో, వాటిని జ్వాలా స్వరూపముతో భస్మం చెయ్యండి. తపన ఉంది, ఈ విషయంలో బాప్‌దాదా కూడా పాస్ చేస్తున్నారు కానీ ఇప్పుడు ఆ తపనను అగ్ని రూపములోకి తీసుకురండి.
విశ్వములో ఒకవైపు భ్రష్టాచారము, అత్యాచారము అనే అగ్ని ఉంటుంది, మరొకవైపు పిల్లలైన మీ యొక్క శక్తిశాలీ యోగము అనగా తపన యొక్క అగ్ని జ్వాలారూపములో ఉండటము అవసరము. ఆ జ్వాలా రూపము ఈ భ్రష్టాచారము, అత్యాచారము అనే అగ్నిని సమాప్తం చేస్తుంది మరియు సర్వాత్మలకు సహయోగాన్ని ఇస్తుంది. మీ తపన జ్వాలా రూపముదై ఉండాలి అనగా శక్తిశాలి యోగము ఉండాలి, అప్పుడు ఈ స్మృతి యొక్క అగ్ని, ఆ అగ్నిని సమాప్తము చేస్తుంది మరియు ఇంకొకవైపు ఆత్మలకు పరమాత్మ సందేశాన్ని, శీతల స్వరూపాన్ని అనుభూతి చేయిస్తుంది. ఇది అనంతమైన వైరాగ్య వృత్తిని ప్రజ్వలితము చేయిస్తుంది. ఒకవైపు భస్మము చేస్తుంది, మరొకవైపు శీతలంగా కూడా చేస్తుంది. అనంతమైన వైరాగ్యము యొక్క అలను వ్యాపింపజేస్తుంది. పిల్లలు ఏమంటారంటే - నా యోగమైతే ఉంది, నాకు బాబా తప్ప మరెవ్వరూ లేరు. ఇది చాలా మంచిదే కానీ సమయమనుసారంగా ఇప్పుడు జ్వాలా రూపులుగా అవ్వండి. ఏ విధంగా స్మృతి చిహ్నాలలో శక్తుల శక్తి రూపాన్ని, మహాశక్తి రూపాన్ని, సర్వ శస్త్రధారి రూపాన్ని చూపించారో, ఇప్పుడు ఆ మహాశక్తి రూపాన్ని ప్రత్యక్షము చెయ్యండి. పాండవులైనా, శక్తులైనా అందరూ సాగరము నుండి వెలువడిన జ్ఞాన నదులే. మీరు సాగరము కాదు, మీరు నదులు, మీరు జ్ఞాన గంగలు. కనుక జ్ఞాన గంగలైన మీరు ఇప్పుడు ఆత్మలను మీ జ్ఞానం యొక్క శీతలత ద్వారా పాపాల అగ్ని నుండి ముక్తులుగా చెయ్యండి. ఇది వర్తమాన సమయంలోని బ్రాహ్మణుల కార్యము.
ఈ సంవత్సరము ఏ సేవ చెయ్యాలి అని పిల్లలందరూ అడుగుతుంటారు. బాప్‌దాదా మొదటి సేవ ఇదే చెప్తున్నారు - ఇప్పుడు సమయమనుసారంగా పిల్లలందరూ వానప్రస్థ అవస్థలో ఉన్నారు, మరి వానప్రస్థులు తమ సమయాన్ని, సాధనాలను పిల్లలందరికీ ఇచ్చేసి స్వయం వానప్రస్థులైపోతారు. కనుక మీరందరూ కూడా మీ సమయము యొక్క ఖజానాను, శ్రేష్ఠ సంకల్పాల ఖజానాను ఇప్పుడు ఇతరుల కోసం వినియోగించండి. మీ కొరకు సమయాన్ని, సంకల్పాలను తక్కువగా ఉపయోగించండి. ఇతరుల కొరకు వినియోగించడం ద్వారా స్వయం కూడా ఆ సేవ యొక్క ప్రత్యక్ష ఫలాన్ని తినేందుకు నిమిత్తులుగా అవుతారు. మనసా సేవ, వాచా సేవ చేయండి మరియు అన్నింటికంటే ఎక్కువగా - బ్రాహ్మణులకైనా లేక ఇతరులెవరైతే సంబంధ-సంపర్కంలోకి వస్తారో వారికైనా, మీరు మాస్టర్ దాతలుగా అయ్యి ఏదో ఒకటి ఇస్తూ వెళ్ళండి. నిస్వార్థులుగా అయ్యి సంతోషాన్ని ఇవ్వండి, శాంతిని ఇవ్వండి, ఆనందాన్ని అనుభూతి చేయించండి, ప్రేమను అనుభూతి చేయించండి. ఇవ్వాలి, మరియు ఇవ్వటము అంటే స్వతహాగానే తీసుకోవటము. ఎవరు ఏ సమయములో, ఏ రూపముతో సంబంధ-సంపర్కములోకి వచ్చినా వారు ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి. మాస్టర్ దాతలైన మీ వద్దకు వచ్చినవారు ఖాళీగా వెళ్ళకూడదు. బ్రహ్మాబాబాను చూసారు కదా - నడుస్తూ-తిరుగుతూ ఉన్నప్పుడు కూడా పిల్లలు ఎవరైనా ఎదురుగా వస్తే, వారు ఏదో ఒక అనుభూతిని చేసుకోకుండా ఖాళీగా వెళ్ళేవారు కాదు. కనుక చెక్ చేసుకోండి - మీ వద్దకు ఎవరు వచ్చినా, మిమ్మల్ని ఎవరు కలిసినా వారికి ఏదైనా ఇచ్చారా లేక ఖాళీగా వెళ్ళిపోయారా? ఎవరైతే ఖజానాలతో నిండుగా ఉంటారో, వారు ఇవ్వకుండా ఉండలేకపోతారు. తరగని, అఖండ దాతగా అవ్వండి. ఎవరో అడగాలి అని కాదు. దాత ఎప్పుడూ కూడా - వీరు అడిగితే ఇద్దాము అని చూడరు. అఖండ మహాదానులు, మహాదాతలు తమంతట తామే ఇస్తారు. కనుక ఈ సంవత్సరము మొదట మహాదాతగా అయ్యే సేవ చెయ్యండి. మీరు దాత ద్వారా లభించినదానిని ఇస్తారు. బ్రాహ్మణులు ఎవ్వరూ బికారులు కాదు, వారు సహయోగులు. కనుక పరస్పరంలో బ్రాహ్మణులు ఒకరికొకరు దానమిచ్చుకోకూడదు, సహయోగాన్ని ఇచ్చుకోవాలి. ఇది మొదటి నంబరు సేవ. అలాగే బాప్‌దాదా విదేశీ పిల్లల నుండి శుభవార్తను విన్నారు. ఈ సృష్టిలో ధ్వనిని వ్యాపింపచెయ్యటానికి నిమిత్తులైనవారు ఎవరైతే ఉన్నారో, వారికి బాప్‌దాదా మైక్ అనే పేరును పెట్టారు. విదేశీ పిల్లలు పరస్పరం కలిసి ఈ కార్యాన్ని చేసారు అన్నదానిని బాప్‌దాదా చూసారు. మరియు ప్లాన్ తయారుచేసారంటే అది ప్రత్యక్ష రూపంలో జరిగేదే ఉంది. భారత్‌లో 13 జోన్లు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రతి ఒక్క జోన్ నుండి కనీసం ఒక విశేషమైన నిమిత్త సేవాధారి తయారవ్వాలి, వారిని మైక్ అనండి లేక ఇంకేమైనా అనండి, కానీ ధ్వనిని వ్యాపింపజేయడానికి ఎవరినైనా నిమిత్తులను తయారుచెయ్యండి. బాప్‌దాదా తక్కువలో తక్కువ చెప్పారు. కానీ ఒకవేళ పెద్ద-పెద్ద దేశాలలో ఇలా నిమిత్తులుగా అయ్యేవారు ఉన్నట్లయితే కేవలం జోన్ వారే కాదు కానీ పెద్ద దేశాల నుండి కూడా ఏర్పాట్లు చేసుకుని అటువంటి ప్రోగ్రామ్‌ను తయారుచెయ్యాలి. బాప్‌దాదా విదేశీ పిల్లలకు మనసులోనే అభినందనలు అందించారు, ఇప్పుడు నోటి ద్వారా కూడా ఇస్తున్నారు ఎందుకంటే ప్రాక్టికల్లోకి తీసుకువచ్చే ప్లాన్‌ను మొదట బాప్‌దాదా ఎదురుగా తీసుకువచ్చారు. ఆ మాటకొస్తే భారత్‌లోనైతే ఇంకా సహజము అన్నది బాప్‌దాదాకు తెలుసు కానీ ఇప్పుడు క్వాలిటీ సేవ చేసి సహయోగులను సమీపంగా తీసుకురండి. చాలామంది సహయోగులుగా ఉన్నారు కానీ వారిని సంగఠనలోకి ఇంకా సమీపంగా తీసుకురండి.
అలాగే బాప్దాదాకున్న సంకల్పము – పెద్ద పట్టణాలలో పెద్ద ఏరియా ఉంటుంది, ఆ ఏరియా చాలా పెద్దగా ఉంటుంది, ప్రతి సెంటరు వారు తమ ఏరియా నుండి ఇటువంటి విశేషమైన వారిని తయారు చేయడం ఆవశ్యకము ఎందుకంటే సమయం సమీపిస్తుంది మరియు చివరి సమయములో మీ అందరూ మీ పరిచయాన్ని ఇవ్వడం కాదు, మీ తరఫున వారు భాషణ చేయాలి, వారు స్పీకర్ అవ్వాలి, మీరు సర్చ్‌లైట్ అవ్వాలి. కనుక ప్రతి ఒక్కరూ తమ ఏరియా నుండి ఇటువంటి మైక్‌ను తయారు చేయాలి. ప్రతి ఏరియాలో విశేషమైన వ్యాపారవేత్తలు లేక భిన్న-భిన్న వర్గాలకు సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులు ఉంటారు. తమ-తమ సెంటరు నుండి తమ ఏరియాలో ఉండే విశేషమైన ఆత్మలను తయారు చేయండి. ఈ జ్ఞానం ఏమిటో వారు వినిపించాలి. ఇప్పుడు మీరు ఈ చివరి సమయంలో సాక్షాత్కార మూర్తులుగా, ఫరిశ్తా అయ్యి దృష్టిని ఇవ్వండి, వారు స్పీకర్ అవ్వాలి. స్పీకర్‌గా అవ్వడమైతే అందరూ నేర్చుకున్నారు, చిన్న-చిన్న టీచర్లు కూడా స్పీచ్‌ను చాలా బాగా చెప్తున్నారు. అందరూ స్పీచ్ చెప్తారు. ఇప్పుడు ఇతరులను స్పీకర్లుగా తయారు చేయండి. మీ దృష్టి లేక రెండు వచనాలు అందరికీ ఎటువంటి భాసన ఇవ్వాలంటే ఎంతోకాలం నుండి స్పీచ్ వింటున్నాము అనిపించాలి. అటువంటి సమయం కూడా వచ్చేదే ఉంది.
ఇప్పుడు సమయం కూడా ఫాస్ట్ గతిని తీసుకుంటుంది, సమయం వేగంగా వెళుతూ పదే-పదే మిమ్మల్ని వెనక్కి తిరిగి ఎలా చూస్తుందంటే – మా యజమాని వేగంగా వస్తున్నారా లేదా అని చూస్తుంది, లేక సమయం వేగంగా వెళ్తుందా? యజమాని మీరే కదా? మీరు వేగంగా వస్తున్నారా లేదా అని సమయం మీకోసం వెనక్కి తిరిగి పదే-పదే చూస్తుంది. కావున ఈ సంవత్సరం క్వాలిటీ సేవపై విశేష అటెన్షన్‌ను ఉంచండి. మీ సెంటరులో ఏ వర్గం నుండి ఎంత క్వాలిటీ సేవ జరిగింది అన్న రిజల్ట్ అన్ని సెంటర్లనుండి రావాలి. క్వాంటిటీ (సంఖ్య) అయితే స్వతహాగానే పెరుగుతుంది. ఇప్పుడు కూడా చూడండి, హాల్ చిన్నగా అయిపోయింది. క్వాంటిటీ అయితే పెరుగనుంది, ఇప్పుడు ఇటువంటి ప్రాక్టికల్ గ్రూపును తయారు చేయండి.
అలాగే బ్రాహ్మణ ఆత్మలను మరింత సమీపంగా తీసుకువచ్చేందుకు, ప్రతి చోటా మరియు మధుబన్‌లో నలువైపులా జ్వాలా స్వరూపము యొక్క వాయుమండలాన్ని తయారుచేయడానికి, భట్టీలనైనా పెట్టండి లేక సంగఠనలో పరస్పరం ఆత్మిక సంభాషణ చేసుకుని జ్వాలా స్వరూపాన్ని అనుభవం చేయించండి మరియు ముందుకు తీసుకువెళ్ళండి. ఎప్పుడైతే ఈ సేవలో నిమగ్నమైపోతారో, అప్పుడు చిన్న-చిన్న విషయాలేవైతే ఉంటాయి కదా, వేటి వెనుకైతే సమయం పడుతుందో, శ్రమించాల్సి వస్తుందో, నిరాశ చెందుతారో, అవన్నీ ఎలా అనిపిస్తాయంటే - జ్వాలాముఖి ఉన్నతమైన స్థితి ఎదురుగా ఆ సమయాన్ని ఇవ్వడము, శ్రమించడము అనేది ఒక బొమ్మలాటలా అనుభవమవుతుంది. స్వతహాగానే సహజంగానే సురక్షితులైపోతారు. బాప్‌దాదా చెప్పారు కదా - మీరు ఉన్నదేమో మాస్టర్ సర్వశక్తిమంతులైన పిల్లలుగా, కానీ చిన్న-చిన్న విషయాల వెనుక శ్రమిస్తున్నారంటే, అది చూసి బాప్‌దాదాకు అన్నింటికన్నా ఎక్కువగా దయ కలుగుతుంది. జ్వాలాముఖి రూపము యొక్క ప్రేమ తక్కువ ఉన్నప్పుడు శ్రమ అనిపిస్తుంది. కనుక ఇప్పుడు శ్రమ పడటము నుండి విముక్తులవ్వండి, నిర్లక్ష్యులుగా అవ్వకండి కానీ శ్రమ నుండి విముక్తులు అవ్వండి. అలాగని శ్రమించనవసరం లేదంటే హాయిగా నిద్రపోదాము అని అనుకోకండి. ప్రేమతో శ్రమను సమాప్తము చెయ్యండి, అంతేకానీ నిర్లక్ష్యముతో కాదు. ఏం చెయ్యాలో అర్థమైందా?
ఇప్పుడు బాప్‌దాదా అయితే రావాలసే ఉంటుంది. ఇకముందు ఏమవుతుంది, బాప్‌దాదా వస్తారా, రారా అని అడుగుతుంటారు. బాప్‌దాదా రాను అనైతే అనరు, హాజీ-హాజీ అనే అంటారు. పిల్లలు ‘హజూర్ (స్వామీ)’ అని పిలవగానే బాబా ‘హాజరయ్యాను’ అని అంటారు. మరి అర్థమైందా ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో. శ్రమను ప్రేమతో సమాప్తం చేయండి. ఇప్పుడు శ్రమ నుండి ముక్తి అయ్యే సంవత్సరాన్ని జరుపుకోండి, కానీ ప్రేమతో జరుపుకోండి, సోమరితనంతో కాదు. పక్కాగా గుర్తుంచుకోండి - సోమరితనం ఉండకూడదు.
సరేనా, అన్ని సంకల్పాలు పూర్తయ్యాయా? ఏదైనా మిగిలిపోయిందా? (జానకి దాదీతో) ఏదైనా మిగిలిపోయిందా? అని జనక్‌ను అడుగుతున్నాము. దాది అయితే చిరునవ్వు నవ్వుతున్నారు. ఆట పూర్తయిపోయిందా? ఈ ఆపరేషన్ కూడా ఏమిటి? ఆటలో ఆట. ఆట బాగా జరిగింది కదా!
అచ్ఛా, విశేషంగా టీచర్లందరూ కూడా కూర్చుని ఉన్నారు. ఒక్క దెబ్బకు రెండు పనులు చేసారు, టీచర్లు చాలా తెలివైనవారు. (మీటింగ్ కూడా మరియు బాప్‌దాదాతో మిలనము కూడా జరిగింది)
అచ్ఛా, అనేక కల్పాలలో అయితే వచ్చారు కానీ ఎవరైతే ఈ కల్పంలో మొదటి సారి వచ్చారో వారు చేతులెత్తండి. ఎవరైతే మొదటిసారి వచ్చారో, ముందు కూర్చున్న వారు కావచ్చు, వెనుక కూర్చున్న వారు కావచ్చు, వారికి బాప్‌దాదా విశేషంగా స్నేహ దృష్టిని కూడా ఇస్తున్నారు మరియు పదమారెట్ల అభినందనలను కూడా ఇస్తున్నారు. చాలా మంచి సమయంలో వచ్చారు. మీరు చూడండి, ఇప్పుడు ఇంత సంఖ్యలో ఉన్నారు, మున్ముందు ఇంత కూడా లభించదు. కూర్చోవడానికి లభించడము కూడా కష్టమవుతుంది. అందుకే, ఇప్పుడు వచ్చారు, చాలా మంచి పని చేసారు. అభినందనలు. అచ్ఛా, అందరికీ వేడిగా అనిపిస్తుందా? (రంగు-రంగుల చేతి విసనకర్రలు అందరి వద్ద ఉన్నాయి) చూడండి, భక్తి యాత్రలకన్నా చాలా సుఖంగా కూర్చున్నారు, మట్టిలో కూర్చోలేదు, జమకాణా మరియు పరచిన మందమైన దుప్పట్లపై కూర్చున్నారు.
(డ్రిల్) క్షణంలో బిందు స్వరూపులుగా అయ్యి మనసు-బుద్ధిని ఏకాగ్రము చేసే అభ్యాసాన్ని పదే-పదే చెయ్యండి. స్టాప్ అని అనగానే క్షణంలో వ్యర్థమైన దేహభానము నుండి మనను-బుద్ధి ఏకాగ్రమైపోవాలి. ఇటువంటి కంట్రోలింగ్ పవర్‌ను మొత్తము రోజంతటిలో ఉపయోగించి చూడండి. కంట్రోల్ అవ్వమని ఆర్డర్ ఇచ్చాక, 2 నిమిషాల తర్వాత కంట్రోల్ అవ్వటం, 5 నిమిషాల తర్వాత కంట్రోల్ అవ్వటం కాదు, అందుకే మధ్యమధ్యలో కంట్రోలింగ్ పవర్‌ను ఉపయోగించి చూసుకుంటూ ఉండండి. క్షణంలో కంట్రోల్ అవుతుందా, నిమిషంలో కంట్రోల్ అవుతుందా, ఎక్కువ నిమిషాలు పడుతుందా, ఇదంతా చెక్ చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు అందరూ మూడు మాసాల చార్టును ఇంకా పక్కా చేసుకోవాలి. సర్టిఫికేట్ తీసుకోవాలి. ముందుగా స్వయానికి స్వయం సర్టిఫికేట్‌ను ఇచ్చుకోవాలి, ఆ తరువాత బాప్‌దాదా ఇస్తారు. అచ్ఛా!
నలువైపులా ఉన్న పరమాత్మ పాలనకు అధికారులైన ఆత్మలకు, పరమాత్మ చదువుకు అధికారులైన శ్రేష్ఠ ఆత్మలకు, పరమాత్మ ప్రాప్తులతో సంపన్నమైన ఆత్మలకు, సదా బిందువు యొక్క విధి ద్వారా తీవ్ర పురుషార్థులైన ఆత్మలకు, సదా శ్రమ నుండి ముక్తులై ఉంటూ ప్రేమలో మునిగిపోయి ఉండే పిల్లలకు, జ్వాలా స్వరూప విశేష ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీజీతో:- డ్రామాలో ఏది జరిగినా, అందరి స్నేహము పెరుగుతుంది. నిమిత్త ఆత్మలపై అందరి ప్రాణము ఉంటుంది. కావున ఆపరేషన్ అన్నది నిమిత్తమాత్రమే, అందరి స్నేహము మరియు ఆశీర్వాదాల ఖజానా చాలా జమ అయ్యాయి. చూడండి, డ్రామాలో మురళీలు కూడా సమయ ప్రమాణంగా ఎన్నో రిపీట్ అయ్యాయి, బాప్‌దాదా అందరికీ సకాశ్ ఇచ్చే మరియు తీసుకునే పాఠాన్ని నేర్పించారు. సమయం అనుసారంగా అటువంటి మురళీలే నడిచాయి. బాప్దాదాకైతే ప్రేమ ఉండనే ఉంది కానీ పిల్లలు ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్వక ప్రేమ ఉంది. పరమాత్మ ప్రేమ మరియు బ్రాహ్మణ ఆత్మల ప్రేమ – ఇవి ఎగిరేలా చేస్తాయి ఎందుకంటే సాకార సామయంలో కొద్ది సమయం కలుసుకనే మహత్వం చాలా ఉండినది. ఇంత సమయం కలిసే కన్నా ఫరిశ్తా సమానమైన ఈ మిలనము – ఇది కూడా డ్రామాలో పాత్ర చాలా బాగుంది. ఇప్పుడు మీరు బ్రహ్మా బాబా సమానంగా ఫరిశ్తా రూపంతో కలవడము, నడుచుకోవడము మరియు ఎగరడము – ఈ పాత్రయే జరుగుతుంది. బ్రహ్మా బాబాను చూసారు కదా – పూర్తిగా అతీతంగా, కర్మాతీతంగా ఉండేవారు. అలా మహారథులైన మీరందరూ ఇప్పుడు ఈ విధంగా బ్రహ్మా సమానంగా కర్మాతీత స్థితికి సమీపంగా రావలసిందే. ఫాలో ఫాదర్. మీ యొక్క ఒక్క సెకండు యొక్క దృష్టి అనేక గంటల ప్రాప్తిని అనుభవం చేయిస్తుంది. ఇప్పుడు మాట్లాడటము, కూర్చోవడము ఈ శ్రమ కూడా తగ్గుతుంది. పూర్తిగా బ్రహ్మా బాబాయే కనిపిస్తారు. వీరు దాదీలు కారు, బ్రహ్మా బాబా అనిపిస్తుంది. అవ్యక్త బ్రహ్మా, అవ్యక్త రూపంలో పాలన ఇస్తున్నారు మరియు మీ ద్వారా సాకార బ్రహ్మా యొక్క అనుభూతులు పెరుగుతాయి. మిమ్మల్ని దాదీ అనరు, బ్రహ్మాను చూస్తారు. ఇలాగే ఉన్నారు కదా? అచ్ఛా. అమూల్యమైన రత్నము మీరు. విలువైన రత్నాలను జాగ్రత్తగా సంభాళించడం జరుగుతుంది.
నిమిత్తంగా ఉన్న ఆత్మలైన మీ ఉల్లాస-ఉత్సాహాలతో నలువైపుల ఉన్న ఆత్మల ఉల్లాస-ఉత్సాహాలు నడుస్తున్నాయి ఎందుకంటే ఒకరికొకరు సహయోగిగా ఉన్నారు. హజూరు హాజరు అని బాబా అంటారు కదా, అలాగే పరస్పరంలో హాజరు-హాజరు అంటూ ఈ స్నేహము మరియు సంగఠనతో శక్తి ఇతరులకు లభిస్తుంది మరియు మీకు ఆశీర్వాదాలు లభిస్తున్నాయి. రెండింటి ప్రాప్తి కలుగుతుంది. అందరికంటే ఎక్కువగా ఆశీర్వాదాల ఖాతా ఎవరికి జమ అవుతాయి? మీకు. ఇందులో ముందు నేను అని చెప్పడానికి అభిమానము కాదు, స్వమానము ఉంటుంది. ఏదైనా ఇస్తే ఆశీర్వాదాలు లభిస్తాయి కదా.
ఇప్పుడు కూడా వైరాగ్య వృత్తి రాలేదు, ఇది ఎప్పుడు ఆరంభం అవుతుందా అని బాప్‌దాదా కూడా చూస్తున్నారు. ఇప్పుడైతే సాధనాలను ఉపయోగించే అనుభవిగా ఎక్కువగా ఉన్నారు. ఎప్పటివరకైతే బ్రాహ్మణులలో అనంతమైన వైరాగ్య వృత్తి ఇమర్జ్ అవ్వదో అప్పటివరకు విశ్వంలో కూడా వైరాగ్య వృత్తి రాజాలదు అని బాప్‌దాదాకు తెలుసు. పూర్తి విశ్వంలో వైరాగ్య వృత్తియే పాపాల నుండి కొంత విముక్తి చేస్తుంది. ఇప్పుడు శక్తి సైన్యానికి దయ రావాలి, ఇప్పుడు దయ తక్కువ, సేవ ఎక్కువగా ఉంది. కానీ ఇప్పుడు దయ ఎక్కువగా ఇమర్జ్ అయ్యి ఉండాలి. పాప కర్మల భారాన్ని మోస్తూ ఉన్నారు. భారంతో వంగుతూ ఉన్నారు. మరి దయ రావాలి కదా. అచ్ఛా!
*** ఓంశాంతి ***
