Search for a command to run...
5 Dec 2016
అందరి మనసు పటంలో మొదటి అవ్యక్త మిలనపు స్మృతులు నిండి ఉన్నాయి, అందరి ముఖములో, హృదయములో నా బాబా, మధురమైన బాబా, ప్రియమైన బాబా అని ఉంది. ఈ అవ్యక్త మిలనము అందరినీ ఆకర్షిస్తుంది
5 December 2016 · తెలుగు
ఓం శాంతి. ఈరోజు బ్రహ్మా బాబా ఎక్కువగా గుర్తుకు వస్తారు. ఈ రోజే అవ్యక్త రూపంలో బాప్దాదా మిలనము యొక్క సూక్ష్మవతనం పాత్ర జరిగింది. అందరి ముఖాలలో బాప్దాదా మూర్తి స్పష్టంగా ప్రత్యక్షమయింది. అందరి నోటి నుండి మా బాబా, మా బాబా మమ్మల్ని కలుసుకుంటున్నారు అని వెలువడింది. పిల్లలంతా అవ్యక్తంగా కలుసుకున్నది ఆ రోజునే. ఎలా అయితే ఇప్పుడు మీరంతా బాబాను కలుసుకుంటున్నారో, ఆ రోజున, అవ్యక్త రూపంలో తండ్రి పిల్లలను కలుసుకున్న మొదటి రోజు. అందరి మనసులలో, ఆ రోజు, అవ్యక్త మిలనము అని అనబడే ఆ రోజును, అవ్యక్త రూపంలో అవ్యక్త మిలనము కూడా జరిగింది. అవ్యక్త రూపంలో బాబా నయనాలకు అవ్యక్త మిలనము యొక్క మొదటి రోజు. అందరి హృదయాలలో అవ్యక్త మిలనపు ఈ దృశ్యాలను చూసాము. అందరూ అవ్యక్త మిలనపు దివసాన్ని జరుపుకున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క లీల ఉంటుంది. ఈ అవ్యక్త దివసము చాలా ప్రియంగా అనిపిస్తుంది. వ్యక్త దేశంలో ఉంటున్నప్పటికీ అవ్యక్త మిలనము, అవ్యక్త దివసము, అవ్యక్త దృశ్యాలు నలువైపుల అందరి నయనాలలో ఉన్నాయి. ఇటువంటి అవ్యక్త మిలనపు సభలో, అవ్యక్త రూపంలో బాబా మరియు పిల్లల మిలనపు దివసము జరుపుకోబడుతుంది. అందరి నోటి నుండి బాబా, ఓ బాబా, మధురమైన బాబా అని వెలువడుతుంది. సాకారంలో కూడా అవ్యక్త రూపాన్ని చూసారు. ఈ అవ్యక్త దివసమును మెజారిటీ అదే స్నేహం, అదే రూపంలో జరుపుకుంటున్నారు. అందరి హృదయాలలో ఈ అవ్యక్త మిలనము, సాకార రూపపు మిలనము, ఈ మధురమైన మిలనము మనసును ఆకర్షిస్తుంది. సాకారంలో కలిసిన వారికి ఇప్పుడు అదే మిలనము అవ్యక్త మిలనముగా జరుపుకోవడము చాలా మధురమైన అనుభవాలను గుర్తుకు తెప్పిస్తుంది. నా బాబా, మధురమైన బాబా... ఆ మిలనము గుర్తుంది కదా! మొదటి రోజున ఎవరు వచ్చారు? ఇంతమంది ఉన్న సభలో ఆ మిలనము జరుపుకోవడానికి ఎవరు వచ్చారో చేతులు ఎత్తండి.
చూడండి, ఆ మిలనపు దివసాన్ని ఎంతో మనస్ఫూర్తిగా జరుపుకున్నారు. ఇప్పుడు జరుపుకున్నది ఆ సమయంలో అందరూ వేచి చూసేవారు. ఇప్పుడిప్పుడే సాకారంలో బాప్దాదా మిలనము జరిపేవారు, ఇప్పుడిప్పుడే అవ్యక్త బ్రహ్మా రూపంలో మిలనము జరుపుతున్నారు. అందరూ ఆ రోజును గుర్తు చేసుకుంటున్నారు, అది అవ్యక్త బాబాకు మొదటి రోజు, అందరి నయనాలు మిలన దివసము మొదటి రోజును జరుపుకుంటున్నాయి. ఎలా అయితే ఈ రోజు అవ్యక్త మిలనము జరుపుకుంటున్నారో అలాగే అవ్యక్త దివసము జరుపుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ మనసులో అవ్యక్త మిలనపు సంతోషాలను జరుపుకుంటున్నారు. అందరి మనసు పటంలో ఆటోమేటిక్గా ఆ రోజు గుర్తుకు వస్తుంది. పిల్లలను బాబా, బాబాను పిల్లలు ఏ రూపంలో కలిసి ఉండవచ్చు? ఆ రోజు గుర్తుకు వస్తుంది, ముందు కూర్చున్న పిల్లలు ఆ రోజులను గుర్తు చేసుకుంటున్నారు. తండ్రి మరియు పిల్లల ప్రత్యక్ష మిలనము గుర్తుంది, అలాగే వతనంలో ఇది మొదటి రోజు మిలనము కూడా అని గుర్తుకు ఉంది. ఇది కేవలం కొద్ది సమయపు మిలనమే, అందరి ముఖాలు ఎలా ఉన్నాయంటే ఈ రోజు మాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది అన్నట్లుగా ఉంది. మరి అందరూ ఈ రోజును, మిలనపు దివసాన్ని జరుపుకున్నారు. అందరి హృదయాలలో నా బాబా, నా బాబా, నా బాబా, నయనాలు మెరుస్తున్నాయి. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ రెండు కళ్ళు ఉన్నాయి, కొంతమంది పాపం చూడలేరు కానీ బాబా కూడా పిల్లలను చూస్తున్నారు మరియు పిల్లలు కూడా బాబాను చూస్తున్నారు. ఇద్దరి నోటినుండి నా బాబా, నా బాబా, నా బాబా అని వెలువడుతుంది. ఆనాటి మిలనము ఎలా ఉండి ఉంటుందో మీరే ఆలోచించండి. ఆ రోజును మర్చిపోవడం కూడా కష్టమే. ఆ రోజును గుర్తు తెచ్చుకుంటే గుర్తుకు వస్తుంది. ఆ రోజు ప్రత్యేకంగా గుర్తు ఉంటుంది ఎందుకంటే నిరాకారం నుండి సాకారం, సాకారం నుండి సూక్ష్మ బ్రహ్మా రూపంలో బాబా పిల్లలందరినీ కలిసిన రోజు. ఆ దృశ్యమైతే అందరికీ గుర్తుంది కదా. కళ్ళ నీళ్ళు, కళ్ళు ఆ రోజును గుర్తు తెప్పిస్తున్నాయి. ఈ రోజు స్మృతికి చాలా ప్రత్యేకమైన రోజు అని అందరి హృదయాలు చెప్తున్నాయి. ఆ రోజు అవ్యక్త మిలనంలో పిల్లలు తండ్రిని కలుసుకుంటున్నప్పుడు పూర్తి సభ యొక్క పరిస్థితి ఎలా ఉండిందో ఆలోచించండి! అందరూ ఆనాటి స్మృతులలోకి వెళ్ళిపోయారు. అందరూ ఆ స్మృతులలో మునిగి ఉన్నారు, ఆ రోజు అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. అప్పుడు వచ్చిన వారికైతే చాలానే గుర్తు ఉంటుంది, ఆ స్మృతి చాలా లోతైనది. అందరి నయనాలలో గంగ, జమున నదులు ప్రహిస్తున్నాయి. ఈ రోజు ప్రత్యేకమైనది. మేము ఎలా ఉంటాము అని అందరూ ఆలోచించారు! బాబాకైతే తెలుసు. ఇది ప్రియమైన రోజు, ఏడ్చే రోజు కాదు అని బాబా అన్నారు. ప్రేమ స్వరూపము ఎలా ఉంటుంది అని చూపించే దృశ్యాన్ని చూపించారు. అందరూ తమ హృదయ ప్రేమను ప్రకటించారు. అచ్ఛా.
సేవ టర్న్ ఢిల్లీ మరియు ఆగ్రా వారిది, 15 వేల మంది అక్కడినుండి వచ్చారు, మొత్తం 22,000 మంది:- మంచిది, ఇప్పుడు మిలనానికి వచ్చినవారు నిల్చోండి, మిగతా వారంతా కూర్చోండి. మంచిది, బాప్దాదా ప్రత్యేకంగా చేతులు ఎందుకు ఎత్తించారంటే వచ్చిన వారంతా మిలనము అయితే జరుపుకున్నారు కదా. అందరూ మిలనము జరుపుకున్నారు కదా! మిలనము మీకు హోమ్ వర్కును కూడా ఇచ్చింది. ఇక మీదట ఏమి చెయ్యాలి అని కూడా వినిపించాము. మరి చూడండి, బాబాకు ఎంతగా పిల్లల శుభదివసము గుర్తుంటుందో! ఎవ్వరినీ మర్చిపోరు, భిన్న భిన్న రూపాలలో జరుపుకుంటూ ఉంటారు కానీ మేము మరియు బాబా, ప్రతి రోజు యొక్క విశేషతను మర్చిపోలేరు. ప్రతి రోజు యొక్క విశేషతను గుర్తు చేయిస్తుంది. భిన్న భిన్న సమయాలలో జరిగిన లీలలు, ఆ దివ్య లీలలు, ఒకసారి ఒక లీల, మరోసారి మరో లీల, ఇవైతే అందరూ చూసే ఉంటారు.
డబల్ విదేశీయులు 30 దేశాల నుండి 300 మంది వచ్చారు:- అందరూ సమీపంగా వచ్చారు. బాబాకు ఎంతమంది గుర్తుంటారు! పిల్లలు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క సమయంలో వస్తారు కానీ గుర్తుకు రాగానే చేరుకున్నవారి ఆట చాలా అద్భుతమైనది. వస్తారు, వచ్చి కలుసుకుని తమ మనసులోని మాటలను దిలారాముని ఎదుట ఉంచుతారు, వెళ్ళిపోతారు కానీ ఈ మాటలు గాఢమైన హృదయపూర్వక మాటలు కదా! పూర్తి సభ వాయుమండలం, హాల్ వాయుమండలం స్మృతి అనే గోడలతో అలంకరింపబడి ఉన్నట్లుగా కనిపిస్తుంది. అన్ని గోడల పైన “నా బాబా, మధురమైన బాబా, ప్రియమైన బాబా” అని వ్రాసి ఉంది, చాలా మంచి డిజైన్లో వ్రాసి ఉన్నట్లుగా కనిపిస్తుంది. మీకు కనిపించిందా? కనిపించింది కదా! ఎవరికైతే కనిపిస్తుందో వారు చేతులెత్తండి. మీరు కూడా మీ ప్రేమకు గుర్తులను చూసారు, చూసినది స్మృతిచిహ్నంగా అయిపోయింది. స్మృతి దివసాన్ని ఎప్పుడూ స్మృతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఆ రోజులే స్మృతిచిహ్నంగా అయిపోయాయి.
దాదీలతో:- సభను చూసారా (బాబాను చూసాను) బాబాను చూస్తే అంతా చూసినట్లే. అందరి హృదయాలను ప్రేమ ఊయలలో ఊగించారు. అందరి ముఖాలను చూడండి, ఇప్పుడు అందరూ ఊగుతున్నారు. అందరూ ఎక్కడ కూర్చున్నారు! అందరూ ఊయలలో కూర్చున్నారు, ఊయలలో. అందరూ తమ మనసులో బాబా, బాబా అని అంటున్నారు. లేకపోతే గొడవగా ఉంటుంది. ఇప్పుడు అందరి మనసులో ఏమి జరుగుతుంది! బాబా, బాబా, బాబా. మంచిది కదా. బాబా కూడా పిల్లల ప్రేమను చూసి సంతోషిస్తారు, ఎంత ప్రేమ వీరి మనసులో ఉంది, ఎంతగా మనస్పూర్తిగా వర్ణన చేస్తారు అని బాబా సంతోషిస్తారు. చూడండి, బాప్దాదా మనసు ఏమి చెప్తుంది! చెప్పండి, మీరు చెప్పకపోతే బాబా వినిపిస్తారు. అందరి ముఖాలు చెప్తున్నాయి. అందరూ దూర దూరంగా ఉన్నారు, అర్థం చేసుకోలేకపోయారు కానీ ప్రతి ఒక్కరూ తమ మనసులో చెప్తున్నారు. మనసు మాటలు బాప్దాదా వద్దకు ముందుగా చేరుకుంటాయి. అందరి ముఖాలను ఫోటోగ్రాఫర్ ఆ చిన్నదానిలో(కెమెరాలో) బంధిస్తాడు. కొంతమంది ముఖం వాడిపోయినట్లుగా ఉంటుంది, ఏమి ఆలోచిస్తుంటారో మరి! కానీ సదా హర్షితంగా ఉండే పిల్లలు బాబాకు కనిపిస్తారు. మనసులో మిలనము యొక్క చిత్రాలు ఎప్పటికీ ఉంటాయి. ఇది ప్రత్యేకంగా మిలన్ దివసము అని మీరు పెట్టుకుంటారు కదా.
రతన్మోహిని దాదీ గారితో:- ఆరోగ్యం చక్కబడుతుంది కదా.
బాబా మమ్మల్ని కలుస్తున్నారు అని అనుకుంటే మీకు కలుస్తున్నారు అన్న ఫీలింగ్ కలుగుతుంది. బాబా సూక్ష్మంగా అయితే దూరంగా ఉన్నారు కానీ సూక్ష్మంలో బాప్దాదా ముఖము మనసులో నిండి ఉండాలి. మనసులో అయితే ప్రతి ఒక్కరూ ఉండగలరు కదా. ఏమి జరిగినా కానీ, గాలివాన వచ్చినా, తుఫాను వచ్చినా, ఏమి జరిగినా కానీ హృదయపు మిలనము, హృదయ స్థితి, హృదయ భోజనము అన్నీ ఎంతో ప్రేమతో స్వీకరించబడతాయి. అందరూ సంతోషిస్తున్నారు. అచ్ఛా!
ఓంశాంతి