Search for a command to run...
31 Mar 2016
పిల్లలు ప్రతి ఒక్కరి హృదయపూర్వక ప్రేమ మరియు స్థితి వారి రూపంలో(ముఖంలో) కనిపిస్తుంది, ప్రతి ఒక్కరూ భిన్న భిన్న సంబంధాల ప్రేమతో మిలనం జరుపుకుంటున్నారు, జరుపుకుంటూ ఉంటారు
31 March 2016 · తెలుగు
ఓం శాంతి. ఈ చైతన్య దీపాల సంగఠనను చూసి బాప్‌దాదా చాలా సంతోషిస్తున్నారు. దీపరాజును కలుసుకునేందుకు ఒక్కొక్క దీపము ఎక్కడెక్కడి నుండో వచ్చింది. ఇంత పెద్ద దీపాల సంగఠనను చూసి దీపరాజు సంతోషిస్తున్నారు, వాహ్ దీపాలు వాహ్! ఒకరినొకరు చిరునవ్వుతో చూసుకుంటున్నారు ఎందుకంటే ఈ మిలనములో తోటివారు పరస్పరం కలుసుకుంటారు, అంతేకాక చాలా కాలం తర్వాత కలుస్తారు. ఈ మిలనము, ఈ మిలనానికి చాలా శ్రేష్ఠ విలువ ఉంది. మామూలుగా అయితే పరస్పరంలో కలుస్తుంటారు, మాట్లాడుకుంటారు, మురళి వింటారు, భోజనం చేస్తారు, ఆత్మిక సంభాషణ చేస్తారు, కానీ ఈ మిలనము ఎంతో ప్రియంగా అనిపిస్తుంది ఎందుకంటే నడుస్తూ తిరుగుతూ ఉన్న దీపరాజు మరియు దీపరాజు పిల్లలు, ఇద్దరి మిలనము జరుగుతుంది. పిల్లలు, ‘బాబా, ఓ బాబా!’ అంటారు, బాబా, ‘చెప్పండి పిల్లలూ, మధురమైన పిల్లలూ!’ అంటారు.
ఈరోజైతే బాబా మీ కోసమే వచ్చారు అందుకే దీని పేరు దీపావళి. దీపాల మిలనము. ఒకవేళ మీరు శ్రద్ధగా సమయాన్ని వెచ్చించి చూస్తే, ఒక్కొక్క దీపం నుండి, ప్రతి ఒక్కరి ముఖం నుండి ఎంతో మధురాతి మధురమైన మనసులోని మాటలు వినిపిస్తాయి. ఒక్కొక్కరి ముఖము వారి మనసులోని అనేక విషయాలను స్పష్టం చేస్తుంది. ఇప్పుడు ఈ సమయంలో మనసులో ఏముందో అది కొందరిలో అయితే బయటకు వ్రాసినట్లుగా కనిపిస్తుంది ఎందుకంటే బాబా ఎదురుగా కనిపించాలంటే అందుకు సమయం చాలా కొంచెం ఉంది. విదేశాలు కావచ్చు, భారతదేశం కావచ్చు, బాబా హృదయంలో పిల్లలు, పిల్లల హృదయంలో బాబా. ఈ మిలనమును అతి స్నేహ స్వరూపంగా చూడాలనుకుంటే మధువనంలో చూడండి. ఇప్పుడు ప్రతి ఒక్కరి హృదయంలో ఎవరున్నారు? బాబా హృదయంలో పిల్లలు, పిల్లల హృదయంలో బాబా. ఎంతటి సుందరమైన మిలనము! పిల్లలు ప్రతి ఒక్కరూ తమ నోటితో లోలోపల అనుకునే మాటలైతే రికార్డు అవుతున్నాయి కానీ ఇప్పుడు వారి ముఖం అనే రికార్డులో స్పష్టంగా వస్తుంది మరియు మిలనం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఒకటేసారి ఇంతమందితో కలుస్తున్నాము. ఈ హృదయపు మిలనము తండ్రి మరియు పిల్లల రూపంలో, సహచరుల రూపంలో, సఖుల రూపంలో ఎంత ప్రియంగా ఉంది. మీరే తల్లి, మీరే తండ్రి... మీరే సర్వస్వం అన్న మీ పాట ఉంది కదా. మీరు ఇక్కడకు వచ్చి చూడండి, పిల్లల మనసులో, ఏ సమయంలో ఏ రూపంలో స్మృతి ఉంటుందో, ఆ సమయంలో వారి ముఖంలో ఆ మిలనపు రూపం కనిపించేస్తుంది. అది ఎంతో ప్రియంగా అనిపిస్తుంది. అందరి హృదయాలలో నడుస్తూ తిరుగుతూ, పనులు చేసుకుంటూ కూడా హృదయాభిరాముడు హృదయంలో కనిపిస్తున్నారు. ఈ మిలనము కొద్ది సమయం కోసమే అయినా కానీ ఎంత ప్రియమైనది! ప్రతి ఒక్కరి హృదయంలో విశేషంగా నా బాబా అని ఉంది. “వాహ్ బాబా వాహ్! మీరు పిల్లలందరికీ మీ హృదయపు తునకనే ఇచ్చేసారు”. ప్రతి ఒక్కరి హృదయంలోకి చూస్తే, ఆ హృదయానికి నమూనాను గీసేవారు ఉంటే అది చూసి మీకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది - ఒకరు ఒక రూపంలో, మరొకరు మరొక రూపంలో, ఒక్కరినే గుర్తు చేస్తున్నారు.
ఈ సభను విడిచిపెట్టండి, ఈ సమయంలో ఇక్కడున్నవారైనా లేక సెంటర్లలో ఉన్న పిల్లలందరి మనసులోనైనా ఎవరు కనిపిస్తున్నారు, మెజారిటీ? ప్రతి ఒక్కరి ఇప్పటి ముఖాన్ని ఒకవేళ ఫోటో తీస్తే అందరిదీ ఎంతటి సంతోషకర హృదయం కనిపిస్తుంది! తండ్రి మరియు పిల్లల ఈ మిలనము హాయినిస్తుంది. మీ హృదయంలో ఎవరున్నారు అని ఎవరినైనా అడిగితే ఏమని జవాబు వస్తుంది? నా బాబా, మధురమైన బాబా, నా ప్రియుడు అంటారు. ప్రతి ఒక్కరి ముఖమును ఫోటో తీస్తే అందరి ముఖాలలో తేడా కనిపిస్తుంది. అందరి మనసులు మాట్లాడుతున్నాయి, మనసు నుండి వచ్చే ఆ మాటలు ఏమిటి? అందరి భావము ఒకటే కానీ భిన్న భిన్న మాటలలో చెప్తున్నారు. అందరి హృదయాలనుండి వినిపించేది ఒక్కటే, “మా హృదయ రాజు వచ్చేసారు”. అందరి హృదయాలను చూడండి, మనసును ఫోటో తియ్యగలిగే ఫోటోగ్రాఫర్ ఇంకా రాలేదు. బాబా హృదయంలో పిల్లలందరూ ఎలా ఇమిడి ఉన్నారో ఆ దృశ్యాన్ని ఒకవేళ మీరు కూడా చూస్తే ఇక చూస్తూనే ఉండిపోతారు ఎందుకంటే ఇక్కడ ఈ సమయంలో ప్రతి ఒక్కరి హృదయపు నమూనా స్పష్ట రూపంలో ఉంది. ప్రతి ఒక్కరూ తమ మనసులో ఉన్న విధంగా కనిపిస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, ఒకరు ఒక రూపంలో, ఇంకొకరు ఇంకో రూపంలో, ఒక్కో సమయంలో ఒక్కో పోజుతో మిలనమును జరుపుకుంటున్నారు, అది చూడదగ్గ దృశ్యము. ఒకరి దగ్గర పిల్లవాడి రూపంలో, మరొకరి వద్ద తల్లిదండ్రుల రూపంలో, సఖుని రూపంలో, భిన్న భిన్న రూపాలలో ఉన్నారు. ప్రతి ఒక్కరూ తమ రూపం యొక్క నమూనాలో మునిగి ఉన్నారు. కొందరు నా బాబా అంటున్నారు, మరి కొందరు నా హృదయ హారము అంటున్నారు. భిన్న భిన్న రూపాలతో, భిన్న భిన్న ప్రేమపూర్వక సంబంధాలు ఉంటాయి కదా, అవి ప్రతి ఒక్కరి మనసు అనే ముఖంలో ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరి మనసు యొక్క ఫోటోను చూసి బాప్‌దాదా ఎంత సంతోషిస్తుండవచ్చో మీరు ఆలోచించండి. ఈ సాధారణ రూపంలో కాదు కానీ సాధారణ రూపంలో కూడా మనసులో ఏ రూపంలో గుర్తు చేసుకుంటున్నారో ఆ రూపంలోనే కనిపిస్తున్నారు. మరి చెప్పండి, ఎంత బాగా అనిపిస్తుండవచ్చు! మనసు యొక్క ఫోటో, ఈ ముఖమైతే కనిపించనే కనిపించదు.
మరి బాప్‌దాదాకు కొన్నిసార్లు, సాకార రూపంలో క్లాసు రూపంలో కూర్చుని ఉన్న పిల్లలు ఇమర్జ్ అవుతారు. అందరూ కూర్చున్నది ఈ సంగమయుగ రూపంలోనే అయినా కానీ అందులోని ఆంతరిక రూపాన్ని చూడాలనుకుంటే అది కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరి హృదయం సంతోషమనే ఊయలలో ఊగుతుంది. బాప్‌దాదా పిల్లల సాధారణ రూపాన్ని చూడటం లేదు. సంబంధాల స్వరూపంలో తండ్రి మరియు పిల్లల స్వరూపంలో చూస్తున్నారు, అంతేకానీ ఇమర్జ్ చేసుకుంటే సాధారణంగానే వస్తారు అని కాదు, హృదయపూర్వక ప్రేమ స్వరూపం ప్రత్యక్షంగా ఉంది. మరి మీరు చూడండి, అందరి మనసుల పూర్తి స్థితి, ఇప్పుడు ఈ సమయంలో సభలో కనిపిస్తుంది. బాప్‌దాదాకు ఎంత ప్రేమ ఉంది! ప్రతి ఒక్కరి లోతైన హృదయపూర్వక ప్రేమను చూసి ఎంతగా ఒక్కొక్కరి పట్ల స్నేహాన్ని ప్రత్యక్షంగా కనబరుస్తున్నారు. ఏ మూలన కూర్చున్నాకానీ, మూల ఎక్కడ, మేము ఎక్కడ, కానీ ప్రతి ఒక్కరి ముఖము బాప్‌దాదాకు సమీపంగానే కనిపిస్తుంది. ఏ వస్తువునైనా పెద్దది చేసి మరియు నేచురల్ రూపంలో చూస్తే ఎంత తేడా కనిపిస్తుంది! బాప్‌దాదా ఎప్పుడు వచ్చినా కానీ మీ వాస్తవిక రూపాన్నే చూస్తారు, వారి హృదయం నుండి ఏమని వెలువడుతుంది? వాహ్ పిల్లలూ వాహ్! సమ్ముఖంగా కలవడానికైతే కొద్ది సమయమే లభించింది, మాట్లాడుకోవడమైతే హృదయంతోనే చేసుకోగలం కదా. సమ్ముఖంలో మాట్లాడుకున్నట్లుగానే మనసులోని మాటలను మనసు ద్వారానే మాట్లాడుతాము. సమ్ముఖ అనుభవము, సంతోషము, మనసు నిండటము, ఈ అనుభవాలు మనసుకు ఎంతగానో నచ్చుతాయి. ఒకవేళ ఎవరైనా చివరలో కూర్చున్నా కానీ మనసులో ఎవరికైతే స్మృతి పక్కాగా ఉంటుందో, వారు ‘నేను బాబాతో పాటు కూర్చున్నాను’ అని అనుకుంటారు. సాథి(తోడు) మరియు సాక్షి, రెండు రూపాలు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరి మనసులోని అనుభవాలు వేర్వేరుగా ఉంటాయి. బాబా స్మృతి చాలా బాగా అనుభవం అవుతుందని అందరూ అంటారు కానీ అనుభవాలలో కూడా భిన్న భిన్న రూపాలున్నాయి. మెజారిటీ హృదయాలలో సంగమ రూపమే మిలనంలో ప్రియంగా అనిపిస్తుంది ఎందుకంటే ఒరిజినల్ ఫీలింగ్ వస్తుంది. తండ్రి మరియు పిల్లల మిలనము చాలా ప్రియంగా అనిపిస్తుంది. చివరలో కూర్చున్నా కానీ, అదీ ఇక్కడి లెక్కతో, అందరూ హృదయంలో ఉన్నారు. హృదయాభిరాముడు మరియు పిల్లల హృదయము, ఈ మిలనము ఎంత ప్రియమైనది! మరి ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎక్కడ కూర్చున్నారు? కుర్చీ మీదనా? ప్రతి ఒక్కరూ తమకున్న ప్రేమ అనుసారంగా ఆ స్థానంలోనే కూర్చున్నారు. మరి చెప్పండి, ఈ సభ ఎలా అనిపిస్తుంది? ప్రతి ఒక్కరి మానసిక చిత్రము ఇప్పుడు ఏ విధంగా ఉంది? అందరి మానసిక చిత్రము ఇప్పుడు బయటకు స్పష్టంగా కనిపిస్తుంది. సభ ఎంతో బాగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరి హృదయ చిత్రము ఉంది. అందరి ముఖాలు చాలా సుందరంగా, నల్ల నల్లగా కాదు, స్నేహంలో నిండి ఉన్న వారికి మేకప్ జరుగుతుంది, మరి చెప్పండి, సభ ఎలా అనిపిస్తుంది? ఇటువంటి సభను బాబా చూడగలరు, సెకండులో బాబా ఎదుట వారి స్థితి అనుసారంగా వారి రూపం కనిపించేస్తుంది. సభ చాలా సుందరంగా కనిపిస్తుంది. కొందరు తెల్లగా, కొందరు నల్లగా, కానీ బాబాకు మాత్రం తపనలో మునిగి ఉన్న పిల్లల చిత్రమే కనిపిస్తుంది. మీకున్న తపనను మీ ముఖంలోనే మీరు చూడవచ్చు. ప్రతి ఒక్కరి ముఖము వర్తమాన సమయంలో ఉన్న తపనను ప్రత్యక్షంగా చూపిస్తుంది.
సమయానుసారంగా మాతల సంఖ్య తక్కువేమీ లేకపోవడాన్ని బాప్‌దాదా చూసారు. వారు ఇంకా ఎక్కువ వస్తున్నారు. కాళ్ళ నొప్పులు ఉన్నాకానీ వారికి ఏవో ఒక స్పెషల్ కాళ్ళు లభించేస్తాయి. ఇటువంటి పిల్లల మధ్య బాప్‌దాదాకు ఎంత మంచిగా అనిపిస్తుంది! వాహ్! భక్తిలో వీరిని రకరకాలుగా చూపిస్తారు. ఈ రోజు వచ్చినప్పుడు బాప్‌దాదా కూడా పిల్లలు ఒక్కొక్కరినీ చూస్తారు. పిల్లలు కూడా అదే స్నేహ రూపంలో కనిపిస్తారు. ప్రతి ఒక్కరి హృదయం నుండి వాహ్ బాబా వాహ్! అన్న పాటే వినిపిస్తుంది. బాబాకు పిల్లల భిన్న భిన్న రూపాల పాట మంచి స్వరంతో వినిపిస్తుంది. ఒకరు ఒక విధంగా, ఇంకొకరు ఇంకో విధంగా కాదు, అందరిదీ ఒకే అలంకరణ, అందరూ ఒకే తపనతో కనిపిస్తున్నారు. మీ అందరి ముఖాలు కొంతైతే మారుతాయి, అవే ముఖాలు కానీ లోపల ఉన్న ప్రేమ స్వరూపం బయటకు కూడా కనిపిస్తుంది. ఇక్కడకు రావడానికి పిల్లలకు కొంత కష్టం కలుగుతుండవచ్చు కానీ బాప్‌దాదాకు మాత్రం రావడానికి ఎంతో సంతోషంగా ఉంటుంది, హృదయపు ఆనందంతో దూరదూరాల నుండి ఎంతో తపనతో వచ్చే పిల్లల ముఖాలను చూసి బాప్‌దాదా మనసులోనే మాట్లాడుతారు.
ఇప్పుడు ఇన్ని స్పీకర్లను అయితే పెట్టలేరు, మనసు యొక్క స్వీకరు పెట్టవచ్చు. అందరూ కలుస్తున్నారు కదా! ఏది ఏమైనా కానీ కలుస్తున్నాము కదా అని అందరూ అంటారు కదా! మీరేమంటారు? ఇంత దానితోనే సుఖం కలుగుతుందా? కలుగుతుందా? చాలా సమయం ఉండాలి అన్న కోరిక అయితే ఉంటుంది. కానీ డ్రామా అనుసారంగా ఇలాగే వీలుంది అని బాప్‌దాదా చూసారు. బాప్‌దాదా ప్రతి ఒక్కరి కోరిక అనుసారంగా, ఇంతమంది కూర్చుని ఉన్నారు, ప్రతి ఒక్కరి కోరిక వేర్వేరుగా ఉంటుంది. కానీ ప్రేమతో జరిపిన మిలనము 10 నిమిషాలే అయినా కానీ, అది 10 నిమిషాలు కాదు. ఒక విధంగా చూసుకుంటే కొద్ది సమయమే అనిపిస్తుంది, మరో విధంగా ఆలోచిస్తే ఎక్కువ సమయంగా అనిపిస్తుంది. బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ చూసి సంతోషిస్తారు కూడా, చూడండి, ఎక్కడెక్కడి నుండో మూలమూలన కూర్చుని ఉన్నారు. కానీ ఇంత సమయంలో సంతోషపడ్డారు కూడా, బయటకు మాత్రమే కాదు, మనస్ఫూర్తిగా కూడా ఎందుకంటే మరింకే విధంగానూ జరగలేదు కదా! ప్రతి ఒక్కరూ మాకూ కొంత సమయం కావాలి అని కోరుకుంటారు, ఈ కోరికైతే పెరుగుతూ ఉంటుంది, ఇది బాప్‌దాదాకు కూడా తెలుసు కానీ అస్సలు లేని దానికన్నా ఇలా జరగడం ఇష్టమే కదా. అస్సలు లేదు అనేకన్నా జరుగుతుంది కదా.
మీకు కష్టంగా లేదు కదా! ఎండాకాలం, ఎండలో రావడము-వెళ్ళడము, అంటే ముందుగా ఎండాకాలంలోఒక వర్షం వస్తుంది, ఆ తర్వాత మిలనము. సాధనాలను కూడా ఉపయోగిస్తారు కానీ కలియుగం కదా, కలియుగంలో అన్ని సాధనాలు లభించడం అన్నది అసంభవం. మనం సంపన్నం అవుతాము, సమాప్తి కూడా జరుగుతుంది. కానీ ఆ ఒక్క నిమిషం యొక్క మిలనం కూడా చాలా ప్రియంగా అనిపిస్తుంది. బాబా కూడా ఒక్క రోజులో ఇంతమంది పిల్లలను కలుసుకుంటారు, బాబాకు కూడా మంచిగా అనిపిస్తుంది. అస్సలు మిలనం లేని దానికన్నా ఇది మంచిది కదా. ఎందుకంటే ఎక్కువ చేస్తే, ఇలా దూరంగా కలవాల్సి ఉంటుంది, ఇప్పుడు జరుగుతున్నట్లుగా. బాబాకు కూడా పిల్లలపై ప్రేమ ఉంది కదా! మరి ఒక్కరి కోసం ఇంతమందితో కలవడము, ఇదైతే కలవడానికి అతి ప్రియమైన సమయము అయినప్పటికీ కలుస్తున్నాము కదా. పేరు ఏమి పెడ్తారు? ఎలా కలిసినా కానీ, బాబాను కలిసి వచ్చాము అనే అంటారు కదా. ఈ మధ్యకాలంలో వేడి, చలి వస్తున్నాయి, కలుస్తున్నాయి, పెరుగుతున్నాయి, ఇలా నడుస్తూనే ఉంది. మొదట్లో సభలు ఇంత పెద్ద పెద్దగా ఉండేవా! ఇప్పుడైతే సాధారణమైపోయింది. ఒక్క సభలోనే ఎన్ని పట్టణాల నుండి, తమ తమ స్థానాల నుండి వచ్చి కలుస్తున్నారు! తమ స్థానాల నుండి వచ్చి ఒక స్థానంలో అయితే కలిసారు కదా. అయినప్పటికీ ప్రయత్నిస్తారు, ఎంత సమయం బాబా ఎదురుగా కూర్చున్నారో అంత సమయం మిలనం చేసుకుంటారు, అందరికీ తమ సాధనాలైతే ఉంటాయి. పెద్ద మైదానంలో ఉంటే బాబాకు ఇష్టమే కానీ పెద్ద మైదానంలో వినడము, అర్థం చేసుకోవడము కొంచెం కష్టమవుతుంది. ఇప్పుడు సమయం సమీపిస్తుంది, అయినా కానీ మిలనమైతే జరుగుతుంది కదా. ఇంత దూరదూరంగా, ఎంత దూరం నుండి కలుస్తున్నారు. బాబాకు కూడా నచ్చుతుంది. కేవలం ఓర్పుతో లభించిన ప్రోగ్రాము అనుసారంగా నడుచుకోండి. పిల్లలు కొంచెం అలజడిలోకి రావడాన్ని బాబా చూసినప్పుడు మనసు నొచ్చుకుంటుంది కదా! కానీ తండ్రి మరియు పిల్లల ఈ మిలనము వీడేది కాదు. వచ్చిన వారందరూ, కష్టంగా ఉన్నా లేకపోయినా, మంచిగా లభించినా లేక కొంచెం కష్టమయినా, బాప్‌దాదా అందరినీ కలుసుకుంటున్నారు. కొద్దిగా కష్టమేమైనా కలిగి ఉన్నా కూడా దానికోసం కూడా ఏర్పాట్లు జరుగుతాయి, చేస్తారు తప్పకుండా. ప్రతి ఒక్కరూ మేమూ కలిసి వస్తాము అని అనుకుంటారు, ఆ ఏర్పాట్లు కూడా చూడండి, సేవను ఇంకొంచెం ముందుకు నడిపించండి. నిమిత్తమై ఉన్న ఆత్మల సేవను చేసి దీనిని పెంచవచ్చు కానీ ఇందుకు ధైర్యమున్నవారు కావాలి. లేకపోతే నలుగురు పోలీసులు రాగానే రెండో రోజు నుండి అందరూ భయపడిపోతారు, కనుక ఇటువంటి హంగామా కూడా చెయ్యకూడదు. ప్రభుత్వానికి కోపం తెప్పించకూడదు. జరిగేది జరగకమానదు. అంతేకానీ సుఖ సాధనాలు కదా అని అనుకోవద్దు. ఈ విధంగా మిలనం జరగడం కూడా మంచిదే అని భావించేవారు చేతులెత్తండి. అందరూ చేతులెత్తారు. ఇంకా మంచిగా చెయ్యవచ్చు కదా అని మీరు అనుకుంటారు కానీ అన్నిటినీ చూడాల్సి ఉంటుంది. మన దాదీని చూడండి (దాదీ జానకి వైపు చూస్తూ), ఎంత వయస్సు వచ్చింది. వీరికన్నా పెద్దవారు కూడా ఉండవచ్చు. ఎందుకంటే ఈనాటి సభలో వృద్ధులు ఎక్కువగా కనిపిస్తున్నారు. మీకు ఇష్టమే కదా. వద్దనుకున్నా కూడా ఇష్టమే. ఇలా ఉండాలని అనుకోవడం లేదు, కానీ చెయ్యాల్సి వస్తుంది. మన రాజ్యం ఉన్నప్పుడు ఎన్ని సాధనాలు ఉంటాయంటే అన్నింటినీ పూర్తిగా ఉపయోగించము కూడా, అన్ని ఉంటాయి. సాధనాలు ఉండాల్సిన సమయంలో ప్రతి ఒక్కరూ ఈ ఏర్పాటు ఉంటే ఇంకా బాగుండేది అని అనుకుంటారు. బాప్‌దాదాను పిల్లలు కలిసినప్పుడు ఒక్కొక్కరితో కలవడమైతే కష్టం, కానీ అందరి నుండి దృష్టి తీసుకుంటారు మరియు ఇస్తారు. మీకు ఈ హాల్ అయినా లభించింది, చాలా మంచిది. కొంచెం ఎండలు సహించాల్సి వస్తుంది, సరిగ్గా వినిపించకపోవచ్చు, ఇలా జరుగుతుంది కానీ నెమ్మది నెమ్మదిగా అన్నీ చక్కబెడ్తున్నారు, చేస్తూ ఉంటారు. కానీ తండ్రి మరియు పిల్లల మిలనము ఉండనే ఉంది. అంతేనా లేక దీనికన్నా లేకపోతేనే మంచిది అనుకుంటున్నారా? లేదు. బాబాకు కూడా పిల్లలు గుర్తుకొస్తారు కదా. బాబాకు గుర్తుకు రారు అని కాదు. బాబాకు కూడా గుర్తుకు వస్తారు, చాలా రోజులయింది, పిల్లలను కలవలేదు అని అనుకుంటారు. కానీ అన్నీ చూసుకోవాలి కదా. బాబా కలిసినప్పుడల్లా పిల్లలు ఎంతో ప్రియంగా అనిపిస్తారు. కొంచెం ఎండ, కొంచెం చెమటను సహించాల్సి రావచ్చు కానీ బాబా ముందు ఇవన్నీ ఏపాటి! భక్తిలో ఏమేమి చేసేవారిమి? ఇదైతే జ్ఞానము. సౌకర్యం అయితే లభిస్తుంది కదా. మంచిగానే కూర్చున్నారు కదా. సౌకర్యంగా ఇక్కడ పడుకోలేదేమో కానీ సరిగ్గా కూర్చున్నారు కదా. ఇలాగే ఉండాలి కూడా, ఒకవేళ ఇక్కడ పడుకునే ఏర్పాట్లు ఉంటే సగంమంది పరంధామానికి వెళ్ళిపోయి ఉండేవారు. బాప్‌దాదా ఎప్పుడు రావాల్సి ఉంటుందో, అప్పుడు దృశ్యాలు కనిపిస్తుంటాయి. ఇదైతే జరుగుతుంది. ప్రకృతి కూడా మనకు చాలా సహాయం చేస్తుంది. ఎక్కడ బస్టాండు లేదో అక్కడ బస్టాండ్ తయారువుతుంది. ఎక్కడెక్కడ కష్టంగా ఉందో అక్కడంతా సరి చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు. కానీ కావలసినదల్లా హృదయపు తపన మరియు కొంత బస్టాండులో ఉండటము, వచ్చినా కానీ దూరంగా కూర్చుంటారు. ఇప్పుడు ఈ సభలో ఎవరైతే చివరలో కూర్చున్నారో వారికేమి కనిపిస్తుంది! కానీ అందరూ డ్రామా అనుసారంగా మంచి మిలనం జరుపుకుంటున్నారు, జరుపుకుంటూ ఉంటారు. ఇష్టమే కదా! ఇంతమంది కూర్చున్నారు, ఇలా కూర్చున్నారు. మరి ఇష్టమేనా! దీని గురించి కూడా ఆలోచిస్తారా? ఈ జెండాలను ఊపుతున్నారు, పాపం వారికి రావడం, పోవడం ఇబ్బందిగా ఉంటుంది కదా. అయినా కానీ మనసు పెద్దది. ఎంత పేదవారో అంత పెద్ద మనసు ఉంటుంది. అచ్ఛా. ఇప్పుడు దీనిని కూడా సమాప్తి చెయ్యాల్సి ఉంది.
సేవ టర్న్ యు.పి, బనారస్ మరియు పశ్చిమ నేపాల్ వారిది, 13 వేలమంది యు.పి నుండి వచ్చారు, మొత్తం 27 వేలమంది వచ్చారు:- ఎక్కువమంది యు.పి నుండి ఉన్నారు. ఇక్కడ బాగా కనిపిస్తుంది. మేమైతే చాలా శ్రమించాము, మీరైతే సుఖం సమయంలో వచ్చారు. మా రోజుల్లో అయితే స్కూటర్ కూడా లేదు. ఇవన్నీ తర్వాత నెమ్మది నెమ్మదిగా వచ్చాయి. సంతోషంగా ఉన్నారు. సంతోషంగా కలుస్తూ ఉందాము.
డబల్ విదేశీయులు 50 దేశాల నుండి 900 మంది వచ్చారు:- కష్టంగా ఉండి ఉండవచ్చు. మేము మొదట్లో ప్రారంభించినప్పుడు ఎలాంటి స్థితి ఉండేది, కానీ ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా అర్థమయింది. ఇది ఇష్టమే కదా. ఇది ఇలా జరిగితే కూడా ఇష్టమే కదా! అచ్ఛా. అందరూ తెలివైనవారే. అర్థం చేసుకోగలరు. చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇది ధరలు పెరుగుతున్న సమయం కనుక దాని అనుసారంగా ఏర్పాట్లు చెయ్యడం జరుగుతుంది. సహజంగా ఎంత చెయ్యగలిగితే అంత చెయ్యడంపై అటెన్షన్ ఉంటే చాలు. కానీ ఏదో ఒక కారణం చేత డబ్బులు పెంచవలసి వస్తుంది, అయినా కానీ బాబా మనకు తోడుగా ఉన్నారు, మనకు పరిష్కారాన్ని ప్రభుత్వం కూడా ఇస్తుంది.
మంచిది కదా, మీకు ఇష్టమే కదా! అందరూ సౌకర్యంగా కలుస్తారు కూడా, కలిసిన తర్వాత మంచిగా వెళ్తారు కూడా. ఇంటికి వెళితే ఆహారపానీయాలు రెండు పూటల లభిస్తాయి. ఏ సౌకర్యం ఉంటే బాగుంటుంది అని మీకు అనిపిస్తుందో అది చెప్పండి. చెప్పిన తర్వాత ఎందుకు అవ్వలేదు, ఎందుకు అవ్వలేదు అని ఒత్తిడి తీసుకురావద్దు. ఎంత వీలైతే అంత మీ మాట వినడం జరుగుతుంది.
దాదీలతో:- ఏ కష్టమూ లేకుండా సహజంగా అయ్యేట్లు చూడండి అని అందరూ బాబాకు చెప్తారు. అవుతుంది అని బాబా చెప్తున్నారు. (దాదీ జానకిగారిని తమ వద్ద కూర్చోబెట్టుకున్నారు) మీరొక్కరు సౌకర్యంగా కూర్చుంటే అందరూ కుర్చున్నట్లే. ప్రోగ్రాము అయితే మీరే తయారు చేస్తారు కదా. మీరే యజమానులు కదా.
(మోహిని అక్కయ్యగారి 75వ జన్మదినం జరిపారు, మోహిని అక్కయ్య బాప్‌దాదాకు సుందరమైన మాలను వేసారు, బాప్‌దాదా మోహిని అక్కయ్యకు మాలను వేసారు):- ఏదైతే తయారు చేస్తున్నారో అది జనరల్‌లో ఉపయోగిస్తున్నారు. ఎటువంటి ఫిర్యాదు రాలేదు. నెమ్మది నెమ్మదిగా ఉన్న కష్టాన్ని సమాప్తం చేద్దాము. అటెన్షన్ పెడదాము.
ముగ్గురు అన్నయ్యలు బాప్‌దాదాకు పుష్పగుచ్ఛాన్ని ఇచ్చారు:- అంతా మంచిగా ఉన్నారా! మీటింగ్ చేస్తున్న కొద్దీ అంతా స్పష్టమవుతూ ఉంటుంది. (పుణె జగదాంబ భవనం ప్లాన్‌ను బాప్‌దాదాకు చూపించారు) (బృజ్ మోహన్ అన్నయ్య సి.డి ఓపనింగ్ చేయించారు)
ఈషూ అక్కయ్యతో:- ఆరోగ్యం బాగుంది కదా.
ఎస్.డి.ఎమ్ గారు మరియు ఎస్.పి గారు బాప్‌దాదాను కలుస్తున్నారు:- ఇప్పుడు కలిసారు కదా. (చాలా మంచి సహయోగాన్ని ఇస్తారు) దేశం పని కదా. అందరూ చెయ్యాలి. ఇది దేశానికి సంబంధించిన పని, బ్రహ్మా కుమారీల పర్సనల్ పని కాదు. అచ్ఛా. ఇప్పుడు అందరూ కలిసారు. ఇప్పుడిక ముందు కూడా మిలనం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ ఎలా ప్రోగ్రాము తయారు చేస్తారో అలా చెయ్యండి. అచ్ఛా!
ఓంశాంతి