‘‘విశ్వపరివర్తన కొరకు శాంతి యొక్క శక్తిని ప్రయోగించండి’’
18-03-2020 ఓం శాంతి “అవ్యక్త మహావాక్యాలు” వీడియో ద్వారా 18-02-08 మధువనం
విశ్వపరివర్తన కొరకు శాంతి యొక్క శక్తిని ప్రయోగించండి
ఈరోజు బాప్‌దాదా, విశ్వ పరివర్తకుడైన తండ్రి నలువైపుల ఉన్న తమ ఆశా దీపాలైన పిల్లలను చూసి హర్షిస్తున్నారు. పిల్లలకు బాప్దాదాపై అతి అతి అతి ప్రేమ ఉంది అని బాప్‌దాదాకు తెలుసు మరియు బాప్‌దాదాకు కూడా పిల్లలందరి పట్ల పదమారెట్లకన్నా కూడా అధిక ప్రేమ ఉంది. ఈ ప్రేమ అయితే ఈ సంగమయుగములో సదా లభించనుంది. ఎలా ఎలా అయితే సమయము సమీపిస్తుందో ఆ అనుసారంగా పిల్లలు ప్రతి ఒక్కరి మనస్సులో ఇప్పుడు ఏదైనా చెయ్యాల్సిందే అన్న సంకల్పము, ఉల్లాస-ఉత్సాహము ఉన్నాయి అని బాప్‌దాదాకు తెలుసు. ఎందుకంటే నేటి మూడు సత్తాలు అతి అలజడిలో ఉండటాన్ని మీరు చూస్తున్నారు. ధర్మ సత్తా కావచ్చు, రాజ్య సత్తా కావచ్చు, సైన్స్ సత్తా కావచ్చు, సైన్స్ కూడా ఇప్పుడు ప్రకృతిని యథార్థ రూపంలో నడిపించలేకపోతుంది. జరగాల్సిందే అని అంటారు ఎందుకంటే ప్రకృతి ద్వారా సత్తాను కార్యంలో వినియోగించడమే సైన్స్ సత్తా పని. కానీ సైన్స్ సాధనాలు ఉన్నప్పటికీ, ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఇప్పుడు ప్రకృతి కంట్రోల్లో లేదు. ఇక ముందు కూడా ఈ ప్రకృతి ఆటలు మరింత పెరుగుతాయి ఎందుకంటే ఇప్పుడు ప్రకృతిలో కూడా ఆది సమయములో ఉన్న శక్తి లేదు. ఇటువంటి సమయములో, ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు ఏ సత్తా పరివర్తన చెయ్యగలదు? ఈ సైలెన్స్ శక్తియే విశ్వ పరివర్తన చెయ్యగలదు. మరి నలువైపుల ఉన్న అలజడులను తొలగించేవారు ఎవరు? తెలుసు కదా! పరమాత్మ పాలనకు అధికారి అయిన ఆత్మలు తప్ప మరెవ్వరూ చెయ్యలేరు. మరి మీ అందరికీ మేమే బ్రాహ్మణ ఆత్మలము, బాప్‌దాదా సహచరులము, పరివర్తనా కార్యంలో సహచరులము అన్న ఉల్లాస-ఉత్సాహము ఉంది కదా!
బాప్‌దాదా విశేషంగా అమృతవేళ మరియు రోజంతా అటు ఇటు వెళుతూ కూడా ఏమి చూసారంటే ఎంతగా ప్రపంచంలో మూడు సత్తాల అలజడి ఉన్నదో అంతగా శాంతి దేవతలు, శాంతి దేవుళ్ళు అయిన మీరు ఎంత శక్తిశాలిగా శాంతి యొక్క శక్తిని ప్రయోగించాలో, అది తక్కువగా ఉంది. కావున బాప్‌దాదా ఇప్పుడు పిల్లలందరికీ ఈ ఉల్లాసాన్ని ఇప్పిస్తున్నారు - సేవా క్షేత్రములో సందేశాన్ని మంచిగా వ్యాపింపజేస్తున్నారు, బాప్‌దాదా విశేషంగా ఇచ్చే సూచన ఏమిటంటే ఇప్పుడు శాంతి యొక్క శక్తి వైబ్రేషన్లను నలువైపుల వ్యాపింపజేయండి.
ఇప్పుడు విశేషంగా, బ్రహ్మా బాబా మరియు జగదాంబ తల్లిని చూసారు కదా, స్వయంగా ఆది దేవ్‌గా ఉండి శాంతి యొక్క శక్తిపై ఎంతగానో గుప్త పురుషార్థము చేసారు. మీ దాదీ కర్మాతీతంగా కావడానికి ఈ విషయాన్నే ఎంతో పక్కాగా చేసుకున్నారు. బాధ్యతలు ఉన్నప్పటికీ, సేవా ప్లాన్లను తయారు చేస్తూ కూడా శాంతి శక్తిని జమ చేసుకున్నారు. మరి సేవా బాధ్యతలు ఎంత పెద్దగా ఉన్నా కానీ సేవా సఫలత, ప్రత్యక్ష ఫలితము శాంతి యొక్క శక్తి లేనిదే ఎంతగా కోరుకుంటారో అంతగా వెలువడదు ఎందుకంటే స్వయం కోసం కూడా పూర్తి కల్పం యొక్క ప్రాలబ్ధమును కూడా సైలెన్స్ శక్తితోనే చేసుకోగలరు. ఇందుకోసం ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్వయం కోసం, పూర్తి కల్పం యొక్క ప్రాలబ్ధము - రాజ్య మరియు పూజ్య - రెండు ప్రాలబ్ధాలను కలిపి తీసుకోవడానికి ఇదే సమయము, ఎందుకంటే నాజూకు సమయము రానుంది. అటువంటి సమయములో శాంతి యొక్క శక్తి ద్వారా టచింగ్ పవర్ మరియు క్యాచింగ్ పవర్ చాలా అవసరము. ఈ సాధనాలు ఏమీ పని చెయ్యలేని సమయము వస్తుంది, కేవలం ఆధ్యాత్మిక బలము, బాప్‌దాదా ఇచ్చే డైరెక్షన్ల టచింగ్ మాత్రమే కార్యము చేయించగలవు. కావున స్వయాన్ని పరిశీలించుకోండి - ఇటువంటి సమయములో బాప్‌దాదా ఇచ్చే టచింగ్ నా మనసు, బుద్ధికి వస్తుందా? ఇందుకు బహుకాలపు అభ్యాసము కావాలి. ఇందుకు సాధనము - మనసు, బుద్ధి సదా, అప్పుడప్పుడు కాదు, సదా క్లీన్ (స్వచ్ఛము) మరియు క్లియర్ (స్పష్టము)గా ఉండాలి. ఇప్పుడు రిహార్సల్ పెరుగుతూ ఉంటుంది మరియు సెకండ్లో రియల్ అయిపోతుంది. ఒకవేళ కొంచెం కూడా మనసులో, బుద్ధిలో ఏ ఆత్మపట్ల అయినా కానీ, ఏ కార్యము పట్ల అయినా కానీ, తోటి వారు, సహచరుల పట్ల కానీ కొంచమైనా నెగటివ్ ఉన్నట్లయితే దానిని క్లీన్ మరియు క్లియర్ అని అనడం జరుగదు. అందుకే బాప్‌దాదా ఈ విషయంలో అటెన్షన్‌ను ఇప్పిస్తున్నారు. రోజంతటిలో పరిశీలించుకోండి - సైలెన్స్ శక్తి ఎంత జమ చేసుకున్నాను? సేవ చేస్తూ కూడా సైలెన్స్ శక్తి ఒకవేళ వాణిలో లేకపోతే ప్రత్యక్ష ఫలితముగా సఫలతను ఎంతగా కోరుకుంటున్నారో అంతగా ఉండదు. శ్రమ ఎక్కువ, ఫలితము తక్కువ. సేవ చెయ్యండి కానీ శాంతి యొక్క శక్తితో సంపన్నమైన సేవను చెయ్యండి. అప్పుడు మీరు ఆశించిన ఫలితముకన్నా ఎక్కువ ఫలితమే వస్తుంది. పదే పదే పరిశీలించుకుంటూ ఉండండి. ఇకపోతే రోజురోజుకూ ఎక్కడ ఏ సేవ జరిగినా కానీ అది మంచిగా చేస్తున్నందుకు బాప్‌దాదాకు సంతోషంగా ఉంది. కానీ స్వయం పట్ల శాంతి యొక్క శక్తిని జమ చేసుకోవడంలో, పరివర్తన అవ్వడంలో మరింత అటెన్షన్.
ఇప్పుడు పూర్తి ప్రపంచం విశ్వ పరివర్తనకు ఎవరు నిమిత్తమవుతారా అని వెతుకుతుంది! ఎందుకంటే రోజురోజుకీ దుఃఖము, అశాంతి పెరుగుతున్నాయి, ఇంకా పెరగనున్నాయి. భక్తులు తమ ఇష్టులను స్మృతి చేస్తున్నారు, కొందరు అతిలోకి వెళ్ళి వ్యాకులతతో జీవిస్తున్నారు. ధర్మ గురువుల వైపుకు దృష్టి మళ్ళిస్తున్నారు. సైన్స్ వారు కూడా ఎలా చెయ్యాలి, ఎప్పటి వరకు జరుగుతుంది అని ఆలోచిస్తున్నారు. మరి వీరందరికీ జవాబు ఇచ్చేవారు ఎవరు? ఆఖరకు గోల్డెన్ మార్నింగ్ (సువర్ణ ప్రభాతము) ఎప్పుడు వస్తుంది అని అందరి హృదయాల నుండి పిలుపు వినిపిస్తుంది. మరి మీరందరూ తీసుకువచ్చేవారే కదా? అవునా? నేను ఇందుకు నిమిత్తుడను అని భావించేవారు చేతులెత్తండి. నిమిత్తులు. (అందరూ చేతులెత్తారు). అచ్ఛా. ఇంతమంది నిమిత్తమైతే ఎంత సమయంలో జరగాలి! మీరందరూ సంతోషపడుతున్నారు మరియు బాప్‌దాదా కూడా సంతోషిస్తున్నారు. చూడండి, ఈ గోల్డెన్ ఛాన్స్ (సువర్ణ అవకాశము) ప్రతి ఒక్కరికీ గోల్డెన్ సమయం అనుసారంగా ప్రాప్తిస్తుంది.
ఎలా అయితే సేవ కోసం మీటింగ్ చేస్తారో, సమస్య పరిష్కారానికి కూడా మీటింగ్ చేస్తారో అలాగే ఇప్పుడు ఈ మీటింగ్‌ను చెయ్యండి. ఇటువంటి ఒక మీటింగ్‌ను చేయండి, ఈ ప్లాన్‌ను ఆలోచించండి. స్మృతి మరియు సేవ. స్మృతి అనగా శాంతి యొక్క శక్తి. మీరు టాప్ స్టేజ్‌లో (ఉన్నత స్థితిలో) ఉన్నప్పుడు అది ప్రాప్తిస్తుంది. ఎక్కడైనా ఉన్నత స్థానంలో నిల్చున్నట్లయితే అక్కడి నుండి అన్ని స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే మీ టాప్ స్టేజ్, అన్నిటికన్నా టాప్‌లో ఏముంది? పరంధామము. బాప్‌దాదా ఏమంటారంటే సేవ చేసిన తర్వాత టాప్ స్టేజిలో బాబా వద్దకు వచ్చి కూర్చోండి. ఎలా అయితే అలసిపోతే 5 నిమిషాలైనా ఎక్కడన్నా శాంతిగా కూర్చుంటే తేడా కనిపిస్తుంది కదా, అలాగే మధ్య మధ్యలో బాబా వద్దకు వచ్చి కూర్చోండి. రెండవ టాప్ స్థానము, సృష్టి చక్రాన్ని చూడండి, సృష్టి చక్రంలో టాప్ స్థానము ఏమిటి? సంగమానికి వచ్చి ముల్లును టాప్‌లో చూపిస్తారు కదా. క్రిందకు రండి, సేవ చెయ్యండి మళ్ళీ టాప్ స్థానానికి వెళ్ళిపోండి. మరి అర్థమయిందా ఏమి చెయ్యాలో? సమయము మిమ్మల్ని పిలుస్తుందా లేక మీరు సమయాన్ని సమీపానికి తీసుకువస్తున్నారా? రచయిత ఎవరు? పరస్పరంలో ఇటువంటి ప్లాన్లను తయారు చెయ్యండి. అచ్ఛా.
పిల్లలు రావలసిందే అని అన్నారు, బాప్‌దాదా హా జీ అన్నారు. అలాగే మీరు కూడా ఇతరుల మాటలను, స్వభావాలను, వృత్తిని అర్థం చేసుకుని, హా జీ, హా జీ అంటూ ఉంటే సంగఠన శక్తి సైలెన్స్ జ్వాలను ప్రజ్వలింపజేస్తుంది. జ్వాలాముఖిని చూసారు కదా. ఈ సంగఠన శక్తి శాంతి జ్వాలను ప్రజ్వలింపజేస్తుంది. అచ్ఛా.
నలువైపుల ఉన్న బాప్‌దాదా హృదయ సింహాసనాధికారి మరియు విశ్వ రాజ్య సింహాసనాధికారులకు, సదా తమ సైలెన్స్ శక్తితో ముందుకు సాగుతూ మరియు ఇతరులకు కూడా ముందుకు సాగే ఉల్లాస ఉత్సాహాలను ఇచ్చేవారికి, సదా సంతోషంగా ఉంటూ మరియు అందరికీ సంతోషాల బహుమతులను ఇచ్చేవారికి, నలువైపుల ఉన్న బాప్‌దాదా యొక్క లక్కీ మరియు లవ్లీ పిల్లలకు బాప్‌దాదా ప్రియస్మృతులు మరియు దీవెనలు, నమస్తే.
*** ఓంశాంతి ***
