"నిర్లక్ష్యము, సోమరితనము మరియు సాకులు చెప్పడం అనే నిద్ర నుండి మేలుకోవడమే శివరాత్రి యొక్క సత్యమైన జాగరణ"
ఓం శాంతి 20.02.20 మధువనం
ప్రాణప్రదమైన అవ్యక్తమూర్త తల్లి తండ్రి అయిన బాప్‌దాదాకు అతి స్నేహులు, తమ సత్యమైన హృదయంతో భోలానాథుడైన బాబాను సంతృప్తి పరిచేవారు, సదా పవిత్రత వ్రతాన్ని ఆచరించేవారు, బ్రహ్మాచారి అయినటువంటి నిమిత్త టీచర్ అక్కయ్యలు మరియు దేశ విదేశాలలోని సర్వ బ్రాహ్మణ కులభూషణ సోదర సోదరీలు,
ఈశ్వరీయ స్నేహ సంపన్న మధుర స్మృతులతో పాటు ఈరోజు త్రిమూర్తి శివ జయంతి సో గీతా జయంతి సో స్వర్ణిమ యుగ జయంతికి అందరికీ చాలా చాలా హృదయపూర్వక స్నేహభరిత అభినందనలు.
మనమందరం మన అతి ప్రియమైన శివ భోలానాథుడైన తండ్రి యొక్క వజ్రతుల్యమైన త్రిమూర్తి శివ జయంతిని చాలా ఉల్లాస ఉత్సాహాలతో జరుపుకుంటాము, జెండాను ఎగురవేస్తాము, స్వ పరివర్తన మరియు విశ్వ పరివర్తన కోసం ప్రతిజ్ఞలు చేస్తాము, వీటితోపాటు అనేక ఆత్మలకు శివబాబా అవతరణ యొక్క దివ్య సందేశాన్ని ఇచ్చే సేవలను చేస్తాము. సర్వుల కళ్యాణకారి, స్వయంభూ అయిన శివ పరమాత్మ ఈ ధరిత్రి పై గత 84 సంవత్సరాల నుండి అవతరిస్తూ విశ్వ పరివర్తన అనే మహా కార్యాన్ని గుప్త రీతిలో చేస్తున్నారు. పిల్లలూ, ఈ శుభ సందేశాన్ని ప్రతి ఆత్మకు చేర్చండని బాబా అంటారు. ఈ సందేశం అందకుండా ఎవ్వరూ వంచితులవ్వకూడదు, ఇందుకోసం మనమందరం బాబా నుండి మనకు లభించిన మొట్టమొదటి వరదానము “బీ హోలీ, బీ యోగి” (పవిత్రంగా ఉండండి, యోగిగా ఉండండి), దీని ప్రాక్టికల్ స్వరూపులుగా అయ్యి మన శ్రేష్ఠ నడవడిక, చరిత్ర ద్వారా బాబాను ప్రత్యక్షం చేయాలి. “ఇదే, ఇదే...” అని నలువైపుల నుండి జయజయకారాల ధ్వని ఎప్పుడు మారుమ్రోగుతుందో అప్పుడు విశ్వ పరివర్తన అనే మహా కార్యం సంపన్నమవుతుంది, అప్పుడు ప్రతి ఆత్మ ముక్తి, జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని జన్మ సిద్ధ అధికారంగా ప్రాప్తి చేసుకోగలుగుతుంది. ఈ శుభ భావనతో ఇప్పుడు మిగిలి ఉన్న సేవలను త్వరత్వరగా సంపన్నం చేయాలి. దీనితోపాటు విశేషంగా తీవ్ర పురుషార్థం చేసి కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకుని సంపూర్ణంగా అవ్వాలి. చెప్పండి, ఈ లక్ష్యమే ఉంది కదా!
చూడండి, మధుబన వరదాన భూమిలో ఈ విశేష పండుగ వారం రోజులు జరుగుతుంది. బాబా యొక్క అన్ని స్థానాలలో సోదరసోదరీలందరూ కలిసి జెండాను ఎగురవేస్తారు, నోరు తీపి చేసుకుంటారు, సంతోషాలు జరుపుకుంటారు. గత సంవత్సరం వలె అనంతమైన సేవల కోసం ఈ సంవత్సరం కూడా శాంతివన్ వద్ద ఉన్న పాఠశాలలో ఎంతో సుందరంగా “మహా శివరాత్రి మహోత్సవం” కార్యక్రమం 5 రోజులు జరిగింది. ఇందులో అమరనాథుని గుహ, 12 జ్యోతిర్లింగాల దర్శనము విశేష ఆకర్షణగా నిలిచాయి. నలువైపుల ఉన్న అనేక గ్రామాల నుండి అనేకానేకమంది ఈ మేళాను దర్శించుకోవడానికి వచ్చారు.
బాప్‌దాదా సీజన్లో ఈసారి సేవ టర్న్‌లో భోపాల్ జోన్ సోదరసోదరీలు చేరుకున్నారు. వీరితో పాటు డబల్ విదేశీ సోదరసోదరీలు కూడా చాలా సంఖ్యలో వచ్చారు, వీరెంతో చక్కగా జ్ఞానపు లోతుల్లోకి వెళ్లి ఆత్మిక సంభాషణ చేస్తూ విశేషమైన తపస్సు చేస్తున్నారు. విదేశాల ముఖ్యమైన పెద్దక్కయ్యలందరూ ఈ సమయంలో మధుబనంలో ఉన్నారు. శివరాత్రి తర్వాత స్వ ఉన్నతి, విశ్వ సేవ నిమిత్తం అందరూ కలిసి పూర్తి సంవత్సరానికి ప్లాన్లు తయారు చేస్తారు.
మనందరి ప్రేరణా స్తోత్రమైన దాదీ జానకిగారు కొంత సమయంగా ఆరోగ్యం బాగా లేని కారణంగా వారు అహ్మదాబాద్ మేమ్ నగర్ సేవాకేంద్రంలో ఉంటున్నారు, 2-3 రోజులలో మధుబనానికి వచ్చేస్తారు. వారు అహ్మదాబాద్ నుండి విశేషంగా అందరికీ ప్రియ స్మృతులను మరియు శివ జయంతికి అభినందనలను తెలిపారు.
ఇకపోతే మనందరి అతి ప్రియమైన బాప్‌దాదా యొక్క అమూల్యమైన రథం దాదీ గుల్జార్‌గారు ఇప్పుడు ఇంకా ముంబయి గామ్దేవి సేవాకేంద్రంలోనే ఉన్నారు. బ్రాహ్మణ పిల్లలందరి విశేష సంకల్పం బాప్‌దాదా వద్దకు చేరుకుంటూ ఉంటుంది, బాప్‌దాదా తప్పకుండా పిల్లల ఆశను పూర్తి చేసి దాదీగారిని మధుబనానికి తీసుకు వస్తారు. బాప్‌దాదా యొక్క ఈ గుప్త పాత్రలో మనమంతా సదా రాజీగా ఉంటూ డ్రామా అనే పట్టాలపై అచలంగా, నిశ్చలంగా ఉంటాము. అచ్ఛా!
అందరికీ చాలా చాలా స్నేహ సంపన్న స్మృతి... ఓం శాంతి.
20.02.20 ఓం శాంతి అవ్యక్త మహావాక్యాలు - వీడియో ద్వారా 15-02-07 మధువనం
నిర్లక్ష్యము, సోమరితనము మరియు సాకులు చెప్పడం అనే నిద్ర నుండి మేలుకోవడమే శివరాత్రి యొక్క సత్యమైన జాగరణ
ఈరోజు బాప్‌దాదా విశేషంగా నలువైపుల ఉన్న తమ అతి గారాల పిల్లలు, అతి ప్రియమైనవారు, పరమాత్మ ప్రేమకు పాత్రులైన పిల్లలను కలుసుకోవడానికి మరియు విచిత్రమైన తండ్రి పిల్లల జన్మదినాన్ని జరుపుకోవడానికి వచ్చారు. మీరందరూ కూడా ఈరోజు విచిత్రమైన జన్మ దినాన్ని జరుపుకోవడానికి వచ్చారు కదా! ఈ జన్మ దినం పూర్తి కల్పంలో మరెవ్వరికీ ఉండదు. తండ్రి మరియు పిల్లల జన్మ దినం ఒకే రోజు ఉండటాన్ని ఎప్పుడూ వినలేదు కదా. మరి మీరందరూ బాబా జన్మ దినాన్ని జరుపుకోవడానికి వచ్చారా లేక పిల్లలది కూడా జరుపుకోవడానికి వచ్చారా? ఎందుకంటే పూర్తి కల్పంలో పరమాత్మ తండ్రి మరియు పరమాత్ముని పిల్లల మధ్య ప్రేమ ఎంత అపారమైనదంటే వారి జన్మ కూడా ఒకేసారి జరిగింది. బాబా ఒంటరిగా విశ్వ పరివర్తన కార్యాన్ని చేయరు, పిల్లలతో కలిసి చేస్తారు. ఈ అలౌకిక తోడుగా ఉండే ప్రేమ, సహచరునిగా అయ్యే ప్రేమ ఈ సంగమంలోనే అనుభవం చేసుకుంటారు. తండ్రి మరియు పిల్లలది ఎంత గాఢమైన ప్రేమ అంటే వారి జన్మ కూడా కలిసి జరుగుతుంది. ఉండేది కూడా ఎక్కడ? ఒంటరిగానా లేక కలిసి ఉంటారా? పిల్లలు ప్రతి ఒక్కరూ మేము బాబాతో కంబైన్డ్‌గా ఉన్నాము అని ఎంతో ఉల్లాస ఉత్సాహాలతో చెప్తారు. కంబైన్డుగా ఉంటారు కదా! ఒంటరిగా అయితే ఉండరు కదా! జన్మ కలిసి ఉంది, కలిసి ఉంటారు ఆ తర్వాత కూడా ఏమని ప్రతిజ్ఞ ఉంది? కలిసి ఉన్నాము, కలిసి ఉంటాము, మన స్వీట్ హోమ్‌కు కలిసి వెళ్తాము. తండ్రి పిల్లల మధ్య ఇంతటి ప్రేమను ఇంకెక్కడైనా చూసారా? పిల్లలు ఎవరైనా కానీ, ఎక్కడున్నా కానీ, ఎలా ఉన్నా కానీ కలిసి ఉంటారు, కలిసే ఉంటాము. మరి ఇటువంటి విచిత్రమైన మరియు ప్రియాతి ప్రియమైన జన్మ దినాన్ని జరుపుకోవడానికి వచ్చారు. సమ్ముఖంలో జరుపుకున్నా కానీ, దేశ విదేశాలలో నలువైపుల ఉన్నా కానీ ఒకే సమయంలో కలిసి జరుపుకుంటున్నాము.
బాప్‌దాదా నలువైపుల ఉన్న పిల్లలందరూ ఏ విధంగా ఉల్లాస ఉత్సాహాలతో మనసులో వాహ్ బాబా! వాహ్ బాబా! వాహ్ జన్మ దినం! అనే పాటను పాడుతున్నారో చూస్తున్నారు. ఒకవేళ స్విచ్ ఆన్ చేస్తే నలువైపుల ధ్వని, మనసులోని ధ్వని, ఉల్లాస ఉత్సాహాల ధ్వని బాప్‌దాదా చెవులకు వినిపిస్తున్నాయి. బాప్‌దాదా పిల్లలందరి ఉత్సాహాన్ని చూసి పిల్లలకు కూడా తమ దివ్య జన్మకు పదమా పదమా పదమారెట్లు అభినందనలు తెలుపుతున్నారు. వాస్తవానికి ఉత్సవం అంటేనే ఉల్లాస ఉత్సాహాలలో ఉండటమని అర్థం. మరి మీరందరూ ఉత్సాహంతో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. పేరు కూడా భక్తులు శివరాత్రి అని పెట్టారు.
ఈరోజు బాప్‌దాదా ఆ భక్త ఆత్మకు అభినందనలు తెలుపుతున్నారు, మీ ఈ విచిత్ర జన్మ దినాన్ని జరుపుకోవడాన్ని చాలా చక్కగా కాపీ చేసిన ఆ భక్త ఆత్మకు అభినందనలు తెలుపుతున్నారు. మీరు జ్ఞానము మరియు ప్రేమ రూపంలో జరుపుకుంటారు, ఆ భక్త ఆత్మ భావన, శ్రద్ధ రూపంలో మీరు జరుపుకునే దానిని కాపీ చేసారు. మరి ఈరోజు ఆ బిడ్డకు అభినందనలు తెలుపుతున్నారు, కాపీ చేయడంలో మంచి పాత్రను పోషించారు. చూడండి, ప్రతి విషయాన్ని కాపీ చేసారు. కాపీ చేయడానికి కూడా తెలివి ఉండాలి కదా! ముఖ్యమైన విషయమేమిటంటే ఈరోజు భక్తులు కూడా వ్రతం పెట్టుకుంటారు, వారు ఆహారపానీయాల వ్రతాన్ని పెట్టుకుంటారు, భావనలో వృత్తిని శ్రేష్ఠంగా చేసుకోవడానికి వ్రతాన్ని పెట్టుకుంటారు, వారు ప్రతి సంవత్సరం పెట్టుకుంటారు, మరి మీరు ఏ వ్రతం తీసుకున్నారు? ఒకేసారి వ్రతం తీసుకుంటారు, ప్రతి సంవత్సరం వ్రతం తీసుకోరు. ఒకేసారి పవిత్రత యొక్క వ్రతాన్ని తీసుకుంటారు. అందరూ పవిత్రత వ్రతాన్ని తీసుకున్నారు కదా, పక్కాగా తీసుకున్నారా? ఎవరైతే పక్కాగా తీసుకున్నారో వారు చేతులెత్తండి, పక్కా కొంచెం కూడా కచ్చా లేదు కదా. పక్కా? మంచిది. మరో ప్రశ్న కూడా ఉంది, సరే, వ్రతం అయితే తీసుకున్నారు, అభినందనలు. కానీ అపవిత్రతకు ముఖ్యంగా ఐదుగురు సహచరులు ఉన్నారు కదా! తల ఊపండి. అచ్ఛా, మరి ఐదింటి వ్రతాన్ని తీసుకున్నారా? లేక రెండు మూడు మాత్రమే వ్రతంగా తీసుకున్నారా? ఎందుకంటే ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ ఒకవేళ అంశమాత్రమైనా అపవిత్రత ఉంటే వారిని సంపూర్ణ పవిత్ర ఆత్మ అని అంటామా? బ్రాహ్మణ ఆత్మలైన మీకైతే పవిత్రత బ్రాహ్మణ జన్మ యొక్క ప్రాపర్టీ, పర్సనాలిటీ మరియు రాయల్టీ (ఆస్తి, వ్యక్తిత్వము మరియు హుందాతనము). మరి పరిశీలించుకోండి - ముఖ్యమైన పవిత్రత పైన అయితే అటెన్షన్ ఉంది కానీ సంపూర్ణ పవిత్రత కోసం ఇతర ఐదు సహచరులను తేలికగా వదిలేయలేదు కదా? చిన్నవాటి పైన ప్రేమ పెట్టుకున్నారు మరియు పెద్ద దాన్ని సరి చేస్తున్నారా! మిగతా నాలుగింటిని మీ సహచరులుగా చేసుకోండి అని బాబా అనుమతించారా? పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యం మాత్రమే కాదు, బ్రహ్మచర్యంతో పాటు బ్రహ్మాచారులుగా అవ్వడము అనగా పవిత్రత యొక్క వ్రతాన్ని ఆచరించడము. కొంతమంది పిల్లలు ఆత్మిక సంభాషణలో ఇలా అంటారు, ఆత్మిక సంభాషణ అయితే అందరూ చేస్తారు కదా. మరి అందులో చాలా మధురాతి మధురంగా మాట్లాడుతారు. బాబా, ముఖ్యమైనదైతే మంచిగానే ఉంది కదా, ఇకపోతే చిన్న చిన్నవి అలా మనసా సంకల్పాలలో వస్తాయి అంటారు. మనసులో వస్తాయి, వాచలోకి రావడం లేదు, మనసును ఎవ్వరూ చూడరు. చిన్న చిన్న పిల్లలపైన ప్రేమ ఉంటుంది కదా అని మరి కొందరు అంటారు. మరి ఈ నాలుగింటిపైన ప్రేమ ఉంటుంది. క్రోధము వచ్చేస్తుంది, మోహము వచ్చేస్తుంది, అనుకోవడం లేదు కానీ వచ్చేస్తుంది. ఎవరైనా వస్తే మీరు తలుపు తెరిస్తేనే కదా లోపలకు రాగలరు అని బాప్‌దాదా అంటారు. మరి తలుపు ఎందుకు తెరిచారు? బలహీనత అనే ద్వారాన్ని తెరిచారు, బలహీనత అనే ద్వారాన్ని తెరవడం అంటే ఆహ్వానించడం అని అర్థం.
మరి ఈరోజు తండ్రి మరియు పిల్లలైన మీ జన్మ దినాన్ని జరుపుకుంటున్నారు కానీ జన్మతః వ్రతాన్ని ప్రతిజ్ఞగా చేసారు. బాబా మొట్టమొదటగా ఏ వరదానాన్ని ఇచ్చారు, గుర్తుందా? జన్మ దినం యొక్క వరదానం గుర్తుందా? ఏమి ఇచ్చారు? పవిత్ర భవ, యోగి భవ. అందరికీ ఈ వరదానం గుర్తుంది కదా? గుర్తుందా, మర్చిపోలేదు కదా? పవిత్ర భవ అనే వరదానాన్ని ఒక్కరికి ఇవ్వలేదు, ఐదింటికి ఇచ్చారు. మరి ఈరోజు బాప్‌దాదా ఏమి కోరుకుంటున్నారు? జన్మ దినాన్ని జరుపుకోవడానికి వచ్చారు, తండ్రిది కూడా జరపడానికి వచ్చారు. శివరాత్రి జరుపుకోవడానికి వచ్చారు, మరి జన్మ దినానికి బహుమతిని తెచ్చారా లేక ఖాళీ చేతులతో వచ్చారా?
ఈరోజు బాప్‌దాదా యొక్క శుభ ఆశ తమ ఆశా దీపాలైన పిల్లల పట్ల, ఆ శుభమైన ఆశ ఏమిటి, చెప్పమంటారా? చెప్పడము లేక వినడము అంటే ఏమిటి? ఒక చెవితో విని హృదయంలో ఇముడ్చుకోవడము, అంతేనా? బయటకు వదిలిపెట్టరు కదా, ఇలా లేదు కదా? మనసులోనే ఇముడ్చుకోవాలి. మరి ఈరోజు ఆ శుభ ఆశను చెప్తాము, మొదటి లైన్వారు చెప్పండి, తల ఊపండి, టీచర్లు తల ఊపండి. డబల్ విదేశీయులు చెప్పండి. స్వయాన్ని బంధించాల్సి ఉంటుంది, అప్పుడే సరే అని చెప్పండి, ఊరికే కాదు.
మరి ఈరోజు భక్తులు జాగరణ చేస్తారు, నిద్రపోరు, మరి పిల్లలైన మీ జాగరణ ఏమిటి? ఏ నిద్రలోకి పదే పదే వెళ్ళిపోతుంటారు, నిర్లక్ష్యము, సోమరితనము మరియు సాకులు చెప్పడము అనే నిద్రలో హాయిగా నిద్ర పోతారు. మరి ఈరోజు బాప్‌దాదా ఈ మూడు విషయాలలో ప్రతి సమయము జాగరణ కోరుకుంటున్నారు. ఎప్పుడైనా చూడండి, క్రోధము వస్తుంది, అభిమానము వస్తుంది, లోభము వస్తుంది, కారణము ఏమని చెప్తారు? బాప్‌దాదాకు ఒక ట్రేడ్ మార్క్ కనిపిస్తుంది, ఏ విషయం జరిగినా కానీ, ఏమంటారు, ఇదైతే నడుస్తుంది కదా, ... ఎవరు నడిపిస్తున్నారో తెలియడం లేదు. కానీ మాటలైతే ఇవే అంటారు - ఇదైతే జరుగుతుంది, ఇదైతే నడుస్తుంది. ఇదేమీ కొత్త విషయము కాదు, ఇలా జరుగుతుందిలే. ఇది ఏమిటి? నిర్లక్ష్యము కాదా? వీరు కూడా చేస్తున్నారు కదా, మెజారిటీ క్రోధం నుండి రక్షించబడటానికి ఇలా చేసాను అందుకని ఇలా జరిగింది అంటారు కానీ నేను రాంగ్ చేసాను అని అనరు. వీరు ఇలా చేసారు కదా, ఇలా జరిగింది కదా, అందుకని ఇలా జరిగింది. ఇతరులపై దోషం పెట్టడం చాలా సహజం. వీరు చేయకపోతే ఇలా జరిగి ఉండేది కాదు అంటారు. మరి బాబా చెప్పినది జరగదా? వారు చేస్తే ఇలా జరుగుతుంది, మరి బాబా శ్రీమతంపై క్రోధాన్ని సమాప్తం చేయలేరా? ఈరోజుల్లో క్రోధం యొక్క సంతానం ఆవేశం, ఆవేశం కూడా భిన్న భిన్న రకాలుగా ఉంటుంది. మరి ఈరోజు నాలుగింటి వ్రతాన్ని తీసుకుంటారా? ఎలా అయితే మొదటి విషయంలో విశేషంగా మెజారిటీ దృఢ సంకల్పం తీసుకున్నారు. మరి అలాగే మిగతా నాలుగింటిలో సంకల్పం చేస్తారా! వీరిలా చేసారు కాబట్టి నేనిలా చేసాను అని సాకులు చెప్పకండి, మరి బాబా ఏదైతే పదే పదే చెప్తున్నారో అది గుర్తుకు లేదా, వారు చేసింది గుర్తుంది, మరి ఇది సాకులు చెప్పడమే కదా! మరి ఈరోజు బాప్‌దాదా జన్మ దినం సందర్భంగా బహుమతిని కోరుకుంటున్నారు, ఈ మూడు విషయాలు ఆ నాలుగింటి ధారణను తేలికగా చేసేస్తాయి. సంస్కారాలను అయితే ఎదుర్కోవలసిందే, ఇది సంస్కారాలను ఎదుర్కోవడము కాదు, పరీక్ష. ఒక్క జన్మకు పరీక్ష మరియు పూర్తి కల్పానికి ప్రాప్తి, అర్థకల్పానికి రాజ్యము, అర్థకల్పము పూజ్యులు, పూర్తి కల్పానికి ఒక్క జన్మలోనే ప్రాప్తి, అది కూడా చిన్నని జన్మ, పూర్తి జన్మ కాదు, చిన్నని జన్మ. మరి ధైర్యము ఉందా? ధైర్యము తప్పకుండా పెట్టుకుంటాము అనేవారు, అంతేకానీ పురుషార్థం చేసి చూస్తాము, అటెన్షన్ పెట్టి చూస్తాను.... చూస్తాము అనేవారు కాదు.
బాప్‌దాదా ఏమి చూస్తున్నారంటే సమయానిది ఏమీ భరోసా లేదు మరియు ఈ జ్ఞానం ఆధారంగా ప్రతి పురుషార్థం విషయంలో బహుకాలపు లెక్క ఉంటుంది. ఇప్పుడే చేస్తారు, కానీ బహుకాలపు లెక్క ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏ ప్రాప్తిని కోరుకుంటారు? ఎవరైనా రాముడు సీతగా అవ్వాలనుకుంటారా, చేయి ఎత్తమంటే ఎందులో ఎత్తుతారు? రాముడు సీతగా అవ్వాలనుకునేవారు చేతులెత్తండి, రాజ్యం లభిస్తుంది. రాముడు సీతగా అవ్వడంలో ఎవరైనా చేతులెత్తుతున్నారా? లక్ష్మీనారాయణులుగా అవ్వరా? డబల్ విదేశీయులలో ఎవరైనా చేయి ఎత్తుతారా ఇందులో? (ఎవ్వరూ లేరు) బహుకాలపు ప్రాప్తిని పొందాలనుకుంటున్నప్పుడు, లక్ష్మీనారాయణులుగా అవ్వడము అంటే బహుకాలపు రాజ్య భాగ్యాన్ని ప్రాప్తి చేసుకోవడము. మరి బహుకాలపు ప్రాప్తి కదా. మరి ప్రతి విషయంలో బహుకాలం ఉండాలి కదా! ఇప్పుడు 63 జన్మల బహుకాలపు సంస్కారము ఉంది కనుక ఏమంటారు, మా భావము అది కాదు, భావన అది కాదు, 63 జన్మల సంస్కారము అని అంటారు కదా. మరి బహుకాలపు లెక్క కదా ఇది. అందుకని సంకల్పంలో దృఢత్వం ఉండాలని బాప్‌దాదా కోరుకుంటున్నారు, దృఢత్వం లోపిస్తుంది, అందుకే జరిగిపోతుందిలే... ఫర్వాలేదు, నడవనిద్దాము, ఎవరు అయ్యారు. మరొక విషయము అందరికీ చాలా బాగా వచ్చు, బాప్‌దాదా మాటలను నోట్ చేసారు, తమకు ధైర్యం లేకపోతే ఇలా అంటారు, మహారథులు కూడా ఇలా చేసారు కదా, మేము చేస్తే ఏమయింది? కానీ ఏ సమయంలో అయితే మహారథి తప్పు చేసారో ఆ సమయంలో వారు మహారథులా అని బాప్‌దాదా ప్రశ్నిస్తున్నారు? మరి మహారథి పేరును ఎందుకు పాడు చేస్తున్నారు? ఆ సమయంలో వారు మహారథి కానే కాదు, మరి మహారథి పేరు చెప్పి స్వయాన్ని బలహీనంగా చేసుకోవడం ఇది స్వయాన్ని మోసగించుకోవడమే. ఇతరులను చూడటం సహజమవుతుంది, స్వయాన్ని చూసుకోవడంలో కొంచెం ధైర్యం కావాలి. మరి ఈరోజు బాప్‌దాదా లెక్కల పుస్తకాన్ని సమాప్తం చేసే బహుమతిని తీసుకోవడానికి వచ్చారు. బలహీనత మరియు సాకులు చెప్పే లెక్కల పుస్తకం చాలా పెద్దదిగా ఉంది, దానిని సమాప్తం చేయండి. మేము చేసి చూపిస్తాము, చేయవలసిందే, వంగాల్సిందే, మారవలసిందే, పరివర్తన సెరిమనీ జరుపుకోవలసిందే అని సంకల్పం చేస్తాము అని అనుకుంటున్నారో వారు చేతులెత్తండి. దృఢమా లేక కపటమా? కపట సంకల్పం కూడా ఉంటుంది మరియు దృఢ సంకల్పం కూడా ఉంటుంది. మరి మీరంతా దృఢమైన చేతినే ఎత్తారా? మధుబన్ వారు పెద్దగా చేతిని ఎత్తండి. ఇక్కడ ఎదురుగా మధుబన్ వారు కూర్చుంటారు, చాలా దగ్గరగా కూర్చునే అవకాశం. మొదటి సీట్ మధుబన్ వారికి లభిస్తుంది, బాప్‌దాదా సంతోషిస్తున్నారు. ముందు కూర్చున్నారు, ముందుగానే ఉండండి.
మరి ఈనాటి బహుమతి చాలా బాగుంది కదా. బాప్‌దాదాకు కూడా సంతోషంగా ఉంది ఎందుకంటే మీరు ఒక్కరే కాదు, మీ వెనుక మీ రాజధానిలో మీ రాయల్ కుటుంబం, మీ రాయల్ ప్రజలు, తర్వాత ద్వాపరం నుండి మీ భక్తులు, సతో రజో తమోగుణి, మూడు ప్రకారాల భక్తులు, మీ వెనుక పెద్ద లైన్ ఉంది. మీరు ఏది చేస్తారో అది మీ వెనుక ఉన్నవారు మిమ్మల్ని చూసి చేస్తారు. మీరు సాకులు చెప్తే మీ భక్తులు కూడా చాలా సాకులు చెప్తారు. ఇప్పుడు బ్రాహ్మణ పరివారం కూడా మిమ్మల్ని చూసి, తప్పుగా కాపీ చేయడంలో తెలివైనవారిగా ఉన్నారు. ఇప్పుడు దృఢ సంకల్పం చేయండి, సంస్కారాల ఘర్షణ జరిగినా, స్వభావాల అభిప్రాయ భేదాలు వచ్చినా, మూడవ విషయము బలహీనతలది ఉంటుంది, ఎవరైనా ఎవరి గురించైనా అసత్య విషయాన్ని చెప్పారనుకోండి, అప్పుడు కొంతమంది పిల్లలు అంటారు, మాకు అసత్యంపై చాలా క్రోధం వస్తుంది. కానీ మీ క్రోధాన్ని సత్యమైన బాబాతో వెరిఫై చేయించుకున్నారా, సత్యమైన బాబా మీతో ఉన్నారు, పూర్తి అసత్య ప్రపంచం ఒక వైపు ఉంది, ఒక్క బాబా మీతో ఉన్నారు, మీ విజయము నిశ్చితమై ఉంది. ఎవ్వరూ మిమ్మల్ని కదిలించలేరు, ఎందుకంటే బాబా మీకు తోడుగా ఉన్నారు. అసత్యము అంటున్నారు కదా. మరి అసత్యాన్ని అసత్యమే చేయండి, ఎందుకు పెంచుతున్నారు! బాబాకు సాకులు నచ్చవు, ఇది జరిగింది, ఇది జరిగింది, ఇది జరిగింది... ఇది ఇది అనే పాట ఇప్పుడు సమాప్తం కావాలి. మంచిగా జరిగింది, మంచి జరుగుతుంది, మంచిగా ఉంటాము, అందరినీ మంచిగా చేస్తాము. మంచి-మంచి-మంచి అనే పాటను పాడండి. మరి ఇష్టమేనా? ఇష్టమేనా? సాకులు చెప్పడాన్ని సమాప్తం చేస్తారా? చేస్తారా? రెండు చేతులు ఎత్తండి. అలా మంచిగా ఊపండి, అచ్ఛా, చూస్తున్నవారు కూడా చేతులు ఊపుతున్నారు. ఎక్కడనుండి చూస్తున్నా కానీ చేతులు ఊపండి. మీరైతే ఊపుతున్నారు. అచ్ఛా, ఇప్పుడు క్రిందకు దించండి, ఇప్పుడు మీ పరివర్తనకు చప్పట్లు కొట్టండి. (అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు) అచ్ఛా.
ఈరోజు, ఈ సమయం, సంగఠన యొక్క చిత్రాన్ని సదా మీ ముందు పెట్టుకోండి. ఎప్పుడైనా బలహీనత వస్తే, రానివ్వవద్దు, గేట్ బంద్. ద్వారము ఏమిటో తెలుసు కదా! మూసేయండి. డబల్ మూసేయండి, డబల్ తాళం వేయండి, ఈరోజుల్లో సింగల్ తాళం వేయడం లేదు. ఒకటి స్మృతి, మరొకటి సేవలో బిజీగా పెట్టడము, ఈ రెండు ఆల్మైటీ తాళాలను వేయండి. గాడ్రేజ్ కాదు గాడ్ తాళం వేయండి. పక్కా జాగరణ చేయండి, పక్కా వ్రతాన్ని ఆచరించండి.
బాప్‌దాదాకు పిల్లలందరిపై ఎంతో ప్రేమ ఉంది. చివరి నంబర్ వారైనా కానీ బాప్‌దాదాకు ఆ పిల్లలపై కూడా ఎంతో ప్రేమ ఉంటుంది. ఎందుకని? ఇటువంటి పిల్లలు ఏ తండ్రికైనా లభిస్తారా? ఒక్క బాప్‌దాదాకు మాత్రమే బ్రాహ్మణ పిల్లలు లభిస్తారు. ఏ మహాత్మ కానీ, మహామండలేశ్వరుడు కానీ, ధర్మ పిత కానీ, ఎవ్వరికైనా సరే ఇటువంటి పిల్లలు లభించారా? ఆ పిల్లలు ప్రతి ఒక్కరూ నా బాబా అంటారు. ఉన్నారా ఇలాంటివారు, చరిత్రలో? అందుకని బాప్‌దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరి మహత్వము తెలుసు. వాహ్ బాబా వాహ్! అన్న పాటను పిల్లలు పాడుతున్నాము అంటారు. మీకంటే కూడా నేను 100 రెట్లు వాహ్ పిల్లలూ వాహ్! అన్న పాటను పాడుతూ ఉంటానని బాబా అంటారు. అంతే కదా! వాహ్ వాహ్ పిల్లలే కదా! మధుబనం వారు వాహ్ వాహ్ పిల్లలే కదా! వెనుక కూర్చున్నవారు వాహ్ వాహ్ పిల్లలే కదా! అచ్ఛా.
సేవ టర్న్ భోపాల్ జోన్ వారిది:- మంచిది, భోపాల్ మధ్య ప్రదేశ్‌లో ఉంది. మధ్య ప్రదేశ్ చాలా పెద్దది. భోపాల్‌కు విశేషంగా బాప్‌దాదా రెండు సేవలను ఇవ్వాలనుకుంటున్నారు, అవి ఏమిటో చెప్పమంటారా? టీచర్లు శ్రద్ధగా వినండి.
మధ్య ప్రదేశ్‌లో ఉన్న వి.ఐ.పీలు, దాగి ఉన్నారని బాప్‌దాదాకు తెలుసు, కేవలం వారిని మైదానంలోకి తీసుకురండి. రెండవది, పెద్ద పెద్ద సేవాకేంద్రాలు, వేటినైతే మీరు పెద్దవి అంటున్నారో, వాటి లిస్ట్‌ను ఇవ్వండి. ప్రతి పెద్ద సెంటర్ క్రింద చిన్న ఉప సేవాకేంద్రాలు, గీతా పాఠశాలలు చాలా చాలా ఉంటాయి, ఆ పెద్ద సెంటర్లు కనీసం ఒక సంవత్సరం లోపు, చాలా సమయాన్ని ఇస్తున్నాము, ఇంత ఇవ్వకూడదు, కానీ ఒక్క సంవత్సరం లోపు కనీసం పెద్ద సెంటర్ తమ ఒక వారస క్వాలిటీని ముందుకు తీసుకురండి.
వారు ఇప్పుడు ఉండవచ్చు, కానీ యజ్ఞంలో ఆ వారస క్వాలిటీవారు ప్రసిద్ధమవ్వాలి. చాలామంది ఉన్నారు కదా అని కాదు. మా వద్ద వారసులు చాలామంది ఉన్నారు అని చాలా సెంటర్లు అంటాయి, కానీ వారసులు దాగి ఉండరు. వారస క్వాలిటీ అయితే వారు దాగి ఉండలేరు. బాప్‌దాదా గుప్త వారసులను ఒప్పుకోరు. వారి కనెక్షన్, వారి రిలేషన్ పద్దతి ప్రమాణంగా ఉండవలసిందే. ఇటువంటి వారసులను ప్రతి సెంటర్ ముందుకు తీసుకురండి. పెద్ద సెంటర్లు తీసుకురాగలవు కదా? మేము చిన్నవారము అని ఇందులో అనకండి. ఇందులో చిన్నవారిగా అవ్వకండి. చిన్నవారు కూడా పెద్దగా అవ్వండి. సరేనా టీచర్లు? సరిగ్గా చెప్పామా? చేతులెత్తండి. మరి ఈ రెండు కార్యాలు భోపాల్ వారు చేయాలి, సరేనా భోపాల్ వారు, మీలోనే ఒకరు వారసులుగా అవుతారు కదా. మరి చూస్తాము, అసలైతే 6 నెలలలో తయారు కావాలి కానీ బాప్‌దాదా ఒక సంవత్సరం సమయాన్ని ఇస్తున్నారు. సరేనా. ఇకపోతే సేవ యొక్క ఈ బంగారు అవకాశాన్ని తీసుకుంటారు, ఇది మంచిది. ఇది స్వ ఉన్నతికి చాలా మంచి అవకాశం అని బాప్‌దాదా సదా వినిపిస్తూనే ఉంటారు ఎందుకంటే సేవా బాధ్యత అంటూ విడిగా ఏమీ లేదు, యజ్ఞ సేవ యొక్క బాధ్యత. అక్కడ అయితే సమయం మరియు అటెన్షన్ ఇవ్వవలసి ఉంటుంది, ఇక్కడైతే ఒకే అటెన్షన్ స్వ ఉన్నతి మరియు యజ్ఞ సేవ. యజ్ఞ సేవ యొక్క పుణ్యాన్ని ఒకవేళ ప్రతి సమయము జమ చేసుకుంటే మీ పుణ్య ఖాతా చాలా చాలా త్వరగా పెరుగుతుంది. మంచి పని చేసారు, సంఖ్య కూడా బాగా తెచ్చారు. ఛాన్స్ మంచిగా తీసుకున్నారు. ఇప్పుడు ఇక ముందు రిజల్ట్ చూస్తాము. అచ్ఛా.
డబల్ విదేశీయులు వచ్చారు:- బాప్‌దాదాకు డబల్ విదేశీయులను చూస్తే ఒక విషయంలో విశేషంగా సంతోషంగా అనిపిస్తుంది, ఎక్స్ట్రా సంతోషం వస్తుంది. ఆరంభంలో డబల్ విదేశీయులు వచ్చినప్పుడు, టీచర్లకు గుర్తుండి ఉంటుంది, భిన్న భిన్న కల్చర్ల నుండి ట్రాన్స్ఫర్ అవ్వడం చాలా కష్టంగా అనిపించేది కానీ ఇప్పుడు దీని చర్చ అంతగా లేకపోవడాన్ని బాప్‌దాదా చూసారు, ఇందుకు కారణం ఏమిటి? ఎందుకంటే పరస్పరం సంగఠనను చూసి వృద్ధి మంచిగా అవుతుంది! మెజారిటీవారు తమ చుట్టుప్రక్కల సందేశాన్ని ఇవ్వడానికి తమ తమ సాధనాలను ఉపయోగిస్తారు, సందేశాన్ని అందించే ఉత్సాహం బాగుంది అని బాప్‌దాదా విన్నారు. దీని రిజల్ట్‌గా ప్రతి టర్న్‌లో ఇప్పుడు విదేశీయుల గ్రూప్ తక్కువ లేరు. క్వాలిటీ కూడా బాగుంది మరియు క్వాంటిటీ కూడా పెరుగుతుంది కనుక వీరంతా ఒక చందన వృక్షంలా అయ్యారు. మరి చందన వృక్షాన్ని చూసి బాప్‌దాదా సంతోషిస్తున్నారు.
సమాచారమైతే బాప్‌దాదా వద్దకు చేరుకుంటుంది. మీరు ఈ-మెయిల్ ద్వారా పంపినా కానీ, బాప్‌దాదా వద్దకు అయితే కాపీ ముందుగానే చేరుకుంటుంది. సేవ యొక్క ఉల్లాసము బాగుంది. ఇప్పుడు కేవలం ఈనాటి వ్రతాన్ని పక్కా చేసుకోండి. విదేశీయులు నంబర్ తీసుకుంటారు కదా? నంబర్ తీసుకుంటారా? ఏ నంబర్? మొదటి నంబరా లేక రెండవదైనా ఫర్వాలేదా? (మొదటి నంబర్) ఎవరికైతే ఒక్క బాబాపై ప్రేమ ఉంటుందో వారు ఒక్కరి సమానంగా ఒకే నంబర్ తీసుకుంటారు. ఒక్క బాబాయే ప్రపంచం అన్న స్లోగన్ ఏదైతే ఉందో, ఉన్నదే ఒక్క ప్రపంచం అయినప్పుడు నంబర్ ఒక్కటే అవుతుంది కదా. మీ టైటిల్ డబల్ ఫారెనర్స్. మరి పురుషార్థంలో, సంకల్పాల దృఢత్వంలో కూడా డబల్ ఫోర్స్ యొక్క పురుషార్థాన్ని చేసి చూపించండి. అటెన్షన్ ఉంచుతారు, కేవలం ఎక్కడ తేడా వస్తుంది? తీవ్రతలో దృఢత్వం తగ్గుతుంది, ప్రోగ్రామ్‌లు చాలా బాగా చేస్తారు, బాప్‌దాదా కూడా టాపిక్ వింటారు, ప్రతి గ్రూప్ వారి పురుషార్థం యొక్క అంశం చూసి చాలా సంతోషిస్తారు కానీ ఏమవుతుంది, టాపిక్ మొదలు పెట్టినప్పుడు లేదా లక్ష్యం పెట్టుకున్నప్పుడు చాలా ఫోర్స్‌గా మొదలు పెడ్తారు, తర్వాత ఏదో ఒక పేపర్ వస్తుంది కదా, రావలసిందే, పేపర్ లేకుండా ఎవ్వరూ పాస్ అవ్వరు. అందులో దృఢత్వం లోపిస్తుంది మరియు పురుషార్థం సాధారణమైపోతుంది. సదా దృఢత్వం ఉండటంలో లోటు ఉంటుంది. మరి అన్నింటిలో పురుషార్థము. చేసి చూపిస్తాము. అంతే కదా. ఇంతటి ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయి కదా? ఉన్నాయా? ఉన్నాయి, కేవలం దృఢత్వాన్ని చెక్ చేసుకోండి, మాటలలోకి రాకండి. దృఢత్వాన్ని చూసుకోండి. అచ్ఛా.
ఇకపోతే బాప్‌దాదా చూస్తున్నారు, ఎవరైతే కార్డ్‌లు పంపారో, ఉత్తరాలు రాసారో, గ్రీటింగ్స్ పంపారో, వాటిని బాప్‌దాదా స్వీకరించారు మరియు రిటర్న్‌లో ఒక్కొక్కరికి పేరు మరియు విశేషత సహితంగా ప్రియస్మృతులు మరియు ఆశీర్వాదాలను ఇస్తున్నారు. ఎవరైతే కార్డ్‌లు, ఉత్తరాల ద్వారా కాక మనసుతో, సంకల్పంతో తమ ఉల్లాస ఉత్సాహాన్ని పంపారో, ఆ పిల్లలందరికీ కూడా చాలా చాలా పదమారెట్ల ప్రియస్మృతులు మరియు బాబా యొక్క హృదయపూర్వక ఆశీర్వాదాలు.
మీరంతా సమ్ముఖంగా కూర్చున్నారు, సమ్ముఖంలో ఉండే మజాయే వేరు. సైన్స్ సాధనాల ద్వారా ఎంత స్పష్టంగా, ఎంత మంచిగా అనిపించినా కానీ, సమ్ముఖంగా మధుబనంలో ఉన్నతికి ద్వారమును అనుభవం చేయిస్తుంది.
అచ్ఛా, ఇప్పుడు బాప్‌దాదా ఏదైతే చెప్పారో దానిని ప్రతి ఒక్కరూ ఒక నిమిషము కోసం దృఢ సంకల్ప స్వరూపులై కూర్చోండి - సాకులు చెప్పడం, సోమరితనం మరియు నిర్లక్ష్యాన్ని ప్రతి సమయము దృఢ సంకల్పం ద్వారా సమాప్తం చేసి బహుకాలానికి లెక్కను జమ చేసుకోవాలి. ఏమి జరిగినా కానీ, ఏమీ చూడకూడదు, కానీ కేవలం బాబా హృదయ సింహాసనాధికారులుగా అవ్వాలి, విశ్వానికి సింహాసనాధికారులుగా అవ్వాలి. ఈ దృఢ సంకల్ప స్వరూపంలో అందరూ కూర్చోండి. అచ్ఛా.
నలువైపుల సదా ఉల్లాస-ఉత్సాహాలను అనుభవం చేసుకునేవారు, సదా దృఢత్వాన్ని సఫలతకు తాళం చెవిగా చేసుకుని వినియోగించేవారు, సదా బాబా తోడు మరియు ప్రతి కార్యంలో సహచరునిగా అయ్యి ఉండేవారు, సదా ఏకనామీ మరియు ఎకానమీ, ఏకాగ్రత స్వరూపంలో మున్ముందుకు ఎగురుతూ ఉండేవారు, బాప్‌దాదాకు అతి గారాల పిల్లలు, ప్రియమైనవారు, విశేషమైన పిల్లలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
డైమండ్ హాల్ స్టేజ్ పైన శివబాబా జెండాను ఎగురవేసారు.
దాదీ రతన్మోహినిగారు మరియు నిర్వైర్ అన్నయ్య గారు అందరికీ శివ జయంతి అభినందనలను తెలిపారు.
ఈరోజు బాబా మహావాక్యాలను వింటూ అందరూ సంతోషంతో నాట్యం చేస్తున్నారు. ఇలా సదా సంతోషంగా ఉండండి మరియు సదా సంతోషాలను పంచుతూ ఉండండి.
మీరందరూ కలిసి మనసులో శివబాబా జెండాను ఎగురవేసారు. 84వ త్రిమూర్తి శివ జయంతికి సమస్త దేశ విదేశాలలోని సోదరసోదరీలకు చాలా చాలా చాలా కోటి కోటి అభినందనలు, అభినందనలు.
*** ఓంశాంతి ***
