‘‘తమ శ్రేష్ఠ స్వమానపు నషాలో ఉండి అసంభవమును సంభవము చేస్తూ నిశ్చింత చక్రవర్తులుగా అవ్వండి’’
17-11-26 “బులెటిన్” ఓం శాంతి మధుబన్
ప్రాణేశ్వరుడైన అవ్యక్త బాప్‌దాదాకు అతి ప్రియమైనవారు, ఈ సృష్టి వృక్షానికి ఆధారమూర్తులైన విశ్వ పూర్వజ ఆత్మలు, అసంభవాన్ని సంభవం చేసే శ్రేష్ఠ స్వమానధారులు, నిశ్చింత చక్రవర్తులైన నిమిత్త టీచర్ సోదరీమణులు మరియు దేశ విదేశాల సర్వ బ్రాహ్మణ కుల భూషణులైన సోదర సోదరీమణులకు,
ఈశ్వరీయ స్నేహ సంపన్నమైన మధుర స్మృతులు స్వీకరించండి.
తదుపరి సమాచారం - మీరందరూ దీపావళి పావన పర్వదినాన్ని ఎంతో ఉల్లాస-ఉత్సాహాలతో జరుపుకుని ఉంటారు. బాబా అంటున్నారు – పిల్లలూ, మీరు సదా వెలుగుతున్న దీపాలు, అనేకుల దీపాలను వెలిగిస్తారు, అందుకే దీపమాల (దీపావళి) యొక్క గాయనం ఉంది. మీ యొక్క ఇంతటి స్మరణీయ దినం రోజున విశేష సాక్షాత్కార మూర్తులుగా మారి, సాక్షాత్ బాప్‌దాదా సమానంగా ఆత్మల పట్ల మీ కళ్యాణ భావనతో, మీ ఆత్మిక స్నేహ స్వరూపంతో, మీ సూక్ష్మ శక్తుల ద్వారా ఆత్మలలో బలాన్ని నింపే సేవ చేయండి. దాంతోపాటు మీ చార్టును కూడా పరిశీలించుకోండి:
1. ఇప్పటివరకు సంపూర్ణ శ్రేష్ఠ సంకల్పాల పురుషార్థంలో ఎంతవరకు సఫలతను పొందాము?
2. వ్యర్థ సంకల్పాలు లేదా వికల్పాలపైన ఎంతవరకు విజయులమయ్యాము?
3. వాణిలో ఎంతవరకు ఆత్మికత యొక్క ఆకర్షణ లేదా అలౌకికత వచ్చింది?
4. కర్మణా ద్వారా ఎంతవరకు అతీతంగా మరియు ప్రియంగా, అలౌకిక, అసాధారణ కర్మలు చేయగలుగుతున్నాము?
5. కర్మలలో ఎంతవరకు కర్మయోగి యొక్క, యోగయుక్త, యుక్తియుక్త, స్నేహయుక్త రూపాన్ని తీసుకువచ్చాము?
6. తండ్రి సమానంగా ఆకర్షణ రూపము, స్నేహీ రూపము, సహయోగి రూపంగా ఎంతవరకు మారాము?
7. ఇప్పటికీ ఏ లోపం లేదా బలహీనత మిగిలిపోయి ఉంది? దేనిని తప్పక పరివర్తన చేసుకోవాలి?
ఈరోజు కూడా బాబా అంటున్నారు - పిల్లలూ, మీ వద్ద సైలెన్స్ శక్తి ఉంది; ఈ శక్తి ద్వారా పరివర్తన శక్తిని కార్యంలోకి తీసుకురండి. నెగెటివ్‌ను పాజిటివ్‌గా పరివర్తన చేయండి. మాయ ఎంతటి సమస్య రూపంలో వచ్చినప్పటికీ, మీరు పరివర్తన శక్తితో, సైలెన్స్ శక్తితో సమస్యను సమాధాన స్వరూపంగా మార్చివేయండి. కారణాన్ని నివారణ రూపంలోకి మార్చండి. పూజ్య ఆత్మలైన మీ సహజ సంస్కారం, అనాది సంస్కారం ఆశీర్వాదాలు ఇవ్వడం. మీ జడ చిత్రాలు సైతం అందరికీ ఆశీర్వాదాలు ఇస్తున్నప్పుడు, చైతన్య పూజ్య ఆత్మలైన మీరు తప్పకుండా ఆశీర్వాదాలు ఇవ్వాల్సిందే కదా. ఇప్పుడు మీరు ఎవరికైనా ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఎంతగా సంతోషిస్తుందో, దీనివల్ల సంతోషపు వాతావరణం ఎంత సుఖదాయకంగా తయారవుతుందో చూడండి. కాబట్టి సమయానుసారంగా అందరికీ ఆశీర్వాదాలు ఇస్తూ, తీసుకుంటూ ముందుకు సాగండి, ఇదే శ్రేష్ఠ పురుషార్థం.
ఇక ప్రస్తుతం సేవ యొక్క ఈ టర్న్ కర్ణాటక జోన్‌ది నడుస్తోంది. బాబా పిల్లలందరూ అలసట లేకుండా మారి తమ సేవలను అందిస్తున్నారు. దేశ విదేశాల నుండి ఇంకా అనేకానేక మంది సోదర సోదరీమణులు తమ మధుబన్ తపోభూమికి విచ్చేసి విశేష తపస్సు చేస్తున్నారు. బాప్‌దాదా ప్రతి బిడ్డనూ జ్ఞాన రత్నాలతో అలౌకికంగా అలంకరించి దివ్యతా సంపన్నులుగా తీర్చిదిద్దుతున్నారు. అచ్ఛా - అందరికీ స్మృతులు.... ఓం శాంతి.
17-11-2026 ‘‘అవ్యక్త బాప్‌దాదా’’ ఓం శాంతి రివైజ్ 31-10-07 మధుబన్
‘‘తమ శ్రేష్ఠ స్వమానపు నషాలో ఉండి అసంభవమును సంభవము చేస్తూ నిశ్చింత చక్రవర్తులుగా అవ్వండి’’
ఈరోజు బాప్‌దాదా నలువైపుల ఉన్న తమ శ్రేష్ఠ స్వమానధారీ విశేష పిల్లలను చూస్తున్నారు. పిల్లలైన ప్రతి ఒక్కరి స్వమానము ఎంత విశేషమైనదంటే అటువంటి విశేషత విశ్వములోని ఏ ఆత్మకూ లేదు. మీరందరూ విశ్వ ఆత్మలకు పూర్వజులు మరియు పూజ్యులు కూడా. మొత్తము సృష్టిరూపి వృక్ష పునాదికి మీరు ఆధారమూర్తులు. విశ్వమంతటికీ పూర్వజులు, మొదటి రచన. చిన్న పిల్లవాడైనా, వృద్ధ మాత అయినా, ప్రవృత్తి వారైనా కానీ పిల్లల ప్రతి ఒక్కరి విశేషతను చూసి బాప్‌దాదా సంతోషిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ వారి-వారి విశేషతలు ఉన్నాయి. ఈరోజుల్లో ఎంత పెద్ద సైన్సు వారైనా, ప్రపంచపు లెక్కలో విశేషమైన వారైనా, ప్రకృతిజీతులుగా అయితే అయ్యారు కదా. చంద్రుని వరకు కూడా చేరుకున్నారు కానీ ఇంత చిన్నని జ్యోతి స్వరూప ఆత్మను గురించి తెలుసుకోలేకపోయారు. మరి ఇక్కడైతే చిన్న పిల్లవాడు కూడా నేను ఆత్మను, జ్యోతి బిందువును అని తెలుసుకుంటాడు. నేను ఆత్మను అని నషాతో అంటాడు. ఎంత పెద్ద మహాత్మలైనాగానీ ఏమంటారు? బ్రాహ్మణ మాతలేమో, మేము పరమాత్ముని పొందామని గర్వముతో అంటారు. పొందారు కదా! మరి మహాత్మలు ఏమంటారు? పరమాత్ముని పొందటము చాలా కష్టమని అంటారు. మేము ప్రవృత్తిలో ఉంటూ, కలసి ఉంటూ పవిత్రంగా ఉంటాము ఎందుకంటే మా మధ్య తండ్రి ఉన్నారు అని ప్రవృత్తిలో ఉన్నవారు ఛాలెంజ్ చేస్తారు. కావుననే ఇద్దరూ కలసి ఉంటూ కూడా పవిత్రంగా ఉండగలుగుతున్నారు ఎందుకంటే పవిత్రత మన స్వధర్మము. పర ధర్మము కష్టమనిపిస్తుంది, స్వ ధర్మము సహజమవుతుంది. లోకులు ఏమంటారు? నిప్పు మరియు దూది కలసి ఉండలేవు, చాలా కష్టము అని అంటారు. కానీ మీరందరూ ఏమంటారు? చాలా సహజము అంటారు. మొదట్లో మీ అందరిదీ ఒక గీతము ఉండేది - ఎంత పెద్ద ధనవంతులైనాగానీ, యజమానులైనాగానీ ఒక్క శివబాబాను తెలుసుకోలేదు. చిన్ని బిందువైన ఆత్మను గురించి తెలుసుకోలేదు కానీ పిల్లలైన మీరందరూ తెలుసుకున్నారు, పొందారు. అసంభవము సంభవమైందని ఎంతో నిశ్చయము మరియు గర్వముతో అంటారు. బాప్‌దాదా కూడా విజయి రత్నాలైన పిల్లలు ప్రతి ఒక్కరినీ చూసి సంతోషిస్తారు ఎందుకంటే ధైర్యము పిల్లలది, సహాయము తండ్రిది. కనుకనే ప్రపంచము వారికి అసంభవమైన విషయము మీకొరకు సహజము మరియు సంభవమైపోయింది. మేము పరమాత్మునికి డైరెక్టు పిల్లలము అని ఫఖుర్ (శుద్ధమైన గర్వము) ఉంటుంది. ఈ నషా కారణంగా, నిశ్చయము కారణంగా, పరమాత్ముని పిల్లలైన కారణంగా మాయనుంచి కూడా రక్షింపబడ్డారు. పిల్లలుగా కావటము అనగా సహజంగానే రక్షింపబడటము. మీరు పిల్లలు కావున అన్ని విఘ్నాలనుండి, సమస్యలనుండి రక్షింపబడ్డారు.
మరి మీ యొక్క, ఇంతటి శ్రేష్ఠ స్వమానమును తెలుసుకున్నారు కదా! ఎందుకని సహజము? ఎందుకంటే మీరు సైలెన్సు శక్తి ద్వారా పరివర్తన శక్తిని కార్యములో వినియోగిస్తారు. నెగిటివ్‌ను పాజిటివ్‌లోకి పరివర్తన చేసేస్తారు. మాయ ఎంత పెద్ద సమస్య రూపంలో వచ్చినా కానీ మీరు పరివర్తన శక్తి ద్వారా, సైలెన్సు శక్తి ద్వారా సమస్యను సమాధాన స్వరూపముగా చేసేస్తారు. కారణమును నివారణ రూపంలోకి మార్చేస్తారు. ఇంత శక్తి ఉంది కదా, కోర్సు కూడా చేయిస్తారు కదా! నెగిటివ్‌ను పాజిటివ్‌గా చేసే విధిని నేర్పిస్తారు. ఈ పరివర్తన శక్తి తండ్రి ద్వారా వారసత్వముగా లభించింది. ఒక్క శక్తి కాదు, సర్వ శక్తులూ పరమాత్మ వారసత్వంగా లభించాయి, అందుకనే బాప్‌దాదా అంటారు, ప్రతిరోజూ మురళిని వింటారు కదా! మరి ప్రతిరోజూ బాప్‌దాదా ఇదే అంటారు - తండ్రిని స్మృతి చెయ్యండి మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యండి. తండ్రి స్మృతి కూడా ఎందుకని సహజంగానే వస్తుంది? వారసత్వ ప్రాప్తిని గుర్తు చేసుకున్నప్పుడు ప్రాప్తి కారణంగా తండ్రి స్మృతి సహజంగా వచ్చేస్తుంది. పిల్లలైన ప్రతి ఒక్కరికీ ఈ ఆత్మిక ఫఖుర్ ఉంటుంది, మనస్సులో పాటను పాడుతారు - పొందాల్సింది పొందేసాము. ప్రతి ఒక్కరి హృదయములో ఈ పాట స్వతహాగానే మ్రోగుతుంది కదా! ఫఖుర్ ఉంది కదా! ఎంతగా ఈ ఫఖుర్లో ఉంటారో, ఫఖుర్కు గుర్తు - బేఫికర్‌గా (నిశ్చింతగా) ఉండటము. ఒకవేళ సంకల్పములోగానీ, మాటలోగానీ లేక సంబంధ-సంపర్కములోగానీ ఏవిధమైనటువంటి ఫికర్ (చింత) ఉన్నా ఫఖుర్ (శుద్ధమైన గర్వము) ఉండదు. బాప్‌దాదా అయితే నిశ్చింత చక్రవర్తులుగా చేసారు. చెప్పండి, నిశ్చింత చక్రవర్తులేనా? ఎవరైతే నిశ్చింత చక్రవర్తులో వారు చేతులెత్తండి. నిశ్చింతులకు అప్పుడప్పుడు చింత వస్తుందా? మంచిది. తండ్రి నిశ్చింతులైనప్పుడు, పిల్లలకు ఏ చింత ఉంటుంది!
అన్ని చింతలను మరియు అన్ని రకాల భారాలను బాప్‌దాదాకు ఇచ్చేయమని బాప్‌దాదా అయితే చెప్పి ఉన్నారు. తండ్రి సాగరుడు కదా! కాబట్టి భారము అంతా ఇమిడిపోతుంది. బాప్‌దాదా అప్పుడప్పుడు పిల్లల ఒక గీతాన్ని విని చిరునవ్వు నవ్వుతూ ఉంటారు. ఏ పాటనో తెలుసా? ఏమి చేయాలి, ఎలా చేయాలి... అప్పుడప్పుడు పాడుతుంటారు. బాప్‌దాదా వింటూ ఉంటారు. కానీ బాప్‌దాదా పిల్లలందరికీ ఇదే చెప్తారు - ఓ నా మధురమైన పిల్లలూ, ముద్దు బిడ్డలూ - సాక్షీ దృష్ట స్థితి అనే సీటుపై సెట్ అవ్వండి, సీటుపై సెట్ అయ్యి ఆటను చూడండి, చాలా మజా వస్తుంది, వాహ్! త్రికాలదర్శి స్థితిలో స్థితి అవ్వండి. సీటునుంచి క్రిందకు వస్తారు కనుకనే అప్సెట్ అవుతారు. సెట్ అయినట్లయితే అప్సెట్ కారు. ఈ మూడు విషయాలు పిల్లలను వ్యాకులపరుస్తాయి. ఏ మూడు విషయాలు? - చంచలమైన మనస్సు, భ్రమిస్తున్న బుద్ధి మరియు పాత సంస్కారాలు. పిల్లల ఒక విషయాన్ని వింటుంటే బాప్‌దాదాకు నవ్వు వస్తుంటుంది, అది ఏ విషయమో తెలుసా? పిల్లలు ఇలా అంటుంటారు - ఏం చెయ్యాలి బాబా, ఇది నా పాత సంస్కారం కదా! బాప్‌దాదా నవ్వుతారు. నా సంస్కారము అని చెప్తూనే ఉన్నారు, మరి నాదిగా చేసుకున్నారా? ఎప్పుడైతే పాత సంస్కారాన్ని నాదిగా చేసుకున్నారో, మరి నాది అన్నది చోటు చేసుకుంది కదా. నా సంస్కారము అని బ్రాహ్మణ ఆత్మ అనగలదా? నాది-నాది అని అన్నట్లయితే నాది అనేది తన చోటును ఏర్పరుచుకుంటుంది. బ్రాహ్మణులైన మీరు నాది అని అనజాలరు. ఇది గత జీవితపు సంస్కారము. శూద్ర జీవిత సంస్కారము. బ్రాహ్మణ జీవితముది కాదు. కావున నాది-నాది అన్నట్లయితే అది కూడా నా అధికారము అని కూర్చుంటుంది. బ్రాహ్మణ జీవితపు శ్రేష్ఠ సంస్కారము గురించి తెలుసుకదా! మీరు దేనినైతే పాతది అని అంటున్నారో ఆ సంస్కారము కూడా పాతది కాదు, శ్రేష్ఠ ఆత్మలైన మీ అతి పాతదైన సంస్కారము అనాది మరియు ఆది సంస్కారము. ఇదైతే మధ్యలోని, ద్వాపరములోని సంస్కారము. కావున మధ్యలోని సంస్కారమును సమాప్తము చేసెయ్యాలి, తండ్రి సహాయము కారణంగా ఎటువంటి కష్టమూ ఉండదు. కానీ ఏం జరుగుతుంది? బాబా కంబైండ్‌గా ఉన్నారు, కంబైండ్ అన్నదానికి అర్థమే అవసరమైన సమయంలో సహయోగి కానీ సరైన సమయంలో సహయోగము తీసుకోని కారణంగా మధ్యలో వచ్చిన సంస్కారము పెద్దదిగా అయిపోతుంది.
బాప్‌దాదా ఇదే కోరుకుంటున్నారు - అందరూ పూజ్యనీయ ఆత్మలు. పూజ్యనీయ ఆత్మల విశేషమైన లక్షణము ఆశీర్వాదములను ఇవ్వటమే. మీరందరూ పూజ్యనీయ ఆత్మలని మీకందరికీ తెలుసు కదా? కావున ఆశీర్వాదములను ఇవ్వటము అనగా ఆశీర్వాదములను తీసుకోవటమని అర్థమైపోతుంది. ఎవరైతే ఆశీర్వాదములను ఇస్తారో, ఎవరికైతే ఇస్తారో వారి మనసునుంచి మాటిమాటికీ ఇచ్చేవారి కొరకు ఆశీర్వాదము వెలువడుతూ ఉంటుంది. కావున పూజ్య ఆత్మలైన మీ నిజ సంస్కారము - ఆశీర్వాదములను ఇవ్వటము. ఆశీర్వాదములను ఇవ్వటము అనాది సంస్కారము. మీ జడమైన చిత్రాలే ఆశీర్వాదములను ఇస్తున్నప్పుడు చైతన్య పూజ్య ఆత్మలు ఆశీర్వాదములను ఇవ్వటము, ఇదైతే సహజ సంస్కారము. ఇటువంటి సంస్కారమును నా సంస్కారము అని అనండి. మధ్యలో ద్వాపరములోని సంస్కారము సహజమైపోయింది. నేచర్ అయిపోయింది. వాస్తవానికి ఈ సంస్కారము ఆశీర్వాదములను ఇచ్చే నేచురల్ నేచర్. ఎవరికైనా ఆశీర్వాదములను ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఎంతగా సంతోషిస్తుంది, ఆ సంతోషపు వాయుమండలము ఎంత సుఖదాయిగా ఉంటుంది!
నేను పూజ్య ఆత్మను, నేను తండ్రి శ్రీమతంపై నడిచే విశేష ఆత్మను అని భావించండి, ఈ స్మృతిని మాటిమాటికీ మీ స్మృతి మరియు స్వరూపములోకి తీసుకురండి ఎందుకంటే ప్రతి ఒక్కరినీ, మీరు ఏమి అవుతారు అని అడిగినప్పుడు నేను లక్ష్మీ నారాయణునిగా అవుతానని అంటారు. సీతారాముల విషయంలో ఎవ్వరూ చేతులెత్తరు. 16 కళలు కలిగినవారిగా అవ్వాలనే లక్ష్యమున్నప్పుడు, 16 కళలు అనగా పరమ పూజ్యులు, పూజ్య ఆత్మల కర్తవ్యమే ఆశీర్వాదములను ఇవ్వటము. ఈ సంస్కారాన్ని నడుస్తూ, తిరుగుతూ సహజంగా మరియు సదాకాలము కొరకు తయారుచేసుకోండి. ఉన్నదే పూజ్యులుగా, 16 కళలవారిగా. లక్ష్యమైతే ఇదే కదా!
కాబట్టి సంకల్పం చేయండి – తండ్రి ప్రేమలో మాయ ఎన్ని తుఫానులను ఎదురుగా తీసుకువచ్చినప్పటికీ, మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మల ఎదుట తుఫాను కూడా కానుకగా (తోఫాగా) మారిపోతుంది. ఇలాంటి వరదానాన్ని సదా గుర్తుంచుకోండి. ఎంత ఎత్తైన కొండ అయినా సరే, కొండ మారి దూదిలా అయిపోతుంది. ఇప్పుడు సమయ సమీపతకు అనుగుణంగా వరదానాలను ప్రతిక్షణం అనుభవంలోకి తీసుకురండి. అనుభవపు అథారిటీగా మారండి.
ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీరు అశరీరిగా మారే, ఫరిశ్తా స్వరూపంగా మారే ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి. ఇప్పుడే బ్రాహ్మణుడు, ఇప్పుడే ఫరిశ్తా, ఇప్పుడే అశరీరి – నడుస్తూ తిరుగుతూ, పనులు చేస్తూ కూడా ఒక నిమిషం, రెండు నిమిషాలు సమయం కేటాయించి అభ్యాసం చేయండి. ఏ సంకల్పమైతే చేశారో, అదే స్వరూపాన్ని అనుభవం చేశారా అని పరిశీలించుకోండి. అచ్ఛా.
నలువైపులా ఉన్న సదా శ్రేష్ఠ స్వమానధారులు, సదా తమను తాము పరమపూజ్యులుగా మరియు పూర్వజులుగా అనుభవం చేసుకునేవారు, సదా తమను తాము ప్రతి సబ్జెక్టులోనూ అనుభవీ స్వరూపులుగా తీర్చిదిద్దుకునేవారు, సదా తండ్రి హృదయ సింహాసనాధికారులు, భ్రుకుటి సింహాసనాధికారులు, సదా శ్రేష్ఠ స్థితి యొక్క అనుభవాలలో స్థితులై ఉండేవారు – నలువైపులా ఉన్న పిల్లలందరికీ ప్రియస్మృతులు మరియు నమస్తే.
సేవ కర్ణాటక జోన్ వారిది:- కర్ణాటక సేవాధారులకు చాలా-చాలా సేవ చేసినందుకు మరియు శ్రీమతాన్ని పాలన చేసినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. శుభాకాంక్షలు, శుభాకాంక్షలు.
మంచిది, సేవ చేసే ఏ అవకాశాన్నయితే తీసుకున్నారో, అందులో అందరూ సంతుష్టులుగా ఉన్నారు మరియు ఇతరులనూ సంతుష్టపరిచారు; దీని ద్వారా తమ జమ ఖాతాను ఎంతో చక్కగా జమ చేసుకున్నారు. కర్ణాటక సంఖ్య కూడా తక్కువేమీ కాదు, సంఖ్య బాగుంది; మరియు ఇప్పుడు ఎలాగైతే సంగఠిత రూపంలో కలిసిమెలిసి నిర్విఘ్న సేవ యొక్క రికార్డును చూపించారో, అలాగే మున్ముందు కూడా కర్ణాటక సంగఠిత రూపంలో ఎన్నో అద్భుతాలు చేయగలదు. అచ్ఛా - అందరూ ఎంతో మనస్ఫూర్తిగా సేవ చేసారు కదా. అలసట అయితే కలగలేదు కదా? అలసిపోలేదు కదా! అలసట లేనివారిగా (అథక్‌గా) మారి సేవ చేశారు. అచ్ఛా.
డబల్ విదేశీయులు:- మంచి గ్రూప్ ఉంది. అందరూ నిశ్చయబుద్ధి మరియు ఈశ్వరీయ నషాలో ఉండేవారు, ఎగిరేవారు. నడిచేవారిగా కాదు, ఎగిరేవారిగా మారాలి. నడిచేవారు సమయానికి చేరుకోలేరు; ఎగిరేవారిగా, డబల్ లైట్‌గా మారాలి. ఇక బాప్‌దాదా సంతోషంగా ఉన్నారు. ఏది చేశారో అది సఫలమైంది. మరి మీరందరూ ఎవరయ్యారు? సఫలత యొక్క తారలు. మంచిది, చాలా మంచిది. అచ్ఛా!
*** ఓంశాంతి ***
