"మీ స్వమానము యొక్క గౌరవములో ఉండండి మరియు సమయము యొక్క మహత్వాన్ని తెలుసుకుని ఎవరెడీగా అవ్వండి"
15-10-2026 ఓం శాంతి ‘‘బులెటిన్’’ మధుబన్
ప్రాణప్రదమైన అవ్యక్త మూర్తి తల్లితండ్రి అయిన బాప్‌దాదాకు అతి స్నేహీలు, సదా స్వమానము అనే సీట్‌పై సెట్ అయి ఉండేవారు, పరమాత్మ ప్రేమకు పాత్రులైన ఆత్మలు, ఏకాగ్రత శక్తితో అలజడితో కూడిన పరిస్థితులలో కూడా ఏకరస స్థితిని తయారు చేసుకునే నిమిత్త టీచర్ అక్కయ్యలు మరియు దేశవిదేశాలలోని సర్వ బ్రాహ్మణ కులభూషణ సోదరసోదరీలు,
ఈశ్వరీయ స్నేహ సంపన్న మధుర స్మృతిని స్వీకరించండి.
తర్వాత సమాచారము – ఇప్పుడు ప్రియమైన బాప్‌దాదా యొక్క అనంతమైన ఇంటిలో తండ్రి మరియు పిల్లల అలౌకిక అవ్యక్త మిలన సభ యొక్క సుందరమైన రోజులు మళ్ళీ ప్రారంభమయ్యాయి. ఈసారి సేవ యొక్క మొదటి టర్న్ పంజాబ్ జోన్ వారికి లభించింది. పేరుకు పంజాబ్ జోన్ కానీ ఇందులో అనేక నదుల సంగమం ఉంది. హర్యాణా, పంజాబ్, హిమాచల్, జమ్మూ-కశ్మీర్, ఉత్తారాఖండ్ మొదలైనవి ఉన్నాయి, వీటితోపాటు దేశవిదేశాల నుండి అనేకానేకమంది బాబా పిల్లలు ప్రియమైన బాప్‌దాదా ఇంటికి దివ్య అనుభూతులను చేసుకోవడానికి మరియు స్వయాన్ని సర్వ శక్తులతో సంపన్నంగా చేసుకోవడానికి చేరుకున్నారు. అందరూ జ్ఞానయోగాలతో కూడుకున్న నవీన క్లాసులతో బాగా రిఫ్రెష్ అవుతున్నారు.
ఈ మొదటి మిలన మేళాలో ప్రియమైన బాప్‌దాదా తమ పిల్లలకు ‘‘పూర్వజులు మరియు పూజ్యులు’’ అన్న స్వమానాన్ని గుర్తు చేయించి ఇలా అన్నారు, పిల్లలూ, మీరు విశ్వానికి పూర్వజులు మరియు పూజ్య ఆత్మలు, అందరికంటే అమూల్యమైన ఆధారమూర్తులు మరియు ఉదాహరణమూర్తులు. బాప్‌దాదా పిల్లలైన మీకు పరమాత్మ సింహాసనము, ప్రకాశ కిరీటము మరియు స్మృతి తిలకాన్ని ఇచ్చారు. సత్యయుగ సింహాసము ఎంత అమూల్యమైనదైనా పరమాత్మ హృదయ సింహాసనము కేవలం సంగమంలోనే లభిస్తుంది.
ఇప్పుడు బాప్‌దాదా పిల్లలందరినీ ఫరిశ్తా సో దేవత స్వరూపంలో చూడాలనుకుంటున్నారు, కానీ పిల్లలు నడుస్తూ నడుస్తూ తమ స్వమానాన్ని మర్చిపోయి దేహ భానము మరియు దేహ అభిమానములోకి వచ్చేస్తున్నారు, తర్వాత కలత చెందుతారు, అందుకని బాప్‌దాదా అంటారు, పిల్లలూ, మీ స్వమానము యొక్క స్థితిలో ఉండండి. నాలెజ్ఫుల్తో పాటు పవర్‌ఫుల్‌గా కూడా అవ్వండి. నేను సదా స్వమానము అనే సీట్‌పై కూర్చోవాలి, ఎప్పుడూ అప్సెట్ అవ్వకూడదు అన్న విషయంపై అటెన్షన్ ఉంచండి. సమయం యొక్క మహత్వం గురించి తెలుసుకుని సదా అలర్ట్ మరియు ఎవరెడీగా ఉండాలి అప్పుడు అకస్మాత్తుగా వచ్చే పేపరులో పాస్ అవుతారు. చెప్పండి, ఇంతటి అటెన్షన్‌ను ఉంచి సదా స్వమానము అనే సీట్‌పై సెట్ అయి ఉంటారు కదా!
ఇకపోతే ఇప్పుడు మీరంతా తమ తమ టర్ను కోసం ఎదురు చూస్తుండవచ్చు. బాబా యొక్క అనంతమైన ఇంటికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతము. అచ్ఛా – అందరికీ చాలా-చాలా స్మృతి... ఓం శాంతి.
15-10-2026 ఓం శాంతి ‘‘అవ్యక్త బాప్‌దాదా’’ రివైజ్ వీడియో 16-11-2006 మధుబన్
మీ స్వమానము యొక్క గౌరవములో ఉండండి మరియు సమయము యొక్క మహత్వాన్ని తెలుసుకుని ఎవరెడీగా అవ్వండి
ఈరోజు బాప్‌దాదా నలువైపులా ఉన్న పరమాత్మ ప్రేమకు పాత్రులైన, స్వమానమనే సీట్‌పై సెట్ అయ్యి ఉన్న తమ పిల్లలను చూస్తున్నారు. సీట్ పైనైతే పిల్లలందరూ సెట్ అయ్యి ఉన్నారు, కానీ కొందరు పిల్లలు ఏకాగ్ర స్థితిలో సెట్ అయ్యి ఉన్నారు మరియు కొందరు పిల్లలు సంకల్పాలలో కొంచెం-కొంచెం అప్సెట్ అయ్యి ఉన్నారు. బాప్‌దాదా వర్తమాన సమయమనుసారముగా పిల్లలు ప్రతి ఒక్కరినీ ఏకాగ్రత రూపములో, స్వమానధారి స్వరూపములో సదా చూడాలనుకుంటున్నారు. పిల్లలందరూ కూడా ఏకాగ్రతా స్థితిలో స్థితులవ్వాలనే కోరుకుంటున్నారు. మీకున్న భిన్న-భిన్న స్వమానాల గురించి తెలుసు కూడా, ఆలోచిస్తారు కూడా, కానీ ఏకాగ్రతను అలజడిలోకి తీసుకువస్తారు. సదా ఏకరస స్థితి అనేది తక్కువగా ఉంటుంది. అనుభవమవుతుంది మరియు ఈ స్థితిని కోరుకుంటారు కూడా, కానీ ఈ స్థితి అప్పుడప్పుడు మాత్రమే అన్నట్లు ఎందుకు ఉంటుంది, కారణమేమిటి! సదా అటెన్షన్ పెట్టడములో లోపము. ఒకవేళ స్వమానాల లిస్ట్ తయారు చేసినట్లయితే అది ఎంత పెద్దదిగా ఉంటుంది. అన్నింటికంటే మొదటి స్వమానము ఏమిటంటే - ఏ తండ్రినైతే స్మృతి చేస్తూ ఉండేవారో, వారికి డైరెక్ట్ పిల్లలుగా అయ్యారు, నంబర్‌వన్ సంతానముగా ఉన్నారు. బాప్‌దాదా కోట్లలో కొద్దిమంది అయిన పిల్లలైన మిమ్మల్ని ఎక్కడెక్కడి నుండో ఎంచుకుని తమవారిగా చేసుకున్నారు. ఐదు ఖండాల నుండీ డైరెక్టుగా బాబా పిల్లలను తమవారిగా చేసుకున్నారు. ఇది ఎంత పెద్ద స్వమానము. సృష్టి రచయిత యొక్క మొదటి రచన మీరు. ఈ స్వమానము గురించి తెలుసు కదా! బాప్‌దాదా తనతోపాటుగా పిల్లలైన మిమ్మల్ని కూడా మొత్తము విశ్వములోని ఆత్మలకు పూర్వజులుగా తయారుచేసారు. మీరు విశ్వానికి పూర్వజులు, పూజ్యులు. బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ విశ్వానికి ఆధారమూర్తులుగా, ఉదాహరణమూర్తులుగా తయారుచేసారు. ఆ నషా ఉందా? అప్పుడప్పుడు ఆ నషా కొంచెం తక్కువైపోతూ ఉంటుంది. ఆలోచించండి, అన్నిటికంటే అమూల్యమైన సింహాసనాన్ని, మొత్తము కల్పములో మరెవరికీ ఇటువంటి అమూల్యమైన సింహాసనము లభించదు, అటువంటి పరమాత్మ సింహాసనాన్ని, ప్రకాశ కిరీటాన్ని, స్మృతి తిలకాన్ని ఇచ్చాము. నేను ఎవరిని - అన్న స్మృతి వస్తూ ఉంది కదా! నా స్వమానము ఏమిటి! నషా ఎక్కుతూ ఉంది కదా! మొత్తము కల్పములో సత్యయుగ సింహాసనము ఎంత అమూల్యమైనది, అయినా కానీ పరమాత్మ హృదయ సింహాసనమనేది పిల్లలైన మీకే ప్రాప్తిస్తుంది.
బాప్‌దాదా సదా చివరి నంబర్లోని బిడ్డను కూడా ఫరిశ్తా నుండి దేవతగా అయ్యే స్వరూపములోనే చూస్తారు. ఇప్పుడిప్పుడే బ్రాహ్మణులుగా, బ్రాహ్మణుల నుండి ఫరిశ్తాగా, ఫరిశ్తా నుండి దేవతగా అవ్వాల్సిందే. మీ స్వమానము తెలుసా? ఎందుకంటే బాప్‌దాదాకు తెలుసు - స్వమానాన్ని మర్చిపోయిన కారణముగానే దేహభానము, దేహ-అభిమానము వస్తుంది, అలజడి చెందుతారు, వ్యాకులపడతారు కూడా. దేహ-అభిమానము లేక దేహభానము వచ్చినప్పుడు ఎంత అలజడి చెందుతారో, వ్యాకులపడతారో బాప్‌దాదా చూస్తారు. అందరూ అనుభవీలే కదా! స్వమాన నషాలో ఉండటము మరియు ఈ నషా నుండి దూరమై అలజడిలో, వ్యాకులతలో ఉండటము, ఈ రెండింటి గురించి మీకు తెలుసు. బాప్‌దాదా చూస్తున్నారు, పిల్లలందరూ మెజారిటీ నాలెడ్జ్‌ఫుల్‌గా అయితే చాలా బాగా అయ్యారు, కానీ పవర్లో ఫుల్‌గా, పవర్‌ఫుల్‌గా లేరు. పర్సంటేజ్ లో ఉన్నారు.
బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ సర్వ ఖజానాలకు బాలకులు సో యజమానులుగా తయారుచేసారు. అందరికీ సర్వ ఖజానాలను ఇచ్చారు, ఎక్కువ-తక్కువ ఇవ్వలేదు ఎందుకంటే లెక్కలేనంత ఖజానా ఉంది, అనంతమైన ఖజానా ఉంది, అందుకే పిల్లలు ప్రతి ఒక్కరినీ అనంతమైన బాలకులు సో యజమానులుగా తయారుచేసాము. తండ్రి అనంతమైనవారు, ఖజానా అనంతమైనది, కనుక ఇప్పుడు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి - మీ వద్ద కూడా అనంతమైన ఖజానా ఉందా? సదాకాలము ఉంటుందా లేక అప్పుడప్పుడు ఏదైనా దొంగలించబడుతుందా? మాయమైపోతుందా? బాబా ఎందుకు అటెన్షన్ ఇప్పిస్తున్నారు? అలజడి చెందవద్దు, వ్యాకుల పడవద్దు, స్వమానమనే సీట్‌పై సెట్ అయ్యి ఉండండి, అప్సెట్ అవ్వద్దు. 63 జన్మలైతే మానసిక అలజడిని అనుభవము చేసారు కదా! ఇప్పుడు ఇంకా అనుభవము చేద్దామని అనుకుంటున్నారా? అలసిపోలేదా? ఇప్పుడు స్వమానములో ఉండండి అనగా మీ ఉన్నతోన్నతమైన గౌరవములో ఉండండి. ఎందుకని? ఎంత సమయము గడిచిపోయింది. 70వ సంవత్సరాన్ని జరుపుకుంటున్నారు కదా! కనక స్వయాన్ని గురించిన అవగాహన అనగా స్వమానము గురించిన అవగాహన, స్వమానములో స్థితులవ్వడము. సమయమనుసారముగా ఇప్పుడు ‘సదా’ అన్న పదాన్ని ప్రాక్టికల్ జీవితములోకి తీసుకురండి, పదాన్ని అండర్లైన్ చెయ్యడం కాదు, దానిని ప్రాక్టికల్ జీవితములో అండర్లైన్ చెయ్యండి. అలా ఉండాలి, ఉంటాము, చెయ్యడమైతే చేస్తున్నాము, చేసేస్తాము... ఇవి అనంతమైన బాలకులు సో యజమానులుగా అయ్యేవారి మాటలు కావు. ఇప్పుడు ప్రతి ఒక్కరి హృదయము నుండి - ‘పొందాల్సినదేదో పొందేసాము’ అన్న అనంతమైన నాదము వెలువడాలి. పొందుతూ ఉన్నాము... అన్న మాటను అనంతమైన ఖజానా కల అనంతమైన తండ్రి యొక్క పిల్లలు అనలేరు. పొందేసాము అని అనాలి, బాప్‌దాదాను పొందారు, నా బాబా అని అన్నారు, స్వీకరించారు, వారిని తెలుసుకున్నారు కూడా మరియు స్వీకరించారు కూడా, కనుక ‘పొందేసాము’ అన్న ఈ అనంతమైన నాదము వెలువడుతూ ఉండాలి, ఎందుకంటే బాప్‌దాదాకు తెలుసు, పిల్లలు స్వమానములో అప్పుడప్పుడు ఉంటున్న కారణముగా సమయము యొక్క మహత్వాన్ని కూడా స్మృతిలో తక్కువగా ఉంచుకుంటారు. ఒకటేమో స్వయము యొక్క స్వమానము, మరొకటి సమయము యొక్క మహత్వము. మీరు సాధారణమైనవారు కారు, మీరు పూర్వజులు. మీలోని ఒక్కొక్కరూ విశ్వములోని ఆత్మలకు ఆధారము. కావున ఆలోచించండి, ఒకవేళ మీరే అలజడిలోకి వచ్చినట్లయితే విశ్వములోని ఆత్మల పరిస్థితి ఎలా ఉంటుంది! మహారథులుగా పిలవబడే వారిపైనే విశ్వము ఆధారపడి ఉంది అని అనుకోకండి. కొత్త-కొత్తవారు అయినా సరే, ఎందుకంటే ఈ రోజు కొత్తవారు కూడా చాలామంది వచ్చి ఉంటారు (మొదటిసారి వచ్చినవారు చేతులెత్తారు) కొత్తవారు, వీరు హృదయపూర్వకముగా ‘‘నా బాబా’’ అని స్వీకరించారు. స్వీకరించారా? కొత్త-కొత్తగా ఎవరైతే వచ్చారో, వారు స్వీకరించారా? తెలుసుకోవటము కాదు, ‘‘నా బాబా’’ అని ఎవరైతే స్వీకరించారో వారు చేతులెత్తండి. చేతిని బాగా పైకి ఎత్తండి. కొత్త-కొత్తవారు చేతులెత్తుతున్నారు. పాతవారైతే పక్కాగానే ఉన్నారు కదా, ఎవరైతే హృదయపూర్వకముగా ‘‘నా బాబా’’ అని స్వీకరించారో మరియు బాబా కూడా ఎవరినైతే ‘‘నా పిల్లలు’’ అని స్వీకరించారో, వారందరూ బాధ్యులే. ఎందుకని? ఎప్పటినుండైతే మీరు - నేను బ్రహ్మాకుమారుడను, నేను బ్రహ్మాకుమారిని అని అంటూ వచ్చారో, మీరు బ్రహ్మాకుమారులు, బ్రహ్మాకుమారీలా లేక శివకుమారులు, శివకుమారీలా, లేక ఇద్దరూనా? అలా అయితే మరి బంధింపబడిపోయారు. బాధ్యతా కిరీటము తలపైకి వచ్చేసింది. వచ్చేసింది కదా? పాండవులూ, చెప్పండి, బాధ్యతా కిరీటము వచ్చేసిందా? బరువుగా అయితే అనిపించడం లేదు కదా? తేలికగా ఉంది కదా! అది ఉన్నదే లైట్ కిరీటము, లైట్ ఎంత తేలికగా ఉంటుంది. అలాగే సమయము యొక్క మహత్వాన్ని కూడా అటెన్షన్లో పెట్టుకోండి. సమయమనేది చెప్పి రాదు. కొంతమంది పిల్లలు ఇప్పుడు కూడా అంటూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు - సమయము గురించి కొంచెం షుమారుగా అయినా తెలియాలి కదా, 20 సంవత్సరాలు పడుతుందా, 10 సంవత్సరాలు పడుతుందా, కాస్త తెలిస్తే బాగుంటుంది అని అనుకుంటారు. కానీ బాప్‌దాదా అంటారు, సమయము గురించి, అంతిమ వినాశనము గురించి వదిలేయండి, ముందు మీకు మీ శరీర వినాశనము గురించి తెలుసా? నేను ఫలానా తారీఖున శరీరము వదిలేస్తాను అని తెలిసినవారు ఎవరైనా ఉన్నారా, ఎవరికైనా తెలుసా? అంతేకాక ఈ రోజుల్లోనైతే బ్రాహ్మణులు శరీరం విడిచినందుకు పెట్టే భోగ్లు ఎక్కువయ్యాయి. శరీరముపై ఎటువంటి నమ్మకము లేదు, అందుకే సమయము యొక్క మహత్వాన్ని తెలుసుకోండి. ఈ చిన్నని యుగము వయసులో చిన్నది కానీ ఇది అత్యంత పెద్ద ప్రాప్తులను ఇచ్చే యుగము, ఎందుకంటే అత్యంత పెద్ద తండ్రి ఈ చిన్నని యుగములోనే వస్తారు, ఇతర పెద్ద యుగాలలో రారు. ఈ చిన్నని యుగములోనే మొత్తము కల్పము యొక్క ప్రాప్తికి బీజాన్ని నాటే సమయము ఉంటుంది. కావాలంటే విశ్వ రాజ్యాన్ని ప్రాప్తి చేసుకోండి, కావాలంటే పూజ్యులుగా అవ్వండి, మొత్తము కల్పములో బీజాన్ని వేసే సమయము ఇదే మరియు డబల్ ఫలాన్ని ప్రాప్తి చేసుకునే సమయము ఇదే. భక్తి ఫలము కూడా ఇప్పుడే లభిస్తుంది మరియు ప్రత్యక్షఫలము కూడా ఇప్పుడే లభిస్తుంది. ఇప్పుడిప్పుడే చేయగానే ఇప్పుడిప్పుడే ప్రత్యక్ష ఫలము లభిస్తుంది మరియు భవిష్యత్తు కూడా తయారవుతుంది. మొత్తము కల్పములో చూడండి, ఇటువంటి యుగము మరేదైనా ఉందా? ఎందుకంటే ఈ సమయములోనే తండ్రి తన పిల్లలు ప్రతి ఒక్కరికీ అరచేతిలో అత్యంత పెద్ద కానుకను ఇచ్చారు, మీ కానుక గుర్తుందా? స్వర్గము యొక్క రాజ్య భాగ్యము. కొత్త ప్రపంచమైన స్వర్గము అనే కానుక పిల్లలు ప్రతి ఒక్కరికీ అరచేతిలో ఇచ్చారు. ఇంత పెద్ద కానుకను మరెవ్వరూ ఇవ్వరు మరియు ఎప్పుడూ ఇవ్వలేరు. అది ఇప్పుడే లభిస్తుంది. ఇప్పుడు మీరు మాస్టర్ సర్వశక్తిమంతులుగా అవుతారు, మరే ఇతర యుగములోనూ మాస్టర్ సర్వశక్తిమంతులు అన్న పదవి లభించదు. కనుక స్వయము యొక్క స్వమానములో కూడా ఏకాగ్రముగా ఉండండి మరియు సమయము యొక్క మహత్వాన్ని కూడా తెలుసుకోండి. స్వయము మరియు సమయము - స్వయము యొక్క స్వమానము, సమయము యొక్క మహత్వము. నిర్లక్ష్యులుగా అవ్వకండి. 70 సంవత్సరాలు గడిచిపోయాయి, ఇప్పుడు కూడా ఒకవేళ నిర్లక్ష్యులుగా అయినట్లయితే మీ ప్రాప్తిని చాలా తగ్గించేసుకుంటారు, ఎందుకంటే ఎంత ముందుకు వెళ్తూ ఉంటారో, అంతగానే ఒక రకమైన నిర్లక్ష్యము వస్తుంది. చాలా బాగున్నాము, చాలా బాగా నడుస్తున్నాము, చేరుకుంటాములే, వెనకేమీ ఉండిపోము, కావాలంటే చూడండి, అయిపోతుందిలే... ఇలా నిర్లక్ష్యము వస్తుంది, రెండవది రాయల్ రూపములోని సోమరితనము వస్తుంది. నిర్లక్ష్యము మరియు సోమరితనము. ‘ఎప్పుడో’ అన్న పదాన్ని ఉపయోగించటము అంటే సోమరితనము, ‘ఇప్పుడు’ అన్న పదాన్ని ఉపయోగించటము అంటే త్వరిత దానము మహాపుణ్యము అవుతుంది.
ఇప్పుడు ఈరోజు మొదటి టర్న్ కదా! కనుక బాప్‌దాదా అటెన్షన్ ఇప్పిస్తున్నారు. ఈ సీజన్లో స్వమానము నుండి దిగిపోకూడదు, అలాగే సమయము యొక్క మహత్వాన్ని మర్చిపోకూడదు. అలెర్టుగా, తెలివైనవారిగా, జాగ్రత్తగా ఉండండి. ప్రియమైనవారు కదా! ఎవరిపైనైతే ప్రేమ ఉంటుందో, వారిలోని ఏ కొంచెము బలహీనతనైనా, లోపాన్ని అయినా చూడలేరు. బాప్‌దాదాకు చివరి బిడ్డ ఎవరైతే ఉన్నారో, ఆ బిడ్డపై కూడా అత్యంత ప్రేమ ఉంటుందని వినిపించాము కదా. బిడ్డ కదా. ఇప్పుడు ఈ జరుగుతూ ఉన్న సీజన్లో, సీజన్ ఇండియావారిదైనా కానీ డబల్ విదేశీయులు కూడా తక్కువేమీ లేరు, బాప్‌దాదా చూసారు, డబల్ విదేశీయులు లేని టర్న్ అంటూ ఏదీ ఉండదు. ఇది వారి అద్భుతము. డబల్ విదేశీయులు ఇప్పుడు చేతులెత్తండి. ఎంతమంది ఉన్నారో చూడండి! స్పెషల్ సీజన్ అయిపోయింది, అయినా కూడా చూడండి ఎంతమంది ఉన్నారో! అభినందనలు. మంచిది రండి, చాలా చాలా అభినందనలు.
మరి ఇప్పుడు ఏం చెయ్యాలో విన్నారా? ఈ సీజన్లో ఏమేమి చేయాలి అన్నదాని గురించి హోమ్‌వర్క్‌ను ఇచ్చేసాము. స్వయాన్ని రియలైజ్ అవ్వండి, స్వయాన్నే రియలైజ్ అవ్వండి, ఇతరులను కాదు, నిజమైన బంగారంగా అవ్వండి ఎందుకంటే బాప్‌దాదా భావిస్తారు - ఎవరైతే ‘‘నా బాబా’’ అని అన్నారో, వారు తోడుగా వెళ్తారు. ఊరేగింపులో కలిసిపోయి వెళ్ళటము కాదు. బాప్దాదాతోపాటు శ్రీమతమనే చేతిని పట్టుకుని తోడుగా వెళ్ళాలి మరియు తరువాత బ్రహ్మాబాబాతో కలిసి మొదట రాజ్యములోకి రావాలి. కొత్త ఇంటిలో ఉన్నప్పుడే మజా వస్తుంది కదా. ఒక్క నెల గడిచిపోయినా సరే దానిని ఒక నెల పాతది అని అంటారు. కొత్త ఇల్లు, కొత్త ప్రపంచము, కొత్త పద్ధతులు, కొత్త ఆచార-వ్యవహారాలు మరియు బ్రహ్మాబాబాతోపాటు రాజ్యములోకి రావాలి. బ్రహ్మాబాబాపై మాకు చాలా ప్రేమ ఉంది అని అందరూ అంటారు కదా. మరి ప్రేమ ఉంది అన్నదానికి గుర్తు ఏమిటి? తోడుగా ఉండాలి, తోడుగా వెళ్ళాలి, తోడుగా రావాలి. ఇదే ప్రేమ ఉంది అన్నదానికి ఋజువు. ఇష్టమేనా? తోడుగా ఉండడము, తోడుగా వెళ్ళడము, తోడుగా రావడము, ఇష్టమేనా? ఇష్టమేనా? మరి ఇష్టమైనదానిని ఎవరైనా వదిలేస్తారా! అందుకే బాబాకు పిల్లలు ప్రతి ఒక్కరి పట్ల ప్రీతి యొక్క రీతి ఏమిటంటే - పిల్లలు తోడుగా వెళ్ళాలి, అంతేకానీ వెనుక-వెనుక కాదు. ఒకవేళ ఏదైనా ఖాతా మిగిలిపోయి ఉంటే ధర్మరాజపురిలో శిక్షలు తినటం కోసం ఆగవలసి వస్తుంది. చేతిలో చెయ్యి ఉండదు, వెనుక-వెనుక వస్తారు. మజా ఎందులో ఉంది? తోడుగా ఉండటములోనే ఉంది కదా! కనుక తోడుగానే వెళ్ళాలి అన్నది పక్కా ప్రతిజ్ఞయే కదా? లేక వెనుక-వెనుక రావాలా? చూడండి, చేతులనైతే చాలా బాగా ఎత్తుతారు. ఎత్తిన ఆ చేతులను చూసి బాప్‌దాదా అయితే సంతోషిస్తారు కానీ శ్రీమతమనే చేతిని ఎత్తండి. శివబాబాకు అయితే చెయ్యి ఉండదు, బ్రహ్మాబాబా ఆత్మకు కూడా చెయ్యి ఉండదు, అలాగే మీకు కూడా ఈ స్థూల చెయ్యి ఉండదు, శ్రీమతమనే చేతిని పట్టుకుని తోడుగా వెళ్ళాలి. తోడుగా వెళ్తారు కదా! తల అయితే ఊపండి. అచ్ఛా, చేతులు ఊపుతున్నారు. బాప్‌దాదా ఇదే కోరుకుంటున్నారు - పిల్లలు ఒక్కరు కూడా వెనుక ఉండిపోకూడదు. అందరూ కలిసి కలిసి వెళ్ళాలి. ఎవరెడీగా ఉండవలసి ఉంటుంది. అచ్ఛా!
ఇప్పుడు బాప్‌దాదా నలువైపులా ఉన్న పిల్లల రిజిస్టర్‌ను చూస్తూ ఉంటారు. ప్రతిజ్ఞ చేసిన తర్వాత దానిని నిలబెట్టుకున్నారు అంటే లాభము పొందినట్లు. కేవలము ప్రతిజ్ఞ చెయ్యటమే కాదు, దాని నుండి లాభము పొందాలి. అచ్ఛా. ఇప్పుడు అందరూ దృఢ సంకల్పము చేస్తారా! దృఢ సంకల్పము యొక్క స్థితిలో స్థితులై కూర్చోండి - చేయాల్సిందే, వెళ్ళాల్సిందే. తోడుగా వెళ్ళాలి. ఇప్పుడు ఈ దృఢ సంకల్పాన్ని మీకు మీరు చేయండి. ఈ స్థితిలో కూర్చుండిపోండి. చేస్తాములే... చేస్తాములే... అని అనవద్దు, చేయాల్సిందే. అచ్ఛా!
సేవ టర్న్ పంజాబ్ వారిది:- అచ్ఛా, ఎవరైతే సేవ కోసం వచ్చారో వారంతా లేవండి. బాగుంది, సగం క్లాసు సహయోగులే ఉన్నారు. సహయోగం ఇవ్వడం, ఇవ్వడం కాదు చాలా-చాలా ఆశీర్వాదాలు తీసుకోవడము. ఎందుకంటే ఎవరి సేవ అయితే చేస్తారో, వారు సంతోషిస్తారు. ఎవరైతే సంతోషిస్తారో, వారి నుండి ఆటోమేటిక్‌గా ఆశీర్వాదాలు వెలువడతాయి, మరి ఎన్ని ఆశీర్వాదాలు జమ చేసుకున్నారు! పుణ్యం జమ చేసుకోవడానికే సేవ యొక్క ఈ గోల్డెన్ ఛాన్స్ లభిస్తుంది. అందుకే ఎక్కువ పుణ్యం జమ అవుతుంది.
ఆబూవారు కూడా సేవ చేస్తారు, ఆబూ వారు లేవండి. జ్ఞాన సరోవర్, పాండవ భవన్ అందరూ లేవండి. అచ్ఛా. ఆబూ నివాసులు అంటే క్రింద పైనవారు అందరూ వచ్చేస్తారు. బాప్‌దాదా మాకు ప్రియస్మృతులను ఇవ్వరు అని ఆబూ నివాసులు అంటారు. మరి ఈరోజు విశేషమైన 4 భుజాలు, దాదీను బహు భుజాధారి అని అంటారు కదా, ముఖ్యంగా 4 భుజాలు ఉన్నాయి. అందరికీ, బాప్‌దాదా, ఆరంభం నుండి చేసిన సేవకు ఆశీర్వాదాలను మరియు అభినందనలను ఇస్తున్నారు ఎందుకంటే సేవాధారులు ఎంతమంది వచ్చినాగానీ ఆబూ నివాసులు లేకుండా పని జరగదు. అందుకే మీ పుణ్య ఖాతా యొక్క భండారా తెరుచుకుంది. ఇప్పుడు ఎంతెంత నింపుకుంటారో చూస్తాము. ప్రభుత్వం ఆ భండారీని మూసివేస్తుంది కదా, బాప్‌దాదా అయితే పుణ్యం యొక్క భండారీని తెరుస్తున్నారు. ఇప్పుడు ఎంతెంత నింపుకుంటారో చూస్తాము. సంతోషంగా ఉంది కదా, ఇంట్లో కూర్చునే పుణ్యం జమ అవుతూ ఉంటుంది. ప్రేమ మరియు నిస్వార్థ భావంతో సేవ చేస్తే పుణ్యం యొక్క భండారీ ఆటోమేటిక్‌గా నిండుతుంది. చేతితో వేయాల్సిన అవసరం లేదు, కేవలం ప్రేమతో చేయాలి. మరి దిల్ (హృదయం) మరియు చుల్ (పొయ్యి) వద్ద ఉండనే ఉన్నారు. చుల్ వద్ద కూడా ఉన్నారు, దిల్ వద్ద కూడా ఉన్నారు. అచ్ఛా, కూర్చోండి.
డబల్ విదేశీ సోదరసోదరీలతో:- డబల్ విదేశీయులకు డబల్ పురుషార్థము జరుగుతుంది, ఒకటి సేవ, రెండు స్వ సేవ. కావున డబల్ విదేశీయులు అన్న టైటిల్ బాగుంది. అందరిదీ డబల్ సేవ జరుగుతుంది, ఇండివిడ్యువల్. డబల్ సేవ.
ఇప్పుడు ఎటువంటి వాయుమండలాన్ని తయారు చేయాలంటే ఒకరినొకరు చూసుకుంటూ రేస్ చేయాలి, రీస్ (ఈర్ష్యతో కూడిన రేస్) కాదు, రేస్ చేయాలి. ముందు నంబర్ రావడానికి ప్రయత్నించాలి. మీరు స్వయం ముందుకు వెళ్ళడమే కాదు, మీ తోటివారికి కూడా ఎటువంటి లిఫ్ట్‌ను ఇవ్వాలంటే వారు కూడా ముందుకు వెళ్ళాలి. సరేనా? ఇటువంటి ధైర్యము ఉందా? ప్రతి సెంటర్ యొక్క వాయుమండలం మధుబన్ వలె ఉండాలి. మధుబన్ వారు సంపూర్ణం అవ్వలేదు కానీ వచ్చిన వారంతా మధుబన్ వాయుమండలంతో సంతోషపడతారు, ఇలా సెంటర్ వాయుమండలం కూడా ఉండాలి. ప్రతి ఇల్లు స్వర్గము అన్న గాయనము ఉంది కదా! ప్రతి సెంటర్ స్వర్గానికి నమూనాగా ఉండాలి అని ఇండియా వారికి కూడా చెప్తున్నాము అప్పుడే ప్రతి ఇల్లు స్వర్గము అని చెప్తాము కదా. మంచిది, ఫారెనర్లలో ఈ విశేషత కూడా ఉంది, ఏదైనా విషయంలో దృఢ సంకల్పం చేస్తే, దానిని చేసి చూపిస్తారు. ఇప్పుడు ఈ సంస్కారాన్ని ఈ కార్యంలో వినియోగించండి, చేసే తీరాలి. సరేనా! చేయాలి కదా? అయితే మరుసటి సీజన్లో ఈ రిజల్ట్‌ను అడుగుతాము. ప్రతి సెంటర్ స్వర్గానికి నమూనాగా ఉండాలి. అభినందనలు.
అన్ని వైపులా ఉన్న డబల్ సేవాధారీ పిల్లలకు, సదా ఏకాగ్రముగా స్వమానమనే సీట్‌పై సెట్ అయ్యి ఉండే నలువైపులా ఉన్న బాప్‌దాదా యొక్క మస్తకమణులకు, సమయము యొక్క మహత్వాన్ని తెలుసుకుని తీవ్ర పురుషార్థము యొక్క ఋజువును ఇచ్చే నలువైపులా ఉన్న సుపుత్రులైన పిల్లలకు, ఉల్లాస-ఉత్సాహాలనే రెక్కలతో సదా ఎగురుతూ ఉండే మరియు ఎగిరేలా చేసే నలువైపులా ఉన్న డబల్ లైట్ ఫరిశ్తా పిల్లలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. అచ్ఛా!
*** ఓంశాంతి ***
