Lever clock is a mechanical non pendulum clock that sends impulses to the clock's balance wheel and shows accurate time; Lever and cylinder are the names of the inner mechanisms of the clock to turn the hands of the clock. Lever method means a wheel with teeth rotates inside the clock. A lever oscillates back and forth to move this wheel so that the hands of the clock turn. This is a detached mechanism that enhances the accuracy of time. That is why Baba says his children to be accurate like a lever clock

लीवर घड़ी एक यांत्रिक गैर पेंडुलम घड़ी है जो घड़ी के संतुलन चक्र को आवेग भेजती है और सटीक समय दिखाती है; लीवर और सिलेंडर - घड़ी की सुइयों को घुमाने के लिए घड़ी के आंतरिक तंत्र के नाम हैं। लीवर विधि का मतलब है कि घड़ी के अंदर दांतों वाला एक पहिया घूमता है। इस पहिये को घुमाने के लिए एक लीवर आगे-पीछे घूमता रहता है ताकि घड़ी की सुईयाँ घूमें। यह एक पृथक तंत्र है जो समय की सटीकता को बढ़ाता है। इसीलिए बाबा अपने बच्चों को लीवर घड़ी की तरह एक्यूरेट रहने के लिए बताते हैं
లివర్ గడియారం అనేది యాంత్రిక నాన్ పెండులమ్ (లోలకం) గడియారం, ఇది గడియారం యొక్క బ్యాలెన్స్ వీల్కు ప్రేరణలను పంపి ఖచ్చితమైన సమయాన్ని చూపుతుంది; లీవర్ మరియు సిలిండర్ అనేవి గడియారం ముళ్ళు తిరగడానికి గడియారం లోపల జరిగే ప్రక్రియల పేర్లు. లీవర్ పద్ధతి అంటే గడియారం లోపల ఒక చక్రం తిరుగుతూ ఉంటుంది. దానికి పళ్ళు ఉంటాయి. మీట (లీవర్) ముందుకు వెనకకు డోలనం చేస్తూ ఈ చక్రాన్ని కదిలేలా చేస్తుంది తద్వారా గడియారం ముళ్ళు తిరుగుతాయి. ఈ పద్ధతిలో మీట మరియు చక్రం విడివిడిగా ఉండి కేవలం చక్రం యొక్క పళ్ళ వద్ద మాత్రమే కలుసుకుంటాయి, దీని కారణంగా గడియారం ఖచ్చితమైన సమయాన్ని చూపుతుంది. అయితే సిలిండర్ పద్ధతిలో చక్రం మరియు మీట ఎప్పటికీ ఆనుకునే ఉండటం కారణంగా రాపిడికి గురై ఖచ్చితమైన సమయాన్ని చూపించదు. అందుకే లీవర్ గడియారంలా ఖచ్చితంగా ఉండాలని బాబా చెప్తారు. లీవర్ గడియారం అంటే పెండులం గడియారం కాదు.