Brahma Kumaris
Brahma KumarisMurli
  • Home
  • Murli Search
  • Murli Topics
  • Murli Chintan
  • AI Murli Chintan (ChatGPT)
Languages
  • EEnglish
  • हहिंदी
  • ગગુજરાતી
  • తతెలుగు
Library
  • Overview
    • Favorites
    • Notes & Highlights
    • Collections
    • Tracker
  • Settings
  • BKOne

4 December 1985 | తెలుగు4 December 1985 | తెలుగు · "సంకల్ప భాష - సర్వశ్రేష్ఠ భాష"

HomeSearchBKOneLibrarySettings
2 Dec 1985Prev9 Dec 1985Next

"సంకల్ప భాష - సర్వశ్రేష్ఠ భాష"

ఈరోజు బాప్‌దాదా ఎదురుగా డబల్ రూపంలో డబల్ సభ కొలువుదీరి ఉంది. రెండూ స్నేహీ పిల్లల సభలే. ఒకటి సాకార రూపధారి పిల్లల సభ, రెండవది ఆకారీ స్నేహీ స్వరూప పిల్లల సభ. స్నేహ సాగరుడైన తండ్రితో మిలనము జరుపుకోవడానికి నలువైపులా ఉన్న ఆకార రూపధారి పిల్లలు తమ స్నేహాన్ని బాప్‌దాదా ఎదురుగా ప్రత్యక్షం చేస్తున్నారు. బాప్‌దాదా పిల్లలందరి స్నేహపు సంకల్పాలను, హృదయంలోని వేరువేరు ఉల్లాస-ఉత్సాహాల సంకల్పాలను, హృదయంలోని వేరువేరు భావనలతో కలిసి స్నేహ సంబంధపు అధికారంతో తమ హృదయపు సమాచారాలను, తమ వేరువేరు ప్రవృత్తి పరిస్థితుల సమాచారాలను, సేవా సమాచారాలను నయనాల భాష ద్వారా, శ్రేష్ఠ స్నేహ సంకల్పాల భాష ద్వారా తండ్రి ఎదురుగా స్పష్టం చేస్తున్నారు. బాప్‌దాదా పిల్లలందరి ఆత్మిక సంభాషణను మూడు రూపాలలో వింటున్నారు. 1. నయనాల భాషలో మాట్లాడుతున్నారు. 2. భావన భాషలో. 3. సంకల్ప భాషలో మాట్లాడుతున్నారు. నోటి భాష అయితే సాధారణ భాష. కానీ ఈ మూడు రకాల భాషలు ఆత్మిక యోగి జీవితపు భాషలు; వీటిని ఆత్మిక పిల్లలు మరియు ఆత్మిక తండ్రి తెలుసుకుంటారు మరియు అనుభవం చేసుకుంటారు. ఎంతగా అంతర్ముఖీ స్వీట్ సైలెన్స్ స్వరూపంలో స్థితులవుతూ వెళ్తారో, అంతగా ఈ మూడు భాషల ద్వారా సర్వ ఆత్మలకు అనుభవం చేయిస్తారు. ఈ అలౌకిక భాషలు ఎంత శక్తివంతమైనవి! నోటి భాషను విని మరియు వినిపించి మెజారిటీ అలసిపోయారు. నోటి భాషలో ఏ విషయాన్నయినా స్పష్టం చేయడానికి సమయం కూడా పడుతుంది. కానీ నయనాల భాష సంకేతాలు ఇచ్చే భాష. మనస్సులోని భావనల భాష ముఖం ద్వారా భావ రూపంలో ప్రసిద్ధి చెందుతుంది. ముఖంలోని భావం మనస్సులోని భావనను రుజువు చేస్తుంది. ఎవరైనా ఎవరి ఎదుటికైనా వెళ్ళినప్పుడు స్నేహంతో వెళ్తున్నారా లేదా శత్రుత్వంతో వెళ్తున్నారా, లేదా ఏదైనా స్వార్థంతో వెళ్తున్నారా అనేది వారి మనస్సులోని భావం ముఖంలో కనిపిస్తుంది. ఏ భావనతో వచ్చారో ఆ నయనాలు, ముఖ కవళికలు మాట్లాడతాయి. కాబట్టి భావన భాషను ముఖ కవళికల ద్వారా తెలుసుకోవచ్చు, మాట్లాడనూ వచ్చు. అలాగే సంకల్ప భాష కూడా ఎంతో శ్రేష్ఠమైన భాష. ఎందుకంటే సంకల్ప శక్తి అన్నింటికంటే శ్రేష్ఠమైన శక్తి, మూల శక్తి. అన్నింటికంటే తీవ్రగతి గల భాష ఈ సంకల్ప భాష. ఎవరైనా ఎంత దూరంలో ఉన్నా, ఏ సాధనమూ లేకపోయినా సరే సంకల్ప భాష ద్వారా ఎవరికైనా సందేశం ఇవ్వవచ్చు. అంతిమంలో ఇదే సంకల్ప భాష ఉపయోగపడ్తుంది. సైన్స్ సాధనాలు ఫెయిల్ అయినప్పుడు ఈ సైలెన్స్ సాధనం పనికొస్తుంది. కానీ ఏ కనెక్షన్ కలపడానికైనా సదా లైన్ క్లియర్‌గా ఉండాలి. ఎంతగా ఒక్క తండ్రి మరియు వారు వినిపించిన జ్ఞానంలో లేదా ఆ జ్ఞానం ద్వారా సేవలో సదా బిజీగా ఉండే అభ్యాసులుగా ఉంటారో, అంతగా శ్రేష్ఠ సంకల్పాలు ఉండటం వల్ల లైన్ క్లియర్‌గా ఉంటుంది. వ్యర్థ సంకల్పాలే డిస్టర్బెన్స్. ఎంతగా వ్యర్థం సమాప్తమై సమర్థ సంకల్పాలు నడుస్తాయో, అంతగా సంకల్ప శ్రేష్ఠ భాష అంత స్పష్టంగా అనుభవమవుతుంది - నోటి భాష ద్వారా అనుభవం చేసుకున్నట్లుగానే, సంకల్ప భాష సెకనులో నోటి భాష కంటే చాలా ఎక్కువగా ఎవరికైనా అనుభవం చేయించగలదు. మూడు నిమిషాల ఉపన్యాస సారాన్ని సెకనులో సంకల్ప భాష ద్వారా అనుభవం చేయించగలరు. సెకనులో జీవన్ముక్తి అనే ఏ గాయనం ఉందో దానిని అనుభవం చేయించగలరు.

అంతర్ముఖీ ఆత్మల భాష, ఇదే అలౌకిక భాష. ఇప్పుడు సమయానుసారంగా ఈ మూడు భాషల ద్వారా సహజ సఫలతను పొందుతారు. శ్రమ కూడా తక్కువ, సమయం కూడా తక్కువ, కానీ సఫలత సహజం. అందుకే ఇప్పుడు ఈ ఆత్మిక భాషకు అభ్యాసులుగా మారండి. కాబట్టి నేడు బాప్‌దాదా కూడా పిల్లల ఈ మూడు రీతుల భాషను వింటున్నారు మరియు పిల్లలందరికీ రెస్పాండ్ ఇస్తున్నారు. అందరి అతి స్నేహ స్వరూపాన్ని బాప్‌దాదా చూసి స్నేహాన్ని స్నేహ సాగరంలో ఇముడ్చుకుంటున్నారు. అందరి స్మృతులకు సదాకాలం కొరకు స్మృతి చిహ్న రూపంగా మారే శ్రేష్ఠ వరదానాన్ని ఇస్తున్నారు. అందరి మనస్సులోని వేరువేరు భావాలను తెలుసుకుని పిల్లలందరి పట్ల సర్వ భావాలకు రెస్పాండ్ - ‘సదా నిర్విఘ్న భవ, సమర్థ భవ, సర్వ శక్తి సంపన్న భవ’ అనే శుభ భావనను ఈ రూపంలో ఇస్తున్నారు. తండ్రి యొక్క శుభ భావన, పిల్లలందరి శుభ కామనలు ఏవైతే ఉన్నాయో, పరిస్థితి ప్రకారం సహయోగ భావన లేదా శుభ కామన ఏదైతే ఉందో, ఆ శుభ కామనలన్నీ బాప్‌దాదా యొక్క శ్రేష్ఠ భావన ద్వారా సంపన్నమవుతూ వెళ్తాయి. నడుస్తూ నడుస్తూ అప్పుడప్పుడు కొందరు పిల్లల ఎదురుగా పాత లెక్కాపత్రాలు, ఇందులోనే ఆసక్తి ఉంచుతున్నారు. ఎక్కువ సంపాదనకు సాధనం కూడా ఇదే తయారైంది. అచ్ఛా, అందరూ ఆడుతూ పాడుతూ ముందుకు సాగుతూ ఉంటారు. (ఈ రోజుల్లో సంపర్క ఆత్మలు మంచి సహయోగులుగా ఉన్నారు, వారే స్వయంగా అన్ని ప్లాన్స్ తయారుచేస్తూ వెళ్తున్నారు) మంచిది, అలాగే జరగాలి, అప్పుడే కదా మీరందరూ వానప్రస్థంలోకి వెళ్తారు! వాణికి అతీతమైన స్థితిలోకి వెళ్ళాలి. ఎప్పుడైతే ఇతరులు బాధ్యత తీసుకుంటారో, అప్పుడే కదా వానప్రస్థులైన మీరందరూ అందరినీ వానప్రస్థంలోకి తీసుకువెళ్తారు! ఇప్పుడైతే మీ స్టేజీని మీరే తయారు చేసుకోవాల్సి వస్తోంది, ఆ తర్వాత స్టేజీ తయారై సిద్ధంగా లభిస్తుంది. ఇదే సేవా సఫలత – తయారు చేసేవారు ఇతరులుగా ఉండాలి మరియు మీరు కేవలం ఆశీర్వాదం ఇచ్చి రావాలి.

అందరికీ సేవ చేయడం నేర్పించాము కదా. మరి నేర్చుకున్నవారు ఎందుకు నేర్చుకున్నారు? చేయడానికే నేర్చుకున్నారు కదా. ఇప్పుడు ఎక్కువగా తలబద్దలు కొట్టుకోవాల్సిన అవసరమే లేదు. స్వర్గంలో అన్నీ తయారై సిద్ధంగా ఉన్నట్లుగానే. కేవలం ‘రండి హజూర్, కూర్చోండి హజూర్’ అని మాత్రమే అంటారు. అలాగే ఇప్పుడు కూడా అన్నీ తయారై సిద్ధంగా లభిస్తాయి. ఇక్కడే సేవా స్టేజీలో ఫౌండేషన్ పడుతుంది. సత్యయుగంలో ఏమైనా శ్రమ పడాల్సి ఉంటుందా? కాబట్టి శ్రమ సఫలత యొక్క ఫలాన్ని ఇప్పటి నుండే ప్రత్యక్ష రూపంలో అనుభవం చేసుకుంటేనే ఆ సంస్కారాలు ప్రాక్టికల్‌లోకి వస్తాయి. ఇప్పుడు ఎక్కువగా తల బద్దలు కొట్టుకునే సేవా స్వరూపాన్నే మార్చాలి. ఎక్కడ ఎక్కువగా తల పెడతారో అక్కడ ఎక్కువగా స్వభావాల తలలు కూడా ఢీకొంటాయి. ఇప్పుడు సహజ స్వాభావిక రూపంలో సఫలతను అనుభవం చేసుకుంటారు. అచ్ఛా - దాదీకి సహచరురాలిగా మారారు, ఇది కూడా చాలా మంచి పని చేసారు. ఇది కూడా డ్రామాలో పాత్ర. ఇలాగే ఒకరి సంకల్పాలను మరొకరు ఎగురవేస్తూ ఉంటారు. సంకల్పం చేరుకుంది మరియు ప్రాక్టికల్ అయింది. ఒకరు చెప్పారు, మరొకరు అంగీకరించారు – ఈ శ్రేష్ఠ కర్మను కూడా చేసి చూపించడానికి నిమిత్తం కండి. ‘ఎందుకు, ఏమిటి’ అని అనలేదు కదా. ‘హా జీ’ అని చేసేసారు కదా. ఇలాగే అందరూ తేలికగా మారిపోతే అప్పుడు ఏమవుతుంది? అందరూ ఎగిరే పక్షులైపోతారు. నేడు ఇక్కడ, రేపు అక్కడ. పక్షులు ఒకసారి ఒక కొమ్మపై కూర్చుని, మరొక,రి మరో కొమ్మపై కూర్చుని ఎగురుతూ ఉన్నట్లుగా, ఇలా ఎగిరే పక్షులుగా మారిపోతారు. ఏ కొమ్మపై కూర్చుంటే అదే ఇల్లు. కాబట్టి ఇలాంటి సంస్కారం నింపుకోవాల్సిందే. ఇలా అందరూ నేర్చుకున్నారు కదా. ఎప్పుడైనా ఆర్డర్ వస్తే ‘ఏమిటి, ఎందుకు’ అని అనరు కదా. ‘సేవా స్థానం’ అని అన్నప్పుడు సేవా స్థానం యొక్క అర్థం ఏమిటి? ఎన్నడూ ఏ సెంటర్‌ని ఇల్లు అని అనరు కదా. సేవా స్థానం అంటారు; ప్రవృత్తిలో ఉండేవారికి ఇల్లు ఉంటుంది, కానీ బ్రాహ్మణులుగా మారినవారికి సేవా స్థానాలు ఉంటాయి. సేవా స్థానం అనగా సేవ కోసం ఉన్నది. కాబట్టి ఎక్కడ సేవ ఉంటే అక్కడ హాజరు. ఇల్లు అయితే వదలడానికి కష్టమవుతుంది, సేవా స్థానం అయితే ఎక్కడ సేవ ఉంటే అదే సేవా స్థానం. అచ్ఛా, ఇలా అందరూ ఎవరెడీగా మారండి.

పార్టీలతో అవ్యక్త బాప్‌దాదా మిలనము :-

1. వినడమైతే చాలా విన్నారు. చివరకు లెక్క తీయండి, వినే తీరు ఏమిటి? వినడం మరియు చేయడం రెండూ కలిసి ఉన్నాయా? లేక వినడానికి మరియు చేయడానికి మధ్య తేడా ఉంటుందా? ఎందుకు వింటున్నారు? చేయడానికే కదా. వినడం మరియు చేయడం ఎప్పుడైతే సమానమవుతాయో అప్పుడు ఏమవుతుంది? సంపన్నులైపోతారు కదా. మరి అన్నింటికంటే ముందుగా సంపూర్ణ స్థితికి శాంపిల్ ఎవరు తయారవుతారు? ప్రతి ఒక్కరూ ‘నేను తయారవుతాను’ అని ఎందుకు అనరు? ఇందులో ‘భారాన్ని మోసేవారే అర్జునులు’. తండ్రి స్వయాన్ని నిమిత్తం చేసుకున్నట్లుగా, అలా నిమిత్తమయ్యేవారు అర్జునులుగా మారతారు. అనగా అగ్రస్థానంలోకి వచ్చేస్తారు. అచ్ఛా - చూద్దాం ఎవరు తయారవుతారో. బాప్‌దాదా అయితే పిల్లలను చూడాలనుకుంటున్నారు. సంవత్సరాలు గడుస్తూ వెళ్తున్నాయి. సంవత్సరాలు గడిచినట్లుగానే పాత నడవడిక ఏదైతే ఉందో అది కూడా గడిచిపోవాలి. మరియు కొత్త ఉల్లాసం, కొత్త సంకల్పం సదా ఉండాలి. ఇదే సంపూర్ణతకు నిదర్శనం. పాతదానినంతా దీపమాలలో సమాప్తం చేసారు కదా. దీపావళి జరుపుకున్నారు కదా. కాబట్టి దీపావళిలో పాతది సమాప్తమైంది. ఇప్పుడు అంతా కొత్తగా ఉండాలి. అచ్ఛా.

ప్రశ్న:- తండ్రి సమీపంలోకి రావడానికి ఆధారం ఏమిటి?

జవాబు:- విశేషతలు. విశేషతలే విశేషంగా తండ్రి సమీపంలోకి తీసుకువచ్చాయి. ఇప్పుడు స్వయంలో ఉన్న విశేషతలు ఇతరుల ఎదురుగా విశేష శాంపిల్‌గా మారి ప్రత్యక్షం కావాలి. ఉన్న విశేషతలు సేవ ద్వారా వృద్ధిని పొందుతాయి. తండ్రి నింపిన విశేషతలన్నింటినీ సేవలో పెట్టండి. విశేషతను సాకారంలోకి తీసుకురావడం వల్ల సేవ అనే సబ్జెక్ట్‌లో కూడా మార్కులు లభిస్తాయి. అనుభవాలను వినిపించండి, కేవలం మీ వద్దనే ఉంచుకోకండి. అనుభవాన్ని సేవలోకి తీసుకురండి, అప్పుడు ఇతరుల ఉల్లాస-ఉత్సాహాలు కూడా పెరుగుతాయి. బాప్‌దాదా సదా విశేష ఆత్మల విశేషతనే చూస్తారు మరియు దానితోనే కార్యం చేయిస్తారు. అచ్ఛా!

*** ఓంశాంతి ***

Read in Other Languages

EEnglishहहिंदी

Murli Topics

संकल्प शक्ति /मनसा शक्ति - Power of Thoughts and Mind