"బాలకుడే యజమాని"
ఈరోజు బాప్‌దాదా తమ శక్తి సైన్యాన్ని చూస్తున్నారు - ఈ ఆత్మిక శక్తి సైన్యం మన్జీతులు, జగజ్జీతులుగా ఉన్నారా? మనోజీతులు అనగా మనస్సులోని వ్యర్థ సంకల్పాలు, వికల్పాలపై విజయం పొందినవారు. ఇలా విజయం పొందిన పిల్లలే విశ్వ రాజ్యాధికారులుగా మారతారు. అందుకే మనస్సును జయిస్తే జగత్తును జయించినట్లే అని కీర్తించబడింది. ఈ సమయంలో సంకల్ప శక్తిని అనగా మనస్సును స్వయం అధికారంలో ఎంతగా ఉంచుకుంటారో, అంతగా విశ్వ రాజ్యానికి అధికారులుగా మారుతారు. ప్రస్తుతం ఈ సమయంలో ఈశ్వరీయ బాలురుగా ఉన్నారు మరియు ఇప్పటి బాలురే విశ్వానికి యజమానులుగా మారతారు. బాలురుగా మారకుండా యజమానులుగా మారలేరు. హద్దు యజమానితనం యొక్క ఏ హద్దు నషా అయితే ఉందో దానిని సమాప్తం చేసి హద్దు యజమానితనం నుండి బాల్యత్వంలోకి రావాలి, అప్పుడే బాలుడే యజమానిగా (బాలక్ సో మాలిక్) అవుతారు. అందుకే భక్తి మార్గంలో ఎవరైనా దేశానికి ఎంత పెద్ద యజమాని అయినా, ధనానికి యజమాని అయినా, పరివారానికి యజమాని అయినా సరే, తండ్రి ఎదురుగా అందరూ “మేము నీ బాలురము” అని అంటూనే ప్రార్థిస్తారు. నేను ఫలానా యజమానిని అని ఎన్నడూ అనరు. బ్రాహ్మణ పిల్లలైన మీరు కూడా బాలురుగా మారినప్పుడే ఇప్పుడు కూడా నిశ్చింత చక్రవర్తులుగా అవుతారు మరియు భవిష్యత్తులో విశ్వానికి యజమానులుగా లేదా చక్రవర్తులుగా అవుతారు. “నేను బాలక్ సో యజమానిని” – ఈ స్మృతి సదా నిరహంకార, నిరాకార స్థితిని అనుభవం చేయిస్తుంది. బాలురుగా మారడం అనగా హద్దు జీవితం పరివర్తన చెందడం. ఎప్పుడైతే బ్రాహ్మణులుగా అయ్యారో, అప్పుడు బ్రాహ్మణ జీవితపు మొదటి అతి సహజమైన పాఠం ఏమి చదువుకున్నారు? పిల్లలు ‘బాబా’ అన్నారు మరియు తండ్రి ‘బిడ్డ’ అనగా ‘బాలుడు’ అన్నారు. ఈ ఒక్క పదం యొక్క పాఠం నాలెడ్జ్‌ఫుల్‌గా తయారుచేస్తుంది. బాలుడు లేదా బిడ్డ అనే ఈ ఒక్క పదాన్ని చదువుకుంటే, కేవలం ఈ సమస్త విశ్వానిదే కాదు కానీ మూడు లోకాల నాలెడ్జ్‌ను చదువుకున్నట్లే. నేటి ప్రపంచంలో ఎంత పెద్ద నాలెడ్జ్‌ఫుల్ అయినప్పటికీ మూడు లోకాల నాలెడ్జ్‌ను తెలుసుకోలేరు. ఈ విషయంలో ఈ ఒక్క పదాన్ని చదువుకున్న మీ ఎదురుగా ఎంత పెద్ద నాలెడ్జ్‌ఫుల్ అయినా అజ్ఞానులే. ఇంతటి మాస్టర్ నాలెడ్జ్‌ఫుల్‌గా ఎంత సహజంగా మారిపోయారు? బాబా మరియు పిల్లలు – ఈ ఒక్క పదంలో సమస్తం ఇమిడి ఉంది. విత్తనంలో వృక్షమంతా ఇమిడి ఉన్నట్లుగా, బాలుడు లేదా బిడ్డగా మారడం అనగా సదాకాలం కొరకు మాయ నుండి రక్షించబడటం. మాయ నుండి రక్షించబడి ఉండండి అనగా మేము పిల్లలము అనే ఈ స్మృతిలో సదా ఉండండి. సదా ఇదే స్మృతిని ఉంచుకోండి – “బిడ్డగా మారాము” అనగా రక్షించబడ్డాము. ఈ పాఠం కష్టమైనదా ఏమిటి? సహజమైనదే కదా. మరి ఎందుకు మర్చిపోతారు? కొందరు పిల్లలు – మర్చిపోవాలని అనుకోము కానీ మర్చిపోతున్నాము అని అనుకుంటారు. ఎందుకు మర్చిపోతున్నారు? అప్పుడు ‘బహుకాలపు సంస్కారాలు లేదా పాత సంస్కారాలు ఉన్నాయి’ అని అంటారు. కానీ ఎప్పుడైతే మరజీవగా మారారో, అప్పుడు మరణించే సమయంలో ఏం చేస్తారు? అగ్ని సంస్కారం చేస్తారు కదా. పాతదానికి అంత్యక్రియలు చేసాకనే కొత్త జన్మ తీసుకున్నారు. సంస్కారం చేసేసాక మళ్ళీ పాత సంస్కారాలు ఎక్కడి నుండి వచ్చాయి! శరీరానికి అంత్యక్రియలు చేసినప్పుడు నామ రూపాలు సమాప్తమైపోతాయి. ఒకవేళ పేరు తీసుకున్నా ‘ఫలానా వారు ఉండేవారు’ అని అంటారు తప్ప ‘ఉన్నారు’ అని అనరు. కాబట్టి శరీరానికి సంస్కారం జరిగాక శరీరం సమాప్తమైపోయింది. బ్రాహ్మణ జీవితంలో దేనికి అంత్యక్రియలు చేస్తారు? శరీరమైతే అదే ఉంది, కానీ పాత సంస్కారాలకు, పాత స్మృతులకు, స్వభావానికి అంత్యక్రియలు చేసినప్పుడే మరజీవ అని పిలువబడతారు. సంస్కారం చేసేసాక మళ్ళీ పాత సంస్కారాలు ఎక్కడి నుండి వచ్చాయి! ఒకవేళ అంత్యక్రియలు చేసిన మనిషి మళ్ళీ మీ ఎదురుగా వస్తే ఏమంటారు? దెయ్యం అని అంటారు కదా. అలాగే అంత్యక్రియలు చేసిన ఈ పాత సంస్కారాలు కూడా మళ్ళీ జాగృతమైతే ఏమంటారు? వీటిని కూడా మాయ దెయ్యాలు అనే అంటారు కదా. దెయ్యాలను తరిమికొడతారు కదా, వాటిని వర్ణించరు కూడా. ‘ఇవి పాత సంస్కారాలు’ అని అంటూ మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. ఒకవేళ మీకు పాత విషయాలు నచ్చితే, వాస్తవికమైన అతి పురాతన ఆదికాలపు సంస్కారాలను గుర్తుచేసుకోండి. ఇవైతే మధ్యకాలపు సంస్కారాలు, ఇవి అతి పురాతనమైనవి కావు. మధ్యాన్ని ‘నడుమ’ అంటారు; కాబట్టి మధ్యకాలాన్ని అనగా నడుమ ఉన్నదానిని స్మరించడం అనగా నడిసంద్రపు సుడిగుండంలో చిక్కుకుని పరేషాన్ అవ్వడం. అందుకే ఎన్నడూ ఇలాంటి బలహీనపు మాటలను ఆలోచించకండి. సదా ఈ రెండు పదాలనే గుర్తుంచుకోండి – “బాలుడే యజమాని”. బాల్యత్వమే యజమానితనాన్ని స్వతహాగా స్మృతిలోకి తీసుకువస్తుంది. బాలురుగా మారడం చేతకాదా?
బాలురుగా మారండి అనగా అన్ని భారాల నుండి తేలికగా మారండి. ఒక్కోసారి ‘నీది’, ఒక్కోసారి ‘నాది’ అనడమే కష్టంగా తయారుచేస్తుంది. ఎప్పుడైనా కష్టాన్ని అనుభవం చేసుకున్నప్పుడు ‘నీ పని నీకు తెలుసు’ అంటారు, మరియు సహజంగా ఉన్నప్పుడు ‘నాది’ అంటారు. ‘నాది’ అనే భావం సమాప్తమవ్వడం అనగా బాలుడే యజమానిగా మారడం. తండ్రి అయితే బెగ్గర్‌గా మారమని అంటారు. ఈ శరీర రూప ఇల్లు కూడా నీది కాదు. ఇది లోన్‌గా లభించి ఉంది. కేవలం ఈశ్వరీయ సేవ కొరకు బాబా లోన్ ఇచ్చి ట్రస్టీగా తయారుచేసారు. ఇది ఈశ్వరీయ అమానతు. మీరైతే సర్వస్వాన్ని ‘నీది’ అని అంటూ తండ్రికి ఇచ్చేసారు. ఈ వాగ్దానం చేసారు కదా లేక మర్చిపోయారా? వాగ్దానం చేసారా లేక సగం నీది సగం నాది అని ఉన్నారా? ఒకవేళ ‘నీది’ అని అన్న దానిని ‘నాది’ అని భావించి కార్యంలో పెడితే ఏమవుతుంది? దాని ద్వారా సుఖం లభిస్తుందా? సఫలత లభిస్తుందా? అందుకే అమానతుగా భావిస్తూ, నీదిగా భావిస్తూ నడుచుకుంటే బాలుడే యజమాని అనే సంతోషంలో, నషాలో స్వతహాగానే ఉంటారు. అర్థమైందా? కాబట్టి ఈ పాఠాన్ని సదా పక్కాగా ఉంచుకోండి. పాఠం పక్కా చేసుకున్నారా లేక తమ-తమ స్థానాలకు వెళ్ళి మళ్ళీ మర్చిపోతారా? ఎన్నడూ మర్చిపోనివారిగా మారండి. అచ్ఛా.
సదా ఆత్మిక నషాలో ఉండే బాలక్ సో యజమాని అయిన పిల్లలకు, సదా బాల్యత్వం అనగా నిశ్చింత చక్రవర్తితనం యొక్క స్మృతిలో ఉండేవారికి, సదా లభించిన అమానతును ట్రస్టీగా మారి సేవలో పెట్టే పిల్లలకు, సదా కొత్త ఉల్లాసం, కొత్త ఉత్సాహంలో ఉండే పిల్లలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
పార్టీలతో అవ్యక్త బాప్‌దాదా మిలనము
కుమారీలతో:- ఈ సైన్యం ఏం చేస్తుంది? దండు లేదా సైన్యం సదా విజయాన్ని పొందుతుంది. సైన్యం ఉండేది విజయం కోసమే. శత్రువుతో పోరాడటానికి సైన్యాన్ని ఉంచుకుంటారు. కాబట్టి మాయ అనే శత్రువుపై విజయం పొందడమే మీ అందరి కర్తవ్యం. సదా మీ ఈ కర్తవ్యాన్ని తెలుసుకుని వీలైనంత త్వరగా ముందుకు సాగుతూ వెళ్ళండి, ఎందుకంటే సమయం వేగంగా ముందుకు వెళ్తుంది. సమయపు వేగం తీవ్రంగా ఉండి, మన వేగం బలహీనంగా ఉంటే సమయానికి చేరుకోలేము. అందుకే వేగాన్ని తీవ్రతరం చేయండి. ఎవరైతే నెమ్మదిగా ఉంటారో వారు స్వయంగానే బలైపోతారు. శక్తివంతులు సదా విజయులవుతారు. మరి మీరందరూ విజయులేనా?
సదా ఇదే లక్ష్యాన్ని పెట్టుకోండి – సర్వీసబుల్గా మారి సేవలో సదా ముందుకు సాగుతూ ఉండాలి; ఎందుకంటే కుమారీలకు ఎలాంటి బంధనాలు లేవు. ఎంత సేవ చేయాలనుకుంటే అంత చేయగలరు. సదా ‘నేను తండ్రికి చెందినదానిని మరియు తండ్రి కోసమే ఉన్నాను’ అని భావిస్తూ ముందుకు సాగుతూ ఉండండి. ఎవరైతే సేవకు నిమిత్తమవుతారో వారికి సంతోషం మరియు శక్తి యొక్క ప్రాప్తి స్వతహాగా కలుగుతుంది. సేవా భాగ్యం కోట్లలో కొందరికి మాత్రమే లభిస్తుంది. కుమారీలు సదా పూజ్య ఆత్మలు. మీ పూజ్య స్వరూపాన్ని స్మృతిలో ఉంచుకుంటూ ప్రతి కర్మ చేయండి. మరియు ప్రతి కర్మకు ముందు చెక్ చేసుకోండి – ఈ కార్యం పూజ్య ఆత్మకు తగినట్లుగా ఉందా? ఒకవేళ లేకపోతే పరివర్తన చేసుకోండి. పూజ్య ఆత్మలు ఎన్నడూ సాధారణంగా ఉండరు, మహోన్నతంగా ఉంటారు. 100 మంది బ్రాహ్మణుల కంటే ఉత్తములు కుమారీలు. కాబట్టి 100 మంది బ్రాహ్మణులను ఒక్కొక్క కుమారీ తయారుచేయాలి, వారికి సేవ చేయాలి. కుమారీలు ఎంత అద్భుతమైన ప్లాన్ ఆలోచించారు! ఏ ఆత్మకైనా కళ్యాణం జరగడం కంటే గొప్ప విషయం ఇంకేముంది? మీ ఆనందంలో మీరు ఉండేవారే కదా. ఒక్కోసారి జ్ఞాన ఆనందంలో, ఒక్కోసారి స్మృతి ఆనందంలో, ఒక్కోసారి ప్రేమ ఆనందంలో. ఆనందాలే ఆనందాలు. సంగమయుగమే ఆనందాల యుగం. అచ్ఛా, కుమారీల పైన బాప్‌దాదా దృష్టి సదా ఉంటుంది. కుమారీలు స్వయాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుకుంటారు అనేది వారి పైన ఆధారపడి ఉంటుంది, కానీ బాప్‌దాదా అయితే అందరినీ విశ్వానికి యజమానులుగా చేయడానికి వచ్చారు. సదా విశ్వ యజమానితనం యొక్క సంతోషం మరియు నషా ఉండాలి. సదా అలసట లేని సేవలో ముందుకు సాగుతూ ఉండండి. అచ్ఛా!
*** ఓంశాంతి ***
