‘‘హోలీ యొక్క ఆధ్యాత్మిక రహస్యము’’
ఈరోజు పవిత్రమైన, ఉన్నతమైన(హోలియెస్ట్, హైయెస్ట్) తండ్రి తమ హోలీ మరియు హ్యాపీ హంసలతో హోలీ జరుపుకునేందుకు వచ్చారు. త్రిమూర్తి తండ్రి హోలీ దివ్య రహస్యాన్ని మూడు రకాలుగా వినిపించేందుకు వచ్చారు. సంగమ యుగము హోలీ యుగము. సంగమ యుగము ఉత్సవాల యుగము. శ్రేష్ఠ ఆత్మలైన మీకు ప్రతి రోజూ, ప్రతి సమయము ఉత్సాహంతో నిండిన ఉత్సవము. అజ్ఞానీ ఆత్మలు స్వయాన్ని ఉత్సాహంగా ఉంచుకునేందుకు ఉత్సవము జరుపుకుంటారు. కానీ శ్రేష్ఠ బ్రాహ్మణాత్మలైన మీకు ఈ బ్రాహ్మణ జీవితమే ఉత్సాహంతో కూడిన జీవితము. ఉల్లాసము, సంతోషము నిండిన జీవితము. అందుకని సంగమయుగనే ఉత్సవాల యుగము. ఈశ్వరీయ జీవితము సదా ఉల్లాస ఉత్సాహాలు నిండిన జీవితము. సదా సంతోషంగా నాట్యం చేస్తూ, శక్తిశాలి జ్ఞానామృతాన్ని త్రాగుతూ, సుఖాన్నిచ్చే పాటలు పాడుతూ, హృదయ పూర్వక స్నేహంతో పాటలు పాడుతూ తమ శ్రేష్ఠ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. అజ్ఞానీ ఆత్మలు ఒక్క రోజు జరుపుకుంటారు. అల్పకాలిక ఉత్సాహంలోకి వస్తారు తర్వాత ఎలా ఉన్నవారు అలాగే ఉంటారు. మీరు ఉత్సవము జరుపుకుంటూ హోలీగా అవుతారు, ఇతరులను కూడా హోలీగా చేస్తారు. వారు కేవలం జరుపుకుంటారు. మీరు జరుపుకుంటూనే తయారవుతారు. మనుషులు మూడు రకాలుగా హోలీ జరుపుకుంటారు. ఒకటి - అగ్నితో కాల్చే హోలీ, రెండవది - రంగులు వేసుకునే హోలీ, మూడవది - మంగళ మిలనము చేసే హోలీ. ఈ మూడు హోలీలు ఆధ్యాత్మిక రహస్యం కలిగి ఉన్నాయి. కానీ వారు స్థూల రూపంలో జరుపుకుంటూ ఉంటారు. ఈ సంగమ యుగంలో మహాన్ ఆత్మలైన మీరు తండ్రివారిగా అవ్వడం అనగా హోలీగా అవుతున్నట్లయితే మొదట ఏం చేస్తారు? మొదట పాత స్వభావ సంస్కారాలను యోగ అగ్నితో భస్మం చేస్తారు అనగా కాలుస్తారు. కాల్చిన తర్వాతనే స్మృతి ద్వారా తండ్రి సాంగత్యం అనే రంగు అంటుకుంటుంది. మీరు కూడా మొదట కాల్చే హోలీ జరుపుకుంటారు. తర్వాత ప్రభు సాంగత్యం అనే రంగులో రంగరించబడ్తారు అనగా తండ్రి సమానంగా తయారవుతారు. తండ్రి జ్ఞానసాగరుడు, అయితే పిల్లలు కూడా తండ్రి సాంగత్య రంగులో జ్ఞాన స్వరూపంగా అవుతారు. తండ్రి గుణాలు మీ గుణాలుగా అవుతాయి. తండ్రి శక్తులు మీ ఖజానాలుగా అవుతాయి, మీ ఆస్తిగా అవుతాయి. కావున ఇలాంటి సాంగత్య రంగు అవినాశిగా అంటుకొని జన్మ-జన్మాంతరాలకు ఈ రంగు అవినాశిగా అవుతుంది. సాంగత్య రంగు అంటుకున్నప్పుడు ఈ ఆత్మిక రంగుతో హోలీ జరుపుకుంటే ఆత్మ-పరమాత్మల మిలనము అనగా తండ్రి మరియు పిల్లల శ్రేష్ఠ మిలన మేళా సదా జరుగుతూనే ఉంటుంది. అజ్ఞానీ ఆత్మలు తమ ఈ ఆత్మిక హోలీని స్మృతి చిహ్న రూపంలో జరుపుకోవడం ప్రారంభించారు. ఉత్సాహంతో నిండిన మీ ప్రాక్టికల్ జీవితాన్ని భిన్న-భిన్న రూపాలలో స్మృతి చిహ్నంగా జరుపుకొని అల్పకాలం కొరకు సంతోషిస్తారు. ప్రతి అడుగులో తమ శ్రేష్ఠ జీవితంలో ప్రాప్తించిన విశేషతలను జ్ఞాపకం చేసుకొని కొంత సమయం కొరకు వారు కూడా సంతోషాలు జరుపుకుంటూ ఉంటారు. ఈ స్మృతిచిహ్నాన్ని చూసి లేక విని ఇవి మా విశేషతల స్మృతి చిహ్నమని సంతోషిస్తారు కదా! మీరు మాయను కాల్చేశారు, వారు హోళికను తయారు చేసి కాలుస్తారు. ఎంత రమణీయ కథలు తయారు చేశారంటే అవి విని మా విషయాలను ఎలా తయారు చేశారు అని మీకు నవ్వు వస్తుంది. హోలీ ఉత్సవము మీ భిన్న-భిన్న ప్రాప్తుల స్మృతి రూపంలో జరుపుకుంటారు. ఇప్పుడు మీరు సదా సంతోషంగా ఉంటారు. సంతోష ప్రాప్తికి స్మృతిచిహ్నాన్ని చాలా సంతోషంగా ఉండి హోలీ జరుపుకుంటారు. ఆ సమయంలో అన్ని దు:ఖాలు మర్చిపోతారు. మీరు సదా కాలం కొరకు దు:ఖం మర్చిపోయారు. మీ సంతోషపు ప్రాప్తిని స్మృతిచిహ్నంగా జరుపుకుంటారు.
ఇంకొక విషయం - జరుపుకునే సమయంలో చిన్న పెద్ద చాలా తేలికగా అయ్యి తేలికగా జరుపుకుంటారు. ఆ రోజు కొరకు అందరి మూడ్ కూడా తేలికగా ఉంటుంది. కావున ఇది మీరు డబల్ లైట్‌గా అయినందుకు స్మృతి చిహ్నము. ప్రభువు సాంగత్యపు రంగులో రంగరించబడినట్లయితే డబల్ లైట్‌గా అవుతారు కదా! కావున ఇది ఈ విశేషత యొక్క స్మృతి చిహ్నము. మరో విషయము - ఈరోజు చిన్న పెద్ద ఏ సంబంధం వారైనా సమాన స్వభావంతో ఉంటారు. చిన్న మనవడు కూడా తాతగారికి రంగు పూస్తాడు. అన్ని సంబంధాల వారు తమ వయసును మర్చిపోతారు. సమాన భావంలోకి వచ్చేస్తారు. ఇది కూడా విశేషించి మీ సమాన భావం అనగా సోదర-సోదర స్థితి, ఇతర దేహ సంబంధం యొక్క దృష్టి ఉండదు. ఇది సోదర-సోదర సమాన స్థితికి స్మృతిచిహ్నము. ఇంకొక విషయము - ఈరోజు భిన్న భిన్న రంగులతో బాగా పిచికారి నింపి ఒకరినొకరు రంగులతో రంగరించుకుంటారు. ఇది కూడా ఈ సమయంలో మీ సేవకు స్మృతిచిహ్నము. ఏ ఆత్మకైనా తమ దృష్టి అనే పిచికారి ద్వారా ప్రేమ స్వరూపంగా చేసే రంగు, ఆనంద స్వరూపంగా చేసే రంగు, సుఖం, శాంతి, శక్తులనే ఎన్ని రంగులు వేస్తారు? సదా అంటుకొని ఉండే రంగులు వేస్తారు. తొలగించే పని ఉండదు, శ్రమ చెయ్యవలసిన అవసరం ఉండదు ఇంకా ఈ రంగులలోనే సదా మునిగి ఉండాలని ప్రతి ఆత్మ కోరుకుంటుంది. అందరి వద్ద ఆత్మిక రంగుల ఆత్మిక దృష్టి అనే పిచికారి ఉంది కదా! హోలీ ఆడతారు కదా! ఈ ఆత్మిక హోలీ మీ అందరి జీవితం యొక్క స్మృతి చిహ్నము. బాప్‌దాదాతో మంగళ మిలనము ఎలా జరుపుకున్నారంటే ఈ మిలనం చేస్తూ చేస్తూ తండ్రి సమానంగా అయిపోయారు, తండ్రితో కంబైండ్‌గా అయిపోయారు. ఎవ్వరూ వేరు చెయ్యలేరు.
ఇంకొక విషయము - ఈరోజు అందరూ గడిచిపోయిన విషయాలన్నింటినీ మర్చిపోయే రోజు. 63 జన్మలలో గడిచిపోయిన వాటిని మర్చిపోతారు కదా! గడిచిపోయిన విషయాలకు బిందువు పెడ్తారు కదా! అందువలన హోలీని గడిచిందేదో గడిచిపోయిందనే అర్థంలో కూడా చెప్తారు. ఎలాంటి కఠినమైన శత్రువైనా మరిచి మిలనం చేసే రోజు అని అంగీకరిస్తారు. మీరు కూడా ఆత్మకు శత్రువులైన రాక్షస సంస్కారాలు, రాక్షస స్వభావాన్ని మరిచి ప్రభువు మిలనం జరుపుకున్నారు కదా! సంకల్పమాత్రం కూడా పాత సంస్కారాలు స్మృతిలోకి రాకూడదు. ఇది కూడా మీరు మర్చిపోయే విశేషతకు స్మృతి చిహ్నంగా జరుపుకుంటున్నారు. కావున మీ విశేషతలు ఎన్ని ఉన్నాయో విన్నారు కదా? మీ ప్రతి గుణము, ప్రతి విశేషత, కర్మకు వేరు వేరు స్మృతిచిహ్నాలు తయారు చేశారు. ఎవరి ప్రతి కర్మ స్మృతి చిహ్నంగా తయారవుతుందో ఎవరిని స్మృతి చేసి సంతోషంలోకి వస్తారో వారు స్వయంగా ఎంత మహాన్‌గా ఉన్నారు. మీరు ఎవరో మీకు అర్థం అయ్యిందా? హోలీగా ఉండటంతో పాటు ఎంతో విశేషంగా ఉన్నారు!
డబల్ విదేశీయులకు తమ ఈ శ్రేష్ఠత యొక్క స్మృతిచిహ్నము తెలియకపోయినా తమ స్మృతి యొక్క మహత్వాన్ని ప్రపంచం వారు గుర్తు చేసుకొని స్మృతిచిహ్నాన్ని జరుపుకుంటున్నారు. హోలీ అంటే ఏమిటో అర్థమయిందా? మీరందరూ రంగులో రంగరించబడే ఉన్నారు. ప్రేమ రంగులో ఎలా రంగరించబడి ఉన్నారంటే తండ్రి తప్ప ఇంకేమీ కనిపించకుండా రంగరించబడ్డారు. స్నేహంలోనే తింటూ, త్రాగుతూ, నడుస్తూ, పాడుతూ, నాట్యం చేస్తూ ఉంటారు. పక్కా రంగు అంటుకుందా లేక కచ్చాగా ఉందా? ఎలాంటి రంగు అంటుకుంది? కచ్ఛా రంగా లేక పక్కా రంగా? గడిచిపోయిన దానికి బిందువు పెట్టారా? పొరపాటున కూడా పాత విషయాలు జ్ఞాపకం రాకూడదు. ఏం చెయ్యాలి వచ్చేసిందని అంటారు కదా. ఇది పొరపాటుగా వచ్చిందని అంటారు కదా! ఇది కొత్త జన్మ, కొత్త మాటలు, కొత్త సంస్కారాలు, కొత్త ప్రపంచము. ఈ బ్రాహ్మణుల ప్రపంచము కూడా కొత్తది, బ్రాహ్మణుల భాష కూడా కొత్తది కదా! ఆత్మ భాష కొత్తది కదా. వారు ఏమంటారు, మీరు ఏమంటారు? పరమాత్మ పట్ల కూడా అన్నీ కొత్త విషయాలే ఉన్నాయి. కావున భాష కూడా కొత్తది. పద్ధతులు, ఆచారాలు కొత్తవే. సంబంధ సంపర్కాలు కూడా కొత్తవే. అన్నీ కొత్తవే అయినాయి. పాతది సమాప్తమైపోయింది. కొత్తది మొదలయింది. కొత్త పాటలు పాడ్తారు, పాతవి కాదు. ఎందుకు, ఏమిటి అనేవి పాత పాటలు. ఆహా, ఓహో, వాహ్ ఇవి కొత్త పాటలు. కావున ఎలాంటి పాటలు పాడుకుంటారు? అయ్యో అయ్యో అనే పాటలు పాడడం లేదు కదా! అయ్యో అయ్యో అనేవారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు, మీరు కాదు. కావున అవినాశి హోలీ జరుపుకున్నారు అనగా గడిచిపోయిన దానికి బిందువు పెట్టి సంపూర్ణ పవిత్రంగా అయ్యారు. తండ్రి సాంగత్య రంగులో రంగరించబడ్డారు. కావున హోలీ జరుపుకున్నారు కదా!
సదా తండ్రి మరియు నేను కలిసి ఉన్నాము, సంగమ యుగమంతా సదా కలిసి ఉంటాము. వేరుగా అవ్వనే అవ్వలేము. నేను మరియు నా బాబా అన్న ఉల్లాస-ఉత్సాహాము హృదయంలో ఉంది కదా! లేక తెర వెనుక మూడవవారు కూడా ఎవరైనా ఉన్నారా? అప్పుడప్పుడు ఎలుక, అప్పుడప్పుడు పిల్లి బయటకు రావడం లేదు కదా! అన్నీ సమాప్తమైపోయాయి కదా! తండ్రి లభించారంటే అన్నీ లభించినట్లే. పొందాల్సిందేమీ ఉండదు. సంబంధీకులు మిగలరు. ఖజానా ఉండదు, శక్తి, గుణాలు, జ్ఞానం, పొందవలసిన ప్రాప్తి ఏదీ ఉండదు. కనుక ఇంకేమి కావాలి, దీనినే హోలీ జరుపుకోవడమని అంటాము. అర్థమయిందా?
మీరు ఎంత సంతోషంగా ఉంటారు! నిశ్చింత చక్రవర్తి, గుడ్డి గవ్వ ఖర్చు లేకుండా చక్రవర్తి. ఇలాంటి సంతోషంలో ఎవ్వరూ ఉండరు. ప్రపంచంలోని షావుకార్లందరి కంటే షావుకారు కావచ్చు లేక ప్రపంచంలో ఎవరైనా ప్రసిద్ధమైన వ్యక్తి కావచ్చు, చాలా గొప్ప శాస్త్రవాది కావచ్చు, వేద పాఠాలు చదువుకున్నవారు కావచ్చు, ప్రగాఢ భక్తులు కావచ్చు, నెంబర్‌వన్ సైన్సువారు(విజ్ఞానవేత్తలు) కావచ్చు, ఏ వృత్తి వారికైనా ఇలాంటి సంతోషకరమైన జీవితం లేదు. ఇందులో శ్రమ లేదు. ప్రేమయే ప్రేమ ఉంది. చింత లేదు. కేవలం శుభ చింతకులుగా ఉన్నారు, శుభ చింతన ఉంది. ఇటువంటి సంతోషంతో కూడిన జీవితం, మొత్తం విశ్వమంతా తిరగండి, ఎవరికైనా లభించినట్లయితే వారిని తీసుకురండి. అందుకే పాటలు పాడ్తారు కదా - మధువనంలో, తండ్రి ప్రపంచంలో సంతోషాలే సంతోషాలు ఉన్నాయి. తింటున్నా సంతోషమే, నిదురిస్తున్నా సంతోషమే. మాత్ర వేసుకొని నిద్రపోవాల్సిన అవసరం లేదు. తండ్రితో కలిసి నిద్రపోతే టాబ్లెట్(మాత్ర) వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒంటరిగా నిదురిస్తే హై బి.పి. ఉంటుంది, బాధ ఉంటుంది. కావున మాత్ర వేసుకోవాల్సి వస్తుందని అంటారు. తండ్రి తోడుగా ఉన్నారు. తండ్రితో కలిసి నిదురిస్తున్నారు. ఇదియే టాబ్లెట్(మాత్ర). ఎటువంటి సమయం మళ్లీ వస్తుందంటే ఆదిలో మందులు ఉండేవి కావు. జ్ఞాపకం ఉంది కదా! ఆదిలో ఎంత సమయం మందులు ఉండేవి కావు, కొంచెం వెన్న, మీగడ తినేవారు. మందులు తినేవారు కాదు. ఆదిలో అభ్యాసం చేయించాము కదా! ఇది పాత శరీరం. అంతిమంలో ఆదిలో ఉన్న రోజులు మళ్లీ వస్తాయి. విచిత్రమైన సాక్షాత్కారాలన్నీ చేసుకుంటూ ఉంటారు. ఒక్కసారి సాక్షాత్కారమవ్వాలని చాలా మందికి కోరిక ఉంటుంది. చివరి వరకు ఎవరైతే దృఢంగా ఉంటారో వారికి సాక్షాత్కారాలు అవుతాయి. మళ్లీ అదే సంగఠన యొక్క భట్టీ ఉంటుంది. సేవ పూర్తి అయిపోతుంది. ఇప్పుడు సేవ కారణంగా అనేక స్థానాలలోకి వెళ్ళి ఉన్నారు. మళ్లీ నదులన్నీ సాగరంలో ఇమిడిపోతాయి. కానీ సమయం సున్నితంగా ఉంటుంది. సాధనాలు ఉన్నా పని చేయవు. అందువలన బుద్ధి లైన్ చాలా స్పష్టంగా ఉండాలి. ఇప్పుడు ఏం చెయ్యాలో టచ్ అవుతుంది. ఒక్క సెకండ్ ఆలస్యం అయినా కూడా వెళ్లిపోయినట్లే. ఎలాగైతే వారు కూడా బటన్ నొక్కడంలో ఒక్క సెకండు ఆలస్యం చేసినా ఫలితం ఎలా ఉంటుంది? ఇక్కడ కూడా ఒక్క సెకండ్ టచింగ్ కావడంలో ఆలస్యం అయినా చేరుకోవడం కష్టమవుతుంది. వారు కూడా ఎంత ఏకాగ్రంగా కూర్చుంటారు. కావున ఇది బుద్ధి యొక్క టచింగ్. ఆదిలో ఇంట్లో కూర్చుంటూనే ధ్వని వచ్చేది. రండి చేరుకోండి, ఇప్పుడే బయలుదేరండి అని పిలుపు వినిపించేది, వెంటనే బయలుదేరేవారు. అలాగే చివర్లో కూడా తండ్రి పిలుపు వినిపిస్తుంది. ఎలా అయితే సాకారంలో పిల్లలందరినీ పిలిచే వారో అలాగే ఆకార రూపంలో పిల్లలందరినీ రండి, రండి అని ఆహ్వానిస్తారు. రావాలి మరియు కలిసి వెళ్ళాలి. ఇలా సదా తమ బుద్ధి స్పష్టంగా ఉండాలి. ఏకాగ్రత ఎటువైపు మరలినా తండ్రి పిలుపు, తండ్రి ఆహ్వానం మిస్(దూరం) అవుతుంది. ఇవన్నీ జరగనే జరుగుతాయి.
మేమైతే చేరుకుంటామని టీచర్లు అనుకుంటున్నారు. మీకు అక్కడే ఉండమని తండ్రి డైరెక్షన్ (మార్గదర్శనం) ఇవ్వవచ్చు కూడా. అక్కడ ఏదైనా విశేషమైన పని ఉండవచ్చు, అక్కడ ఎవరికైనా శక్తి ఇవ్వాల్సి ఉండవచ్చు. మీతో తీసుకు వెళ్లడం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతాయి కానీ తండ్రి ఆజ్ఞానుసారంగా ఉండాలి. మన్మతంతో కాదు, ఆకర్షణతో కాదు. అయ్యో నా సెంటర్ అని జ్ఞాపకం రాకూడదు, ఫలానా విద్యార్థిని కూడా తోడుగా తీసుకు వెళ్ళాలి, వీరు అనన్యులు, సహాయకులు, ఇలా ఉండరాదు. ఎవరి కోసమైనా ఆగినట్లయితే మీరు ఉండిపోతారు. ఇలా తయారుగా ఉన్నారు కదా! వీరిని ఎవరెడీ అని అంటాము. ఎల్లప్పుడు అన్నీ సర్దుకొని ఉంటారు. ఆ సమయంలో సర్దుకోవాలనే సంకల్పం రాకూడదు. ఇది చెయ్యాలి ఇది చెయ్యాలి అని అనుకోరాదు. సాకారంలో జ్ఞాపకం ఉంది కదా, సేవాధారి పిల్లల స్థూల బ్యాగ్‌లు, సూట్‌కేసులు సదా రెడీగా ఉండేవి. రైలు వచ్చేందుకు 5 నిమిషాలు ఉండేది. అప్పుడు వెళ్లమని ఆదేశం లభించేది. కనుక బ్యాగులు సర్దబడి రెడీగా ఉండేవి. ఒక స్టేషన్ ముందే రైలు చేరుకునేది మరియు వీరు వెళ్లేవారు. ఇలా కూడా అనుభవం చేశారు కదా! ఇక్కడ కూడా మానసిక స్థితిలో సూట్‌కేసు, బ్యాగ్ తయారుగా ఉండాలి. తండ్రి పిలిచారు, పిల్లలు హాజరైపోవాలి. దీనినే ఎవరెడీగా ఉన్నారని అంటాము. మంచిది.
సదా సాంగత్య రంగులో రంగరించబడి సదా గడిచిపోయిన దానికి బిందువు ఉంచి వర్తమానం మరియు భవిష్యత్తును శ్రేష్ఠంగా తయారు చేసుకుంటూ, సదా పరమాత్మతో మిలనం జరుపుకుంటూ, సదా పత్రి కర్మ స్మృతిలో ఉంటూ చేసేవారు అనగా పత్రి కర్మను స్మృతి చిహ్నంగా చేసుకునే వారికి, సదా సంతోషంలో నాట్యం చేస్తూ పాడుతూ సంగమయుగ సంతోషాలు జరుపుకునే వారికి, ఇటువంటి తండ్రి సమానంగా తండ్రి ప్రతి సంకల్పాన్ని గ్రహించేవారు, సదా బుద్ధి శ్రేష్ఠంగా మరియు స్పష్టంగా ఉంచుకునే హోలీ హ్యాపీ హంసలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
బాప్‌దాదా పిల్లలందరి ఉత్తరాలకు జవాబు ఇస్తూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు
నలువైపులా దేశ-విదేశాల పిల్లలందరి స్నేహంతో నిండిన, ఉల్లాస-ఉత్సాహాలతో నిండిన లెటర్లు, అక్కడక్కడ తమ ప్రతిజ్ఞలతో నిండిన పురుషార్థపు లెటర్లు మరియు సందేశాలన్నీ బాప్‌దాదాకు లభించాయి. బాప్‌దాదా హోలీ హంసలందరికీ సదా ‘తండ్రి ఎలా ఉంటే నేను అలాగే’ అనే స్మృతినిప్పించే విశేష స్లోగన్‌ను వరదాన రూపంలో జ్ఞాపకం ఇప్పిస్తున్నారు. ఏ కర్మ చేస్తున్నా, సంకల్పం చేస్తున్నా మొదట పరిశీలించుకోండి, తండ్రి సంకల్పమే నా సంకల్పము, తండ్రి కర్మయే నా కర్మగా ఉందా అని సెకండ్లో పరిశీలించుకొని సాకారంలోకి తీసుకురండి. ఎల్లప్పుడూ తండ్రి సమానంగా శక్తిశాలి ఆత్మగా అయ్యి సఫలతను అనుభవం చేసుకుంటారు. సఫలత జన్మ సిద్ధ అధికారమని సహజ ప్రాప్తిని అనుభవం చేస్తారు. నేను స్వయం సఫలతా నక్షత్రాన్ని. సఫలత నా నుండి దూరమవ్వజాలదు. సఫలత అనే మాల సదా మెడలో ఉంటుంది అనగా ప్రతి కర్మలో అనుభవం చేసుకుంటూ ఉంటారు. బాప్‌దాదా ఈరోజు హోలీ సంగఠనలో హోలీ హంసలైన మీ అందరినీ సన్ముఖంలో చూస్తున్నారు, హోలీ జరుపుకుంటున్నారు. అందరినీ స్నేహంతో చూస్తున్నారు. అందరి విశేషతల వెరైటీ సుగంధాన్ని తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరి విశేషతది ఎంత మధురమైన సుగంధము. తండ్రి ప్రతి విశేష ఆత్మను విశేషతలతో చూస్తూ వాహ్ నా సహజయోగి పిల్లలు, వాహ్ నా పదమాపదమ్ భాగ్యశాలి పిల్లలూ! అని పాటలు పాడ్తున్నారు. అందరూ తమ తమ విశేషతలు మరియు పేరు సహితంగా సన్ముఖంలో స్వయాన్ని అనుభవం చేస్తూ ప్రియస్మృతులు స్వీకరించండి అంతేకాక తండ్రి ఛత్రఛాయలో ఉంటూ మాయతో భయపడకండి. చిన్న విషయము పెద్ద విషయము కాదు. చిన్నదానిని పెద్దదిగా చేయకండి. పెద్దదానిని చిన్నదిగా చెయ్యండి. ఉన్నతంగా ఉన్నట్లయితే పెద్దది చిన్నదిగా అవుతుంది. క్రింద ఉన్నట్లయితే చిన్నది కూడా పెద్దదిగా అవుతుంది. అందువలన బాప్‌దాదా తోడు ఉంది, హస్తము ఉంది కావున భయపడకండి. బాగా ఎగరండి. ఎగిరేకళతో సెకండ్లో అన్నిటినీ దాటుకోండి. తండ్రి తోడు సదా సురక్షితంగా ఉంచుతుంది, భవిష్యత్తులో కూడా ఉంచుతుంది. మంచిది. అందరినీ అల్లారు ముద్దు పిల్లలూ, అపురూప పిల్లలూ! అంటూ బాప్‌దాదా హోలీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. (తర్వాత బాప్‌దాదాతో పిల్లలందరూ హోలీ జరుపుకున్నారు మరియు పిక్నిక్ చేశారు).
బాంధేలీలకు (బంధనంలో ఉన్నవారికి) ప్రియస్మృతులు అందిస్తూ:- బాంధేలీల స్మృతి అయితే సదా తండ్రి వద్దకు చేరుతుంది మరియు బాప్‌దాదా అందరు బాంధేలీలకు ఇదే చెబుతున్నారు - యోగం అనగా స్మృతి యొక్క లగ్నాన్ని అగ్ని రూపంగా మార్చండి. ఎప్పుడైతే లగ్నం అగ్ని రూపంగా మారుతుందో అప్పుడు అగ్నిలో సమస్తమూ భస్మమైపోతుంది. ఈ బంధనాలు కూడా లగ్నమనే అగ్నిలో సమాప్తమైపోతాయి మరియు స్వతంత్ర ఆత్మలుగా మారి ఏ సంకల్పం చేస్తారో దాని సిద్ధిని పొందుతారు. మీరు స్నేహీలు, మీ స్నేహ స్మృతి చేరుకుంటుంది. స్నేహానికి ప్రతిఫలంగా (రెస్పాండ్గా) స్నేహం లభిస్తుంది; కానీ ఇప్పుడు స్మృతిని శక్తివంతమైన అగ్ని రూపంగా మార్చండి. అప్పుడు సమ్ముఖంగా చేరుకునే ఆ రోజు తప్పకుండా వస్తుంది.
పార్టీలతో:- అందరి మస్తకంపై సదా భాగ్యపు తార మెరుస్తుంది కదా! సదా మెరుస్తుందా? అప్పుడప్పుడు మిణుకుమిణుకుమనడం అయితే జరగడం లేదు కదా? అఖండ జ్యోతి అయిన తండ్రితో కలిసి మీరు కూడా అఖండ జ్యోతి అనగా సదా వెలిగే తారలుగా మారిపోయారు. ఇలా అనుభవం చేసుకుంటున్నారా, ఎప్పుడైనా దీపాన్ని లేదా సితారను గాలి కదిలించడం అయితే జరగడం లేదు కదా? ఎక్కడైతే తండ్రి స్మృతి ఉంటుందో అది అవినాశిగా దేదీప్యమానంగా ప్రకాశించే తార; మిణుకుమిణుకుమనేది కాదు. లైట్ కూడా ఎప్పుడైతే మిణుకుమిణుకుమంటుందో అప్పుడు దానిని ఆర్పేస్తారు, అది ఎవరికీ నచ్చదు. కాబట్టి ఇది కూడా సదా దేదీప్యమానంగా ప్రకాశించే తార. సదా జ్ఞాన సూర్యుడైన తండ్రి నుండి వెలుగును తీసుకుని ఇతరులకు కూడా వెలుగునిచ్చేవారు. సేవ యొక్క ఉల్లాస-ఉత్సాహాలు సదా స్థిరంగా ఉంటాయి. మీరందరూ శ్రేష్ఠ ఆత్మలు, శ్రేష్ఠ తండ్రి యొక్క శ్రేష్ఠ ఆత్మలు.
స్మృతి శక్తి ద్వారా సఫలత సహజంగా ప్రాప్తిస్తుంది. ఎంతగా స్మృతి మరియు సేవ కలిసి ఉంటాయో, ఆ స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ సదాకాలపు సఫలత అనే ఆశీర్వాదాన్ని స్వతహాగా లభింపజేస్తుంది. అందుకే సదా శక్తివంతమైన స్మృతి స్వరూపపు వాతావరణం ఏర్పడటం వల్ల శక్తివంతమైన ఆత్మల ఆహ్వానం జరుగుతుంది మరియు సఫలత లభిస్తుంది. నిమిత్త మాత్రం లౌకిక కార్యం ఉంది, కానీ లగ్నం అంతా తండ్రి మరియు సేవలోనే ఉంది. లౌకికం కూడా సేవ కోసమే, మమకారంతో (లగావ్తో) చేయడం లేదు, డైరెక్షన్ ప్రకారం చేస్తున్నారు; అందుకే తండ్రి స్నేహ హస్తం ఇలాంటి పిల్లలకు తోడుగా ఉంది. సదా సంతోషంతో పాడండి, నాట్యం చేయండి – ఇదే సేవకు సాధనం. మీ సంతోషాన్ని చూసి ఇతరులు సంతోషపడితే అదే సేవ అయిపోతుంది. బాప్‌దాదా పిల్లలకు సదా చెబుతారు – ఎంతగా మహాదానులుగా మారుతారో అంతగా ఖజానా పెరుగుతూ వెళ్తుంది. మహాదానులుగా మారండి మరియు ఖజానాలను పెంచుకోండి. మహాదానులుగా మారి విరివిగా దానం చేయండి. ఈ ఇవ్వడమే పొందడం. మంచి వస్తువు లభించినప్పుడు దానిని ఇవ్వకుండా ఉండలేరు.
సదా మీ భాగ్యాన్ని చూసి హర్షిస్తూ ఉండండి. ఎంత గొప్ప భాగ్యం లభించింది! ఇంట్లో కూర్చుండగానే భగవంతుడు లభించడం కంటే గొప్ప భాగ్యం ఇంకేముంటుంది? ఇదే భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకుని హర్షిస్తూ ఉండండి. అప్పుడు దుఃఖం మరియు అశాంతి సదాకాలం కొరకు సమాప్తమైపోతాయి. సుఖ స్వరూపులుగా, శాంత స్వరూపులుగా మారిపోతారు. ఎవరి భాగ్యాన్నయితే స్వయం భగవంతుడే నిర్మిస్తారో వారు ఎంతటి శ్రేష్ఠులు! కాబట్టి సదా మీలో కొత్త ఉల్లాసం, కొత్త ఉత్సాహాన్ని అనుభవం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండండి. ఎందుకంటే సంగమయుగంలో ప్రతి రోజూ కొత్త ఉల్లాసం, కొత్త ఉత్సాహం ఉంటాయి.
‘ఎలాగోలా నడుస్తున్నాము’ అని కాదు. సదా కొత్త ఉల్లాసం, కొత్త ఉత్సాహమే సదా ముందుకు నడిపిస్తాయి. ప్రతి రోజూ కొత్తదే. సదా స్వయంలో లేదా సేవలో ఏదో ఒక నవీనత తప్పకుండా ఉండాలి. ఎంతగా మిమ్మల్ని మీరు ఉల్లాస-ఉత్సాహాలలో ఉంచుకుంటారో అంతగా కొత్త-కొత్త టచింగ్స్ కలుగుతూ ఉంటాయి. స్వయంగా వేరే ఇతర విషయాలలో బిజీగా ఉంటే కొత్త టచింగ్స్ కూడా కలగవు. మననం చేస్తే కొత్త ఉల్లాసం ఉంటుంది. అచ్ఛా!
*** ఓంశాంతి ***
