‘‘తండ్రి మరియు సేవపై స్నేహము - ఇదే బ్రాహ్మణ జీవితానికి ప్రాణదానము’’
ఈరోజు బాప్‌దాదా పిల్లలందరికీ పురుషార్థంలో ఎంత లగ్నముందో చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ తమ-తమ ధైర్యము-ఉల్లాసాలతో ముందుకు వెళ్తున్నారు. అందరిలో ధైర్యమూ ఉంది, ఉల్లాస-ఉత్సాహాలు కూడా ఉన్నాయి. మేము బాప్‌దాదాకు సమీప రత్నాలుగా, కంటి వెలుగుగా, హృదయ సింహాసనాధికారులుగా, హృదయాభిరామునికి ప్రియమైన వారిగా అయ్యి తీరాలన్న ఒకే శ్రేష్ఠ సంకల్పము కూడా ఉంది. సంపన్నంగా అవ్వాలన్న లక్ష్యము కూడా అందరిలో ఉంది. స్నేహానికి ప్రతిఫలంగా మేము సమానంగా, సంపన్నంగా అవ్వాలన్న ఒకే శబ్దము పిల్లలందరి హృదయంలో ఉంది. ఈ లక్ష్యమనుసారంగా ముందుకు వెళ్లడంలో సఫలురుగా కూడా అవుతున్నారు. మీరేమి కోరుకుంటున్నారని ఎవరిని అడిగినా సంపూర్ణంగా, సంపన్నంగా అవ్వాల్సిందేనని అందరి నుండి ఉల్లాసంతో కూడిన ఒకే సమాధానం వెలువడ్తుంది. బాప్‌దాదా అందరి ఉల్లాస-ఉత్సాహాలను చూసి, శ్రేష్ఠ లక్ష్యాలను చూసి హర్షిస్తున్నారు. ఒకే తండ్రి, ఒకే మతము, ఒకే లక్ష్యము మరియు ఒకే ఇంటిలోకి, ఒకే రాజ్యములోకి వెళ్తున్నారని, ఎగురుతున్నారని, ఉల్లాస-ఉత్సాహాలు మరియు ఐకమత్యము యొక్క అభినందనలు పిల్లలందరికీ తెలియజేస్తున్నారు. ఒకే తండ్రికి ఇంతమంది యోగ్యులైన మరియు యోగీ పిల్లలు. ప్రతి ఒక్కరూ ఒకరికన్నా ఒకరు విశేషతలతో విశేషంగా ముందుకు వెళ్తున్నారు. మొత్తం కల్పంలో ఇటువంటి తండ్రి ఉండరు, ఇటువంటి పిల్లలూ ఉండరు. ఏ ఒక్కరూ ఉల్లాస - ఉత్సాహాలలో తక్కువగా లేరు, విశేషతలతో సంపన్నంగా ఉన్నారు. ఒకే లగ్నములో మగ్నమై ఉన్నారు. ఇలా ఇంకెప్పుడూ జరగజాలదు. కావున బాప్‌దాదాకు కూడా ఇటువంటి పిల్లలంటే గర్వంగా ఉంది, పిల్లలకు కూడా తండ్రి అంటే గర్వంగా ఉంది. ఎక్కడ చూసినా తండ్రి మరియు సేవ అన్న ఒకే విశేష శబ్దము అందరి హృదయాల నుండి వెలువడుతుంది. తండ్రితో ఎంత స్నేహముందో అంత సేవపై కూడా స్నేహముంది. ఈ రెండు స్నేహాలు ప్రతి బ్రాహ్మణ జీవితానికి ప్రాణదానము. ఇందులోనే సదా బిజీగా ఉండే ఆధారము మాయాజీతులుగా చేస్తుంది.
బాప్‌దాదా వద్దకు పిల్లలందరూ ఉల్లాస-ఉత్సాహాలతో సేవ కొరకు చేసిన ప్లాన్లు చేరుకుంటూ ఉంటాయి. అన్ని ప్లాన్లు ఎంతో బాగున్నాయి. డ్రామానుసారంగా ఏ విధి ద్వారా అయితే వృద్ధిని పొందుతూ వచ్చారో అది ఆది నుండి ఇంతవరకు ఎంతో బాగుందనే అంటాము. సేవలో లేక బ్రాహ్మణులు విజయీ రత్నాలుగా అవ్వడంలో లేదా సఫలతను పొందడంలో ఇప్పటికి చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు స్వర్ణిమ జయంతి(గోల్డెన్ జూబ్లీ) వరకు చేరుకున్నారు. స్వర్ణిమ జయంతిని ఎందుకు జరుపుకుంటున్నారు? ప్రపంచం లెక్కతో జరుపుకుంటున్నారా లేక సమయానుసారంగా విశ్వానికి తీవ్ర వేగంతో సందేశాన్ని అందించాలనే ఉల్లాసంతో జరుపుకుంటున్నారా? నలువైపులా నిదురించి ఉన్న ఆత్మలను పెద్ద శబ్దము ద్వారా మేల్కొల్పే సాధనాన్ని తయారు చేస్తున్నారా? ఎక్కడ విన్నా, ఎక్కడ చూసినా నలువైపులా ఇప్పుడు స్వర్ణిమ యుగము(గోల్డెన్ ఏజ్), బంగారు సమయము, బంగారు యుగము రానున్నదనే సర్ణిమ సందేశము ద్వారా సంతోషకరమైన వార్త లభిస్తోందన్న శబ్దము మారుమ్రోగుతూ వినిపించాలి. ఈ గోల్డెన్ జూబ్లీ ద్వారా గోల్డెన్ ఏజ్ రానున్నదన్న విశేష సూచనను లేక సందేశాన్ని ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు బంగారు యుగము రానే వచ్చిందన్న అల నలువైపులా వ్యాపించాలి. ఎలాగైతే ఉదయం అంధకారము తర్వాత సూర్యోదయము జరుగుతుందో, సూర్యోదయమైన వెంటనే ఆ శుభ సందేశము నలువైపులా వ్యాపిస్తుందో, అందరూ అంధకారాన్ని మరిచి ప్రకాశంలోకి వచ్చేస్తారో అటువంటి దృశ్యము నలువైపులా కనిపించాలి. అలాగే విశ్వాత్మలందరూ దు:ఖము, అశాంతులను కలిగించే సమాచారాలను విని విని వినాశనం జరుగుతుందనే భయములో భయభీతులై నిరుత్సాహులుగా అయిపోయారో, నిరాశావాదులుగా అయిపోయారో అటువంటి విశ్వాత్మలకు ఈ గోల్డెన్ జూబ్లీ ద్వారా శుభ ఆశల సూర్యోదయమయ్యే అనుభూతిని చేయించండి. ఎలాగైతే వినాశపు అల ఉందో, అలా సత్యయుగ సృష్టి స్థాపన జరుగుతుందనే సంతోషకరమైన వార్తను నలువైపులా వ్యాపింపజేయండి. అందరి హృదయంలో ఈ ఆశా నక్షత్రాన్ని మెరిపింపజేయండి. ఏమవుతుంది? ఏమవుతుంది? అని భావించేందుకు బదులు ఇప్పుడిది జరుగుతుందని అర్థం చేసుకోవాలి. ఇటువంటి అలను వ్యాపింపజేయండి. ఈ స్వర్ణిమ జయంతి, స్వర్ణిమ యుగము వచ్చే సంతోషకరమైన వార్తను అందించే సాధనము. ఎలాగైతే పిల్లలైన మీకు దు:ఖధామాన్ని చూస్తున్నా సుఖధామము సదా స్వతహాగా స్మృతిలో ఉంటుందో, సుఖధామము యొక్క స్మృతి దు:ఖధామాన్ని మరిపింపజేస్తుందో అంతేకాక సుఖధామము లేక శాంతిధామములోకి వెళ్లే ఏర్పాట్లలో మైమరచిపోయి ఉంటారో, ఇప్పుడిక వెళ్ళాలి మళ్లీ సుఖధామములోకి రావాలి, ఇలా వెళ్లాలి ఇలా రావాలి అనే స్మృతి సమర్థంగా కూడా తయారు చేస్తుంది, చాలా సంతోషంగా సేవకు నిమిత్తంగా కూడా తయారు చేస్తోంది. ఇప్పుడు జనులు దు:ఖము కలిగించే వార్తలు చాలా విన్నారు. ఇప్పుడు ఈ సంతోషకరమైన వార్త ద్వారా దు:ఖధామము నుండి సుఖధామానికి వెళ్లేందుకు చాలా సంతోషంగా ఏర్పాట్లు చేసుకోండి. ఇలా వారిలో మేము కూడా వెళ్లాలన్న ఈ అల వ్యాపించాలి. నిరాశలో ఉన్నవారికి ఆశను కలిగించండి. నిరుత్సాహంలో ఉన్న ఆత్మలకు సంతోషకర వార్తను వినిపించండి. ఎలాంటి విశేష ప్లాను తయారుచేయాలంటే అది విశేషంగా వార్తాపత్రికలలో లేక శబ్దాన్ని వ్యాపింపజేసే సాధనాలేవైతే ఉన్నాయో వాటి ద్వారా ఒకే సమయంలో ఒకే సంతోషకరమైన వార్త లేక సందేశము నలువైపులా అందరికీ చేరుకోవాలి. ఎవరు ఎక్కడ నుండి వచ్చినా ఈ ఒకే విషయము అందరికీ తెలియాలి. అలాంటి విధానము ద్వారా నలువైపులా ఒకే శబ్దము వినిపించాలి. నవీనత కూడా ఉండాలి. మీ జ్ఞాన స్వరూపాన్ని ప్రత్యక్షం చేయాలి. ఇప్పుడు వీరు శాంతి స్వరూప ఆత్మలని శాంతికి సహజ మార్గమును తెలిపేవారని భావిస్తున్నారు. ఈ స్వరూపము ప్రత్యక్షమయింది ఇంకా అవుతోంది కూడా. కానీ జ్ఞాన సాగరుడైన తండ్రి ఇచ్చే జ్ఞానము ఇదే అనే శబ్దము ఇప్పుడు వ్యాపించాలి. ఇప్పుడు శాంతినిచ్చే స్థానము ఇది ఒక్కటేనని అంటున్నారో అదే విధంగా సత్యమైన జ్ఞానము ఇది ఒక్కటే అని అందరి నోటి నుండి వెలువడాలి. ఎలాగైతే శాంతిని మరియు స్నేహ శక్తిని అనుభవం చేస్తున్నారో అలా సత్యత నిరూపించబడాలి, తద్వారా మిగిలినవన్నీ ఏమిటో, వాటంతట అవే తెలిసిపోతాయి. చెప్పాల్సిన అవసరముండదు. ఇప్పుడు ఆ సత్యతా శక్తిని ఎలా ప్రత్యక్షం చేయాలో ఏ విధిని ధారణ చేయడం ద్వారా మీరు చెప్పవలసిన అవసరముండదో, ఆ సత్యమైన జ్ఞానము, పరమాత్ముని జ్ఞానము, శక్తిశాలి జ్ఞానమంటే ఇదేనని వారే స్వయంగా చెప్పాలి. దీని కొరకు విధిని తర్వాత వినిపిస్తాము. దీని గురించి మీరు కూడా ఆలోచించండి. ఆ విధిని మరొకసారి వినిపిస్తాము. స్నేహము మరియు శాంతి యొక్క ధరణి అయితే తయారయ్యింది కదా! ఇప్పుడు జ్ఞాన బీజాలు పడాలి. అప్పుడే జ్ఞాన బీజాల ఫలంగా స్వర్గ వారసత్వానికి అధికారులుగా అవుతారు.
బాప్‌దాదా, పిల్లలు ఏమేమి చర్చించుకుంటూ ఉంటారో అంతా చూస్తూ-వింటూ ఉంటారు. చాలా ప్రేమగా కూర్చుంటారు, ఆలోచిస్తారు, మథనము బాగా చేస్తున్నారు. వెన్న తినేందుకు మంథనమునైతే చేస్తున్నారు. ఇప్పుడు స్వర్ణిమ జయంతిని గురించి మంథనము చేస్తున్నారు. శక్తిశాలి వెన్నయే వెలువడ్తుంది. అందరి హృదయాలలో అల బాగుంది. ఈ హృదయపూర్వకమైన ఉల్లాసాల అల వాయుమండలాన్ని తయారు చేస్తుంది. వాయుమండలం తయారవుతూ అవుతూ ఆత్మలలో సమీపంగా రావాలనే ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడైతే వెళ్లాలి, చూడాలి అన్న ఈ అల వ్యాపిస్తూ ఉంది. ఇంతకుముందు ఇదేమిటో తెలియదని భావించేవారు. ఇప్పుడైతే ఇది బాగుంది, తెలుసుకోవాలని, చూడాలని భావిస్తున్నారు. ఇక చివర్లో ఇదే అది అని అంటారు. ఇప్పుడు మీ హృదయంలోని ఉల్లాస-ఉత్సాహాలు వారిలో కూడా ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు మీ హృదయం నాట్యం చేస్తుంది. దాని ద్వారా వారి నాట్యము మొదలవుతుంది. ఎలాగైతే ఇక్కడ ఎవరైనా చాలా మంచి నాట్యం చేస్తున్నప్పుడు దూరంగా కూర్చున్నవారి పాదాలు కూడా కదులుతూ ఉంటాయో, అలా ఉల్లాస-ఉత్సాహాల వాతావరణము అనేకమంది పాదాలను నడిపించడం మొదలు పెడ్తుంది. అచ్ఛా.
సదా స్వయాన్ని స్వర్ణిమ పప్రంచానికి అధికారిగా అనుభవం చేసేవారికి, సదా తమ స్వర్ణిమ యుగ స్థితిని తయారు చేసుకోవాలనే ఉల్లాస-ఉత్సాహాలలో ఉండేవారికి, సదా దయాహృదయులుగా అయ్యి సర్వ ఆత్మలకు స్వర్ణిమ యుగానికి మార్గాన్ని తెలియజేసే లగనములో ఉండేవారికి, సదా తండ్రి చెప్పిన ప్రతి బంగారు మహావాక్యాన్ని(గోల్డెన్ వర్షన్‌ను) జీవితంలో ధారణ చేసేవారికి, బాప్‌దాదా హృదయ సింహాసనాధికారులకు, సదా స్నేహములో ఇమిడిపోయి ఉన్న విజయీ రత్నాలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
ఆస్ట్రేలియా సోదర-సోదరీమణులతో అవ్యక్త బాప్‌దాదా మిలనము:-
మొత్తం గ్రూప్ అంతా సమీప ఆత్మలదే కదా? బాప్‌దాదా సదా పిల్లలను సమీప రత్నాల రూపంలో చూస్తారు. సమీపంగా ఉండటం అనగా తండ్రి ఎలా ఉన్నారో పిల్లలు కూడా అలాగే ఉండటం. ఇలా అనుభవం చేసుకుంటున్నారా? ప్రతి అడుగులోనూ ఫాలో ఫాదర్ చేసేవారే కదా! బాప్‌దాదా ఆస్ట్రేలియా నివాసులను సదా ముందు ఉంచుతారు; ఎందుకంటే స్వయంగా ఎంతగా ప్రాప్తి చేసుకుంటారో అంతగా ఇతరులకు ఇవ్వాలనే ఉల్లాస-ఉత్సాహాలు బాగున్నాయి. సేవ యొక్క ఉల్లాసం బాగుంది. ఎవరికైతే సేవ పట్ల ప్రేమ ఉంటుందో - వారికి తండ్రి పట్ల కూడా ప్రేమ ఉందని ఇది సిద్ధి చేస్తుంది. శక్తులు సేవా ఉల్లాసంలో ఉంటే, పాండవులు కూడా అలాగే ఉన్నారు. పాండవులు ఆజ్ఞాకారులుగా ఉంటే, శక్తులు కూడా అద్భుతాలు (కమాల్) చేసేవారుగా ఉన్నారు. శక్తులు ముందుకు సాగే సమయం ఇది; ఎందుకంటే అర్థకల్పం ప్రపంచం వారు శక్తులను కిందికి దించారు, అందుకే తండ్రి సంగమయుగంలో ఛాన్స్ ఇస్తున్నారు. మరి ఇప్పుడు శక్తులు ఏమి చేస్తారు? బాప్‌దాదాకు సేవ యొక్క ఆది సమయం గుర్తుకు వస్తోంది, శక్తుల సమూహం చాలా మంచి లవ్లీ రూపంగా నిలిచింది. ఇప్పటికీ సదా ముందుకు వచ్చి అవకాశం తీసుకునేవారిగా మారండి. పాండవులు స్వతహాగానే వారికి తోడుగా ఉన్నారు, ఎందుకంటే ఇద్దరూ లేకుండా ఏ కార్యమూ నడవదు. అచ్ఛా!
*** ఓంశాంతి ***
