"దీపమాల - సమీపత, సంపన్నత మరియు సంపూర్ణతలకు స్మృతి చిహ్నం"
ఈరోజు విశ్వ జ్యోతిని వెలిగించేవారు, వెలుగుతున్న దీపాల యజమాని తమ దీపమాలను చూస్తున్నారు. వాస్తవిక దీపమాల మీ అందరి స్మృతి చిహ్నం. కాబట్టి దీపాల యజమాని సత్యమైన దీపమాలను చూస్తున్నారు. ఈ దీపమాల విచిత్రమైన మాల. విచిత్రమైన యజమాని మరియు విచిత్రమైన మాల. ఆ ప్రజలైతే యజమానిని కూడా ఎరుగరు, మాలను కూడా ఎరుగరు. యజమానిని ఎరిగితే మాలను కూడా ఎరుగుతారు. దీపమాల మీ అందరిలోని మూడు విశేషతలకు స్మృతి చిహ్నం.
ఒకటి సమీపత, సమీపతలో స్నేహం ఇమిడి ఉంది. ఒకవేళ మాలలో స్నేహం, సమీపత అనే ఆధారం లేకపోతే మాల తయారవ్వలేదు. పూస పూసతో లేదా దీపం దీపంతో స్నేహంతో సమీపంగా వచ్చినప్పుడే దానిని మాల అని అంటాము. స్నేహం అనగా సమీపత. స్నేహానికి నిదర్శనం సమీపతే అవుతుంది. ఒకటి సమీపత. రెండవది సంపన్నత. దీపమాల సంపన్నతకు నిదర్శనము. కేవలం ఒక్క లక్ష్మి మాత్రమే ధన దేవత కాదు, మీరందరూ ధనంతో సంపన్నులైన దేవతలు. ధన దేవతలు కావడం వల్ల ధన్య దేవతలుగా కూడా కీర్తించబడతారు. కాబట్టి ధన దేవి, ధన్య దేవి అనేవి సంపన్నతకు నిదర్శనాలు. మూడవ విషయం సంపూర్ణత. సంపూర్ణత అనగా సదా వెలుగుతున్న దీపాలు. ఆరిపోయిన దీపాలను దీపమాల అనరు. వెలుగుతున్న దీపాలనే దీపమాల అంటారు. కాబట్టి సదా ఏకరసంగా వెలుగుతున్న దీపాలకు నిదర్శనం సంపూర్ణత. కనుక దీపమాల సమీపత, సంపన్నత మరియు సంపూర్ణత అనే విశేషతలకు స్మృతి చిహ్నం. అందుకే దీపమాలను పెద్ద రోజు అని అంటారు.
ఏ ఉత్సవం జరుపుకున్నా దానిని పెద్ద రోజు అని అంటారు. ఎందుకంటే విశ్వంలో పెద్దవారి రోజు ఇది. విశ్వంలో అందరికంటే పెద్దవారు ఎవరు? మీరందరూ మిమ్మల్ని మీరు అలాగే భావిస్తారు కాబట్టి, ఈ మూడు విశేషతలను స్వయంలో అనుభవం చేసుకుంటున్నారా? మీ అందరి స్మృతి చిహ్నాన్ని జరుపుకుంటున్నారు. స్మృతి స్వరూపులుగా మారేవారి స్మృతి చిహ్నమే నిర్మించబడుతుంది. అలాంటి స్మృతి స్వరూపులుగా అయ్యారా? లేక ఇప్పటికీ అవుతున్నాము అని అంటారా? ఏమంటారు? వెలిగారంటే అంధకారం సమాప్తమైపోయింది కదా. వెలిగారు అనగా అంధకారం సమాప్తం. వెలిగారా లేక మిణుకుమిణుకుమనే వారా? మిణుకుమిణుకుమనే దీపాలను ఎవరూ ఇష్టపడరు. ఇప్పుడే ఆరిపోయింది, ఇప్పుడే వెలిగింది. లైట్ కూడా ఏకరసంగా వెలగకపోతే ఇష్టపడరు, దానిని ఆపేస్తారు కదా. దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలు మరియు మిణుకుమిణుకుమనే దీపాలు – వేటిని ఇష్టపడతారు?
పెద్ద రోజును సెలవుగా ఎందుకు జరుపుకుంటారు? ఏ పెద్ద రోజులు వచ్చినా అందులో సెలవు జరుపుకుంటారు. మరియు సెలవులో సంతోషం ఉంటుంది. ప్రతి నెల క్యాలెండర్లో ముందుగా అందరూ ఏం చూస్తారు? పెద్ద రోజులు ఎన్ని ఉన్నాయి, సెలవులు ఎన్ని ఉన్నాయి అని. కాబట్టి పెద్ద రోజు అనగా సెలవు రోజు. శ్రమ నుండి సెలవు రోజు. శ్రమ నుండి సెలవు రోజు మరియు ప్రేమ యొక్క ఆనందంలో ఉండే రోజు. ఎప్పుడైతే బలహీనతలకు లేదా మాయకు సెలవు ఇచ్చేస్తారో, అప్పుడు శ్రమ సమాప్తమై ఆనందపు రోజులు మొదలవుతాయి. పెద్ద రోజు అనగా సెలవు రోజు. అందుకే స్మృతి చిహ్న రూపంలో కూడా సెలవు జరుపుకుంటారు. సెలవు రోజు ఏం చేస్తారు? ఆనందాన్ని జరుపుకుంటారు కదా. సెలవు రోజు విశ్రాంతి రోజు అవుతుంది. మీ విశ్రాంతి ఏమిటి? మీరు ఆరామ్ (విశ్రాంతి) చేస్తారా? లేక ఆ-రామ్ (రామ రమ్మని) అంటారా? ఆరామ్ కాదు, ఆ రామ్ ఆ రామ్ అని అంటారు కదా. దీనినే వాస్తవిక విశ్రాంతి అంటారు. దీపమాలలో ఇంకా ఏం చేస్తారు? శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుకుంటారు కదా. ఏ ఉత్సవం వచ్చినా, ఒకరినొకరు కలుసుకున్నప్పుడు అభినందనలు తెలుపుకుంటారు కదా! ఈ ఆచారం కూడా ఎందుకు నడిచింది? ఎవరికైనా శుభాకాంక్షలు తెలిపినప్పుడు ఎలా తెలుపుతారు? ఆలింగనం చేసుకుంటారు, చేతులు కూడా కలుపుతారు, మిఠాయి తినిపిస్తారు, సంతోషాన్ని జరుపుకుంటారు. తమ స్మృతిని మరియు ప్రేమను ఇవ్వడం, తీసుకోవడంలో కూడా శుభాకాంక్షలుగా భావిస్తారు. కాబట్టి సంగమంలో అనగా పెద్ద రోజులలో మీరందరూ సదాకాలం కొరకు మాయ వీడ్కోలు యొక్క అభినందనలు జరుపుకుంటారు. విజయులుగా అవుతారు. అందుకే విజయీ పిల్లలకు బాప్దాదా సదా శుభాకాంక్షలు తెలుపుతారు. ప్రియస్మృతులు ఇస్తారు అనగా శుభాకాంక్షలు తెలుపుతారు. బాప్దాదా రోజూ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతిరోజూ పిల్లలకు ఏ పదాన్ని అంటారు? ‘మధురాతి మధురమైన’ అని అంటూ నోరు తీపి చేసేస్తారు. బాప్దాదా రోజూ మధురాతి మధురమైన పదాలే అంటారు. తీపి యొక్క స్మృతి చిహ్నం ఉంది. నోరు తీపి చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి దీపమాలను జరుపుకునేవారా లేక మీ దీపమాల జరుపబడుతోందా? మీరు తండ్రితో కలిసి జరుపుకున్నారు, అందుకే విశ్వం మీ స్మృతి చిహ్నాన్ని జరుపుకుంటుంది. దీపమాల యొక్క అర్థం ఏమిటో అర్థమైందా - మారడమే జరుపుకోవడం.
దీపమాల కోసం వచ్చారా! బాప్దాదా కూడా దీపాల మాలను చూసి హర్షితులవుతున్నారు. కలుసుకోవడమే జరుపుకోవడం. అందరూ ఆనందాల ఇంటికి చేరుకున్నారు కదా. మధుబన్ అనగా ఆనందాల ఇల్లు. మనస్సులో ఆనందం ఉంటే ప్రతి కార్యంలోనూ ఆనందం ఉంటుంది. ఎలాంటి గందరగోళం ఉండదు. ఎందుకు-ఏమిటి అనేది గందరగోళం. ఓహో, ఆహా అనేది ఆనందం. ఎందుకు, ఏమిటి అనేవి ఇప్పుడు లేవు కదా. దసరా అయితే జరుపుకుని వచ్చారు కదా. ఇప్పుడు దీపావళి జరుపుకోవడానికి వచ్చారు. దసరా లేకుండా దీపావళి జరగదు. దసరాను సమాప్తం చేసి దీపావళి జరుపుకోవడానికి వచ్చారు. విజయులుగా అయిపోయారు కదా! అచ్ఛా.
పిల్లల వృద్ధి జరుగుతూ ఉంది మరియు జరుగుతూనే ఉంటుంది. వృద్ధికి తగినట్లుగా విధిని కూడా తయారు చేయాల్సి ఉంటుంది. అవ్యక్తమై ఇప్పటికి 17 సంవత్సరాల 17వ పాఠం పూర్తయింది. ఇక మిగిలిందేముంది? అయినప్పటికీ బాప్దాదా పిల్లల స్నేహం కారణంగా అవ్యక్తంగా ఉన్నప్పటికీ వ్యక్తంలో టెంపరరీ రథంలో 17 సంవత్సరాలు సవారీ చేశారు. 17 సంవత్సరాలు తక్కువేమీ కాదు. సమయం మరియు శరీరానికి పరిమితి కూడా ఉంటుంది. పేరుకు అవ్యక్తం అంటారు కానీ కలవడానికి మాత్రం వ్యక్తంలో కావాలనుకుంటారు. ఇది ఎందుకు? సహజంగా అనిపిస్తుంది కాబట్టా? అయినప్పటికీ బాప్దాదా కొత్త-కొత్త పిల్లల ఫిర్యాదులను తీర్చడానికి వస్తూనే ఉంటారు. ఇప్పుడు 18వ తేదీన మళ్ళీ 18వ సంవత్సరం ప్రారంభమవుతుంది. 18వ అధ్యాయం ఏమిటి? అందరూ సిద్ధంగా ఉన్నారు కదా. సేవ సమాప్తం చేసుకున్నారా? ఇప్పుడు తండ్రి సమానంగా అవ్యక్త రూపంగా మారిపోండి. అవ్యక్త రూపంతో సేవ చేసారా? ఇప్పుడైతే అవ్యక్త రూపం కూడా వ్యక్తంలోకి రావాల్సి వస్తోంది. అవ్యక్త రూపధారులై నష్టోమోహా స్మృతిర్లబ్ధ అనగా స్మృతి స్వరూపులుగా మారాలి. ఇప్పుడు ఈ సేవ మిగిలి ఉంది. పాదయాత్ర సేవ అయితే చేశారు, ఇప్పుడు ఆత్మిక యాత్ర అనుభవం చేయించాలి. ప్రస్తుతం ఈ యాత్ర యొక్క ఆవశ్యకత ఉంది. అందుకే ఇప్పుడు బాప్దాదా కూడా అవ్యక్త విధి ప్రకారం పిల్లలతో మిలనము జరుపుకుంటారు. వృద్ధికి తగినట్లుగా విధిని పరివర్తన చేసి తీరాల్సిందే. పిల్లల అధికారం - ‘మురళి’. మురళి ద్వారా కలుసుకోవడం మరియు అవ్యక్త దృష్టి ద్వారా కలుసుకోవడం - ఈ రెండూ వరదానపు అనుభూతిని కలిగించగలవు. అందుకే అవ్యక్త స్థితిలో స్థితులై ఇప్పుడు దృష్టి ద్వారా వరదానాలను అనుభవం చేసుకోండి. లేకపోతే వినాలనే జిజ్ఞాస వల్ల దృష్టి మహత్వాన్ని తక్కువగా అనుభవం చేసుకుంటారు.
రెండు గాయనాలు ఉన్నాయి - దృష్టితో తరింపజేయడం మరియు మురళి యొక్క ఇంద్రజాలం! అందుకే ఇప్పుడు దృష్టి ద్వారా వరదానం పొందే అధికారులుగా మారండి. ఎంతగా స్వయం అవ్యక్త స్థితిలో స్థితులవుతారో అంతగా అవ్యక్త దృష్టి భాషను క్యాచ్ చేయగలరు. ఈ దృష్టి వరదానం సదాకాలపు పరివర్తన యొక్క ‘వరదానం’. వాణి యొక్క వరదానం ఒక్కోసారి గుర్తుంటుంది, ఒక్కోసారి మర్చిపోతుంది. కానీ అవ్యక్త రూపంగా మారి అవ్యక్త దృష్టి ద్వారా పొందిన వరదానం సదా స్మృతి స్వరూపులుగా, సమర్థ స్వరూపులుగా చేస్తుంది. ఇప్పుడు దృష్టి నుండి దృష్టి భాషను తెలుసుకోండి. స్థాపనలో ఏం జరిగింది? దృష్టి భాషతో, దృష్టి ఇంద్రజాలంతో స్థాపనా కార్యం ప్రారంభమైంది. అర్థమైందా, అచ్ఛా, 18వ అధ్యాయపు సేవ ఏమిటో మళ్ళీ వినిపిస్తాము.
పిల్లలు ఇంటి అలంకారం. మధుబన్ అలంకారమైన వారు మధుబన్కు చేరుకున్నారు. జరుపుకోండి, పాడండి, నాట్యం చేయండి, కానీ అవ్యక్త రూపంలో. అతీతమైన మరియు ప్రియమైన రూపంలో. ప్రపంచం చేసే విధంగా ఉండే అతీతత్వం కాదు. ఆడుకోండి, తినండి, నవ్వండి, నాట్యం చేయండి కానీ ‘అతీతంగా మరియు ప్రియంగా’ ఉండండి. బాప్దాదా అన్ని సేవాకేంద్రాల, దేశ-విదేశాల పిల్లలందరినీ తమ మెడలోని విజయీ మాలగా, దీపమాలగా చూస్తూ హర్షితులవుతున్నారు మరియు ప్రతి ఒక్క విజయీ వెలుగుతున్న దీపానికి సంగమయుగం మరియు కొత్త ప్రపంచపు సర్వ జన్మల శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సదా సమీపంగా ఉండేవారు, సదా సంపన్నంగా ఉండేవారు, సదా సంపూర్ణంగా ఉండేవారు - ఈ మూడు విశేషతలతో నిండిన పిల్లలకు త్రిమూర్తి సంబంధంతో సదాకాలపు శుభాకాంక్షలు అనండి, అభినందనలు అనండి, గ్రీటింగ్స్ అనండి - సదా ఉన్నాయి మరియు సదా ఉంటాయి.
బాప్దాదా కూడా ధనవంతులైన పిల్లలకు ‘‘ధన్యులు, ధన్యులు’’ అనే శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సదా మధురమైనవారు, మధురంగా తీర్చిదిద్దేవారు. మధురమైన మాటలు, మధురమైన భావనతో అందరి మనస్సు మరియు నోరు తీపి చేసేవారు – ఇలాంటి సదా మధుర భవ! బాప్దాదా పిల్లలందరి దేదీప్యమానంగా వెలుగుతున్న జ్యోతిని చూస్తున్నారు. దూరంగా ఉన్నప్పటికీ అనేక మంది పిల్లలు దేదీప్యమానంగా వెలుగుతున్న జ్యోతి సమూహ రూపంలో బాప్దాదా ఎదురుగా ఇప్పటికీ ఉన్నారు. పిల్లలందరి శుభాకాంక్షల సంకల్పాలు, మాటలు, ఉత్తరాలు మరియు కార్డులు బాప్దాదా ఎదురుగా ఉన్నాయి. దేశ-విదేశాల పిల్లలందరి దీపమాల శుభాకాంక్షలకు ప్రతిఫలంగా అక్షోహిణి సార్లు బాప్దాదా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పేర్లు తీసుకోవడం లేదు కానీ పేర్లు బాప్దాదా ఎదురుగా ఉన్నాయి. ప్రతి ఒక్కరి పేర్ల మాల కూడా బాప్దాదా మెడలో కూర్చబడి ఉంది. వేరువేరు కార్డులు వతనపు గోడకు అతికించబడి ఉన్నాయి. కానీ హృదయపు నినాదం దిలారామ్ వరకు చేరిపోయింది. దూరంగా ఉండి కూడా సమీపమైన పిల్లలకు మరియు సమ్ముఖంలోకి వచ్చే పిల్లలకు - ఇద్దరికీ స్నేహ సంపన్నత మరియు సంపూర్ణత నిండిన ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో:- మాలలోని విజయీ రత్నాలు సదా విశేషంగా కీర్తించబడతారు మరియు పూజించబడతారు. ఇంతటి విశేష పూజ్య ఆత్మలు మీరు. ఇలాంటి ఏదైనా రోజు వచ్చినప్పుడు ఎంతగా అవ్యక్త స్థితిలో స్థితులవుతారో అంతగా భక్త ఆత్మల ఆహ్వానం అనుభవమవుతుంది! భక్తుల శుభ భావనలు లేదా కోరికలను తండ్రి ద్వారా పూర్తి చేయించడానికి విశేష వైబ్రేషన్స్ రావాలి. చివరకు భక్త ఆత్మలందరూ తండ్రితో పాటు తమ పూజ్య ఆత్మలను ప్రత్యక్ష రూపంలో చూస్తారు. వారే మా ఇష్ట దేవతలని వర్ణిస్తారు. ఎవరిని ఇష్ట దేవతలుగా చేసుకుంటారు? ఇష్ట దేవత అని ఎందుకు అంటారు? ఎందుకంటే ఆ ఒక్కరి పైనే – ఒకే బలం, ఒకే నమ్మకం ఉంటుంది. ఆ ఒక్కరిలోనే పరిపక్వంగా ఉంటారు. వారికి ఆ ఒక్కరే సర్వస్వంగా ఉంటారు; అలా ఎవరైతే ఒక్క తండ్రి పట్ల ఇష్ట భావన కలవారిగా ఉన్నారో, ఇష్ట స్థితి కలవారిగా ఉన్నారో వారే ‘ఇష్ట దేవతలు’గా మారతారు. దీనినే – ఒకే బలం, ఒకే నమ్మకం అంటాము! ఇష్ట దేవతకు నిదర్శనం ఏమిటంటే – ఒకే బలం, ఒకే నమ్మకపు స్థితిలో, నిశ్చయంలో, సేవలో పరిపక్వంగా ఉండటం. అందుకే ఇష్ట దేవతను నమ్మే భక్తులు కూడా ఏకాగ్రతతో ఉంటారు, అటు ఇటు తిరగరు, ఒక్కరిలోనే అచలంగా ఉంటారు. తండ్రి ప్రత్యక్షమవుతారు కానీ తండ్రితో పాటు ఇష్ట దేవతలు, ఇష్ట దేవీలు అందరూ ప్రత్యక్షమవుతారు. శ్రేష్ఠ ఆత్మలమైన మాకు ఆహ్వానం జరుగుతుందనే నషా కూడా ఉండాలి. మరియు మేమే తండ్రి ద్వారా వారికి ప్రతిఫలం ఇప్పించేవారము అని నషా ఉండాలి. ఇప్పించేది తండ్రి ద్వారానే అయినప్పటికీ నిమిత్తమవుతారు – అందుకే వారు ఇష్ట దేవతల రూపంలో పూజించబడతారు. విశేష దినాలలో విశేష భక్తులు ఉపవాసాలు ఉన్నట్లుగా, సాధన చేసినట్లుగా, ఏకాగ్రతపై విశేష అటెన్షన్ ఉంచినట్లుగా, సేవాధారి పిల్లలకు కూడా అలాంటి వైబ్రేషన్స్ రావాలి. మేమే ఆ ఆత్మలము అనే అనుభవం కలగాలి. బాప్దాదా అయితే ఉండనే ఉన్నారు కానీ తోడుగా అనన్య పిల్లలు కూడా ఉన్నారు. ప్రాక్టికల్లో ఈ అనుభూతి రావాలి. ఆశీర్వాదం, ఆశీర్వాదం అనే ఏ ఆచారమైతే నడిచిందో, అది ఎలా అనుభవమవుతుందంటే – సంపన్నంగా ఉండటం వల్ల బ్రహ్మా బాబా ద్వారా నడుస్తూ తిరుగుతూ అందరికీ స్వతహాగా ఆశీర్వాద అనుభవం కలిగేది. అలాగే మీరు కూడా నడుస్తూ తిరుగుతూ తండ్రి ద్వారా ఏదో ఒక ప్రాప్తి చేయిస్తున్నట్లుగా అనుభవం చేసుకోండి. ప్రాప్తే ఆశీర్వాదం. నోటితో ఇంకేమీ అనరు కానీ ప్రాప్తి అనుభవం చేయించడం వల్ల అందరి నోటి నుండి – ‘‘వీరే, ఇక్కడే ఉన్నారు’’ అనే గీతాలు వెలువడతాయి. ఆ రోజులు కూడా రాబోతున్నాయి. ఇప్పుడు సాక్షాత్కార మూర్తులుగా మారాలి. ఇప్పుడు సేవ సాక్షాత్కార మూర్తుల ద్వారా జరగాలి. ప్రారంభంలో నడుస్తూ తిరుగుతూ సాక్షాత్కార మూర్తులను చూసినట్లుగానే. బ్రహ్మాను చూసేవారు కాదు, శ్రీకృష్ణుడిని చూసేవారు. శ్రీకృష్ణుడిపై మోహితులయ్యారు కదా! బ్రహ్మపై అయితే కాలేదు. బ్రహ్మ అదృశ్యమై శ్రీకృష్ణుడు కనిపించేవారు, అప్పుడే కదా పరుగెత్తుకుంటూ వచ్చారు! శ్రీకృష్ణుడు పరిగెత్తించాడు అనేది కరెక్టే. ఎందుకంటే బ్రహ్మను బ్రహ్మగా చూసేవారు కాదు, శ్రీకృష్ణుడిగా చూసేవారు. కాబట్టి ఇది సాక్షాత్కార స్వరూపం అయింది కదా! అదే అంత మస్తుగా తయారుచేసింది, పరుగెత్తించింది. సాక్షాత్కారమే సమస్తాన్ని వదిలింపజేసింది. భక్తి సాక్షాత్కారం కేవలం చూడటానికి మాత్రమే పరిమితమవుతుంది. కానీ జ్ఞాన సాక్షాత్కారం చూడటంతో పాటు పొందడం – ఇదే తేడా. కేవలం చూడలేదు, పొందారు. శ్రీకృష్ణుడు మావాడు, మేము గోపికలము – ఇదే నషా స్థాపన చేయించింది. మేమే వారము, మా చిత్రాలే ఉన్నాయి. కాబట్టి అలాగే సాక్షాత్కారం ద్వారా ఇప్పుడు కూడా సేవ జరగాలి. వినడం ద్వారా ప్రభావం అయితే పడుతుంది కానీ పరివర్తన రాదు. మంచిది-మంచిది అంటారు కానీ మంచివారిగా మారరు. ఎప్పుడైతే వారికి సాక్షాత్కారంలో ప్రాప్తి కలుగుతుందో అప్పుడు మారకుండా ఉండలేరు, మీరందరూ మారిపోయినట్లుగా! కాబట్టి ఇప్పుడు నడుస్తూ తిరుగుతూ ఫరిశ్తా స్వరూపపు సాక్షాత్కారం చేయించండి. కేవలం ఉపన్యాసాలు ఇచ్చేవారు మాత్రమే కాదు కానీ సాక్షాత్కార స్వరూపంగా కనిపించాలి. ఉపన్యాసాలు చేసేవారైతే చాలా మంది ఉన్నారు కానీ మీరు అనుభూతి (భాసన) కలిగించేవారు. అలా మారేవారే ముందు నంబర్ తీసుకుంటారు. కేవలం క్లాస్ చేయించడం వల్ల అనుభూతి రాదు; క్లాస్ వింటున్నప్పటికీ ప్రతి ఒక్కరికీ అనుభూతి లభించాలనే కోరిక ఉంటుంది, కాబట్టి ఇప్పుడు ఉపన్యాసాన్ని మార్చి అనుభూతిని ఇవ్వండి. అప్పుడే వీరు అల్లాహ్ ప్రజలు అని అర్థం చేసుకుంటారు. అల్లాహ్ ప్రజలు అనగా అతీతులు. ఇప్పుడైతే – ఇది కూడా మంచిదే, అది కూడా మంచిదే అని అనేస్తున్నారు, అన్నింటినీ కలుపుతూ ఉంటారు కానీ ఇప్పుడు అనుభూతి స్వరూపులుగా మారిపోండి. ప్రాప్తి అనుభవం చేయించండి. అచ్ఛా!
*** ఓంశాంతి ***
