Brahma Kumaris
Brahma KumarisMurli
  • Home
  • Murli Search
  • Murli Topics
  • Murli Chintan
  • AI Murli Chintan (ChatGPT)
Languages
  • EEnglish
  • हहिंदी
  • ગગુજરાતી
  • తతెలుగు
Library
  • Overview
    • Favorites
    • Notes & Highlights
    • Collections
    • Tracker
  • Settings
  • BKOne

19 December 1985 | తెలుగు19 December 1985 | తెలుగు · ‘‘ఫాలో ఫాదర్’’

‘‘ఫాలో ఫాదర్’’

ఈరోజు స్నేహీ పిల్లలందరి స్నేహానికి బదులు ఇచ్చేందుకు బాప్‌దాదా మిలనం జరుపుకునేందుకు వచ్చారు. విదేహీ అయిన బాప్‌దాదా దేహాన్ని ఆధారంగా తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకు? పిల్లలను కూడా విదేహులుగా చేసేందుకు. ఎలాగైతే తండ్రి విదేహీగా ఉన్నారో, దేహంలోకి వచ్చినా విదేహీ స్వరూపంలో విదేహీ స్థితిని అనుభవం చేయిస్తారో, అలా మీరంతా జీవితంలో ఉంటూ, దేహంలో ఉంటూ విదేహీ ఆత్మిక స్థితిలో స్థితియై ఈ దేహం ద్వారా కరావన్‌హార్ (చేయించేవారిగా) అయి కర్మలు చేయించండి. ఈ దేహము కరనహార్ (చేసేది), దేహీ అయిన మీరు కరావన్‌హార్ (చేయించేవారు). ఈ స్థితినే విదేహీ స్థితి అని అంటాము. దీనినే ఫాలో ఫాదర్ అని అంటాము. సదా తండ్రిని ఫాలో చేసేందుకు మీ బుద్ధిని రెండు స్థితులలో స్థితి చేసుకోండి. తండ్రిని ఫాలో చేసేందుకు స్థితి - సదా అశరీరి భవ, విదేహీ భవ, నిరాకారీ భవ. దాదా అనగా బ్రహ్మా బాబాను ఫాలో చేసేందుకు సదా అవ్యక్త స్థితి భవ, ఫరిశ్తా స్వరూప భవ, ఆకారీ స్థితి భవ. ఈ రెండు స్థితులలో స్థితులై ఉండడమంటే ఫాలోఫాదర్ చేయడం. దీని కంటే క్రిందిది వ్యక్త భావము, దేహ భానము, వ్యక్తి భావము, ఇందులో క్రిందికి రాకండి. వ్యక్తి భావము లేక వ్యక్త భావము క్రిందికి తీసుకొచ్చేందుకు ఆధారము, అందుకే అన్నిటికీ అతీతంగా సదా ఈ రెండు స్థితులలో ఉండండి. మూడవ దాని కొరకు బ్రాహ్మణ జన్మ జరుగుతూనే బాప్‌దాదా శిక్షణ లభించింది - సంకల్పంలో లేక స్వప్నంలో కూడా ఈ క్రింద పడే స్థితిలోకి వెళ్లకూడదు, ఇది పరాయి స్థితి. ఎలాగైతే ఎవరైనా ఆజ్ఞ లేకుండా పరదేశానికి వెళ్తే ఏమవుతుంది? బాప్‌దాదా కూడా ఈ ఆజ్ఞ అనే గీత గీశారు, ఈ గీతను దాటి బయటకు వెళ్లకూడదు. ఒకవేళ ఆజ్ఞను ఉల్లంఘించినట్లయితే ఆందోళన చెందుతారు, పశ్చాత్తాప పడ్తారు కూడా, అందుకే సదా ఆత్మగౌరవంతో ఉండేందుకు సదా ప్రాప్తి స్వరూప స్థితిలో స్థితియై ఉండేందుకు సహజ సాధనము - “ఫాలో ఫాదర్”. ఫాలో చేయడం అయితే సహజమవుతుంది కదా! మీరు జీవితంలో బాల్యము నుండి ఫాలో చేయడంలో అనుభవీగా ఉన్నారు. బాల్యములో కూడా తండ్రి పిల్లలకు వేలు పట్టుకొని నడవడంలో, కూర్చుని లేవడంలో ఫాలో చేయిస్తారు. మళ్లీ గృహస్థలుగా అయినప్పుడు కూడా పతి, పత్నికి ఒకరి వెనుక ఒకరు అనుసరిస్తూ నడవడాన్ని నేర్పిస్తారు. ఇంకా ముందుకు వెళ్తే గురువులను ఆశ్రయిస్తారు, అప్పుడు గురువుకు అనుచరులుగా అవుతారు అనగా ఫాలో చేసేవారిగా అవుతారు. లౌకిక జీవితంలో కూడా ఆది మరియు అంతిమములో ఫాలో చేయడం జరుగుతుంది. అలౌకిక, పారలౌకిక తండ్రి కూడా ఒకే సహజ విషయాన్ని సాధనంగా తెలుపుతారు - ఏం చేయాలి? ఎలా చేయాలి? ఇలా చేయాలా లేక అలా చేయాలా? - ఈ విస్తారము నుండి విడిపిస్తారు. అన్ని ప్రశ్నలకు సమాధానము - ఒకే ఒక్క మాట - “ఫాలో ఫాదర్”.

సాకార రూపంలో కూడా నిమిత్తంగా అయి కర్మలు నేర్పించేందుకు, పూర్తి 84 జన్మలు తీసుకునే బ్రహ్మా యొక్క ఆత్మ నిమిత్తంగా అయ్యారు. కర్మలో, కర్మబంధనాల నుండి ముక్తులవ్వడంలో, కర్మ సంబంధాన్ని నిభాయించడంలో, దేహంలో ఉంటూ విదేహీ స్థితిలో స్థితియై ఉండడంలో, శారీరిక బంధనాలను ముక్తి చేయడంలో, మనస్సు యొక్క తపనలో నిమగ్నమై ఉండే స్థితిలో, ధనములో ఒక్కొక్క పైసాను సఫలం చేయడంలో, సాకార బ్రహ్మా సాకార జీవితంలో నిమిత్తంగా అయ్యారు. కర్మ బంధన ఆత్మ కర్మాతీతంగా అయ్యే ఉదాహరణగా అయ్యారు. కనుక సాకార జీవితాన్ని ఫాలో చేయడం సహజమే కదా! ఈ పాఠమే ఫాలోఫాదర్ చేయడం. శరీరము గురించి గానీ, సంబంధాల గురించి గానీ, ధనము గురించి గానీ ప్రశ్నలు ఉండవచ్చు. అన్ని ప్రశ్నలకు జవాబు బ్రహ్మా బాబా జీవితమే. ఉదాహరణకు, ఈ రోజుల్లో సైన్సువారు ప్రతి ప్రశ్నకు జవాబు కోసం కంప్యూటర్‌ను అడుగుతున్నారు. ఎందుకంటే మనిషి బుద్ధి కంటే ఈ కంప్యూటర్ ఆక్యురేట్ అని భావిస్తారు. తయారుచేసేవారి కంటే తయారైన వస్తువే ఆక్యురేట్ అని భావిస్తున్నారు. కానీ సైలెన్స్ వారు అయిన మీకు బ్రహ్మా బాబా జీవితమే ఖచ్చితమైన కంప్యూటర్. అందువలన ఏమిటి? ఎందుకు? అనేందుకు బదులుగా వారి జీవితమనే కంప్యూటరులో చూడండి. ఎలా? ఏమిటి? అనే ప్రశ్న ‘ఇలా’ లోకి పరివర్తన అయిపోతుంది. ప్రశ్నచిత్తులకు బదులుగా ప్రసన్నచిత్తులుగా అవుతారు. ప్రశ్నచిత్తులు అలజడి బుద్ధి గలవారు, అందుకే ప్రశ్న చిహ్నము కూడా వంకరగా ఉంటుంది. ప్రశ్న వ్రాస్తే వంకర టింకరగా ఉంటుంది కదా. ప్రసన్నచిత్తులంటే బిందువు. మరి బిందువులో ఏదైనా వంకరతనముందా? నలువైపులా ఒకే విధంగా ఉంటుంది. బిందువును ఎటువైపు నుండి చూసినా ఒకే రకంగా చూస్తారు మరియు ఒకే విధంగా చూస్తారు. నేరుగా చూసినా, తలక్రిందులుగా చూసినా ఒకే విధంగా ఉంటుంది. ప్రసన్నచిత్తులనగా ఏకరస స్థితిలో ఒక్క తండ్రినే అనుసరించేవారు. అయినా సారమేం లభించింది? సాకార రూపమైన బ్రహ్మా తండ్రిని ఫాలో చేయండి లేక ఆకార రూప బ్రహ్మా తండ్రిని ఫాలో చేయండి. బ్రహ్మా తండ్రినైనా ఫాలో చేయండి లేక శివబాబానైనా ఫాలో చేయండి కానీ మాట అయితే అదే - ‘ఫాలో ఫాదర్’. అందుకే బ్రహ్మా మహిమ - ‘బ్రహ్మా వందే జగద్గురుం’ అని అంటారు. ఎందుకంటే ఫాలో చేయడంలో సాకార రూపంలో, సాకార జగత్తు కొరకు బ్రహ్మా నిమిత్తంగా అయ్యారు. మీరందరూ స్వయాన్ని శివకుమారుడు, శివకుమారి అని పిలుచుకోరు. బ్రహ్మాకుమార్-బ్రహ్మాకుమారి అని పిలువబడ్తారు. సాకార రచనకు నిమిత్తంగా, సాకార శ్రేష్ఠ జీవితానికి స్యాంపుల్‌గా బ్రహ్మాయే అవుతారు. అందుకే సద్గురువు అని శివబాబాను అంటారు. నేర్పించేవారిని కూడా గురువని అంటారు. జగత్తు ముందు నేర్పించేందుకు బ్రహ్మాయే నిమిత్తంగా అవుతారు. కావున ప్రతి కర్మలో ఫాలో చెయ్యాలి. ఈ లెక్కన బ్రహ్మాను జగద్గురువని అంటారు, అందుకే జగత్తు బ్రహ్మాకు వందనం చేస్తుంది. జగత్ పిత అనే టైటిల్ కూడా బ్రహ్మాకు ఉంది. విష్ణువును లేక శంకరుడిని ప్రజాపిత అని అనరు. వారిని యజమాని పరంగా పతి అని అంటారు కానీ వాస్తవానికి వారు తండ్రి. జగత్తుకు ఎంత ప్రియమైన వారో అంత జగత్తుకు అతీతంగా అయి ఇప్పుడు అవ్యక్త రూపంలో ‘ఫాలో అవ్యక్త స్థితి భవ’ అనే పాఠాన్ని చదివిస్తున్నారు. అర్థమయిందా? ఏ ఆత్మకు కూడా ఇటువంటి అతీతత్వము ఉండదు. ఈ అతీత బ్రహ్మా కథను తర్వాత వినిపిస్తాము.

ఈరోజు శరీరాన్ని కూడా సంభాళించాలి. అద్దెకు తీసుకున్నప్పుడు శరీరాన్ని, స్థానాన్ని శక్తి ప్రమాణంగా కార్యములో వినియోగించేవారే మంచి యజమాని. అయినా బాప్‌దాదా, ఇరువురి శక్తిశాలి పాత్రను రథాన్ని నడిపించేందుకు నిమిత్తంగా అయ్యారు. ఇది కూడా డ్రామాలో విశేష వరదానానికి ఆధారమయింది. చాలామంది పిల్లలకు ఈ రథమే నిమిత్తంగా ఎందుకు అయ్యింది అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. వేరేవారికే కాదు, ఈ ప్రశ్న గుల్జార్ దాదీకి కూడా వస్తుంది. కానీ ఎలాగైతే బ్రహ్మాకు కూడా వారి జన్మల గురించి తెలియదో అలా వీరు కూడా తన వరదానాన్ని మర్చిపోయారు. వీరికి ఈ విశేష వరదానం సాకార బ్రహ్మాకు ఆదిలో సాక్షాత్కారమైన సమయంలో లభించింది. బ్రహ్మా బాబాతో పాటు ఆది సమయంలో ఏకాంతంలో తపస్వీ స్థానంలో ఈ ఆత్మ యొక్క విశేషమైన సాక్షాత్కార పాత్రను చూసి, బ్రహ్మా బాబా వీరి సరళ స్వభావాన్ని, అమాయక జీవితం యొక్క విశేషతను చూసి – “ఎలాగైతే ఇప్పుడు ఈ పాత్రలో ఆదిలో బ్రహ్మా, శివబాబాకు సాథీగా అయ్యారు మరియు తోడుగా కూడా ఉన్నారో అలా ముందు-ముందు తండ్రికి సాథీగా అయ్యే, సమానంగా అయ్యే కర్తవ్యాన్ని కూడా సంభాళిస్తారు, బ్రహ్మా బాబా సమానంగా సేవలో పాత్రను అభినయిస్తారు” అనే వరదానమునిచ్చారు. కనుక అదే వరదానము భాగ్యరేఖగా అయింది. బ్రహ్మా బాబా సమానంగా రథంగా అయ్యే పాత్ర చేయడం నిశ్చయింపబడింది. అయినా బాప్‌దాదా ఈ పాత్రను అభినయించేందుకు ఈ బిడ్డకు కూడా అభినందనలు తెలుపుతున్నారు. ఇంత సమయం ఇంత శక్తిని అడ్జస్ట్ చేసుకోవడం, అడ్జస్ట్ చేసుకునే విశేషత అనే లిఫ్ట్ కారణంగా అదనపు గిఫ్ట్ ఉంది. అయినా బాప్‌దాదాకు శరీర అవసరాలన్నీ చూడాల్సి వస్తుంది. వాయిద్యం పాతది, నడిపించేవారు శక్తిశాలిగా ఉన్నారు. అయినా హాజీ హాజీ అనే పాఠం కారణంగా బాగా నడుస్తుంది. కానీ బాప్‌దాదా కూడా విధి మరియు యుక్తి పూర్వకంగానే కార్యము నడిపిస్తున్నారు. కలుసుకునే ప్రతిజ్ఞ అయితే ఉంది కానీ విధి, సమయమనుసారంగా పరివర్తన అవుతూ ఉంటుంది. ఇప్పుడు 18వ సంవత్సరంలో అన్నీ వినిపిస్తాము. 17 అయితే పూర్తి చేయాల్సిందే. అచ్ఛా.

ఫాలో ఫాదర్ చేసే సహజ పురుషార్థీ పిల్లలందరికీ, సదా ప్రసన్న చిత్తులుగా ఉండే విశేష ఆత్మలకు, సదా చేయించేవారిగా అయ్యి దేహంతో కర్మలు చేయించే మాస్టర్ రచయితలైన పిల్లలకు - ఇటువంటి బాప్‌దాదా స్నేహానికి తమ జీవితం ద్వారా బదులు ఇచ్చే పిల్లలకు, స్నేహ సంపన్నమైన ప్రియస్మృతులు మరియు నమస్తే. అచ్ఛా!

*** ఓంశాంతి ***

Read in Other Languages

EEnglishहहिंदी
16 Dec 1985Prev23 Dec 1985Next
HomeSearchBKOneLibrarySettings