Brahma Kumaris
Brahma KumarisMurli
  • Home
  • Murli Search
  • Murli Topics
  • Murli Chintan
  • AI Murli Chintan (ChatGPT)
Languages
  • EEnglish
  • हहिंदी
  • ગગુજરાતી
  • తతెలుగు
Library
  • Overview
    • Favorites
    • Notes & Highlights
    • Collections
    • Tracker
  • Settings
  • BKOne

23 December 1985 | తెలుగు23 December 1985 | తెలుగు · ‘‘కామజీతులు – అన్ని హద్దు యొక్క కామనల నుండి అతీతులు’’

HomeSearchBKOneLibrarySettings
19 Dec 1985Prev25 Dec 1985Next

‘‘కామజీతులు – అన్ని హద్దు యొక్క కామనల నుండి అతీతులు’’

బాప్‌దాదా తమ శ్రేష్ఠమైన చిన్న సుఖవంతమైన ప్రపంచాన్ని చూస్తున్నారు. ఒకవైపు చాలా పెద్ద సారములేని ప్రపంచము. మరో వైపు చిన్న సుఖవంతమైన ప్రపంచము. ఈ సుఖమయ ప్రపంచంలో సదా సుఖ-శాంతి సంపన్నమైన బ్రాహ్మణ ఆత్మలున్నారు, ఎందుకంటే పవిత్రత, స్వచ్ఛతలపై వీరి సుఖశాంతిమయ జీవితం ఆధారపడి ఉంది. ఎక్కడైతే పవిత్రత మరియు స్వచ్ఛత ఉంటుందో అక్కడ ఎటువంటి దుఃఖము, అశాంతి యొక్క నామ-రూపాలు ఉండవు. ఈ చిన్న సుఖమయ ప్రపంచము పవిత్రత అనే కోటలో ఉంది. ఒకవేళ పవిత్రత అనే కోటలో నుండి సంకల్పం ద్వారా అయినా బయటకు వచ్చారంటే దుఃఖము మరియు అశాంతి యొక్క ప్రభావాన్ని అనుభవం చేస్తారు. ఈ బుద్ధి రూపీ పాదము కోట లోపల ఉన్నట్లయితే సంకల్పములోనే కాదు, స్వప్నంలో కూడా దుఃఖము, అశాంతి యొక్క అల రాలేదు. దుఃఖము మరియు అశాంతి ఏ మాత్రం అనుభవం అవుతున్నా తప్పకుండా ఏదో ఒక అపవిత్రత యొక్క ప్రభావముంది. పవిత్రత కేవలం కామజీతులుగా, జగత్‌జీతులుగా అవ్వడం కాదు. కానీ కామ వికారం యొక్క వంశం అంటే సర్వ హద్దు యొక్క కామనలు. కామజీతులనగా అన్ని కామనలను జయించినవారు, ఎందుకంటే కామనలు అనేక విస్తార పూర్వకమైనవి. ఒకటి - వస్తువుల యొక్క కామన, రెండవది - వ్యక్తుల ద్వారా హద్దు ప్రాప్తుల కామన. మూడవది - సంబంధాలు నిభాయించడంలో కూడా హద్దు కామనలు అనేక రకాలుగా ఉత్పన్నమవుతాయి. నాల్గవది - సేవా భావనలో కూడా హద్దు కామనల భావము ఉత్పన్నమవుతుంది. ఈ నాలుగు రకాల కామనలను సమాప్తం చెయ్యడమంటే సదా కొరకు దుఃఖము అశాంతులను జయించడం. ఇప్పుడు ఈ నాలుగు రకాల కామనలను సమాప్తం చేశానా అని తమను తాము ప్రశ్నించుకోండి. ఒకవేళ ఏదైనా వినాశీ వస్తువు బుద్ధిని తన వైపుకు ఆకర్షిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా అది కామన రూపంలోని ఆకర్షణ అవుతుంది. అయితే పదాన్ని పరివర్తన చేసి రాయల్ రూపంలో కోరిక లేదు కానీ బాగా అనిపిస్తుందని అంటారు. వస్తువు అయినా, వ్యక్తి అయినా ఎవరి పట్లనైనా విశేషమైన ఆకర్షణ ఉన్నట్లయితే, ఆ వస్తువే బాగా అనిపిస్తుంది లేక ఆ వ్యక్తినే బాగా అనిపిస్తున్నారంటే, అది కామన. అది కోరిక. అన్నీ బాగా అనిపిస్తున్నాయి అంటే అది యథార్థము, ఇది మాత్రమే బాగుంది లేక వీరు మాత్రమే బాగున్నారు అని అంటే అది అయథార్థము.

ఇది కోరికకు రాయల్ రూపము. ఎవరి సేవ అయినా బాగా అనిపిస్తుంది, ఎవరి పాలనైనా బాగా అనిపిస్తుంది, ఎవరి గుణాలైనా బాగా అనిపిస్తాయి, ఎవరి శ్రమ అయినా బాగా అనిపిస్తుంది, ఎవరి త్యాగమైనా బాగా అనిపిస్తుంది, ఎవరి స్వభావమైనా బాగా అనిపిస్తుంది. ఈ మంచితనపు సుగంధమును తీసుకోవడం లేక ఈ మంచితనాన్ని స్వయం కూడా ధారణ చేయడం వేరే విషయం. కానీ ఈ మంచితనం వలన ‘వీరే మంచివారు’ - ఈ ‘మంచి’ అనడం కోరికలోకి మారిపోతుంది. ఇది కోరిక. అటువంటివారు దుఃఖము, అశాంతిని ఎదుర్కోలేరు. ఒకటేమో మంచితనము వెనుక స్వయాన్ని మంచిగా తయారుచేసుకోవడం నుండి వంచితులుగా చేసుకుంటారు, రెండవది - శత్రుత్వపు కోరిక కూడా క్రిందకు తీసుకొస్తుంది. ఒకటేమో ప్రభావితమయ్యేటువంటి కోరిక, రెండవది - ఎవరి పట్ల అయినా వైరము, ఈర్ష్య భావనల కామన. ఇవి కూడా సుఖ-శాంతులను సమాప్తం చేస్తాయి. సదా వారి మనస్సు అలజడిలోకి వస్తుంది. ప్రభావితమయ్యే వారి లక్షణం - లగావ్ మరియు ఝుకావ్ (ఆకర్షింపబడడం మరియు వంగిపోవడం). అలాగే ఈర్ష్య లేక వైర భావము, వారి గుర్తు - మొండిగా ఉండడం మరియు ఋజువు చేయడం. ఈ రెండు భావాలలో ఎంత శక్తిని, ఎంత సమయాన్ని సమాప్తం చేస్తారో అర్థమే కాదు. రెండూ చాలా నష్టం కలిగిస్తాయి. స్వయమూ విసిగిపోతారు, ఇతరులను కూడా విసిగిస్తూ ఉంటారు. అటువంటి స్థితి యొక్క సమయంలో, అటువంటి ఆత్మల నినాదము - దుఃఖం తీసుకోవాలి మరియు దుఃఖం ఇవ్వాల్సిందే అని అంటారు. ఏమైనా జరగనీ కానీ చెయ్యాల్సిందే అని అంటారు. ఈ కోరిక ఆ సమయంలో మాట్లాడ్తుంది. బ్రాహ్మణాత్మ మాట్లాడదు, అందువలన ఏం జరుగుతుందంటే సుఖ శాంతుల ప్రపంచం నుండి బుద్ధి రూపీ పాదము బయటకు వెళ్ళిపోతుంది, అందుకే ఈ రాయల్ కోరికలపై కూడా విజయులుగా అవ్వండి. ఈ కోరికల నుండి కూడా ఇచ్ఛామాత్రం అవిద్యా స్థితిలోకి రండి.

ఈ రెండు భావాలున్నప్పుడు ఏవైతే సంకల్పాలు చేస్తారో “ఇలా మాట్లాడే చూపిస్తా” అని, అది ఎవరికి చూపిస్తారు? తండ్రికా లేక బ్రాహ్మణ పరివారానికా? ఎవరికి చూపిస్తారు? ఇది చేసి చూపించడం కాదు, క్రిందపడి చూపించడం అని భావించండి. అదేమైనా అద్భుతమా చూపించడానికి! క్రింద పడడం - ఇదేమైనా చూపించే విషయమా! ఈ హద్దు ప్రాప్తి యొక్క నషా - నేను సేవ చేసి చూపిస్తాను, పేరు ప్రఖ్యాతము చేసి చూపిస్తాను, ఇవి రాయల్ మాటలా? చెక్ చేసుకోండి. భాష అయితే సింహానిది అని అంటారు కానీ మేకగా అవుతున్నారు. ఉదాహరణకు ఈ రోజులలో కొందరు సింహం, కొందరు ఏనుగు, కొందరు రావణుడు, కొందరు రాముడు యొక్క ముఖము పెట్టుకుంటారు కదా! అలా ఈ మాయ, సింహం ముఖాన్ని తగిలిస్తుంది. నేను ఇది చేసి చూపిస్తాను, ఇది చేస్తాను అని అంటారు, కానీ మాయ తన వశం చేసుకొని మేకగా తయారుచేస్తుంది. మైపన్(నేను) రావడం అనగా ఏదో ఒక హద్దు కోరికకు వశీభూతులవ్వడం. ఈ భాష యుక్తియుక్తంగా మాట్లాడండి మరియు భావన కూడా యుక్తియుక్తంగా ఉంచుకోండి. ఇది తెలివి కాదు కానీ ప్రతి కల్పములో - సూర్యవంశీయుల నుండి చంద్రవంశీయులుగా అయ్యే ఓటమిని పొందడం. కల్ప-కల్పము చంద్రవంశీయులుగా అవ్వవలసే ఉంటుంది. కనుక ఇది ఓడిపోవడమా? లేక నేర్పరితనమా? కనుక ఇటువంటి తెలివితేటలు చూపించకండి. అభిమానంలోకి రాకండి, అవమాన పరచకండి. ఈ రెండు భావనలు, శుభభావన శుభకామన నుండి దూరం చేస్తాయి. మరి పరిశీలించుకోండి - కొంచెం కూడా సంకల్ప మాత్రం కూడా అభిమానం లేక అవమాన భావన మిగిలిపోలేదు కదా? ఎక్కడైతే అభిమానం మరియు అవమాన భావన ఉంటుందో అక్కడ ఎప్పుడూ ఎవ్వరూ స్వమానం యొక్క స్థితిలో స్థితులవ్వలేరు. స్వమానం అన్ని కోరికల నుండి దూరం చేస్తుంది, అంతేకాక సదా సుఖమయ ప్రపంచంలో సుఖ-శాంతుల ఊయలలో ఊగుతూ ఉంటారు. వారినే సర్వ కామనాజీతులు, జగత్‌జీతులని అంటారు. అయితే బాప్‌దాదా చిన్న సుఖమయ ప్రపంచాన్ని చూస్తున్నారు. సుఖమయ ప్రపంచం నుండి, మీ స్వదేశం నుండి, పరాయి దేశంలోకి బుద్ధి రూపీ పాదము ద్వారా ఎందుకు వెళ్లిపోతున్నారు? పరధర్మము, పరదేశము దుఃఖమిచ్చేవి. స్వధర్మము, స్వదేశము సుఖమిచ్చేవి. కనుక సుఖసాగరుడైన తండ్రికి పిల్లలు, సుఖమయ ప్రపంచానికి అనుభవీ ఆత్మలు మీరు. అధికారీ ఆత్మలు, కనుక సదా సుఖంగా ఉండండి, శాంతిగా ఉండండి. అర్థమయిందా!

దేశ విదేశాలలోని స్నేహీ పిల్లలు తమ ఇంట్లో లేక తండ్రి ఇంట్లో తమ అధికారాన్ని తీసుకునేందుకు చేరుకున్నారు. కాబట్టి అధికారీ పిల్లలను చూసి బాప్‌దాదా కూడా హర్షిస్తున్నారు. ఎలాగైతే సంతోషంగా వచ్చారో అలా సదా సంతోషంగా ఉండేందుకు విధి ఏమిటంటే, ఈ రెండు విషయాలను సంకల్పం ద్వారా కూడా త్యాగం చేసి సదా కొరకు భాగ్యవంతులుగా అయి వెళ్ళండి. భాగ్యము తీసుకునేందుకు వచ్చారు, అయితే భాగ్యము తీసుకోవడంతో పాటు మీ ఎగిరేకళలో విఘ్నరూపంగా అయ్యే ఏదైనా బలహీనతను వదిలి వెళ్ళండి. ఈ వదలడమే తీసుకోవడం. అచ్ఛా.

సదా సుఖం యొక్క ప్రపంచంలో ఉండే సర్వ కామనాజీతులు, సదా సర్వాత్మల పట్ల శుభ భావన మరియు శుభకామనలు ఉంచుకునే శ్రేష్ఠ ఆత్మలకు, సదా స్వమానమనే సీటుపై స్థితులై ఉండే విశేష ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

టీచర్స్‌తో:- అందరూ స్వయాన్ని ఏ మణిగా భావిస్తున్నారు? (సంతుష్టమణి) నేటి సమయంలో విశేషంగా సంతుష్టత యొక్క ఆవశ్యకతే ఉంది. పూజ కూడా ఎక్కువగా ఏ దేవికి జరుగుతుంది? సంతోషి దేవికి. మరియు సంతోషిని ప్రసన్నురాలిని చేయడం కూడా సహజంగా ఉంటుంది. సంతోషి త్వరగా సంతృప్తిగా అవుతుంది. సంతోషి పూజ ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే నేటి సమయంలో టెన్షన్ చాలా ఉంది, ఆందోళనలు చాలా ఉన్నాయి, ఈ కారణంగా అసంతుష్టత పెరుగుతూ వెళ్తుంది. అందుకే సంతృప్తిగా ఉండే సాధనం గురించి అందరూ ఆలోచిస్తారు, కానీ చేయలేకపోతున్నారు. కాబట్టి ఇలాంటి సమయంలో మీరందరూ సంతుష్టమణులుగా మారి సంతుష్టత వెలుగును ఇవ్వండి. మీ సంతుష్టత వెలుగుతో ఇతరులను కూడా సంతృప్తిగా చేయండి. మొదట స్వయంతో స్వయం సంతృప్తిగా ఉండండి, ఆ తర్వాత సేవలో సంతృప్తిగా ఉండండి, ఆ తర్వాత సంబంధంలో సంతృప్తిగా ఉండండి, అప్పుడే సంతుష్టమణి అని పిలువబడతారు. సంతుష్టతకు కూడా మూడు సర్టిఫికెట్లు కావాలి. మీతో మీకు, సేవ నుండి, ఆ తర్వాత సహచరుల నుండి. ఈ మూడు సర్టిఫికెట్లు తీసుకున్నారు కదా. మంచిది, అయినప్పటికీ ప్రపంచపు అలజడి నుండి బయటపడి అచలఘర్‌కు చేరుకున్నారు. ఈ తండ్రి స్థానాలు అచలఘర్ వంటివి. కాబట్టి అచలఘర్‌కు చేరుకోవడం అనేది కూడా గొప్ప భాగ్యానికి నిదర్శనం. త్యాగం చేసారు కాబట్టి అచలఘర్‌కు చేరుకున్నారు. భాగ్యవంతులుగా అయ్యారు, కానీ భాగ్య రేఖను ఇంకా ఎంత పొడవుగా గీసుకోవాలనుకుంటే అంత పొడవుగా గీసుకోగలరు. భాగ్యవంతుల లిస్టులోకి అయితే వచ్చేసారు, ఎందుకంటే భగవంతుని వారిగా మారారు కాబట్టి భాగ్యవంతులయ్యారు. మరియు అందరి నుండి దూరమై ఒక్కరిని తమవారిగా చేసుకున్నారు కాబట్టి భాగ్యవంతులయ్యారు. బాప్‌దాదా పిల్లల ఈ ధైర్యాన్ని చూసి సంతోషంగా ఉన్నారు. ఏదైనా సరే, అయినప్పటికీ త్యాగం మరియు సేవా ధైర్యంలో శ్రేష్ఠులుగా ఉన్నారు. చిన్నవారైనా లేదా కొత్తవారైనా సరే, బాప్‌దాదా త్యాగం మరియు ధైర్యానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదే రిగార్డ్‌తో బాప్‌దాదా చూస్తారు. నిమిత్తమయ్యే మహత్వం కూడా ఉంది. ఇదే మహత్వంతో సదా ముందుకు సాగుతూ విశ్వంలో మహోన్నత ఆత్మలుగా మారి ప్రసిద్ధులైపోతారు. కాబట్టి మీ మహోన్నతను అయితే తెలుసుకున్నారు కదా! ఎంత మహోన్నతులో అంత నిరాడంబరులు. ఫలాలనిచ్చే వృక్షానికి నిదర్శనం వంగి ఉండటం అయినట్లుగానే, ఎవరైతే నిరాడంబరులుగా ఉంటారో వారే ప్రత్యక్ష ఫలాన్ని తినేవారు. సంగమయుగపు విశేషతే ఇది. అచ్ఛా!

*** ఓంశాంతి ***

Read in Other Languages

EEnglishहहिंदी